ముంబై: కోవిడ్-19 సహాయక చర్యలకుగాను టాటా గ్రూప్ కంపెనీలు ఇప్పటి వరకూ దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చు చేసినట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం వెల్లడించారు. టీసీఎస్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. క్తొత హాస్పిటల్స్ నిర్మాణం, ఆక్సిజన్ సామర్థ్య విస్తరణ వంటి చర్యలపై గ్రూప్ కంపెనీలు దృష్టి సారించినట్లు తెలిపారు.
మొత్తం వ్యయాల్లో టాటా సన్స్ వాటా రూ.1,500 కోట్లు కాగా, గ్రూప్ కంపెనీల వ్యయాలు రూ.1,000 కోట్లని పేర్కొన్నారు. మరిన్ని నిధుల వ్యయాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూడా వివరించారు. మూడో వేవ్ ఆందోళనల నేపథ్యంలో సవాళ్లను అధిగమించడానికి మరింత జాగ్రత్తగా తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. అథ్లెటిక్స్, హాకీ, ఫుడ్‌బాల్ వంటి క్రీడా కార్యకలాపాలకు గ్రూప్ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
చదవండి: బ్యాంకు ఖాతాదారులకు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment