ముంబై: టాటా గ్రూపులో భాగమైన టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్ (టాటాఎండీ) సంస్థ కరోనా కట్టడి చర్యల్లో ప్రభుత్వానికి సహకారం అందివ్వనుంది. అందులో భాగంగా కరోనా నిర్థారణ పరీక్షల సామార్థ్యం పెంపు పనుల్లో భాగం కానుంది. దీనికోసం సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)తో టాటా ఎండీ ఒప్పందం చేసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో చిన్న పట్టణాల (ద్వితీయ, తృతీయ శ్రేణి)తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరగనుంది.
టెస్టింగ్ సామర్థ్యం పెంపు
భవిష్యత్తులో కరోనా పరీక్షల అవసరాలు పెరిగితే.. అందుకు తగ్గట్టుగా టెస్టింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నట్టు టాటా కంపెనీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌లను కరోనా పరీక్షలకు వినియోగించుకోవడం ఈ ఒప్పందంలో భాగంగా ఉండనుంది. అలాగే, టాటాఎండీకి చెందిన ‘చెక్ సార్స్–కోవ్–2’ టెస్ట్ కిట్స్‌ను పరీక్షల కోసం విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు టాటా ఎండీ ఓ ప్రకటనలో తెలియజేసింది.
చదవండి : కరోనాకి బెదరని లంబోర్గిని
Comments
Please login to add a commentAdd a comment