
పిల్లల భవిష్యత్తుకు నెలవారీ ఆదాయం
క్యాన్సర్ సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు కవరేజీ
వార్షికంగా రూ. 36,500 వరకు విలువ చేసే మహిళల హెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు ఉచితం
భారతదేశపు దిగ్గజ ప్రైవేట్ జీవిత బీమా కంపెనీల్లో ఒకటైన బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, మహిళల కోసం ప్రత్యేకంగా బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్ ఉమెన్ టర్మ్ (ఎస్‌డబ్ల్యూటీ)ని ఆవిష్కరించింది. ఇది సంప్రదాయ జీవిత బీమా పరిధికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే క్రిటికల్ ఇల్‌నెస్‌కి సంబంధించిన బెనిఫిట్స్, ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్, హెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసులు మొదలైన వాటితో ఆర్థిక భద్రతను అందిస్తుంది. తద్వారా మహిళలు, వారి కుటుంబాలకు సమగ్ర రక్షణ కల్పిస్తుంది.
కుటుంబాల సంరక్షణలో మహిళలు కీలకపాత్ర పోషిస్తారు. కాబట్టి వారికి కూడా ఆర్థిక భద్రత పటిష్టంగా ఉండాలి. మహిళలు ఆర్థిక స్వతంత్రత సాధించడంలో బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ పాలసీ దన్నుగా ఉంటుంది. ఆర్థికంగా ఆత్మవిశ్వాసం, జీవితంలోని ప్రతి దశలోనూ స్థిరత్వం అందించడం ద్వారా వారు తమ జీవిత లక్ష్యాలను సాధించుకోవడంలో తోడ్పాటు అందిస్తుంది.
ఈ ప్లాన్‌లో కీలకాంశాలు
టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా సమగ్ర ఆర్థిక భద్రత: మారుతున్న మహిళల పాత్ర, వారి విశిష్టమైన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా లైఫ్ అష్యూర్డ్ మరణానంతరం నామినీకి ఎస్‌డబ్ల్యూటీ ఏకమొత్తంగా క్లెయిమ్‌ను చెల్లిస్తుంది. తద్వారా పాలసీదారులపై ఆధారపడిన వారి భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అందిస్తుంది.
క్రిటికల్ ఇల్‌నెస్ (సీఐ) భద్రత: సీఐ రైడర్‌తో, బ్రెస్ట్, సర్విక్స్, ఒవేరియన్ క్యాన్సర్లు వంటి మహిళల ప్రత్యేక ఆరోగ్య సమస్యలు సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు ఎస్‌డబ్ల్యూటీ కవరేజీ అందిస్తుంది. దీనితో వారు కీలకమైన పరిస్థితుల్లో ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా చికిత్సపై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది.
చైల్డ్ కేర్ బెనిఫిట్: పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించి, ఈ ప్లాన్ ప్రత్యేకంగా ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్ కూడా అందిస్తుంది. ఎస్‌డబ్ల్యూటీతో కలిపి దీన్ని ఆవిష్కరించడం ఇదే ప్రథమం. ఒకవేళ దురదృష్టకర ఘటన ఏదైనా జరిగినా, పిల్లల చదువుకు తోడ్పాటు లభించేలా ఇది నెలవారీగా స్థిరమైన ఆదాయాన్ని అందించగలదు.
హెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసులు (హెచ్ఎంఎస్): ఆర్థిక భద్రత పరిధికి మించి సమగ్ర హెల్త్ చెకప్‌లు, ఓపీడీ కన్సల్టేషన్లు, ప్రెగ్నెన్సీ సంబంధ తోడ్పాటు, ఎమోషనల్ వెల్‌నెస్ ప్రోగ్రాంలు, న్యూట్రిషనిస్ట్ గైడెన్స్ మొదలైనవన్నీ కవర్ అయ్యేలా ఈ ప్లాన్ సమగ్రమైన హెచ్ఎంఎస్‌ను కాంప్లిమెంటరీగా అందిస్తోంది. మహిళల సంక్షేమం పట్ల కంపెనీకి గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
''నేటి మహిళలు తమ ఆరోగ్యం, పిల్లల సంక్షేమం, ఆర్థిక స్వేచ్చకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇవన్నీ ఒకే ప్లాన్‌లో అందించాలనే ఉద్దేశంతో బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్ ఉమెన్ టర్మ్‌ను ఆవిష్కరించాం. తమ వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకోవడంలో ముందుకు వెళ్లేలా మహిళలకు ఆర్థికంగా భరోసా లభించేలా సాధికారత కల్పించే విధంగా ఇది రూపొందించబడింది. మహిళల ఆరోగ్య సంరక్షణ అవసరాలు లేదా వారి పిల్లలు లేక ప్రియమైన వారి భవిష్యత్తు సంరక్షణ అవసరాలకు అనుగుణంగా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు'' అని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈవో తరుణ్ చుగ్ తెలిపారు.