బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ఏస్ పేరిట జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటు జీవిత బీమా అటు దీర్ఘకాలం అంటే వందేళ్ల వరకు ఆదాయాన్ని ఆఫర్ చేసే పథకం ఇది. పాలసీ ప్రారంభమయ్యాక తొలి నెల/సంవత్సరం నుంచి లేదా అయిదేళ్ల తర్వాత నుంచి కూడా ఆదాయాన్ని అందుకోవడాన్ని ఎంచుకోవచ్చు.
అలాగే పాలసీ కాల వ్యవధిని కనీసం 10 ఏళ్ల నుంచి తమకు 100 సంవత్సరాలు వచ్చే దాకా ఎంచుకోవచ్చని సంస్థ ఎండీ తరుణ్ చుగ్ తెలిపారు. తమ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఎప్పుడు, ఎంతకాలం పాటు, రాబడిని ఎలా అందుకోవాలనుకుంటున్నదీ కూడా కస్టమర్లు తామే నిర్ణయించుకోవచ్చని ఆయన వివరించారు.
వార్షిక ప్రీమియానికి సమ్ అష్యూర్డ్ 11 రెట్లు ఉంటుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో నామినీకి డెత్ బెనిఫిట్, ప్రీమియంల చెల్లింపు నుంచి మినహాయింపుతో పాటు రాబడి కొనసాగడం, మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మహిళా పాలసీదారులకు అదనంగా 2 శాతం ఆదాయ ప్రయోజనం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment