Bajaj Allianz
-
బజాజ్ అలియాంజ్ లైఫ్ సరికొత్త మైలురాయి
ముంబై: బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని ఆస్తులు రూ.లక్ష కోట్ల మైలు రాయిని అధిగమించాయి. దేశంలో టాప్–10 బీమా సంస్థలో వేగంగా వృద్ధిని సాధిస్తున్న కంపెనీల్లో ఒకటని తెలిపింది. 2019–20 నాటికి నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రూ.56,085 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. కంపెనీ పట్ల కస్టమర్లలో ఉన్న విశ్వాసానికి తాజా మైలురాయి నిదర్శనమని సంస్థ ఎండీ, సీఈవో తరుణ్ చుగ్ అభివరి్ణంచారు. గడిచిన మూడేళ్లుగా వ్యక్తిగత నూతన వ్యాపార ప్రీమియంలో ఏటా 41 శాతం చొప్పున వృద్ధిని సాధించినట్టు చెప్పారు. జీవిత బీమా పరిశ్రమలో బజాజ్ అలియాంజ్ లైఫ్ మార్కెట్ వాటా 2019–20 నాటికి 2.6 శాతంగా ఉంటే, 2022–23 నాటికి 5 శాతానికి పెరిగినట్టు తెలిపారు. ప్రైవేటు జీవిత బీమా మార్కెట్లో తమ వాటా 4.6 శాతం నుంచి 7.6 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు. -
వందేళ్ల వరకు ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం
బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ఏస్ పేరిట జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటు జీవిత బీమా అటు దీర్ఘకాలం అంటే వందేళ్ల వరకు ఆదాయాన్ని ఆఫర్ చేసే పథకం ఇది. పాలసీ ప్రారంభమయ్యాక తొలి నెల/సంవత్సరం నుంచి లేదా అయిదేళ్ల తర్వాత నుంచి కూడా ఆదాయాన్ని అందుకోవడాన్ని ఎంచుకోవచ్చు. అలాగే పాలసీ కాల వ్యవధిని కనీసం 10 ఏళ్ల నుంచి తమకు 100 సంవత్సరాలు వచ్చే దాకా ఎంచుకోవచ్చని సంస్థ ఎండీ తరుణ్ చుగ్ తెలిపారు. తమ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఎప్పుడు, ఎంతకాలం పాటు, రాబడిని ఎలా అందుకోవాలనుకుంటున్నదీ కూడా కస్టమర్లు తామే నిర్ణయించుకోవచ్చని ఆయన వివరించారు. వార్షిక ప్రీమియానికి సమ్ అష్యూర్డ్ 11 రెట్లు ఉంటుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో నామినీకి డెత్ బెనిఫిట్, ప్రీమియంల చెల్లింపు నుంచి మినహాయింపుతో పాటు రాబడి కొనసాగడం, మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మహిళా పాలసీదారులకు అదనంగా 2 శాతం ఆదాయ ప్రయోజనం ఉంటుంది. -
ఐపీపీబీ ఖాతాదారులకు బజాజ్ అలియాంజ్ బీమా
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారులకు బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఇండియాపోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు ప్రత్యేకం. చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా రక్షణ పొందొచ్చని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. పాలసీదారు మరణించిన సందర్భంలో తక్షణమే పరిహారంతోపాటు, 5, 7, 10 ఏళ్లపాటు కుటుంబ అవసరాలకు నెలవారీ చెల్లించే సదుపాయాలు ఇందులో ఉన్నట్టు పేర్కొంది. -
బజాజ్ అలియెంజ్ నుంచి బోనస్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ బజాజ్ అలియెంజ్ గత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) గాను పాలసీదారులకు రూ. 1,201 కోట్ల విలువైన బోనస్ ప్రకటించింది. వెరసి అర్హతగల పార్టిసిపేటింగ్ పాలసీదారులకు వరుసగా 22వ ఏడాదిలోనూ బోనస్ చెల్లింపులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. తాజా బోనస్‌లో రెగ్యులర్ రివర్షనరీ బోనస్ రూ. 872 కోట్లు, టెర్మినల్, క్యాష్ బోనస్ రూ. 329 కోట్లు కలసి ఉన్నట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది (2021 - 22) రూ. 11.62 లక్షలకుపైగా పాలసీదారులకు రూ. 1,070 కోట్ల బోనస్ చెల్లించింది. -
కోరుకున్నట్టుగా హెల్త్ పాలసీ: బజాజ్ అలియాంజ్ ఆఫర్
ముంబై: హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తమకు కావాల్సిన సేవలతోనే తీసుకునే విధంగా ‘మై హెల్త్‌కేర్ ప్లాన్’ను బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఆవిష్కరించింది. మోటారు వాహన ఇన్సూరెన్స్‌ను నడిపినంత దూరానికే తీసుకునే విధంగా ఇటీవలే కొత్త తరహా ప్లాన్లు అందుబాటులోకి రావడం తెలిసిందే. ఇదే మాదిరిగా హెల్త్ ఇన్సూరెన్స్‌లోనూ కొత్త తరహా సేవలతో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ముందుకు వచ్చింది. కస్టమర్లు తమకు కావాల్సిన కవరేజీ ఎంపిక చేసుకోవచ్చని, వాటి ప్రకారం ప్రీమియం ఖరారు అవుతుందని సంస్థ తెలిపింది. హాస్పిటల్లో ఇన్ పేషెంట్‌గా చేరినప్పుడు అయ్యే వ్యయాలు, హాస్పిటల్లో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే వ్యయాలు, మేటర్నిటీ వ్యయాలు, ఎయిర్ అంబులెన్స్ సేవలు, అధునాతన చికిత్సా విధానాలు, అవయవ దాత వ్యయాలు, ఆయుర్వేదిక్, హోమియోపతీ సేవల కవరేజీ తీసుకోవచ్చు. బేబీ కేర్ కవరేజీ కూడా అందుబాటులో ఉంది. ఒక ఏడాదికి చెల్లించే ప్రీమియానికి రెట్టింపు విలువ మేర.. అవుట్ పెషెంట్ కవరేజీ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉంటుంది. ప్రమాదాలు, తీవ్ర వ్యాధులు, ఆదాయం నష్టం వంటి సందర్భాల్లో అదనపు పరిహారానికి సంబంధించిన రైడర్లను సైతం ఈ ప్లాన్‌తోపాటు తీసుకోవచ్చు. -
సీనియర్ సిటిజన్ల కోసం బజాజ్ నుంచి సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్స్
హైదరాబాద్: ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలయాంజ్ తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ’రెస్పెక్ట్ సీనియర్ కేర్’ రైడర్‌ను ప్రవేశపెట్టింది. మూడు ప్లాన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రీమియం రూ. 700 నుంచి రూ. 7,500 వరకూ (జీఎస్టీ కాకుండా) ఉంటుందని సంస్థ తెలిపింది. ప్లాన్‌ను బట్టి ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ సర్వీస్, స్మార్ట్ వాచ్ ఫాల్ డిటెక్షన్, ఫిజియోథెరపి.. నర్సింగ్ కేర్ తహా హోమ్ కేర్ సర్వీసులు, మెడికల్ టెలీ–కన్సల్టేషన్ సర్వీసులు మొదలైనవి ఈ రైడర్‌తో పొందవచ్చని కంపెనీ ఎండీ తపన్ సింఘెల్ తెలిపారు. 50 ఏళ్లు పైబడి, కంపెనీ అందించే బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వారు ఈ రైడర్‌ను ఎంచుకోవచ్చు. -
బజాజ్ అలియాంజ్ గ్లోబల్ హెల్త్ ప్లాన్
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడైనా హెల్త్ కవరేజీ పొందే ఫీచర్‌తో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ‘గ్లోబల్ హెల్త్ కేర్’ పేరుతో ఒక పాలసీని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తీసుకున్న వారు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా తమ ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకుని, కవరేజీ పొందొచ్చు. భారత్‌లోనూ కవరేజీ ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఎక్కడ ఉన్నా, వాటిని పొందే సదుపాయాన్ని కల్పించడమే ఈ ప్లాన్ ఉద్దేశ్యమని బజాజ్ అలియాంజ్ ప్రకటించింది. అలియాంజ్ పార్ట్నర్స్’ భాగస్వామ్యంతో బజాజ్ అలియాంజ్ ఈ పాలసీని తీసుకొచ్చింది. రూ.37.50 లక్షల నుంచి కవరేజీ (బీమా/సమ్ అష్యూర్డ్) ప్రారంభమై, రూ.3.75 కోట్ల వరకు అందుబాటులో ఉంటుంది. ఇంపీరియల్ ప్లాన్, ఇంపీరియల్ ప్లస్ ప్లాన్ అనే రెండు రకాలుగా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రకటించింది. హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సలు, చేరే అవసరం లేకుండా తీసుకునే డే కేర్ ప్రొసీజర్స్, మానసిక అనారోగ్యం, పాలియేటివ్ కేర్, ఎయిర్ అంబులెన్స్, అవయవదాతకు అయ్యే ఖర్చులు, ఆధునిక చికిత్సలకు ఈ ప్లాన్‌లో కవరేజీ ఉంటుంది. ప్రీమియం రూ.39,432తో ప్రారంభమవుతుంది. -
కరోనా ఎఫెక్ట్: డిమాండ్ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవే!
కోవిడ్–19తో జీవిత బీమా పరిశ్రమ వ్యాపార వ్యూహాల్లో పలు మార్పులు వచ్చాయని తెలిపారు ప్రైవేట్ రంగ బీమా సంస్థ బజాజ్ అలయంజ్ ఎండీ తరుణ్ చుగ్. కరోనా పరిస్థితుల టర్మ్ పాలసీలకు ఆదరణ వచ్చిందని, ఇది ఇకపైనా కొనసాగగలదని ఆయన పేర్కొన్నారు. సులభతర పాలసీలకు డిమాండ్ పెరుగుతోందని సాక్షి బిజినెస్ బ్యూరోకి వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. బీమా రంగానికి కోవిడ్–19 పాఠాలు.. ప్రతి కంపెనీ తన వ్యాపార ప్రణాళికలను, కస్టమరుకు చేరువయ్యేందుకు అనుసరించే వ్యూహాలను పునఃసమీక్షించుకునేలా కోవిడ్–19 చేసింది. పరిశ్రమ కూడా కొత్త రిస్కులకు వేగంగా అలవాటు పడింది. పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వీసులు, ఉత్పత్తులు, ప్రక్రియలను రూపొందించుకుంది. కస్టమర్లు డిజిటల్ విధానానికి అలవాటు పడటంతో సర్వీసులు అందించడానికి కంపెనీలకు కొత్త మార్గం దొరికింది. అలాగే కోవిడ్ సంక్షోభంతో జీవిత బీమా పాలసీలు అందించే ప్రయోజనాలు కూడా కొంత పెరిగాయి. బీమాపై అవగాహన స్థాయి పెరగడంతో, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. పాలసీదారులు, సంబంధిత వర్గాలందరికీ సరళమైన, స్పష్టమైన విధంగా వివరాలను అందజేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాము. పాలసీలకు సంబంధించి కొత్త పరిణామాలు, ప్రీమియంలు ఎలా చెల్లించాలి, పత్రాలు ఎలా సమర్పించాలి లాంటి అంశాలన్నింటి గురించి పాలసీదారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. కోవిడ్ క్లెయిముల పరిస్థితి .. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత క్లెయిమ్స్ సెటిల్మెంట్ నిష్పత్తి 98.48 శాతంగా ఉండగా, దాదాపు రూ. 1,374 కోట్ల మేర డెత్ క్లెయిమ్స్ చెల్లించాము. కోవిడ్ క్లెయిముల విషయానికొస్తే.. దాదాపు రూ. 74 కోట్లతో 1,300 క్లెయిములు సెటిల్ చేశాం. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉండబోతోందనేది అంచనా వేయాలంటే ముందుగా దాని తీవ్రత అర్థం కావాలి. అంతవరకూ వేచి చూడాల్సి ఉంటుంది. ప్రీమియంల పెంపు.. భారతదేశంలో టర్మ్ ప్లాన్ల ప్రీమియంలు.. చాలా కాలంగా ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అయితే, కోవిడ్ క్లెయిములు పెరుగుతున్న నేపథ్యంలో ప్రీమియంలను కూడా సవరించడం తార్కికంగా సహేతుకమైనదిగానే భావించక తప్పదు. పైగా రీఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ రేట్లు పెంచేశాయి. దీనితో జీవిత బీమా కంపెనీలు దానికి అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో ప్రీమియంలలో కొంత సవరణలకు అవకాశం ఉన్నప్పటికీ .. మరీ ఎక్కువ భారం మోపకుండా, ఒక మోస్తరు స్థాయిలోనే ఉండగలవు. డిమాండ్ ఉన్న పథకాలు.. జీవిత బీమా పాలసీలను ఇప్పటిదాకా మేము ప్రత్యేకంగా విక్రయించాల్సి వచ్చేది. అయితే, మహమ్మారి నేపథ్యంలో పాలసీదారులు ఇప్పుడు వాటిని అడిగి మరీ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ తొలి నాళ్లలో టర్మ్ ప్లాన్లకు ఆదరణ బాగా పెరిగింది. ఇదే ధోరణి మరికొన్నాళ్ల పాటు కొనసాగగలదని భావిస్తున్నాము. అలాగే యాన్యుటీ, గ్యారంటీ రిటర్న్ ప్లాన్లకు కూడా డిమాండ్ ఉంటోంది. కస్టమర్లు పూర్తి అవగాహనతో తగిన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడగలిగేలా ఉండే సరళతరమైన, సులభంగా అర్థం చేసుకోగలిగే సాధనాలు, సమాచారాన్ని కోరుకుంటున్నారు. ఉదాహరణకు వేగవంతమైన ప్రాసెసింగ్, అత్యంత సులభంగా అర్థం చేసుకోగలిగేదిగాను, వైద్య పరీక్షలు అవసరం లేకుండా ఉండేలా మేము ప్రవేశపెట్టిన గ్యారంటీడ్ పెన్షన్ గోల్ (జీపీజీ)కి కస్టమర్ల నుంచి చాలా చక్కని స్పందన వస్తోంది. కొత్త పాలసీలు .. ఇటీవలే బజాజ్ అలయంజ్ లైఫ్ అష్యూర్డ్ వెల్త్ గోల్ పేరిట కొత్త ప్లాన్ ఆవిష్కరించాం. పాలసీదారులు దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలను సాధించడంలో తోడ్పడేలా 100 శాతం గ్యారంటీతో, 30 ఏళ్ల వరకూ పన్ను రహిత ఆదాయాన్ని అందించేలా దీన్ని రూపొందించాం. అందుకునే ఆదాయం మధ్య మధ్యలో కొంత కొంతగా పెరిగే విధంగా ఇందులో స్టెప్–అప్ ఫీచర్ కూడా ఉంది. ఈ వేరియంట్లో ప్రీమియం చెల్లింపు వ్యవధి పూర్తయిన తర్వాత పర్తీ అయిదేళ్లకోసారి ఆదాయం 10 శాతం మేర పెరుగుతుంది. ఆదాయం చెల్లింపు వ్యవధి పూర్తయిన తర్వాత, కస్టమరు చెల్లించిన ప్రీమియంలన్నీ కూడా వెనక్కి తిరిగి వస్తుంది. పెరిగిపోతున్న వ్యయాలతో అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరి ఆర్థిక పోర్ట్‌ఫోలియోలో ఒక్కటైనా గ్యారంటీ ఆదాయం అందించే సాధనం ఉండటం ఎంతో శ్రేయస్కరం. -
యులిప్‌లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: యూనిట్ ఆధారిత బీమా పథకాలకు (యులిప్/ఈక్విటీలతో కూడిన) ఇన్వెస్టర్ల నుంచి మళ్లీ ఆదరణ పెరిగింది. కరోనా సంక్షోభ సమయంలో యులిప్‌ల్లో పెట్టుబడులు పెరిగినట్టు బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యులిప్‌లలో పెట్టుబడుల నిర్వహణ సౌకర్యంగా ఉండడం కారణమని ఈ సంస్థ పేర్కొంది. సర్వే వివరాలను శుక్రవారం విడుదల చేసింది. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు రానున్న సంవత్సరంలో యులిప్‌లలో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సర్వేలో చెప్పారు. కరోనా మొదటి దశ తర్వాత యులిప్‌ల పట్ల తమకు ఇష్టం పెరిగినట్టు 92 శాతం మంది చెప్పారు. యులిప్ ప్లాన్లు ఒకవైపు జీవిత బీమా రక్షణ కల్పిస్తూ, మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తుంటాయి. ప్రీమియంలో కొంత బీమా రక్షణకు పోగా, మిగిలిన మొత్తాన్ని పాలసీదారు ఎంపిక చేసుకున్న సాధనాల్లో బీమా సంస్థ పెట్టుబడులు పెడుతుంది. నీల్సన్ ఐక్యూ సాయంతో బజాజ్ అలియాంజ్ లైఫ్ ఈ సర్వే నిర్వహించింది. మెట్రో, నాన్ మెట్రోల్లో 499 మంది నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ‘‘యులిప్‌లలో పెట్టుబడుల పురోగతిని సమీక్షించుకోవడం సులభంగా ఉంటుంది. వ్యయాలు తక్కువగా ఉంటాయి. రైడర్ లేదా టాపప్ జోడించుకోవడం, నిధులను వెనక్కి తీసుకోవడం సులభం’’ అని సర్వే తెలిపింది. ఆకర్షించే సదుపాయాలు.. మధ్యాదాయ వర్గాల వారు యులిప్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు వీలుండడాన్ని ఇష్డపడుతున్నారు. 21–30 సంవత్సరాల్లోని వారు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడుల సాధనం) రూపంలో యులిప్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. అదే 50 ఏళ్లకు పైన వయసులోని వారు యులిప్‌లో ఒకే విడత (సింగిల్ప్రీమియం) ఇన్వెస్ట్ చేసే ఆప్షన్‌ను ఇష్టపడుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండానే యులిప్‌లలో పెట్టుబడులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి మార్చుకునే సదుపాయం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ సౌకర్యం లేదు. ఎక్కువ మందికి నచ్చే అంశం బీమా రక్షణకుతోడు, పెట్టుబడుల అవకాశం ఉండడం. అన్ని వర్గాలకూ నచ్చే సాధనం.. ‘‘అన్ని రకాల వయసులు, ఆదాయ వర్గాలు, భౌగోళిక ప్రాంతాల్లోనూ యులిప్‌ల పట్ల ఆదరణ ఉన్నట్టు ఈ సర్వే రూపంలో తెలుస్తోంది. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశం ఉండడంతోపాటు, పెట్టుబడుల్లో సౌకర్యం, బీమా రక్షణ, ఉపసంహరణకు వీలు ఇవన్నీ యులిప్‌ల కొనుగోలుకు దారితీసే అంశాలు’’ అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముఖ్య మార్కెటింగ్ అధికారి చంద్రమోహన్ మెహ్రా తెలిపారు. తమ దీర్ఘకాల లక్ష్యాలకు బీమా ప్లాన్లు కూడా ప్రాధాన్య సాధనంగా ఎక్కువ మంది పరిగిణిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
కరోనా కవచ్... బీమా కంపెనీల కొత్త పాలసీలు
కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్ పాలసీలను ‘కరోనా కవచ్’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక స్వల్పకాలిక పాలసీలను (గరిష్టంగా 11 నెలల కాలంతో) జూలై 10 నాటికి తీసుకురావాలంటూ బీమా నియంత్రణ సంస్థ.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ )గడువు పెట్టడంతో.. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ జనరల్, మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్ తదితర బీమా సంస్థలు ఇటువంటి పాలసీలను ప్రవేశపెట్టాయి. మ్యాక్స్‌బూపా మ్యాక్స్ బూపా సంస్థ తక్కువ ప్రీమియానికే కరోనా కవచ్ పాలసీని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. రూ.2.5 లక్షల కవరేజీ కోసం 31–55 ఏళ్ల వయసు వారు రూ.2,200 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని.. అదే ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కోసం రూ.2.5 లక్షల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం రూ.4,700గా ఉంటుందని తెలిపింది. హెచ్డీఎఫ్సీ ఎర్గో కరోనా కారణంగా వ్యక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్సలు తీసుకుంటే పరిహారం చెల్లించే సదుపాయంతో హెచ్డీఎఫ్సీ ఎర్గో సంస్థ కరోనా కవచ్ పాలసీని విడుదల చేసింది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేసిన పరీక్షతో పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటే అందుకయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చే కోమార్బిడిటీ చికిత్సలకు కూడా ఈ పరిహారం అందుతుంది. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలను కోమార్బిడిటీగా చెబుతారు. అంబులెన్స్ చార్జీలను కూడా చెల్లిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఉండి చికిత్సలు తీసుకున్నా కానీ, 14 రోజుల కాలానికి అయ్యే ఖర్చులను భరిస్తుండడం ఈ పాలసీలోని అనుకూలాంశం. అల్లోపతితోపాటు ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యాలకు కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇదే విధమైన పాలసీని ప్రవేశపెట్టింది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల కవరేజీకి ప్రీమియం రూ.447–5,630 మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ ఎంచుకుంటే ప్రీమియం రూ.3,620 మధ్య ఉంటుంది. 0–35 ఏళ్ల మధ్యనున్న వారు మూడున్నర నెలలకు రూ.50వేల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం కింద రూ.447తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. -
బజాజ్ అలయంజ్ నుంచి సమగ్ర టర్మ్ ప్లాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పిల్లల విద్యాభ్యాసం మొదలుకుని ప్రాణాంతకమైన 55 వ్యాధుల దాకా వివిధ అవసరాలకు అనుగుణంగా కవరేజీనిచ్చే వేరియంట్లతో ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ కొత్తగా సమగ్రమైన టర్మ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ గోల్ పేరిట ఆవిష్కరించిన ఈ ప్లాన్‌లో.. జీవిత భాగస్వామికి కూడా కవరేజీ పొందవచ్చు. కట్టిన ప్రీమియంలను కూడా తిరిగి పొందవచ్చు. ఇందుకు సంబంధించి మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ప్లాన్ లభిస్తుందని బజాజ్ అలయంజ్ లైఫ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (ఇనిస్టిట్యూషనల్) ధీరజ్ సెహ్గల్ గురువారమిక్కడ తెలిపారు. రూ. 1 కోటి పాలసీ తీసుకునే పాతికేళ్ల వ్యక్తికి ప్రీమియం అత్యంత తక్కువగా రోజుకు రూ. 13 నుంచి ఉంటుందని ఆయన తెలిపారు. లైఫ్ కవర్, లైఫ్ కవర్ విత్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎక్స్ట్రా కవర్ (సీఈఈసీ) వంటి వేరియంట్లలో ఈ పాలసీ లభిస్తుందని సెహ్గల్ చెప్పారు. -
బజాజ్ నుంచి ‘హెల్త్, లైఫ్’ పాలసీ
హైదరాబాద్: వైద్య బీమా, జీవిత బీమా రెండు రకాల ప్రయోజనాలతో కలిసిన కాంబో పాలసీని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా తీసుకొచ్చాయి. బజాజ్ అలియాంజ్ టోటల్ హెల్త్ సెక్యూర్ గోల్ పేరుతో ఉన్న ఈ పాలసీ ద్వారా హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సల వ్యయాలతో పాటు, జీవితానికీ కవరేజీ లభిస్తుంది. రెండు వేర్వేరు పాలసీలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది. ప్రస్తుతం బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఉన్న హెల్త్‌గార్డ్ పాలసీ, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లోని బజాజ్ అలియాంజ్ ఐ సెక్యూర్ పాలసీ కాంబినేషన్ ఈ నూతన కాంబో పాలసీ. విడిగా రెండు పాలసీలు తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియంతో పోలిస్తే కాంబో పాలసీపై ప్రీమియం 5% తగ్గింపు ఉంటుందని ఈ కంపెనీలు ప్రకటించాయి. -
బజాజ్ అలయంజ్ నుంచి రెండు కొత్త ఉత్పాదనలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండు కొత్త పాలసీలను తమ సంస్థ తేనున్నదని, అవి ఐఆర్డీఏ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ సాయి శ్రీనివాస్ ధూలిపాళ తెలిపారు. ఇందులో ఒకటి యులిప్ పాలసీ అని వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం 25 రకాల పాలసీలను అందుబాటులో ఉంచిందని గురువారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘‘ఏప్రిల్–సెప్టెంబరు మధ్య ఇండివిడ్యువల్ విభాగంలో లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ 9.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రైవేటు కంపెనీలు 11.4 శాతం, బజాజ్ 12.7 శాతం వృద్ధి కనబరిచింది. క్యూ2లో న్యూ బిజినెస్ ప్రీమియం 24% అధికమైంది. పాలసీ సగటు టికెట్ సైజు రూ.39,895 నుంచి రూ.54,636లకు ఎగసింది. ఇండివిడ్యువల్ న్యూ బిజినెస్ ప్రీమియం రెండవ త్రైమాసికంలో రూ.280 కోట్ల నుంచి రూ.346 కోట్లకు చేరింది. రెన్యువల్ ప్రీమియం 17 శాతం వృద్ధితో రూ.870 కోట్లుగా ఉంది. మొత్తం ప్రీమియం రూ.2,015 కోట్ల నుంచి రూ.2,083 కోట్లకు వచ్చి చేరింది’ అని వివరించారు. -
బీమా రంగంలోకి ఫ్లిప్‌కార్ట్
న్యూఢిల్లీ: కార్పొరేట్ ఏజెంట్ లైసెన్సు దక్కించుకున్న ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపింది. ఇకపై తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే అన్ని ప్రముఖ మొబైల్ బ్రాండ్స్ ఫోన్లకు కస్టమైజ్డ్ బీమా పాలసీలు అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. నగదు చెల్లింపు లేదా ఉచిత పికప్, సర్వీస్, డ్రాప్ వంటి సర్వీసులు ఈ పాలసీల ప్రత్యేకతలని పేర్కొంది. అక్టోబర్ 10న ప్రారంభించే ది బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) సేల్ రోజు నుంచి ఈ ఇన్సూరెన్స్ పాలసీల విక్రయం మొదలవుతుందని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి గరికపాటి తెలిపారు. కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ (సీఎంపీ) పేరిట అందించే ఈ పాలసీ ప్రీమియం రూ. 99 నుంచి ఉంటుందని బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘెల్ తెలిపారు. ఫోన్ చోరీకి గురవడం, స్క్రీన్ దెబ్బతినడం మొదలైన వాటన్నింటికీ కవరేజీ ఉంటుంది. క్లెయిమ్స్ కోసం ఫ్లిప్‌కార్ట్‌కి యాప్ ద్వారా లేదా ఈమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్‌ను సర్వీస్ చేయించుకోవడం లేదా పరిహారం తీసుకోవడం అప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ పరిహారం తీసుకోదలిస్తే.. కస్టమర్ బ్యాంక్ ఖాతాకు బీమా సంస్థ నగదు బదిలీ చేస్తుంది. -
36 క్లిష్ట ఆరోగ్య సమస్యలకు పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్... సోమవారం కొత్తపాలసీని ప్రవేశపెట్టింది. బజాజ్ అలయంజ్ లైఫ్ హెల్త్ కేర్ గోల్ పేరుతో రూపొందిన ఈ పాలసీ 36 రకాల క్లిష్ట ఆరోగ్య సమస్యలను కవర్ చేస్తుంది. ఒక ప్రీమియంతో ఒకే పాలసీ కింద ఆరుగురు సభ్యులున్న కుటుంబం లబ్ధి పొందవచ్చు. రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షల కవరేజ్ ఉంటుంది. సంప్రదాయ హెల్త్ పాలసీలతో పోలిస్తే ఇది చాలా భిన్నం. సమస్యను గుర్తిస్తూ డయాగ్నస్టిక్ సెంటర్ ఇచ్చే రిపోర్ట్ ఉంటే చాలు. బీమా మొత్తాన్ని పాలసీదారు ఖాతాలో జమ చేయడం ఈ పాలసీ ప్రత్యేకత. క్లెయిమ్ చేయనట్టయితే.. పిల్లల క్లిష్ట ఆరోగ్య సమస్యలను సైతం కవర్ చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమదేనని సంస్థ ఎండీ తరుణ్ చుగ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 36 రకాల్లో పాలసీదారుకు ఇప్పటికే ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్టయితే 90 రోజుల తర్వాత కవరేజ్ లభిస్తుందని చెప్పారు. 32–35 ఏళ్ల వయసున్న పాలసీదారు, ఆయన భార్య, ఇద్దరు పిల్లల కోసం రూ.6,477 చెల్లిస్తే రూ.5 లక్షల పాలసీ లభిస్తుంది. 10, 15, 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో క్లెయిమ్ చేయనట్టయితే చెల్లించిన ప్రీమియం వెనక్కి వస్తుంది. ఈ ఫీచర్ కావాల్సినవారు సుమారు రెండింతల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. -
గతేడాది కంటే మెరుగైన వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగంలో ఉన్న బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రూ.4,291 కోట్ల నూతన ప్రీమియం సాధించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 29 శాతం వృద్ధి. పరిశ్రమ వృద్ధి రేటు కేవలం 11 శాతం మాత్రమే. 2018–19లో గతేడాది కంటే మెరుగ్గా పనితీరు కనబరుస్తామని బజాజ్ అలియంజ్ లైఫ్ అపాయింటెడ్ యాక్చువరీ సాయి శ్రీనివాస్ ధూళిపాళ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. రెండు కొత్త ఉత్పాదనలను ఐఆర్డీఏ క్లియరెన్స్ రాగానే అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే 40కిపైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు చెప్పారు. ‘2017–18లో మొత్తం రూ.7,578 కోట్ల వ్యాపారం చేశాం. 3.08 లక్షల పాలసీలను విక్రయించాం. కంపెనీ మార్కెట్ వాటా 1.9 నుంచి 2.2 శాతానికి చేరింది. క్లైముల శాతం గ్రూప్ విభాగంలో 99.6, ఇండివిడ్యువల్ విభాగంలో 92.3 శాతముంది. వ్యాపారం పరంగా హైదరాబాద్‌లో టాప్–3లో ఉన్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.211 కోట్ల నూతన ప్రీమియం అందుకున్నాం’ అన్నారు. -
బీమా వృద్ధికి టెక్నాలజీ దన్ను
సాక్షి, బిజినెస్ బ్యూరో : పాలసీల విక్రయం నుంచి సర్వీసుల దాకా జీవిత బీమా రంగంలో టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి పూర్తి డిజిటల్ సంస్థగా ఎదిగే దిశగా ఇన్వెస్ట్ చేస్తున్నామంటున్నారు బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ తరుణ్ చుగ్. గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమకు రెట్టింపు స్థాయిలో కొత్త ప్రీమియం ఆదాయాలు సాధించామని, ఈసారీ మరింత వ్యాపార వృద్ధికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ పనితీరు ఎలా ఉంది. ఈసారి అంచనాలేంటి? గత ఆర్థిక సంవత్సరం అటు మొత్తం జీవిత బీమా రంగానికి ఇటు మా సంస్థకూ సానుకూలంగానే గడిచింది. కొత్త బిజినెస్ ప్రీమియంలు, ముఖ్యంగా యులిప్స్‌లో పెట్టుబడులు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు యులిప్స్‌ను సురక్షితమైన, మెరుగైన పెట్టుబడి సాధనంగా విశ్వసిస్తున్నారనడానికి ఇది నిదర్శనం. 2017–18లో పరిశ్రమ కొత్త ప్రీమియం ఆదాయం 19 శాతం పెరగ్గా, ప్రైవేట్ బీమా సంస్థల్లో మేం అత్యధికంగా 38 శాతం వృద్ధి సాధించాం. 2016–17లో మార్కెట్ వాటా 1.9 శాతం ఉండగా, గత సంవత్సరం 2.2 శాతానికి పెరిగింది. గత క్వార్టర్లో యులిప్ గోల్ అష్యూర్ వంటి పథకాలను ప్రవేశపెట్టాం. కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయాలు పెంచుకునేందుకు ఇవన్నీ తోడ్పడ్డాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా పరిస్థితులు సానుకూలంగానే కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతుండటం, మరింత మెరుగైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటున్న రిటైల్ ఇన్వెస్టర్లు .. సముచిత రాబడులు అందించే పెట్టుబడి సాధనాల వైపు చూస్తుండటం తదితర అంశాలు ఈసారి వ్యాపార వృద్ధికి తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. జీవిత బీమా రంగంలో ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? బీమా రంగ సంస్థలు డిజిటైజేషన్ అవసరాన్ని గుర్తెరిగాయి. కస్టమర్‌కు మెరుగైన అనుభూతినివ్వడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు, వ్యయాలను తగ్గించుకునేందుకు, సులభతరంగా కార్యకలాపాల నిర్వహణకు ఇది తోడ్పడుతోంది. రాబోయే రోజుల్లో ప్రీ–సేల్స్ నుంచి పోస్ట్ సేల్స్ సర్వీసెస్ దాకా అంతా పేపర్రహితంగానే జరిగే అవకాశం ఉంది. బీమా పాలసీల అమ్మకాలు ఆన్లైన్లో మరింతగా పెరగునున్నాయి. డిజిటైజేషన్ కారణంగా ఎలాంటి సర్వీసైనా క్షణంలోనే అందుబాటులో ఉంటుంది. మా విషయానికొస్తే.. 2019 నాటికల్లా పూర్తి డిజిటల్ సంస్థగా ఎదిగే దిశగా ఐటీ ఇన్ఫ్రాను అప్‌గ్రేడ్ చేసేందుకు భారీ పెట్టుబడులు పెడుతున్నాం. మీ సంస్థలో టెక్నాలజీ వినియోగం ఎలా ఉంటోంది? కస్టమర్‌తో పాటు ఉద్యోగులకు కూడా తోడ్పడేటటువంటి టెక్నాలజీలను మేం ఉపయోగిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో లైఫ్ అసిస్ట్ పేరుతో కస్టమర్స్ కోసం పోర్టల్ ప్రారంభించాం. బజాజ్ అలయంజ్ లైఫ్ పాలసీకి సంబంధించి తలెత్తే ప్రశ్నలన్నింటినీ దీని ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఆధార్, ఫండ్ స్విచింగ్, కాంటాక్ట్ వివరాలు అప్డేట్ చేసుకోవడం మొదలైన వాటన్నింటికీ ఇది ఉపయోగపడుతుంది. దీన్ని రెండు లక్షల మందికి పైగా కస్టమర్లు ఉపయోగించుకుంటున్నారు. ఇక పాలసీ సేవలపై కస్టమర్స్‌కి తోడ్పాటు అందించేందుకు బోయింగ్ పేరిట వర్చువల్ చాట్ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉంది. ఇక మా శాఖల్లో లభించే సర్వీసులన్నీ కస్టమర్ ఇంటి దగ్గరే అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించి మోసంబీ పేరుతో చేతిలో ఇమిడే చిన్న పరికరాన్ని రూపొందిం చాం. దీని తోడ్పాటుతో కేవలం నాలుగు నెలల్లోనే రూ. 160 కోట్లకు పైగా రెన్యువల్ ప్రీమియంలు సేకరించగలిగాం. దీంతో పాటు ఫొటో డె డూప్ పేరుతో మరొక ఫీచర్ కూడా అందుబాటులోకి తెచ్చాం. కేవలం సెల్ఫీ క్లిక్ చేయడం ద్వారా పాలసీదారు ఆన్లైన్లో లాగిన్ అయి.. పాలసీ సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. లాగిన్ అయ్యేందుకు పట్టే సమయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. అమ్మకాల కోసం ఇన్స్టాబ్ పేరుతో ప్రత్యేకంగా యాప్ కూడా ఉంది. ఏజెంటు అప్పటికప్పుడు బీమా ప్రీమియంను లెక్కగట్టి, ట్యాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా కొత్త ప్రపోజల్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా ప్రాసెస్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా గత ఆర్థిక సంవత్సరం 27,000 పైచిలుకు పాలసీలు ప్రాసెస్ చేశాం. ఇక సేల్స్ టీమ్ మధ్య పరస్పరం సమాచారం పంచుకునేందుకు ఐస్మార్ట్, పేపర్‌రహితంగా ఏజెంట్ల నియామకం చేపట్టేందుకు ఐ–రిక్రూట్ పోర్టల్ లాంటివి ఉన్నాయి. అటు మా ఉద్యోగులు, మానవ వనరుల విభాగం మధ్య అనుసంధానంగా వ్యవహరించేందుకు వికి పేరుతో చాట్‌బాట్‌ను రూపొందించాం. -
యులిప్‌లపై 15–16 శాతం రాబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యులిప్‌లపై రాబడి 15–16 శాతం వరకూ ఉంటోందని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలియజేసింది. గడిచిన 15 ఏళ్లలో సగటున ఈ స్థాయి రాబడి వస్తోందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సంపత్ రెడ్డి మంగళవారమిక్కడ మీడియాతో చెప్పారు. ‘2016–17లో యులిప్‌ల మార్కెట్ భారత్‌లో రూ.4.1 లక్షల కోట్లుంది. 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో వృద్ధి ఉంటుందని అంచనా. జీవిత బీమా పాలసీల్లో యులిప్‌ల వాటా 60 శాతం దాకా ఉంటుంది. యులిప్‌ల వృద్ధి రేటు జీవిత బీమా పాలసీల కంటే అధికంగా నమోదు చేస్తోంది. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఆరు రకాల యులిప్‌లు అందుబాటులో ఉన్నాయి’ అని వెల్లడించారు. కరెక్షన్ ఉండొచ్చు: స్టాక్ మార్కెట్లో కరెక్షన్ ఉండొచ్చని సంపత్ రెడ్డి తెలిపారు. ‘రానున్న రోజుల్లో ఐటీ రంగం బాగుంటుంది. ఫార్మా ఏడాదిన్నరగా ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రైవేటు బ్యాంకింగ్ రంగం మంచి పనితీరు కనబరుస్తోంది’ అని వివరించారు. కాగా, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా లైఫ్ గోల్ అష్యూర్ పేరుతో నూతన యులిప్ పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీ గడువు ముగిసిన తర్వాత 1.35%గా ఉన్న ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలను మినహాయించి మోర్టాలిటీ చార్జీలను వెనక్కి చెల్లిస్తారు. అది కూడా యూనిట్ల రూపంలో అందజేస్తారు. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు ఈ ఆన్లైన్ పాలసీ తీసుకోవచ్చు. -
పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి హార్ట్, క్యాన్సర్ ప్రొటెక్ట్ ప్లాన్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సంస్థ .. హార్ట్/ క్యాన్సర్ ప్రొటెక్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గుండె జబ్బు లేదా క్యాన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిన పక్షంలో బీమా కవరేజీలో కొంత భాగాన్ని ఏకమొత్తంగా కంపెనీ అందజేస్తుంది. సరైన చోట సరైన చికిత్స పొందేందుకు ఇది ఉపయోగపడగలదని కంపెనీ ఈడీ పునీత్ నందా తెలిపారు. ఇన్‌కం రిప్లేస్మెంట్ పేరిట ప్రత్యేక యాడ్ ఆన్ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది. బీమా కవరేజీలో 1 శాతం మేర ప్రతి నెలా పాలసీదారుకు చెల్లిస్తారు. చికిత్స చేయించుకుంటున్న సమయంలో పాలసీదారు కోల్పోయే ఆదాయాన్ని ఇది కొంత మేర భర్తీ చేయగలదని నందా చెప్పారు. అత్యంత చౌకగా నెలకు రూ. 100కే రూ. 20 లక్షల పైగా క్యాన్సర్ కవరేజీ, రూ. 10 లక్షల హార్ట్ కవరేజీ పొందవచ్చు (సిగరెట్ అలవాటు లేని 30 ఏళ్ల వ్యక్తి, 20 ఏళ్ల వ్యవధికి పాలసీ తీసుకుంటే). క్యాన్సర్ లేదా హృద్రోగం ఉందని పరీక్షల్లో తేలితే భవిష్యత్‌లో ప్రీమియంలు కట్టకపోయినా పాలసీ కొనసాగుతుంది. క్యాన్సర్ లేదా హార్ట్ లేదా రెండింటికీ కలిపి కవరేజీ తీసుకునే వెసులుబాటు ఉంది. ఇండియాబుల్స్ ఫండ్‌లో ఇన్స్టంట్ యాక్సెస్ సదుపాయం ఇండియాబుల్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తమ లిక్విడ్ ఫండ్‌లో ఇన్స్టంట్ యాక్సెస్ సదుపాయం ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్లు సత్వరం తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వారాంతాలైనా, బ్యాంకు సెలవుదినాలైనా, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా మూడొం దల అరవై అయిదు రోజులు, ఇరవై నాలుగ్గంటలూ రిడెంప్షన్ (యూనిట్లు విక్రయించుకోవడం) అవకాశం కల్పిస్తున్నట్లు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అక్షయ్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం దీన్ని దేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఎన్నారై, కార్పొరేట్లకు వర్తించదు. రిడెంప్షన్ అనంతరం నిమిషాల వ్యవధిలోనే సదరు మొత్తం ఐఎంపీఎస్ (ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్) విధానంలో ఇన్వెస్టరు బ్యాంకు ఖాతాలో జమవుతుందని గుప్తా పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా రూ. 50,000 దాకా లేదా తమ పోర్ట్‌ఫోలియో విలువలో 90% దాకా (ఏది తక్కువైతే అది) రిడీమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. బజాజ్ అలయంజ్ లైఫ్ నుంచి ఫ్యూచర్ వెల్త్ గెయిన్ పాలసీ ప్రైవేట్ బీమా దిగ్గజ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ తాజాగా బజాజ్ అలయింజ్ లైఫ్ ఫ్యూచర్ వెల్త్ గెయిన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. యూనిట్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పథకంలో ’వెల్త్ ప్లస్’, ’వెల్త్ ప్లస్ కేర్’ పేరిట రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకవైపు పాలసీదారు కుటుంబానికి బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా సంపదను మరింతగా పెంచగలిగే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. పాలసీదారు కన్నుమూసిన పక్షంలో వెల్త్ ప్లస్ వేరియంట్లో అత్యధిక సమ్ అష్యూర్డ్, ఫండ్ విలువ కుటుంబానికి చెల్లిస్తారు. డెత్ బెనిఫిట్ కింద అప్పటిదాకా కట్టిన ప్రీమియంలపై 105 శాతం మేర చెల్లింపులు జరుపాతురు. ఇక వెల్త్ ప్లస్ కేర్ వేరియంట్లో డెత్ బెనిఫిట్‌తో పాటు పాలసీదారుకు ఇన్కమ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు కన్నుమూసినా లేదా ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడినట్లు తేలినా ఇన్కమ్ బెనిఫిట్ వర్తిస్తుంది. ఫ్యూచర్ వెల్త్ గెయిన్ ప్రీమియం ఏడాదికి కనీసం రూ.50,000గా ఉంటుంది. గరిష్టంగా 25ఏళ్లకు, కనిష్టంగా 5 ఏళ్లకు పాలసీ తీసుకోవచ్చు. -
అదరగొట్టిన దిగ్గజాలు..
ఆటో మోటార్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ దిగ్గజాలు నేడు ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ దిగ్గజం బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఆర్థికసంవత్సర సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా తన నికర లాభాలను 66 శాతం పెంచుకుని రూ.234 కోట్లగా నమోదుచేసింది. అగ్రికల్చర్, రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లోని తమ సహకారమే లాభాల బాటకు తోడ్పడిందని పేర్కొంది. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, కరువు వంటివాటితో బాధపడుతున్న రైతులకు ఊరట కలిగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.159 కోట్ల నుంచి రూ.737 కోట్లకు పెంచుకోగలిగామని కంపెనీ తెలిపింది. జంప్ చేసిన ఐషర్ మోటార్స్ వాణిజ్య వాహనాల ఉత్పత్తి సంస్థ ఐషర్ మోటార్స్ లాభాల్లో జంప్ చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభాలు 45.19శాతం ఎగిసి, రూ.413.16కోట్లగా రికార్డు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.284.56కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ రివ్యూ సందర్భంగా కంపెనీ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ రూ.1,981.01కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది కంటే కంపెనీ 34.9 శాతం వృద్ధి నమోదుచేశామని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. నిర్వహణల నుంచి ఈ త్రైమాసికంలో అత్యధిక ఆదాయాల్లో ఆర్జించామని పేర్కొన్నారు. తమ టూవీలర్ విభాగం రాయల్ ఫీల్డ్ 30.8 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు. నెస్లే రెండింతలు జంప్ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం నెస్లే ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభాలూ రెండింతలు జంప్ అయ్యాయి. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు రూ.269.39 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.124.20 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జించింది. నికర విక్రయాలు 35.13 శాతం ఎగిసి, రూ.2,346.18కోట్లగా రికార్డైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ లాంచ్ చేసిన 25 పైగా కొత్త ప్రొడక్ట్‌లతో లాభాల వృద్ధికి బాటలు వేశామని నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ్ తెలిపారు. మ్యాగీ ఉత్పత్తులతో మళ్లీ ఇన్స్టాంట్ న్యూడిల్స్ కేటగిరీలో పూర్తి ఆధిపత్య స్థానానికి వచ్చేశామని పేర్కొన్నారు. నష్టాల్లోంచి లాభాలోకి వచ్చిన ఐడీఎఫ్సీ దేశీయ లీడింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐడీఎఫ్సీ నష్టాల్లోంచి లాభాల్లోకి పయనించింది. శుక్రవారం వెలువరించిన ఫలితాల్లో కంపెనీ రూ.281.79 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాలను ఆర్జించినట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.1,468.83కోట్ల నికర నష్టాలను నమోదుచేసింది. గ్రూప్ మొత్తం ఆదాయం ఈ క్వార్టర్లో రూ.2,704.13 కోట్లగా ఉన్నట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. బజాజ్ ఆటో@7 శాతం ఇటు టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో సైతం రెండో క్వార్టర్లో 6.7 శాతం వృద్ధిని నమోదుచేసి రూ.1,122 కోట్ల లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. ఇతరాత్ర ఆదాయాలు లాభాలకు వెన్నుదన్నుగా నిలిచినట్టు కంపెనీ పేర్కొంది. అయితే ఈ క్వార్టర్లో రెవెన్యూలు స్వల్పంగా 0.4 శాతం మాత్రమే పెరిగి రూ.6,432కోట్లగా నమోదయ్యాయి. నెమ్మదించిన సేల్స్ వాల్యుమ్ గ్రోత్తో రెవెన్యూలు స్వల్పంగా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో 10.3 లక్షల యూనిట్ల విక్రయాలు జరుపగా.. గతేడాది కంపెనీ 10.56 లక్షల యూనిట్లను అమ్మింది. నైజీరియా, ఈజిప్ట్ వంటి ఎగుమతుల మార్కెట్లలో విక్రయాలు పడిపోయినట్టు బజాజ్ ఆటో తెలిపింది. -
బజాజ్ అలియాంజ్ ‘డ్రైవ్ స్మార్ట్’
ముంబై: బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తొలిసారిగా 12 విలువ జోడించిన సదుపాయాలతో ‘డ్రైవ్‌స్మార్ట్’ సేవలను ప్రారంభిం చింది. భద్రత, రక్షణతోపాటు పొదుపు, సౌల భ్యాన్ని దీనికింద పొందవచ్చని కంపెనీ తెలి పింది. డ్రైవింగ్ ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడమే కాకుండా, రివార్డులనూ పొందడం ఇందులోని అదనపు ఆకర్షణ అని ఈ సేవలను ప్రారంభించిన సందర్భంగా బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ సింఘాల్ తెలిపారు. -
బజాజ్ అలయంజ్ జీఐ లాభం రూ.562 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీ బజాజ్ అలయంజ్ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సర నికర లాభంలో 37 శాతం వృద్ధిని నమోదు చేసింది. గడిచిన ఏడాది రూ. 962 కోట్ల విలువైన క్లెయిమ్‌లు చెల్లించినప్పటికీ రూ. 562 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. జమ్మూ కశ్మీర్ వరదలు, హుద్ హుద్ తుపాన్ వంటి భారీ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని మరీ ఈ లాభాలను నమోదు చేసినట్లు కంపెనీ ఎండీ సీఈవో తపన్ సింఘల్ తెలిపారు. ఈ ఏడాది కాలంలో పరిశ్రమ 10 శాతం వృద్ధిని నమోదు చేస్తే బజాజ్ అలయంజ్ 16 శాతం వృద్ధితో రూ. 5,305 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. -
రుణం వచ్చేలా వృద్ధులకు పాలసీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేవలం పెన్షన్ పథకాలే కాకుండా పదవీ విరమణ తర్వాత బీమా రక్షణతో పాటు, ఆర్థిక అవసరాలను తీర్చేలా వృద్ధులకు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెస్తోంది బజాజ్ అలయంజ్. ఇప్పటి వరకు వయసుపై బడిన వారికి మార్కెట్లో సరైన బీమా పథకం లేదని, ఆ లోటును భర్తీ చేసేలా త్వరలోనే కొత్త పథకం ప్రవేశపెడుతున్నామంటున్న బజాజ్ అలయంజ్ లైఫ్ ప్రొడక్ట్ హెడ్ రితురాజ్ భట్టాచార్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. కొత్త నిబంధనలు వచ్చాక అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందా? ఈ మార్పులతో ప్రీమియం రేట్లు ఏమైనా పెరిగాయా? మార్పులు జరిగినప్పుడు కొంత ఒడిదుడుకులు ఉండటం సహజం. కొత్త నిబంధనలు వచ్చి నెల రోజులు మాత్రమే అయింది. కాబట్టి అప్పుడే అమ్మకాల గురించి వ్యాఖ్యానించటం కష్టం. మార్పులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం మేం కొత్త పథకాలపై ఏజెంట్లకు అవగాహన కల్పించే పనిలో ఉన్నాం. ఇదంతా పూర్తయి మామూలు పరిస్థితి రావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. మా పథకాల పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్చి కొత్త తరహా పథకాలను ప్రవేశపెట్టడానికి ఈ నిబంధనల మార్పును చక్కగా వినియోగించుకుంటున్నాం. కొత్త నిబంధనలతో బీమా రక్షణ పెరిగింది. ఆ మేరకు ప్రీమియం ధరల్లో కొంత మార్పు ఉండచ్చు కాని ప్రీమియం ధరల్లో భారీ మార్పులేమీ రాలేదు. బజాజ్ అలయంజ్ ఎటువంటి ఉత్పత్తులపై దృష్టిపెడుతోంది? ప్రస్తుతం ఎన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం 8 వ్యక్తిగత బీమా పథకాలు, మరో 8 గ్రూపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలోకి చేరి తొలిసారిగా బీమా తీసుకునే వారికోసం, అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా బీమా రక్షణతో పాటు వారి అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండే పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ముఖ్యంగా జీవించే కాలం పెరుగుతుండటంతో 60 ఏళ్ల పైబడిన వారికి ఉపయోగపడేలా, అవసరమైతే బీమా పథకంపై రుణం తీసుకునే అవకాశం ఉండే హోల్‌లైఫ్ పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ఇంతకాలం బీమారంగం వీరి అవసరాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విభాగంపై మేం ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. వచ్చే నెలలోనే ఇటువంటి పాలసీని ప్రవేశపెట్టనున్నాం. మొత్తం మీద నెలకు 3 పథకాలు చొప్పున ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. టర్మ్, యులిప్, ఎండోమెంట్ అన్ని పథకాలు ఉండే విధంగా బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియోపై దృష్టిసారిస్తున్నాం. కేవలం ఆన్లైన్లో తీసుకునేలా ఏమైనా కొత్త బీమా పథకాలను ప్రవేశపెడుతున్నారా? ప్రత్యేకంగా ఎటువంటి ఆన్లైన్ పథకాలనూ ప్రవేశపెట్టడం లేదు. కాని అన్ని పథకాలనూ ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా తీసుకునే పాలసీలపై ఏజెంట్లకు కమీషన్లు చెల్లించాల్సి ఉండదు కాబట్టి ఆ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. కాని ప్రస్తుతం సరళిని చూస్తే పాలసీ వివరాలను తెలుసుకోవడానికి ఆన్లైన్ ఉపయోగించి, ఆఫ్‌లైన్‌లో పాలసీలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. పాలసీ తీసుకునే సమయంలో ఏజెంట్ సహాయం కావాలనుకోవడం దీనికి ప్రధాన కారణంగా గమనించాం. అలాగే రెన్యువల్ ప్రీమియంలు ఆన్లైన్ ద్వారా చెల్లించే వారి సంఖ్యలో 30 శాతానికిపైగా వృద్ధి నమోదవుతోంది. యులిప్ ఫండ్స్ మార్చుకోవడం, చిరునామా మార్పు వంటి సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నాం. బ్యాంకులు కేవలం ఒక బీమా కంపెనీ పథకాలనే కాకుండా అన్ని బీమా కంపెనీలు పథకాలూ అమ్మేలా ఐఆర్డీఏ విడుదల చేసిన మార్గదర్శకాల సంగతి? మొత్తం వ్యాపారంలో 55 శాతం వరకు బ్యాంకుల నుంచే వస్తోంది. దేశవ్యాప్తంగా 100కిపైగా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. బ్యాంకులను బ్రోకర్లుగా మారిస్తే మా వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. వ్యాపారం సన్నగిల్లడంతో కొన్ని బీమా కంపెనీలు శాఖల సం ఖ్యను తగ్గించుకుంటున్నాయి? బజాజ్ అలయంజ్ పరిస్థితేంటి? గతంలో ఒకే పట్టణంలో నాలుగైదు శాఖలను ఏర్పాటు చేసిన బీమా కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా వాటిని విలీనం చేస్తున్నాయి. శాఖలను పునర్ వ్యవస్థీకరించడం తప్ప పూర్తిగా మూసేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 773 శాఖలు ఉన్నాయి. తగినన్ని శాఖలు ఉండటంతో కొత్తగా ఎటువంటి విస్తరణ కార్యక్రమాల యోచన లేదు. -
బజాజ్ అలియంజ్ పాలసీల పునరుద్ధరణ
పాలసీదారులు ప్రీమియాలు కట్టకుండా వదిలేసిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బజాజ్ అలియంజ్ తెలిపింది. మార్చ్ 31 దాకా ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాంప్రదాయ పాలసీల పునరుద్ధరణకు సంబంధించి 50% మేర వడ్డీ మొత్తం మినహాయింపునిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, ఆరోగ్యపరమైన డిక్లరేషన్ల నిబంధనలు కూడా సడలించింది. -
బజాజ్ అలయంజ్ మహిళా బ్రాంచ్
న్యూఢిల్లీ: మహిళా బ్యాంక్ స్ఫూర్తితో బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందరూ మహిళలుండే శాఖను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించింది. అందరూ మహిళా ఉద్యోగులు ఉండే బీమా కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తొలి బీమా కంపెనీ తమదేనని బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, తపన్ సింఘాల్ తెలిపారు. ఈ బ్రాంచ్ కోసం త్వరలో మహిళా ఏజెంట్లను, ఉద్యోగులను నియమించుకుని, వారికి తగిన శిక్షణనిస్తామని వివరించారు. కుటుంబ బాధ్యత కోసం తమ వృత్తిగత బాధ్యతలను త్యాగం చేసిన మహిళా ఉద్యోగులను నియమించుకుంటామని, వారి కెరీర్‌కు మళ్లీ ప్రారంభాన్నిస్తామని పేర్కొన్నారు. మొదటగా 5గురు మహిళా ఉద్యోగులు, 10 మహిళ ఏజెంట్లతో పుణే బ్రాంచ్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే మహిళ ఏజెంట్ల సంఖ్యను 60కు పెంచుతామని వివరించారు. అన్ని మెట్రో నగరాల్లో కూడా త్వరలో ఇలాంటి మహిళా బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామని తపన్ సింఘాల్ పేర్కొన్నారు.