
హైదరాబాద్: వైద్య బీమా, జీవిత బీమా రెండు రకాల ప్రయోజనాలతో కలిసిన కాంబో పాలసీని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా తీసుకొచ్చాయి. బజాజ్ అలియాంజ్ టోటల్ హెల్త్ సెక్యూర్ గోల్ పేరుతో ఉన్న ఈ పాలసీ ద్వారా హాస్పిటల్‌లో చేరి తీసుకునే చికిత్సల వ్యయాలతో పాటు, జీవితానికీ కవరేజీ లభిస్తుంది. రెండు వేర్వేరు పాలసీలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది.
ప్రస్తుతం బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఉన్న హెల్త్‌గార్డ్ పాలసీ, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లోని బజాజ్ అలియాంజ్ ఐ సెక్యూర్ పాలసీ కాంబినేషన్ ఈ నూతన కాంబో పాలసీ. విడిగా రెండు పాలసీలు తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియంతో పోలిస్తే కాంబో పాలసీపై ప్రీమియం 5% తగ్గింపు ఉంటుందని ఈ కంపెనీలు ప్రకటించాయి.