![Bajaj Allianz launches HERizon Care healthcover for women](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/BAJAJ.jpg.webp?itok=UsQJmUDG)
‘హెరిజాన్’ను ఆవిష్కరించిన బజాజ్ అలియాంజ్
పుణె: మహిళల కోసం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ‘హెరిజాన్ కేర్’ను బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొచి్చనట్టు తెలిపింది. క్రిటికల్ ఇల్‌నెస్ (తీవ్రమైన వ్యాధులు/అనారోగ్యాలు), మేటర్నల్ (మహిళల గర్భధారణ, ప్రసవానంతర ఆరోగ్యం), రీప్రొడక్టివ్ హెల్త్, వెల్‌నెస్ తదితర అన్ని అంశాలకు ఈ ప్లాన్‌లో రక్షణ ఉంటుందని తెలిపింది.
జీవితంలోని వివిధ దశల్లో మహిళలకు ఆర్థిక భద్రతను ఇచ్చే విధంగా ఉంటుందని పేర్కొంది. విటా షీల్డ్, క్రాడిల్ కేర్ పేరుతో రెండు రకాల సమగ్రమైన కవరేజీలు ఇందులో ఉంటాయి. విటాషాల్డ్ కింద 34 క్రిటికల్ ఇల్‌నెస్‌లకు కవరేజీ ఉంటుంది. కావాలంటే ఈ కవరేజీని పెంచుకోవచ్చు. చైల్డ్ ఎడ్యుకేషన్ కింద.. మహిళ క్రిటికల్ ఇల్‌నెస్ బారిన పడితే ఆమె పిల్ల ల విద్యా సంబంధింత ఖర్చులను ఈ పాలసీ చెల్లిస్తుంది.
క్రిటికల్ ఇల్‌నెస్ కారణంగా ఉద్యోగం కోల్పోతే ఎదురయ్యే ఆర్థిక అనిశ్చితులకూ రక్షణ కల్పిస్తుంది. క్రాడిల్ కేర్ కింద మహిళ పునరుత్పాదక ఆరోగ్య అవసరాలకు తగ్గట్లుగా రక్షణ ఉంటుంది. సరోగేట్ కేర్ (మరొకరి సాయంతో సంతానం పొందడం) కింద.. గర్భాన్ని మోస్తున్న తల్లికి సంబంధించి అయ్యే వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. 21–45 ఏళ్ల వయసు మహిళలకు సంతాన లోపాలను అధిగమించే విషయంలోనూ కవరేజీని ఆఫర్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment