
మహిళ ఆరోగ్యం ఒక కుటుంబానికి ఎంతో అవసరం. ఆమె ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సాఫీగా ముందుకునడుస్తుంది. అయితే మహిళల ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రసూతి సంబంధిత ఖర్చులు, గైనకాలజీ సమస్యలు, రొమ్ము లేదా గర్భాశయ క్యాన్సర్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలు వంటి ప్రత్యేకమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలకు ఆరోగ్య బీమా ఒక కీలకమైన ఆర్థిక రక్షణగా నిలుస్తుంది.
అందుకే దేశంలోని అనేక బీమా ప్రొవైడర్లు ఇప్పుడు ఈ అవసరాలను తీర్చే మహిళల కోసమే ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పథకాలను అందిస్తున్నాయి. ఆర్థిక స్థిరత్వం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెస్తున్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఉమెన్ స్పెసిఫిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, అవి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ ప్లాన్
క్యాన్సర్ సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు కూడా కవరేజీ లభించేలా మహిళల కోసం బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. దీని పేరు ’బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ (ఎస్‌డబ్ల్యూటీ) ప్లాన్’. ఇది సంప్రదాయ జీవిత బీమా పరిధికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధించిన బెనిఫిట్స్, ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్ మొదలైన వాటితో ఆర్థిక భద్రతను అందిస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్మార్ట్ ఉమెన్ ప్లాన్
» గర్భధారణ సంబంధిత సమస్యలను కవర్ చేస్తుంది.
» క్లిష్టమైన అనారోగ్యాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
టాటా-ఏఐజీ వెల్సూరెన్స్ ఉమెన్ పాలసీ
» హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ అందిస్తుంది.
» క్యాన్సర్, స్ట్రోక్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలను కవర్ చేస్తుంది
స్టార్ వెడ్డింగ్ గిఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీ
» ప్రసూతి, వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తూ నవ వధూవరుల కోసం రూపొందించిన ప్రత్యేక పాలసీ ఇది.
రెలిగేర్ జాయ్ మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
» ప్రసూతి ప్రయోజనాలు, నవజాత శిశువుల సంరక్షణపై దృష్టి పెడుతుంది
న్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ
» మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్లాన్ వారికి పూర్తి ఆరోగ్య కవరేజీని కల్పిస్తుంది.
రిలయన్స్ హెల్త్ పాలసీ
» అదనపు వెల్ నెస్ లక్షణాలతో సమగ్ర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
సరైన ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?
ఉత్తమ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.కవరేజ్: పాలసీలో మీకు సంబంధించిన ప్రసూతి, క్రిటికల్ ఇల్ నెస్ కవర్ అయ్యేలా చూసుకోండి.
ప్రీమియం ఖర్చు: ఖర్చు, ప్రయోజనాల ఆధారంగా విభిన్న ప్లాన్‌లను పోల్చి చూడండి.
వెయిటింగ్ పీరియడ్: ప్రసూతి కవరేజీ, ముందుగా ఉన్న పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్ చెక్ చేయండి.
అదనపు ప్రయోజనాలు: వెల్నెస్ కార్యక్రమాలు, నివారణ సంరక్షణ, ఆసుపత్రిలో చేరిక ప్రయోజనాల కోసం చూడండి.