term plan
-
వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు కొత్త తరహా టర్మ్ ప్లాన్స్..
జీవిత బీమాకు సంబంధించి అత్యంత సరళమైన పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది పాలసీదారు కన్నుమూసిన పక్షంలో, వారు తమ జీవితకాలంలో చెల్లించిన ప్రీమియంలకు ప్రతిగా వారి కుటుంబసభ్యులకు (లబ్ధిదారులకు) నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తామంటూ బీమా కంపెనీ ఇచ్చే హామీ. కొత్త ఇన్వెస్టర్లు సాధారణంగానే సరళమైన, సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అన్వేషిస్తుంటారు కాబట్టి వారి కేటగిరీలో టర్మ్ ప్లాన్లకు ఆదరణ ఉంటోంది. ఈ పాలసీల కాలవ్యవధి 15 నుంచి 40 ఏళ్లు, అంతకు పైబడి ఉంటుంది. తమకు అనుకూలమైన కాలవ్యవధిని పాలసీదారు ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ ప్రారంభమయ్యే సమయానికి పాలసీదారు వయస్సు, ఎంచుకున్న మొత్తం సమ్ అష్యూర్డ్ బట్టి ప్రీమియం ఉంటుంది. వార్షిక ప్రీమియం ఎంత కట్టాల్సి ఉంటుందనేది తెలుసుకునేందుకు చాలా మటుకు బీమా కంపెనీల వెబ్సైట్లలో ఉండే ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాల్క్యులేటర్లను కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. దురదృష్టవశాత్తూ ఒకవేళ పాలసీదారు మరణించిన పక్షంలో నామినీకి మొత్తం సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. ఇన్సూరెన్స్ కాల వ్యవధి తీరేంత వరకు పాలసీదారు జీవించే ఉన్న పక్షంలో వారు మొత్తం సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్‌ల రూపంలో వడ్డీని కూడా పొందే విధమైన పాలసీలూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు దీనికి అదనంగా ప్రత్యేక అలవెన్సులు, బహుమతులు, లాయల్టీ అడిషన్ వంటివి కూడా ఇస్తున్నాయి. టర్మ్ ప్లాన్లకు ఎందుకింత ఆదరణ.. వివిధ ప్రొఫెషన్స్‌కు చెందిన కస్టమర్లు తమకు అవసరమైనవి ఎంపిక చేసుకునేలా వివిధ ఫీచర్లు, సరళమైన ఆప్షన్స్‌తో టర్మ్ ప్లాన్లు లభిస్తాయి. కొన్ని ప్లాన్లు డెత్ క్లాజ్‌తో వచ్చినప్పటికీ యాక్సిడెంటల్ డెత్, శాశ్వత వైకల్యం, తీవ్ర అనారోగ్యం వంటి ఆప్షన్స్‌తో పాటు నిర్దిష్ట వయస్సుకు వచ్చాకా పెన్షన్ పొందేటువంటి అదనపు క్లాజ్లతో కూడా లభిస్తుంటాయి. ఇక కొన్ని టర్మ్ ప్లాన్లలో మనీ బ్యాక్ ఫీచర్ ఉంటుంది. ఈ తరహా పాలసీలో ప్రతి 5 నుంచి 10 ఏళ్లకోసారి సమ్ అష్యూర్డ్‌లో నిర్దిష్ట శాతం మొత్తాన్ని పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. ఈ చెల్లింపులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 కింద ఇన్‌కం ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. పిల్లల చదువు లేదా వివాహం లేదా వ్యాపారంపై పెట్టుబడి పెట్టుకోవడం వంటి ఖర్చుల కోసం పాలసీదారుకి ఈ మొత్తం ఉపయోగపడగలదు. కొన్ని టర్మ్ ప్లాన్లలో చెల్లించాల్సిన ప్రీమియాన్ని తగ్గించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కొందరు ప్రొఫెషనల్స్‌కు సంపద ఉండొచ్చు. దానితో పాటు కట్టాల్సిన బకాయిలు, అప్పులూ ఉండొచ్చు. అలాంటి వారు తమకు ఆర్థికంగా భారం కాకుండా తక్కువ ప్రీమియాన్ని చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా వారు పెట్టుబడి పెట్టడం కోసం పెద్ద మొత్తంలో నగదును కేటాయించాల్సిన అవసరం లేకుండా, అలాగే అదే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా తమ ఆర్థిక భవిష్యత్తును భద్రపర్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదు. ఎండోమెంట్ పాలసీగా లేదా నెలవారీ యాన్యుయిటీలతో కూడుకున్న పెన్షన్ ఫండ్‌లాగా మార్చుకునే సౌలభ్యంతో కూడా పలు టర్మ్ పాలసీలు లభిస్తున్నాయి. ఆ విధంగానూ ఇవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఇలాంటి కేసుల్లో బీమా కంపెనీ, ప్రీమియాన్ని సవరించే అవకాశం ఉన్నప్పటికీ, మారే తమ అవసరాలకు అనుగుణమైన బీమా పాలసీ ప్రయోజనాలను పాలసీదారు పొందవచ్చు. కొందరు ప్రొఫెషనల్స్ తమ టర్మ్ ప్లాన్లను హోల్ లైఫ్ పాలసీలుగా మార్చుకోవాలనుకోవచ్చు. అలాంటప్పుడు సర్వైవల్ ప్రయోజనాలు లభించవు. దానికి బదులుగా పాలసీదారు మరణానంతరం, పాలసీ మెచ్యూరిటీ మొత్తాన్ని వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు బీమా కంపెనీ చెల్లిస్తుంది. కొత్త తరహా ప్లాన్స్ .. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బీమా కంపెనీలు టర్మ్ పాలసీల్లో పలు కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. డెత్ క్లాజ్‌తో పాటు కొన్ని టర్మ్ ప్లాన్లు 64 పైచిలుకు కీలక అనారోగ్యాలు, వ్యాధులకు కవరేజీ అందిస్తున్నాయి. ఇక టర్మ్ ప్లాన్ 40 ఏళ్ల పైబడిన కాలానికి ఉన్నా, పాలసీదారులు 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేని విధమైన పాలసీలూ ఉన్నాయి. సదరు వయస్సుకు వచ్చాకా రిటైర్ అయ్యే ప్రొఫెషనల్స్ ఈ తరహా టర్మ్ పాలసీలతో ప్రయోజనం పొందవచ్చు. ఇక కొన్ని కొత్త రకం ప్లాన్లను చూస్తే.. వరుసగా పదేళ్ల పాటు ప్రీమియంలు చెల్లించిన తర్వాత కొన్ని ప్రీమియంలను దాటవేసేందుకు వీలు కల్పించేవీ ఉంటున్నాయి. తద్వారా పాలసీదారులకు ఒక ఏడాది, రెండేళ్ల పాటు కాస్త వెసులుబాటు లభించగలదు. ఏదైతేనేం.. తమ భవిష్యత్తు అలాగే తాము ప్రేమించే వారి భవిష్యత్తుకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు టర్మ్ పాలసీలపై ఇన్వెస్ట్ చేయడం వివేకవంతమైన నిర్ణయం కాగలదు. ఆలస్యం చేసే కొద్దీ వయస్సును బట్టి ప్రీమియం భారం కూడా పెరిగిపోతుంది కాబట్టి.. దీన్ని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. -
insurance: ప్రీమియం తక్కువ.. రక్షణ ఎక్కువ
రోజుకు ఒక దోశ కోసం చేసే ఖర్చు.. పావు లీటర్ పెట్రోల్‌కు అయ్యే వ్యయం.. 30–50 రూపాయలు నావి కావంటూ వచ్చిన ఆదాయం నుంచి పక్కన పెడితే కుటుంబానికి చక్కటి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ, మనం సామాన్యులం. జీవితానికి రక్షణ ఇచ్చే బీమా విషయంలోనూ పిసినారి తనం ప్రదర్శిస్తుం టాం. అనుకోనిది జరిగితే.. విధి ఎదురు తిరిగితే అప్పుడు మన కుటుంబం పడే కష్టాలను చూడ్డానికి మనం ఉండం. నిండు మనసుతో ప్రేమించే మనవారి కోసం ఒక్క టర్మ్ ప్లాన్ రక్షణగా ఇవ్వలేమా? అది లేకుండా వారి పట్ల ఎంత ప్రేమ చూపించినా తామరాకుపై నీటిబొట్టు చందమే అవుతుంది..! టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది స్వచ్ఛమైన, సూటైన బీమా ప్లాన్. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు. అందుకే దీన్ని ప్రొటెక్షన్ ప్లాన్ అంటారు. జీవితానికి రక్షణ కల్పించేది. కుటుంబానికి ఆధారమైన ప్రతి వ్యక్తి ఈ ఒక్క బీమా ప్లాన్ తీసుకుంటే చాలు. పాలసీదారు వయసు, ఆరోగ్య చరిత్ర, ఎంచుకున్న కాలం (ఏ వయసు వరకు బీమా కావాలి) ఈ అంశాల ఆధారంగా ప్రీమియం ఏటా ఎంత కట్టాలన్నది బీమా కంపెనీ నిర్ణయిస్తుంది. ఏటా ఆ మేరకు చెల్లిస్తూ వెళ్లాలి. పాలసీ కాలవ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా పాలసీదారు ఏ కారణం వల్లనైనా మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు పరిశీలన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీకి లేదంటే వారసులకు చెల్లిస్తుంది. మరి పాలసీ కాలవ్యవధి ముగిసేవరకు నిక్షేపంగా జీవించి ఉంటే? ఉదాహరణకు 75 ఏళ్ల వయసు వచ్చే వరకు రక్షణను ఎంపిక చేసుకున్నారనుకోండి? అప్పటికీ పాలసీదారు జీవించి ఉన్నారనుకుందాం. టర్మ్ ప్లాన్ కనుక రూపాయి కూడా తిరిగి రాదు. పాలసీ ముగిసిపోతుంది. అన్నేళ్లపాటు వేల రూపాయలు కడితే రూపాయి తిరిగి రాదా..? కొందరికి ఇది అస్సలు నచ్చదు. అందుకే వారు మాకొద్దు టర్మ్ పాలసీ అంటుంటారు. ఇక్కడ కావాల్సింది కుటుంబానికి రక్షణ, రాబడి కాదు. రాబడుల కోసం వేరే మార్గాలున్నాయి. ఒకవేల కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే.. అప్పటి వరకు కట్టినదంతా మరణించిన కుటుంబాలకు పరిహారంగా వెళ్లిందనుకుంటే ఆ సంతృప్తి వేరు. కనుక బీమా రక్షణ కోరుకునే వారు ముందుగా తీసుకోవాల్సింది టర్మ్ ప్లాన్. దీనికంటే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రీమియం ధరల పరిస్థితి ఇదీ... టర్మ్ ప్లాన్ల విషయంలో బీమా సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీయే నడుస్తోంది. కరోనా రాకతో బీమా క్లెయిమ్‌లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. చెల్లింపుల భారంతో రీఇన్సూరెన్స్ సంస్థలు (బీమా సంస్థల పాలసీలపై బీమా ఇచ్చేవి) ప్రీమియంను గత ఆరు నెలల్లో పెంచేశాయి. కొన్ని బీమా కంపెనీలు పెరిగిన రీఇన్సూరెన్స్ రేట్ల మేర తమ పాలసీలపైనా అమలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్ పెంచుకునేందుకు పాత ప్రీమియం ధరలనే కొనసాగిస్తున్నాయి. పాలసీ ప్రీమియం రేటు అనేది దరఖాస్తుదారుల వయసు, హెల్త్ రిస్క్, ఎంపిక చేసుకున్న కవరేజీ, కాలవ్యవధి అంశాల ఆధారంగా మారిపోతుంటుంది. పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేస్తే.. వయసు పెరుగుదల ఫలితంగా ప్రీమియం కూడా అధికమవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తితో పోలిస్తే 35 ఏళ్ల వ్యక్తికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 22 శాతం అధిక ప్రీమియం వసూలు చేస్తోంది. జీవనశైలి అలవాట్లు ప్రీమియం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనవి. ఉదాహరణకు పొగతాగడం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యం సేవించడం ఇవి ప్రీమియంను భారీగా పెంచే అంశాలు. పొగతాగే అలవాటు ఉందని వెల్లడిస్తే ఆరోగ్యవంతులతో పోలిస్తే ప్రీమియం 20 అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విద్యార్హతలు కూడా ప్రీమియంను 34 శాతం మేర ప్రభావితం చేస్తున్నాయి. అందుకునే ఇలాంటి అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కానీ నిజాయితీగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగినా వెల్లడించడం మానొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురి కాకూడదంటే వెల్లడించాలి. ఇక ప్రీమియం తక్కువగా ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం చాలా చిన్న వయసులో తీసుకోవడమే. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎంపిక చేసుకున్న కవరేజీ (బీమా రక్షణ రూపాయిల్లో) కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తుంది. బీమా కవరేజీ అన్నది అన్ని వయసులకు ఒకటే కాకుండా.. మధ్య వయసు నుంచి బాధ్యతలు పెరిగి వృద్ధాప్యానికి చేరువ అయ్యే క్రమంలో తగ్గిపోతాయి. కనుక కవరేజీ కూడా ఏటేటా కొంత శాతం చొప్పున మొదటి 15–20 ఏళ్లు పెరుగుతూ వెళ్లి.. ఆ తర్వాత తగ్గుతూ ఉండేలా ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తాయి. పరిహారం ఏక మొత్తంలో కావాలా? లేక సగం పరిహారం చెల్లించి మిగిలినది ప్రతీ నెలా నిర్ణీత కాలం వరకు చెల్లించేలా ఎంపిక చేసుకోవాలా? ఇది కూడా ప్రీమియంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇండియా ఫస్ట్ లైఫ్ రూ.కోటి కవరేజీని పాలసీ ముగింపు సమయానికి 2 కోట్లకు వెళ్లే ఆప్షన్ ఇస్తోంది. సాధారణ పాలసీతో పోలిస్తే ప్రీమియం 50 శాతం ఎక్కువ. 100 ఏళ్ల వయసు వచ్చే వరకు కవరేజీ ఎంపిక చేసుకున్నా.. ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కట్టిన ప్రీమియం కాలవ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటి ప్రీమియం కూడా 50–100 శాతం వరకు అధికంగా ఉంటోంది. కానీ, ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్ ప్లాన్ లాభసాటి కానేకాదు. దీన్ని ఎంపిక చేసుకోవద్దు. దీనికి బదులు సాధారణ పాలసీ ఎంపిక చేసుకుని ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. టర్మ్ ప్లాన్ అన్నది తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ఆర్థిక రక్షణ కోసమే. 70 ఏళ్లు వచ్చే సరికి ఈ బాధ్యతలు దాదాపుగా ముగిసిపోతాయి. కనుక 100 ఏళ్లకు టర్మ్ ప్లాన్ ఉపయోగం లేని ఆప్షనే. పాలసీకి అనుబంధాలు.. యాడ్ ఆన్స్ పేరుతో పలు రైడర్లు టర్మ్ పాలసీకి అనుబంధంగా తీసుకోవచ్చు. వీటితో కవరేజీ విస్తృతి పెరుగుతుంది అంతే. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఒకటి. తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే ఏక మొత్తంలో ఈ కవరేజీ కింద పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల క్రిటికల్ ఇల్నెస్ కవర్ కోసం ఏటా రూ.2,000 ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇలాంటి రైడర్లు అన్నవి పాలసీదారులు తమ అవసరాలను విశ్లేషించుకుని తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్‌నెస్‌లు ఏవన్నవి ప్రతి బీమా సంస్థ ఓ జాబితాను నిర్వహిస్తుంటుంది. అందులో ఉన్న వాటికే కవరేజీ వస్తుంది. ఇందులోనూ ఇండెమ్నిటీ, బెనిఫిట్ అని ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితేనే పరిహారం ఇచ్చేవి ఇండెమ్నిటీ. బెనిఫిట్ ప్లాన్ అన్నది నిర్ధారణ అయిన వెంటనే ఏక మొత్తంలో చెల్లించేది. యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ కూడా టర్మ్ ప్లాన్‌తో తీసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే బీమాకు అదనంగా, ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర అదనపు పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం కారణంగా వైకల్యం పాలైనా పరిహారం చెల్లిస్తుంది ఈ రైడర్. పాలసీ డాక్యుమెంట్లో వైకల్యాన్ని తెలిపే వివరాలు ఉంటాయి. ఈ యాడ్ ఆన్ ప్రీమియం రూ.2,000లోపే ఉంటుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ అయితే సమగ్ర ప్రమాద బీమా రూ.కోటి కవరేజీకి రూ.6,000 వరకు చార్జ్ చేస్తోంది. పిల్లలు, భార్య రక్షణకు సంబంధించి యాడ్ఆన్స్ కూడా ఉన్నాయి. పాలసీదారు మరణిస్తే వీటి కింద ప్రత్యేక పరిహారం మంజూరవుతుంది. అప్పుడు పిల్లల విద్య, జీవిత భాగస్వామి పోషణ అవసరాలకు పరిహారం వినియోగమవుతుంది. దంపతుల్లో భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్టయితే తమ అవసరాలకు అనుగుణంగా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ గృహిణి అయితే టర్మ్ ప్లాన్ రాదు. అలాంటప్పుడు జాయింట్ టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. బజాజ్ అలియాంజ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ తదితర సంస్థలు జాయింట్ టర్మ్ ప్లాన్ అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్లు హెల్త్ ప్లాన్ అనుబంధంగా కూడా లభిస్తాయి. బీమా సంస్థ పాలసీ కంటే ముందు చూసేది బీమా కంపెనీ గురించే. అవసరమైన సందర్భంలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. ఆ బాధ్యతల్లో బీమా సంస్థ ఏ మేరకు నిజాయితీగా ఉంటుందన్నది చూడాలి. క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి సమస్యల్లేకుండా సాఫీగా జరిగిపోవాలి. ఏ సంస్థ ఆర్థిక పరిస్థితి అయినా వచ్చే రెండు సంత్సరాల తర్వాతి కాలం గురించి విశ్లేషించడం అంత సులభం కాదని నిపుణులే అంటుంటారు. అందుకుని అప్పటి వరకు ఆ బీమా కంపెనీ పూర్వపు చరిత్రే ప్రామాణికం అవుతుంది. ఎల్ఐసీ ప్రభుత్వరంగ బీమా సంస్థ. అంతేకాదు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలో ఎల్ఐసీకి వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఇండియా ఫస్ట్ (బీవోబీ, యూనియన్ బ్యాంకు),కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ (కెనరా బ్యాంకు) విషయంలోనూ దీర్ఘకాలానికి సంబంధించి అంత ఆందోళన అక్కర్లేదు. బ్యాంకింగ్ అనుభవంతో అవి అండర్‌రైటింగ్ నైపుణ్యాలు ప్రదర్శంచగలవు. ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కోటక్ మహీంద్రా సైతం వాటి బ్యాంకింగ్ అనుభవాలపై ఆధారపడగలవు. దేశీ బీమా సంస్థల్లో ఎక్కువ కంపెనీలు విదేశీ భాగస్వామ్య సంస్థలతో కలసే బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. బీమా సంస్థ నిర్వహణలోని ఆస్తులు, విదేశీ భాగస్వామితో ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తోంది? సేవల నాణ్యత ఇలాంటి అంశాలన్నింటినీ తరచి చూడాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పాలసీ నిబంధనలకు బీమా సంస్థ ఎంత నిజాయతీగా కట్టుబడి ఉంటుందన్న దానిపైనే బీమా పరిహారం చెల్లింపులన్నవి ఆధారపడి ఉంటాయి. దీనికి ప్రామాణిక కొలమానమే క్లెయిమ్ చెల్లింపుల రేషియో. ఒకవేళ ఎక్కువ క్లెయిమ్‌లను తిరస్కరించినట్టయితే ఆ సంస్థ అండర్‌రైటింగ్ ప్రమాణాల నాణ్యతను సందేహించాల్సిందే. ఎం దుకంటే పాలసీదారు రిస్క్‌ను బీమా సంస్థ ముందే సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైనట్టుగానే చూడాలి. అందుకే క్లెయిమ్ చెల్లింపుల చరిత్ర బీమా సంస్థ నిజాయితీకి దర్పణం పడుతుంది. క్లెయిమ్‌ల పరిష్కార రేషియో అంటే.. మరణ పరిహారం కోరుతూ బీమా సంస్థకు వచ్చిన మొత్తం అభ్యర్థనల్లో ఎన్నింటిని ఆమోదించిందన్నది తెలిపే నిష్పత్తి. సాధారణంగా ఇది 94 శాతం నుంచి 98 శాతం మధ్యలో ఉంటోంది. ఎన్నింటిని తిరస్కరించింది? ఎన్నింటిని పెండింగ్‌లో పెట్టిందన్నది కూడా చూడాలి. వ్యక్తుల స్థాయిలో క్లెయిమ్ తిరస్కరణ రేటు గతంలో సగటున 0.6 శాతంగా ఉంటే, అది 5.5 శాతానికి పెరిగిపోయింది. గతంతో పోలిస్తే తిరస్కరణ రేటు పెరిగినట్టు తెలుస్తోంది. బీమా సంస్థల మధ్య ఇది భిన్నంగా ఉంటుంది. కరోనా సమయంలో క్లెయిమ్‌లకు సంబంధించి ప్రమాణాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) కఠినతరం చేసింది. దీంతో ఎల్ఐసీ సగటు చెల్లింపుల రేషియో 2018–19లో 97.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి 98.6 శాతానికి మెరుగుపడింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా సంస్థల సగటు చెల్లింపుల రేషియో 96.6 శాతం నుంచి 97 శాతానికి పుంజుకుంది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ అన్నది ప్రీమియం ధరలపై ప్రభావం చూపించదు. పాలసీదారులు క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తికి అదనంగా.. క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ ఎంత సులభంగా ఉందన్నది విచారించుకోవాలి. ఆన్లైన్లో ఇందుకు సంబంధించి యూజర్ల రివ్యూలు లభిస్తాయి. జీవితానికి విలువ కట్టగలమా..? బీమాకు సంబంధించి జీవిత విలువ అనేది ముఖ్యం. అప్పుడే ఎంత విలువకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోగలం. పాలసీ తీసుకునే వారి భవిష్యత్తు ఆదాయ సామర్థ్యాన్ని అంచనా వేసి, ఆ విలువకు సరిపడా బీమా రక్షణ (సమ్ అష్యూర్డ్) కల్పించుకోవాలి. బీమా సంస్థల ఆన్లైన్ పోర్టళ్లలో కొటేషన్ చూసుకునే సమయంలో మనం చెప్పిన ఆదాయాన్ని బట్టి అర్హత మేరకు గరిష్ట బీమా కవరేజీని చూపిస్తున్నాయి. కాకపోతే ఎవరికి వారు వారి వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాలి. వ్యక్తి వార్షిక జీవన అవసరాలు ఎంతో చూడాలి. అప్పటికే రుణ బాధ్యతలు (గృహ రుణం, వ్యక్తిగత రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం ఇలా ఏవైనా) ఉంటే వాటిని కలుపుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని విస్మరించకూడదు. ఇలా వచ్చిన మొత్తానికి కనీసం 6 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముడి పెట్టి, సరైన కవరేజీపై నిర్ణయానికి రావాలి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి ఇలాంటి కవరేజీల్లో ప్రీమియంను బట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం సరైన రక్షణ అనిపించుకోదు. -
ఎండోమెంట్ ప్లాన్లు.. రెండూ కావాలంటే!
యూనిట్ లింక్డ్ పాలసీల్లో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్ పతనాల్లో చేతికి అందేదేమీ ఉండదు. టర్మ్ ప్లాన్లలో తక్కువకే ఎక్కువ పరిహారం వస్తున్నా... చెల్లించిన ప్రీమియం పాలసీదారులు జీవించి ఉంటే వెనక్కి రాదు. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో దురదృష్టవశాత్తూ మరణిస్తే పరిహారం రావాలి.. లేదా జీవించి ఉన్నా తాము చెల్లించిన మొత్తానికి హామీతో కూడిన రాబడి కలసి అందుకోవాలి. అందుకే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల్లో అత్యధికులు ఎండోమెంట్ ప్లాన్లకు చోటిస్తుంటారు. ఆకర్షణీయమైన ఎండోమెంట్ ప్లాన్ల వివరాలు చూస్తే... హెచ్డీఎఫ్సీ సంచయ్ ప్లస్ పాలసీదారులకు హామీతో కూడిన (గ్యారంటీడ్) రాబడులను ఆఫర్ చేస్తుంది. ఈ పాలసీలో నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. గ్యారంటీడ్ మెచ్యూరిటీ.. అంటే కాల వ్యవధి ముగిసిన తర్వాత హామీ మేరకు చెల్లించేది. గ్యారంటీడ్ ఇన్కమ్, లైఫ్‌లాంగ్ ఇన్కమ్, లాంగ్‌టర్మ్ ఇన్కమ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఐదేళ్ల ప్రీమియం చెల్లించే వ్యవధి ఎంచుకున్న వారికి పదేళ్లకు.. ఆరేళ్లు ప్రీమియం చెల్లింపును ఎంచుకుంటే 12 ఏళ్లకు.. పదేళ్ల ప్రీమియం కాల వ్యవధిని ఎంచుకున్నవారికి 20 ఏళ్లకు హామీ ఇచ్చిన మేరకు ఏక మొత్తంలో కంపెనీ చెల్లిస్తుంది. గ్యారంటీడ్ ఇన్కమ్ ఆప్షన్లో.. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు కంపెనీ నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. అలాగే, లైఫ్‌లాంగ్ ఇన్కమ్లో.. పాలసీదారునికి 99 ఏళ్లు వచ్చే వరకు చెల్లింపులు చేస్తుంది. లాంగ్‌టర్మ్ ఇన్కమ్ ఆప్షన్లో 25 ఏళ్ల పాటు చెల్లింపులు జరుగుతాయి. అన్ని ఆప్షన్లలోనూ పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత రెండేళ్ల నుంచి చెల్లింపులు మొదలవుతాయి. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే.. సమ్ ఇన్సూర్డ్ లేదా అప్పటి వరకు ప్రకటించిన గ్యారంటీడ్ అడిషన్స్‌తో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనాలను.. ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 40 ఏళ్ల వ్యక్తికి 5–5.5% మధ్య ప్రస్తుతం ఉంది. ప్రీమియం చెల్లింపు కాలం ఎక్కువ ఉంటే రాబడుల రేటూ ఎక్కువగా వస్తుంది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ ఏఎస్ఐపీ ఇది హెచ్డీఎఫ్సీ లైఫ్ సంచయ్ ప్లస్ మాదిరి ప్లాన్. రెండు రకాల ప్లాన్ ఆప్షన్లను అందిస్తోంది. పదేళ్ల ప్లాన్‌కు ఐదేళ్లు, 15 ఏళ్ల ప్లాన్‌కు ఏడేళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 60 ఏళ్ల వయసు వరకు పాలసీని తీసుకోవచ్చు. గ్యారంటీడ్ అడిషన్స్, గ్యారంటీడ్ లంప్సమ్ మొత్తాన్ని చెల్లిస్తారు. గ్యారంటీడ్ అడిషన్స్ అన్నవి ఏడాదికోసారి పాలసీకి జోడించడం జరుగుతుంది. పాలసీ కాల వ్యవధిని అనుసరించి ఇది ఏటా 10–15% మధ్య ఉండొచ్చు. మరణ పరిహారం సమ్ అష్యూరెన్స్ లేదా గ్యారంటీడ్ మెచ్యూరిటీ ప్రయోజనం ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. గడువు తీరిన తర్వాత ప్రయోజనం ఏకమొత్తంలో తీసుకునే ఆప్షన్ ఒక్కటే ఉంది. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకుంటే తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా అష్యూర్ 50 ఏళ్లు, ఆలోపు వయసున్న ఎవరైనా ఈ ప్లాన్ తీసుకునేందుకు అర్హులే. 12 ఏళ్లు, 15 ఏళ్ల కాల వ్యవధితో వస్తాయి. 12 ఏళ్ల పాలసీకి ఆరేళ్లు, 15 ఏళ్ల పాలసీకి ఏడేళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. త్రైమాసికం, అర్ధ సంవత్సరం ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు లేవు. అలాగే, ఈ పాలసీలో కనీస వార్షిక ప్రీమియం రూ.50,000. ఈ పాలసీలో ఇంటర్నల్ రేటు ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) 5.5 శాతంగా ఉంది. ఐసీఐసీఐ లక్ష్య లైఫ్‌లాంగ్ ప్రీమియం చెల్లించిన ఐదేళ్ల తర్వాత నుంచి పాలసీదారులకు ఇందులో ఏటా ఆదాయం లభిస్తుంది. పాలసీదారు మరణించేంత వరకు లేదా 99 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. ఎంత మేర ప్రీమియం చెల్లించడానికి అంగీకారం తెలిపారన్న దాని ఆధారంగా పాలసీ జారీ చేసే సమయంలోనే గ్యారంటీడ్ చెల్లింపులు ఎంత మేర అన్నవి నిర్ణయమవుతాయి. 15 ఏళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లో 50 ఏళ్ల వయసు వారి వరకే ఈ పాలసీని తీసుకునేందుకు అవకాశం ఉంది. 12 ఏళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లో ప్రవేశానికి గరిష్ట వయసు 53 ఏళ్లు. అదే విధంగా పదేళ్ల ప్రీమియం ఆప్షన్లో గరిష్ట ప్రవేశ వయసు 55 ఏళ్లు. హెచ్డీఎఫ్సీ లైఫ్ సంచయ్ ప్లస్ ఇది కూడా హోల్‌లైఫ్ పాలసీయే. అంటే జీవితాంతం బీమా రక్షణ కల్పించే ఉత్పత్తి. 55–65 ఏళ్ల వయసు వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎంచుకునే వ్యవధిపై ఇది ఆధారపడి ఉంటుంది. 100లో తమ వయసును తీసివేయగా మిగిలే కాలానికి పాలసీ వర్తిస్తుంది. లేదంటే 30 నుంచి 40 ఏళ్ల కాలానికీ పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. ఆరు, ఎనిమిది, పది, పన్నేండేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లలో అనుకూలమైనదానిని ఎంచుకోవచ్చు. తక్షణ ఆదాయం (ఇమీడియట్ ఇన్‌మక్), తర్వాత ఆదాయం (డిఫర్డ్ ఇన్కమ్) అనే ఆప్షన్లు ఉన్నాయి. తక్షణ ఆదాయ ఆప్షన్ ఎంచుకుంటే, ఏటా ప్రకటించే బోనస్‌ను చెల్లించడం జరుగుతుంది. గడువు తీరిన తర్వాత జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు సమాన మొత్తం ఒకే సారి చెల్లిస్తారు. అదే తర్వాత తీసుకునే ఆదాయ ఆప్షన్లో.. హామీతో కూడిన ఆదాయం, క్యాష్ బోనస్‌ను ప్రీమియం చెల్లింపు గడువు తీరిన ఏడాది తర్వాత నుంచి పాలసీ గడువు ముగిసే వరకు చెల్లించడం మొదలవుతుంది. ప్రీమియం చెల్లింపు గడువు తీరిన నాటి నుంచి పాలసీ ముగియడానికి వరకు ఉండే కాలం లేదా 25 ఏళ్లు ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అప్పటి వరకు ఏటా ఈ చెల్లింపులు జరుగుతాయి. గడువు తీరిన తర్వాత సమ్ అష్యూర్డ్, టర్మినల్ బోనస్ చెల్లిస్తారు. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ 50 ఏళ్ల వయసు, ఆలోపున్న వారు పాలసీ తీసుకునేందుకు అర్హులు. కనీస పాలసీ కాల వ్యవధి 15 ఏళ్లు. గరిష్టంగా 35 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. పూర్తి పాలసీ కాలవ్యవధి వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాక్షిక కాలానికే ప్రీమియం ఆప్షన్ లేదు. పాలసీ అమల్లో ఉన్న కాలంలో మరణం చోటు చేసుకుంటే సమ్ అష్యూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తారు. కాల వ్యవధి తీరే వరకు జీవించి ఉంటే అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు అందుకోవచ్చు. అయితే, ఈ పాలసీ కాల వ్యవధి తీరిన తర్వాత కూడా పాలసీదారునికి జీవితాంతం బీమా రక్షణ కొనసాగుతుంది. అంటే కాల వ్యవధి తీరిన తర్వాత ఒకసారి ప్రయోజనం చెల్లించగా, తిరిగి పాలసీదారు మరణానంతరం నామినీలకు సమ్ అష్యూరెన్స్‌ను చెల్లిస్తారు. ప్రతీ రూ.1,000 సమ్ అష్యూరెన్స్ మొత్తంపై 15 ఏళ్ల కాల వ్యవధి ఎంచుకున్న వారికి 2018–19 సంవత్సరానికి జీవన్ ఆనంద్ పాలసీలో రూ.41ను బోనస్‌గా ప్రకటించారు. 16–20 ఏళ్ల కాల వ్యవధి ఎంచుకున్న వారికి ప్రతీ రూ.1,000 బీమాపై ప్రకటించిన బోనస్ రూ.45. అదే 20 ఏళ్లకు పైగా కాల వ్యవధి కలిగిన పాలసీదారులకు రూ.1,000 బీమాపై రూ.49 బోనస్ అందుకున్నారు. వీటిని గుర్తుంచుకోవాలి.. ఎండోమెంట్ పాలసీల్లో సరెండర్ చార్జీలు అధికం. అంటే పాలసీదారులు గడువు తీరకుండానే పాలసీని స్వాధీనం చేయాలనుకుంటే నష్టపోయేది ఎక్కువ. అలాగే, పార్టిసిపేటింగ్ ప్లాన్లలో బోనస్‌లకు గ్యారంటీ లేదు. ఎండోమెంట్ ప్లాన్లలో రాబడులు నికర రాబడి రేటు తక్కువే. కానీ, ఇందులో మెచ్యూరిటీ తీరిన తర్వాత చేసే చెల్లింపులపై ఎటువంటి పన్ను ఉండదు. మరణంపై వచ్చే పరిహారానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. కనుక పన్ను ఆదాను పరిగణనలోకి తీసుకుంటే రాబడి రేటు ఫిక్స్డ్ డిపాజిట్ల స్థాయిలో ఉంటుందని భావించొచ్చు. బీమా పాలసీలకు చేసే ప్రీమియంను సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా పొందొచ్చు. -
బజాజ్ అలయంజ్ నుంచి సమగ్ర టర్మ్ ప్లాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పిల్లల విద్యాభ్యాసం మొదలుకుని ప్రాణాంతకమైన 55 వ్యాధుల దాకా వివిధ అవసరాలకు అనుగుణంగా కవరేజీనిచ్చే వేరియంట్లతో ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ కొత్తగా సమగ్రమైన టర్మ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ గోల్ పేరిట ఆవిష్కరించిన ఈ ప్లాన్‌లో.. జీవిత భాగస్వామికి కూడా కవరేజీ పొందవచ్చు. కట్టిన ప్రీమియంలను కూడా తిరిగి పొందవచ్చు. ఇందుకు సంబంధించి మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ప్లాన్ లభిస్తుందని బజాజ్ అలయంజ్ లైఫ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (ఇనిస్టిట్యూషనల్) ధీరజ్ సెహ్గల్ గురువారమిక్కడ తెలిపారు. రూ. 1 కోటి పాలసీ తీసుకునే పాతికేళ్ల వ్యక్తికి ప్రీమియం అత్యంత తక్కువగా రోజుకు రూ. 13 నుంచి ఉంటుందని ఆయన తెలిపారు. లైఫ్ కవర్, లైఫ్ కవర్ విత్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎక్స్ట్రా కవర్ (సీఈఈసీ) వంటి వేరియంట్లలో ఈ పాలసీ లభిస్తుందని సెహ్గల్ చెప్పారు. -
కోటి టర్మ్ బీమాకు ఎన్ని పాలసీలు తీసుకోవాలి?
నేను రూ. కోటికి టర్మ్ బీమా తీసుకుందామనుకుంటున్నాను. రూ. కోటికి ఒకే టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచిదా? లేకుంటే రూ.25 లక్షల చొప్పున నాలుగు టర్మ్ ప్లాన్లు తీసుకోవడం మంచిదా? - సుభాష్, హైదరాబాద్ టర్మ్ బీమా పెద్ద మొత్తంలో ఉంటే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటారు. ఎక్కువ మంది గరిష్టంగా రెండు పాలసీలు తీసుకుంటారు. కానీ నాలుగు పాలసీలు తీసుకోవడం ఓవర్-డైవర్సిఫికేషన్‌కు దారి తీస్తుంది. ఒకవేళ ఈ పాలసీలను క్లెయిమ్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు క్లెయిమ్‌ల ప్రక్రియ గందరగోళానికి దారి తీస్తుంది. ఇలా నాలుగు టర్మ్ బీమా పాలసీలు తీసుకోవడం వల్ల వ్యయాలు పెరుగుతాయి. అందుకని రూ. కోటికి బీమా పాలసీ తీసుకుంటున్నారు కాబట్టి, రూ.25 లక్షల చొప్పున నాలుగు టర్మ్ పాలసీలు కాకుండా, రూ.50 లక్షల చొప్పున రెండు టర్మ్ పాలసీలు తీసుకోవడం మంచిది. ఒక ఎల్ఐసీ పాలసీ ఆధారంగా నేను రుణం తీసుకున్నాను. ఈ పాలసీకి సంబంధించి 22 త్రైమాసికాల పాటు ప్రీమియమ్‌లు చెల్లించాను. ఇలా రుణం తీసుకున్న ఎల్ఐసీ పాలసీని సరెండర్ చేయవచ్చా? - శివ ప్రసాద్, వైజాగ్ సంప్రదాయ ఎల్ఐసీ ప్లాన్లలో గ్యారంటీడ్ సరెండర్ విలువ, లేదా స్పెషల్ సరెండర్ విలువలను బట్టి రుణం పొందవచ్చు.గరిష్టంగా పొందే రుణం కూడా ఈ విలువలను బట్టే ఉంటుంది. మీరు రుణం తీసుకున్న ఎల్ఐసీ పాలసీని సరెండర్ చేయవచ్చు. అయితే మీరు పొందిన సరెండర్ విలువ మొత్తాన్ని-మీరు తీసుకున్న రుణం, దానిపై వచ్చే వడ్డీకి అడ్జెస్ట్ చేస్తారు. సరెండర్ విలువ కంటే మీరు తీసుకున్న రుణం అధికంగా ఉంటే మిగిలిన మొత్తాన్ని మీరు చెల్లించాల్సి ఉంటుంది. నేను రెండేళ్ల క్రితం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స తీసుకున్నాను. ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్ల పాటు ప్రీమియమ్ చెల్లించాను. ఈ ప్లాన్‌ను సరెండర్ చేయమంటారా? కొనసాగించమంటారా? - సాయి శ్రీధర్, విజయవాడ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స ఎలాంటి టర్మ్ ప్లాన్లను ఆఫర్ చేయడం లేదు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స ప్లాన్లన్నీ మెచ్యూరిటీ బెనిఫిట్స్‌తో వచ్చేవే. పాలసీ తీసుకొని మూడేళ్లు పూర్తయితేనే మీరు ఈ పాలసీని సరెండర్ చేయడానికి వీలుంటుంది. మీ విషయంలో పాలసీ తీసుకొని రెండేళ్లే అయింది. కాబట్టి ఆ పాలసీని సరెండర్ చేయడానికి వీలు లేదు. బీమా అవసరాలకు ఎండోమెంట్ పాలసీలు తీసుకోవడం సరికాదు. మీ బీమా, ఇన్వెస్ట్మెంట్ అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. జీవిత బీమా కోసం టర్మ్ ఇన్సూరెన్స పాలసీలు తీసుకోవడమే సరైనది. ఈ తరహా పాలసీల్లో బీమా కవర్ అధికంగానూ, ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉంటాయి. పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత భారీ మొత్తాలను ఆఫర్ చేసే బీమా పాలసీలను తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఇవి తగిన బీమా కవర్‌ను ఇవ్వలేవు. వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. రాబడులు తక్కువగా ఉంటాయి. ఇక మీ విషయానికొస్తే, భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవడానికి గాను, ఈ పాలసీను సరెండర్ చేయండి. పాలసీ తీసుకొని మూడేళ్లు పూర్తికాకముందే ఆ పాలసీని సరెండర్ చేస్తే, మీకు ఏమీ రాదు. మీరు చెల్లించిన రెండేళ్ల ప్రీమియమ్ రూ.40,000 నష్టపోతారు. మూడో ఏడాది కూడా ప్రీమియమ్ చెల్లించి, తర్వాత సరెండర్ చేస్తే ఎంతో, కొంత చేతికొస్తుంది కదాని ఈ పాలసీని కొనసాగించారనుకోండి. మీరు మూడో ఏడాది చెల్లించిన ప్రీమియమ్(రూ.20,000) కంటే తక్కువగానే సరెండర్ విలువ ఉంటుంది. ఇక మీకు ఎంత బీమా కవర్ అవసరమో అంచనా వేసుకొని, దానికి తగిన టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స పాలసీలకు చెల్లించే దాని కంటే చాలా తక్కువగానే ఈ టర్మ్ బీమా పాలసీల ప్రీమియమ్ ఉంటుంది. నేను ఇటీవలనే ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడి సొంతంగా వ్యాపారం ప్రారంభించాను. నాకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు రెండవ తరగతి చదువుతోంది. కొడుకుకు రెండో సంవత్సరం. వీరిద్దరి ఉన్నత చదువుల కోసం పొదుపు చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స మంచి రాబడులు వస్తాయని మిత్రులు చెబుతున్నారు. ఏ మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి. - భాస్కర్, నెల్లూరు పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు.. ఇలాంటి దీర్ఘకాలిక ఉన్నత లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేస్తే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు వస్తాయి. మీకు మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్చేయడం కొత్త అయితే, ముందుగా రెండు మంచి బ్యాలెన్సడ్ ఫండ్సను ఎంచుకోండి. వీటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్‌సకు సంబంధించి కొంత అవగాహన వచ్చాక మంచి పనితీరు కనబరుస్తున్న ఈక్విటీ ఫండ్సను కనీసం రెండింటిని ఎంచుకోండి. వాటిల్లో కూడా సిప్ ద్వారా ఇన్వెస్ట్చేయండి. బ్యాలెన్సడ్ ఫండ్స ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సిస్టమాటిక్ ట్రాన్సఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సలోకి బదిలీ చేసుకోండి. స్వల్పకాలంలో ఈక్విటీ ఫండ్స కొంత ఒడిదుడుకులకు గురైనా, దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇస్తాయి. -
మేమిద్దరం... మాకొక్కటి..!
ఒక వ్యక్తి తప్పనిసరి ఆర్థిక ప్రణాళిక అంటే... అది సమగ్ర, సంపూర్ణ జీవిత బీమా ప్రణాళిక. తన అవసరాలకు తగిన బీమా కలిగి ఉండడం ఎవ్వరికైనా ధీమానే. ఇది బీమాకు సంబంధించి ప్రాథమిక అంశం. సంఘంలో ఒకనిగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పుడు సరే కానీ కాలక్రమంలో మనిషి బాధ్యతలు పెరుగుతాయి. వివాహం... భాగస్వామిగా మరో వ్యక్తితో కలిసి వ్యాపార సంబంధాలు... ఇలా మనిషి కార్యకలాపాలు విస్తృతమవుతాయి. అలాంటి వారి విషయంలో ఉమ్మడి జీవిత బీమా ప్రణాళిక ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం ప్రతి వ్యక్తికి వారి అవసరాలకు అనుగుణంగా బీమా ప్రణాళికలు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి జీవిత బీమా ప్రణాళిక విషయంలోనూ ఇదే విధమైన ప్రొడక్టులు రూపుదిద్దుకుంటుండడం సానుకూల పరిణామం. పరస్పర ప్రయోజనం: ఒకరిపై ఒకరు ఆధారపడి సాగించే జీవన ప్రయాణంలో ఉమ్మడి జీవిత బీమా ప్రణాళిక ఎంతో అవసరం. అది వివాహం కావచ్చు... లేదా వ్యాపార భాగస్వామ్యం కావచ్చు. ఒక మంచి టర్మ్ ప్లాన్‌తో వ్యక్తి సాగించే ప్రయాణంలో ఆ వ్యక్తితో జతగూడే జీవిత భాగస్వామి కావచ్చు.. లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు.. వారిని ఉమ్మడి జీవిత బీమా బాటలో కూర్చే సౌలభ్యత ఇక్కడ ఉంది. ఆ మేరకు ఉపయోగాలు ఇక్కడ లభిస్తున్నాయి. వ్యత్యాసాలు: ప్రధానంగా రెండు వేర్వేరు ప్రయోజనాలను ఈ ప్రొడక్టులు అందిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది బీమా మొత్తం ఒకటిగా ఉండవచ్చు. లేదా రెండు వేర్వేరుగానూ ఉండవచ్చు... సింగిల్‌గా ఈ బీమా మొత్తం ఉన్నప్పుడు... దురదృష్టవశాత్తు భాగస్వామి మరణిస్తే మరొకరికి బీమా మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ సందర్భంలో పాలసీ ముగుస్తుంది. అయితే కవరేజ్ వేర్వేరుగా ఉన్నప్పుడు ఒక సభ్యుడు మరణిస్తే, సంబంధిత ప్రయోజనం (బీమా మొత్తం) అంతా చెల్లించినప్పటికీ... జీవించి ఉన్న వ్యక్తి పాలసీ, బీమా మొత్తం కొనసాగుతుంది. లాభాలు... నిర్వహణ: ఒకే పాలసీ, ఒకే ఒక్క బీమా మొత్తంతో పోల్చిచూస్తే... జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. ముఖ్యంగా చిన్న కుటుంబం... అలాగే భాగస్వామ్యంలో జరిగే వ్యాపార కార్యకలాపాల్లో ఈ పాలసీ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. వ్యయం, నిర్వహణ, ప్రీమియం చెల్లింపు ఇత్యాది విషయాలన్నింటిలో వెసులుబాటును కల్పిస్తుంది. అలాగే ఉమ్మడి ఆస్తులు, తనఖా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నా ఈ తరహా పాలసీలు ఎంతో సానుకూలం. వెసులుబాటు: ఈ తరహా ప్రొడక్టుల్లో టర్మ్ ప్లాన్ కొనసాగుతున్న ఒక వ్యక్తి... కాలక్రమంలో అవసరమైతే తన జీవిత భాగస్వామిని కూడా చేర్చుకుని దీనిని జాయింట్ లైఫ్ ప్లాన్‌గా మలుచుకునే అవకాశం ఉంటుంది. విడాకుల కేసుల్లో ప్రాథమిక పాలసీదారు... పాలసీలో రెండవ వ్యక్తిని తొలగించుకునే వీలుంటుంది. భద్రత: జీవిత భాగస్వాముల భద్రత విషయంలో ఈ పాలసీ లాభం అపరిమితం. ప్రధానంగా ఆదాయాన్ని సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆర్థిక కష్టనష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్న సహ భాగస్వామికి ఈ తరహా పాలసీలు కొండంత అండనిస్తాయి. పిల్లల భవిష్యత్, రుణాల చెల్లింపులు, వ్యాపార కార్యకలాపాల్లో ఆర్థిక నష్టాల నివారణ... ఇలా అన్ని రకాలుగా ఇవి ప్రయోజనకరం. -
అవైవా ‘ఐ-సెక్యూర్’ టర్మ్ ప్లాన్
అవైవా లైఫ్ ‘ఐ-సెక్యూర్’ పేరుతో ఆన్లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారుని మరణం తర్వాత పిల్లల చదువులు, గృహ రుణాలకు చెల్లించే ఈఎంఐలు భారం కాకుండా ఉండటానికి ఏటా కొంత మొత్తం ఇచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. క్లెయిమ్ చేసినప్పుడు.. సమ్ అష్యూర్డ్‌లో 10 శాతాన్ని ఏకమొత్తంగా ఇవ్వడంతో పాటు, ఆపైన 15 ఏళ్ల పాటు ఏటా 6% వెనక్కి ఇవ్వడం జరుగుతుంది.