కోటి టర్మ్ బీమాకు ఎన్ని పాలసీలు తీసుకోవాలి? | How many million Term insurance policies | Sakshi
Sakshi News home page

కోటి టర్మ్ బీమాకు ఎన్ని పాలసీలు తీసుకోవాలి?

Published Mon, Nov 21 2016 1:37 AM | Last Updated on Tue, Aug 21 2018 8:07 PM

కోటి టర్మ్ బీమాకు ఎన్ని పాలసీలు తీసుకోవాలి? - Sakshi

కోటి టర్మ్ బీమాకు ఎన్ని పాలసీలు తీసుకోవాలి?

 
నేను రూ. కోటికి టర్మ్ బీమా తీసుకుందామనుకుంటున్నాను. రూ. కోటికి ఒకే  టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచిదా? లేకుంటే రూ.25 లక్షల చొప్పున నాలుగు టర్మ్ ప్లాన్‌లు తీసుకోవడం మంచిదా? 
 - సుభాష్, హైదరాబాద్ 
 టర్మ్ బీమా పెద్ద మొత్తంలో ఉంటే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటారు. ఎక్కువ మంది గరిష్టంగా రెండు పాలసీలు తీసుకుంటారు. కానీ నాలుగు పాలసీలు తీసుకోవడం ఓవర్-డైవర్సిఫికేషన్‌కు దారి తీస్తుంది. ఒకవేళ ఈ పాలసీలను క్లెయిమ్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు క్లెయిమ్‌ల ప్రక్రియ  గందరగోళానికి దారి తీస్తుంది. ఇలా నాలుగు టర్మ్ బీమా పాలసీలు తీసుకోవడం వల్ల వ్యయాలు పెరుగుతాయి. అందుకని రూ. కోటికి బీమా పాలసీ తీసుకుంటున్నారు కాబట్టి, రూ.25 లక్షల చొప్పున నాలుగు టర్మ్ పాలసీలు కాకుండా, రూ.50 లక్షల చొప్పున రెండు టర్మ్ పాలసీలు తీసుకోవడం మంచిది. 
 
 ఒక ఎల్‌ఐసీ పాలసీ ఆధారంగా నేను రుణం తీసుకున్నాను. ఈ పాలసీకి సంబంధించి 22 త్రైమాసికాల పాటు ప్రీమియమ్‌లు చెల్లించాను. ఇలా రుణం తీసుకున్న ఎల్‌ఐసీ పాలసీని సరెండర్ చేయవచ్చా?
 - శివ ప్రసాద్, వైజాగ్
 సంప్రదాయ ఎల్‌ఐసీ ప్లాన్‌లలో  గ్యారంటీడ్ సరెండర్ విలువ, లేదా స్పెషల్ సరెండర్ విలువలను బట్టి రుణం పొందవచ్చు.గరిష్టంగా పొందే రుణం కూడా  ఈ విలువలను బట్టే ఉంటుంది. మీరు రుణం తీసుకున్న ఎల్‌ఐసీ పాలసీని సరెండర్ చేయవచ్చు. అయితే మీరు పొందిన సరెండర్ విలువ మొత్తాన్ని-మీరు తీసుకున్న రుణం, దానిపై వచ్చే వడ్డీకి అడ్జెస్ట్ చేస్తారు. సరెండర్ విలువ కంటే మీరు తీసుకున్న రుణం అధికంగా ఉంటే మిగిలిన మొత్తాన్ని మీరు చెల్లించాల్సి ఉంటుంది. 
 
 నేను రెండేళ్ల క్రితం పోస్టల్  లైఫ్ ఇన్సూరెన్‌‌స తీసుకున్నాను. ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్ల పాటు ప్రీమియమ్ చెల్లించాను. ఈ ప్లాన్‌ను సరెండర్ చేయమంటారా? కొనసాగించమంటారా?
 - సాయి శ్రీధర్, విజయవాడ 
 పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్‌‌స ఎలాంటి టర్మ్ ప్లాన్‌లను ఆఫర్ చేయడం లేదు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్‌‌స ప్లాన్‌లన్నీ మెచ్యూరిటీ బెనిఫిట్స్‌తో వచ్చేవే. పాలసీ తీసుకొని మూడేళ్లు పూర్తయితేనే మీరు ఈ పాలసీని సరెండర్ చేయడానికి వీలుంటుంది. మీ  విషయంలో పాలసీ తీసుకొని రెండేళ్లే అయింది. కాబట్టి ఆ పాలసీని సరెండర్ చేయడానికి వీలు లేదు. బీమా అవసరాలకు ఎండోమెంట్ పాలసీలు తీసుకోవడం సరికాదు. మీ బీమా, ఇన్వెస్ట్‌మెంట్ అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. జీవిత బీమా కోసం టర్మ్ ఇన్సూరెన్‌‌స పాలసీలు తీసుకోవడమే సరైనది. ఈ తరహా పాలసీల్లో బీమా కవర్ అధికంగానూ, ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉంటాయి. పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత భారీ మొత్తాలను ఆఫర్ చేసే బీమా పాలసీలను తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఇవి తగిన బీమా కవర్‌ను ఇవ్వలేవు. వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. రాబడులు తక్కువగా ఉంటాయి. ఇక మీ విషయానికొస్తే, భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవడానికి గాను,   ఈ పాలసీను సరెండర్ చేయండి. పాలసీ తీసుకొని మూడేళ్లు పూర్తికాకముందే ఆ పాలసీని సరెండర్ చేస్తే, మీకు ఏమీ రాదు. మీరు చెల్లించిన రెండేళ్ల ప్రీమియమ్ రూ.40,000 నష్టపోతారు. మూడో ఏడాది కూడా ప్రీమియమ్ చెల్లించి, తర్వాత సరెండర్ చేస్తే ఎంతో, కొంత చేతికొస్తుంది కదాని ఈ పాలసీని కొనసాగించారనుకోండి. మీరు మూడో ఏడాది చెల్లించిన ప్రీమియమ్(రూ.20,000) కంటే తక్కువగానే సరెండర్ విలువ ఉంటుంది. ఇక మీకు ఎంత బీమా కవర్ అవసరమో అంచనా వేసుకొని, దానికి తగిన టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్‌‌స పాలసీలకు చెల్లించే దాని కంటే చాలా తక్కువగానే ఈ టర్మ్ బీమా పాలసీల ప్రీమియమ్ ఉంటుంది. 
 
 నేను ఇటీవలనే ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడి సొంతంగా వ్యాపారం ప్రారంభించాను. నాకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు రెండవ తరగతి చదువుతోంది. కొడుకుకు రెండో సంవత్సరం. వీరిద్దరి ఉన్నత చదువుల కోసం పొదుపు చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్‌‌స మంచి రాబడులు వస్తాయని మిత్రులు చెబుతున్నారు. ఏ మ్యూచువల్ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి. 
 - భాస్కర్, నెల్లూరు 
 పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు.. ఇలాంటి దీర్ఘకాలిక ఉన్నత లక్ష్యాల కోసం మ్యూచువల్  ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేస్తే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు వస్తాయి. మీకు మ్యూచువల్ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్‌చేయడం కొత్త అయితే, ముందుగా రెండు మంచి బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌సను ఎంచుకోండి. వీటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో నెలకు కొంత మొత్తం  ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్  ఫండ్‌‌సకు సంబంధించి కొంత అవగాహన వచ్చాక మంచి పనితీరు కనబరుస్తున్న ఈక్విటీ ఫండ్‌‌సను కనీసం రెండింటిని ఎంచుకోండి. వాటిల్లో కూడా సిప్ ద్వారా ఇన్వెస్ట్‌చేయండి. బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌స ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సిస్టమాటిక్  ట్రాన్‌‌సఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌సలోకి బదిలీ చేసుకోండి. స్వల్పకాలంలో ఈక్విటీ ఫండ్‌‌స కొంత ఒడిదుడుకులకు గురైనా,  దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement