
యశవంతపుర(కర్ణాటక): వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినఘటన బెంగళూరుని హెబ్బాళ కనకనగరలో సోమవారం సాయంత్రం జరిగింది. బషీర్ ఉల్లా, బాహర్ అస్మా(29) దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త మరో మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు అస్మా అనుమానించింది. ఇదే విషయంపై తీవ్ర మనో వేదనకు గురైనట్లు సమాచారం.
ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో అస్మా ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు వచ్చి పరిశీలించారు. అస్మాను చంపి ఉరివేసినట్లు ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బషీర్ ఉల్లాను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.