woman suspicious death
-
మహిళ అనుమానాస్పద మృతి
విశాఖపట్నం: 93వ వార్డు పరిధి గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న బాలాజీ గార్డెన్స్‌లోని ఎన్ఎస్టీఎల్ కాలనీలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. డీసీపీ ఆనంద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొడుకుల రాధాగాయత్రి(45), ఆమె భర్త నరేంద్ర ఎన్ఎస్టీఎల్ కాలనీలో అద్దె ఇంట్లో గత ఆరు నెలల నుంచి ఉంటున్నారు. నరేంద్ర వీఎస్పీఈజెడ్లో పనిచేస్తున్నారు. నరేంద్ర అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్తుండటంతో ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. రాధాగాయత్రికి శ్రీనివాసనగర్‌లో ఉంటున్న కల్పన అనే బ్యూటీషియన్‌తో కొంతకాలంగా స్నేహం ఉంది. రాధాగాయత్రి, కల్పన గతంలో బాలాజీ గార్డెన్స్‌లోనే అద్దె ఇళ్లలో ఉండేవారు. ఈనెల 21వ తేదీన ఒంట్లో బాగోలేదని రాధాగాయత్రి కల్పనకు చెప్పింది. దీంతో ఆరోజు ఉదయం తన కూతురు గీతికతో కలిసి రాధాగాయత్రి ఇంటికి వచ్చి టిఫిన్ ఇచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు పలుమార్లు కల్పన ఫోన్ చేసినా రాధాగాయత్రి లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆదివారం సాయంత్రం కల్పన తన కూతురు గీతికతో కలిసి రాధాగాయత్రి ఇంటికి వచ్చింది. గీతిక బయటి నుంచి పిలవగా ఎంతకీ పలకలేదు. ఇంటి పెరటివైపు ఉన్న డోరు తీసి ఉండటంతో లోపలకి వెళ్లి చూసింది. ఇంట్లో రాధాగాయత్రి మృతి చెంది ఉండటాన్ని చూసి భయంతో బయటకి వచ్చేసింది. వెంటనే విషయాన్ని స్థానిక వలంటీర్ సత్యశ్రీకి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన సత్యశ్రీ పెందుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ ఆనంద్‌రెడ్డి, ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, పెందుర్తి సీఐ శ్రీనివాసరావు పరిశీలన జరిపారు. డాగ్‌స్క్వాడ్‌తో కూడా పరిశీలించారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ కూడా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలన జరిపారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లను, కల్పన కూతురు గీతికని, వలంటీర్ సత్యశ్రీలను విచారించారు. ఆమె భర్త నరేంద్రకి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో నరేంద్ర పనిచేస్తున్న ఆఫీసుకి పోలీసులను పంపిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తేలుతాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా రాధాగాయత్రి ఒక్కరే ఇంట్లో ఉంటోందని, నరేంద్ర ఆమె భర్త కాదేమో అన్న అనుమానాలు సంఘటన స్థలంలో చోటుచేసుకున్నాయి. -
ఆ నలభై నిమిషాల్లో ఏం జరిగింది..?
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలో శనివారం రాత్రి వెలుగులోకి వచ్చిన యువతి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడలేదు. పట్టణంలోని సుందర్‌నర్‌కు చెందిన దండగల వెంకన్న అలివేలు దంపతుల కుమార్తె దండగల శోభ(18) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్సనిస్టుగా పనిచేసిన శోభ పరీక్షలు ఉండటంతో ఇంటి వద్దనే ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలో ఏమైందో ఏమో గాని శనివారం రాత్రి 7:40 గంటల సమయంలో బైపాస్‌రోడ్డు వెంట ఉన్న వైష్ణవి అపార్ట్మెంట్ వద్దకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యం బైపాస్‌రోడ్డు వెంట ఉన్న ఖలీల్ దాబా ఎదురుగా ఉన్న సీసీ కెమరాల్లో రికార్డు కాగా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైష్ణవి అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తు వరకు శోభ చేరుకున్నట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. కూపీ లాగుతున్న పోలీసులు కాగా, వైష్ణవి అపార్ట్మెంట్లోకి శనివారం రాత్రి 7.40 గంటలకు చేరుకున్న శోభ మరో 40నిమిషాల అనంతరం రెండో అంతస్తు నుంచి కిందపడింది. అయితే, అపార్ట్‌మెంట్‌కు శోభ ఎందుకు వెళ్లింది? ఎవరితో మాట్లాడింది.? 40నిమిషాల్లో ఏం జరిగింది. అనే అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా, శోభ తన సెల్‌ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్లింది. ఘటన తర్వాత పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఐదు నెలల కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్నారు. కాగా, కూతురు మృతిపై అనుమానాలున్నాయని శోభ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లో తమకు తెలిసిన వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా, ఆది వారం మధ్యాహ్నం శోభ మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తిచేశారు. శోభ మృతి విషయం తెలుసుకున్న వారి బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ తెలిపారు. -
లోకేష్‌తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి.. భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి రెల్లివీధిలో చోటుచేసుకుంది. చనిపోయిన మహిళ తల్లిదండ్రులు వడ్డాది వాసు, వడ్డాది జానకి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... కాసరపు దుర్గా సాయి శిరీషకి 2017లో మత్స్యకార కుటుంబానికి చెందిన లోకేష్‌తో ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. లోకేష్ సీమెన్‌గా పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విధులకు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య కొంత కాలంగా తగదాలు జరుగుతున్నాయి. చదవండి: విషాదం: అల్లుడి మృతి.. ఆగిన మామ గుండె దీంతో శిరీష తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో శనివారం లోకేష్ అత్తారింటికి వెళ్లి... భార్యను తమ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లిపోయాడని, ఆ సమయంలో ఇంటి వద్దనే బెల్ట్ తీసి తమ కుమార్తెను మా ఎదుటే కొట్టాడని వడ్డాది వాసు, జానకి తెలిపారు. అనంతరం ఆదివారం శిరీష అత్తవారింటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని చెప్పారు. తమ కుమార్తె శరీరంపై దెబ్బలు ఉన్నాయని, భర్తే చంపేసి ఉంటాడని శిరీష తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వన్‌టౌన్ పోలీసులను వివరణ కోరగా... మృతురాలు శిరీష తల్లిదండ్రుల ఆరోపణ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించామని తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఓ ఇంట్లో 35 ఏళ్ల మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధి బాపూజీనగర్ సమీపం రామకృష్ణానగర్‌లో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉంటున్న ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు తెలిపిన వివరాలివీ.. రామకృష్ణానగర్‌లోని బ్యాచిలర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం స్థానికులు గుర్తించారు. చదవండి: మరో మహిళతో ఆర్ఎంపీ సహజీవనం, భార్యకు విషయం తెలియడంతో.. ఈ విషయాన్ని ఇంటి యజమాని గేదెల సత్యవతికి తెలిపారు. ఆ ఇళ్లు తాళం వేసి ఉండటంతో.. యజమాని కొడుకు ఈశ్వరరావు మారు తాళాలతో తలుపులు తెరిచి చూడగా.. బాత్రూమ్లో మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ శ్రీపాదరావు, సీఐ కృష్ణారావు, ఎస్ఐ అప్పలనాయుడు.. మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మహిళ మృతి చెంది మూడు రోజులై ఉంటుందని పోలీసులు తెలిపారు. బాత్రూమ్లో స్నానానికని వెళ్లే సమయంలో జారిపడి తలకు గాయమై మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమె మృతికి ఇతర కారణాలున్నాయో అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఇంట్లో మూడు నెలల కిందట ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు దిగారు. వీరు పోర్టులో బొగ్గు పని చేస్తుంటారు. ఉదయం 7 గంటలకు వెళ్లి తిరిగి సాయంత్రం వస్తుంటారు. ఇద్దరిలో ఒకరి పేరు రాజేష్‌గా పోలీసులు గుర్తించారు. పరారీలో ఇద్దరు యువకులు: మూడు రోజులుగా ఈ ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని సీసీ కెమెరాలు, కిరాణా దుకాణాల వద్ద వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణారావు తెలిపారు. ఎస్ఐ అప్పలనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
పెదపాడు: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందడంతో పెదపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం.. పెదపాడు మండలం వడ్డిగూడెంకు చెందిన ఘంటసాల ఉదయ్‌కుమార్‌రాజుతో కృష్ణా జిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామానికి చెందిన చంటి(25)కి 2013లో వివాహమైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆమె మృతి చెంది ఉండటంతో ఉదయ్ చంటి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఆమె తండ్రి మోరు రామకృష్ణ ఫిర్యాదుతో పెదపాడు ఏస్సై అర్జునరావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉదయ్, చంటి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంటి మృతదేహాన్ని తహసీల్దార్ జీజేఎస్ కుమార్ శనివారం పరిశీలించారు. ఆమె మృతికి గల కారణాలను గ్రామంలో ఆరాతీశారు. -
మహిళ అనుమానాస్పద మృతి
చిలమత్తూరు(హిందూపురం) : చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులోని మార్కెట్ తనిఖీ కేంద్రం సమీపంలో ఊరు, పేరు తెలియని ఓ మహిళ(39) అనుమానాస్పదస్థితిలో మరణించి ఉండగా ఆదివారం కనుగొన్నట్లు ఎస్ఐ జమాల్‌బాషా తెలిపారు. చెక్‌పోస్టు మార్కెట్ తనిఖీ కేంద్రం పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉందని, భరించరాని దుర్వాసన వస్తోందంటూ తమకు సమాచారం అందిందన్నారు. సిబ్బందితో కలసి వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు వివరించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు ఎవరు, ఏ ప్రాంతం వాసి, ఇది హత్యనా, కాదా? ఒక వేళ హత్య అయితే హంతకులు ఎవరు, ఎందుకు చంపారనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై యువతి అనుమానాస్పద మృతి
-
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : నగరంలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సోమవారం కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన కావ్యశ్రీ(23) అనే యువతి మాదాపూర్‌లోని డీఎన్‌ఎస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తోంది. ఆమె మెహిదీపట్నం అత్తాపూర్‌లో నివాసం ఉంటోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి బయల్దేరిన ఆమె పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై మృతురాలై కనిపించింది. కావ్యశ్రీ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆమె చెవులు, ముక్కు నుంచి రక్తం వస్తూ రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెకు సంబంధించిన బ్యాగ్, ఫోన్ మరోవైపు పడి ఉన్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.