పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై యువతి అనుమానాస్పద మృతి | woman suspicious death in hyderabad pv expressway | Sakshi
Sakshi News home page

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై యువతి అనుమానాస్పద మృతి

Published Mon, Jan 23 2017 10:29 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై యువతి అనుమానాస్పద మృతి

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్ : నగరంలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సోమవారం కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన కావ్యశ్రీ(23) అనే యువతి మాదాపూర్‌లోని డీఎన్‌ఎస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తోంది. ఆమె మెహిదీపట‍్నం అత్తాపూర్‌లో నివాసం ఉంటోంది.

సోమవారం ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి బయల్దేరిన ఆమె పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై మృతురాలై కనిపించింది. కావ్యశ‍్రీ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆమె చెవులు, ముక్కు నుంచి రక్తం వస్తూ రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెకు సంబంధించిన బ్యాగ్‌, ఫోన్‌ మరోవైపు పడి ఉన్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement