Kavya Sri
-
27 ఏళ్ల దాకా అమ్మాయే..ఇపుడు అబ్బాయి!
దుబ్బాక: ఆ దంపతులకు తొలి సంతానంగా పండంటి ఆడబిడ్డ పుట్టింది. సాక్షాత్తూ లక్ష్మీదేవే ఇంటికి వచ్చిందని ఆ జంట మురిసిపోయింది. కావ్యశ్రీ అని చక్కని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొన్నారు. కూతురిని పాఠశాలకు, కళాశాలకు పంపి చక్కగా చదివించారు. కానీ, కావ్యశ్రీ వయసు పెరుగుతున్నాకొద్ది ఆమె శరీరంలో మార్పులు రావటం మొదలైంది. యుక్త వయసు వచ్చేసరికి అబ్బాయిలా గడ్డం, మీసాలు వచ్చాయి. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ, 26 ఏళ్ల వయసు వచ్చేనాటికి ఆమె.. అతడిలా మారటం స్పష్టంగా తెలిసిపోయింది. ఆరోగ్య పరంగా కూడా కావ్యశ్రీ ఇబ్బందులు ఎదుర్కొన్నది. కంగారుపడిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా, కావ్యశ్రీ ఆడపిల్ల కాదని.. మగపిల్లాడని డాక్టర్లు తేల్చారు. దీంతో 27 ఏళ్ల వయసులో కావ్యశ్రీ కాస్తా.. కార్తికేయగా మారాడు. సిద్దిపేట జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. అనారోగ్యంతో బయటపడిన నిజం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన దొంతగౌని రమేశ్, మంజుల మొదటి సంతానం కావ్యశ్రీ 1996 అక్టోబర్ 30న జన్మించింది. కావ్యశ్రీకి 2018 నుంచి శరీరంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మగవారిలాగా గడ్డం, మీసాలు పెరగడం ప్రారంభమైంది. విపరీతమైన కడుపు నొప్పి, ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో తల్లిదండ్రులు రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో వైద్యులను సంప్రదించారు. వారు ప్రత్యేక వైద్య నిపుణులను కలవాలని సూచించటంతో రెండు నెలల క్రితం బెంగళూరుకు చెందిన డాక్టర్లను కలిశారు. అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో నమ్మ లేని నిజాలు బయట పడ్డాయి. కావ్యశ్రీకి కడుపు కింది భాగంలో పురుషుల మాదిరిగా వృషణాలు ముడుచుకుని ఉండడంతోపాటు, 2.5 ఇంచుల అంగం బయటకు రావడం గమనించారు. ముడుచుకున్న వృషణాలను శస్త్ర చికిత్స చేసి సరి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఛాతీ భాగం సైతం అబ్బాయిదేనని, అధిక కొవ్వు కారణంగా ఎత్తుగా కనపడిందని తేల్చారు. ఇలా ఛాతీ ఎత్తుగా పెరగడాన్ని గైనాకో మాస్టియో అంటారని వైద్యులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కావ్యశ్రీ అని పిలుచుకున్న తమ సంతానానికి కార్తికేయ అని పేరు మార్చామని తల్లిదండ్రులు తెలిపారు. మూడు వారాల క్రితం ఆధార్ కార్డులో సైతం కార్తికేయగా పేరు మారి్పంచారు. కావ్యశ్రీ విద్యార్హతల సర్టిఫికేట్లలో సైతం పేరు మార్చాల్సి ఉంది. 2014 నుంచే కార్తికేయ బైక్, కారు సైతం నడుపుతున్నాడు. ప్రస్తుతం కార్తికేయ ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.అబ్బాయిగా జీవించటం ఆనందంగా ఉంది నాకు టీనేజ్ వచ్చేసరికి అబ్బాయిలాగా గడ్డం, మీసాలు రావడం మొదలైంది. డాక్టర్లను సంప్రదించగా అసంకల్పిత రోమాలు అని చెప్పారు. కడుపు నొప్పి తరచుగా వస్తుండడంతో హైదరాబాద్‌లో నిపుణులను కలిశాం. దీంతో నాకు అసలు విషయం తెలిసింది. ఇప్పుడు అబ్బాయిగా జీవించడం నాకెంతో ఆనందంగా ఉంది. –దొంతగౌని కార్తికేయజన్యు లోపాల వల్లే.. కార్తికేయ విషయంలో క్రోమోజోమ్‌ల లోపంతో ఇలా జరిగింది. కొన్ని క్రోమోజోమ్‌లు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల వృషణాలు చిన్నగా పెరిగాయి. వృషణాలు కొంత భాగం కడుపులో ముడుచుకొని ఉండటాన్ని గుర్తించాం. తదుపరి వైద్య పరీక్షలకు నిపుణులను సంప్రదించాలని సూచించాం. అతడు అమ్మాయి కాదు అబ్బాయే. టెస్టిక్యులర్ ఫెమినైజేషన్ సిండ్రోమ్ కారణంగా బయటకు అమ్మాయిలా కనిపించినా అంతర్గతంగా మొత్తం పురుష లక్షణాలే ఉన్నాయి. ఇది చాలా అరుదైన లక్షణం. –డాక్టర్ హేమారాజ్ సింగ్, సర్జన్, దుబ్బాక ఆస్పత్రి సూపరింటెండెంట్కార్తికేయను అబ్బాయిలాగే గుర్తించండి నా కొడుకులో జన్యు మార్పుల వల్ల మేము ఇన్నాళ్లు అమ్మాయిగా భ్రమపడ్డాం. యుక్త వయస్సు వచ్చేసరికి వాడికి గడ్డం, మీసాలు రావడం గమనించాం. ఈ క్రమంలో కడుపు నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాం. అమ్మాయి కాదని అబ్బాయి అని నిర్థారించారు. సమాజం తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా అబ్బాయిని అబ్బాయిలాగే గుర్తించండి. –మంజుల–రమేష్ గౌడ్, కార్తికేయ తల్లిదండ్రులు -
పక్కా ప్రణాళికతోనే ప్రాణాలు తీశాడు..
నెల్లూరు(క్రైమ్): తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో కావ్యశ్రీని చంపడమే లక్ష్యంగా సురేష్‌రెడ్డి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.. బిహార్‌లో తుపాకీ కొనుగోలు చేసి నెల్లూరు వచ్చాడు.. అదును కోసం వేచి చూసి ఈ నెల 9న ఆమెను తుపాకీతో కాల్చి చంపి.. ఆపై తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీని ఎక్కడ, ఎవరి వద్ద కొనుగోలు చేశాడు.. తదితర వివరాలను సేకరించిన పోలీసులు బిహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వివరాలను గురువారం నెల్లూరు క్రైమ్స్ ఏఎస్పీ చౌడేశ్వరి మీడియాకు వివరించారు. పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన కావ్యశ్రీ.. అదే ప్రాంతానికి చెందిన సురేష్‌రెడ్డితో పెళ్లికి నిరాకరించడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గతేడాది ఆగస్టులో ఆమెకు సురేష్‌రెడ్డి మెసేజ్ పంపాడు. దానికి ఆమె స్పందించకపోవడంతో ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. యాసిడ్‌తో దాడి, హత్యచేయడంపై ఇంటర్నెట్లో వీడియోలు చూశాడు. చివరకు తుపాకీతో కాల్చి చంపాలని నిర్ణయించుకుని, ఆ సమాచారం కోసం నెలల తరబడి డార్క్ నెట్లో శోధించాడు. బిహార్‌లో తుపాకులు దొరుకుతాయని తెలుసుకుని గతేడాది డిసెంబర్లో పాట్నాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే పాట్నా పున్పున్ పోస్టు కందాప్ గ్రామానికి చెందిన కారు డ్రైవర్ రమేష్‌కుమార్ అలియాస్ రోహిత్, అతని అన్న ఉమేష్‌ల నుంచి తుపాకీని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి అదును కోసం వేచి చూసి చివరికి కావ్యశ్రీని కాల్చి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కోణంలో దర్యాప్తు ఘటనపై శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. అసలు సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సురేష్‌రెడ్డి సెల్‌ఫోను మెసేజ్‌లు, కాల్ డేటా, ట్రావెల్ హిస్టరీని సేకరించారు. మృతుడు గతేడాది డిసెంబర్లో బిహార్‌లోని ఓ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.89,500 విత్‌డ్రా చేసినట్టు గుర్తించారు. తుపాకీ పైనున్న( స్టార్) గుర్తుల ఆధారంగా దానిని బిహార్‌లోనే కొనుగోలు చేసినట్టు నిర్ధారణకొచ్చారు. ప్రత్యేక బృందాలు పాట్నాకు వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో.. తుపాకీని విక్రయించిన అన్నదమ్ముల్లో ఒకడైన రోహిత్‌కు నెల్లూరు వచ్చి విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. దీంతో రమేష్ ఈ నెల 17న నెల్లూరు వచ్చి సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యాడు. రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు గురువారం అతడిని అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారం మేరకు అతడి అన్న ఉమేష్ కోసం గాలిస్తున్నట్టు క్రైమ్స్ ఏఎస్పీ చౌడేశ్వరి వివరించారు. -
ఢీ– 13 విన్నర్‌గా లారీ డ్రైవర్ కూతురు.. మనమ్మాయే!..
సాక్షి, తాండూరు టౌన్(వికారాబాద్): తాండూరు పట్టణానికి చెందిన కావ్యశ్రీ ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన ఢీ– 13 డ్యాన్స్ పోటీల్లో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో కార్తీక్‌ను ఓడించి టైటిల్ దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంది. పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన లారీ డ్రైవర్ మహేశ్, పద్మావతి దంపతుల కూతురు దువచర్ల కావ్యశ్రీ, స్థానిక భాష్యం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. చిన్ననాటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్న ఆమెకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఢీ– 13లోఅవకాశం దక్కింది. ప్రతీ రౌండ్లో సత్తా చాటుతూ పోటీదారులకు సవాలు విసిరింది. ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా విజేతగా నిలిచింది. కావ్యశ్రీ విజయంపై భాష్యం కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పట్టణ వాసులు ఆనందం వ్యక్తంచేశారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్‌గా ఎదగాలనేదే తన లక్ష్యమని కావ్యశ్రీ తెలిపింది. చదవండి: కపిల్ దేవ్ బయోపిక్కు షాక్, నిర్మాతలపై చీటింగ్ కేసు చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్ -
యువతి అనుమానాస్పద మృతి
లంగర్‌హౌస్: పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం అనుమానాస్పదస్థితిలో యువతి మృతదేహం లభించింది. లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ ఎంఏ జావీద్, మృతురాలి కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటకకు చెందిన రాజేశ్వరి అత్తాపూర్‌లో నివసిస్తోంది. ఆమెకు కూతురు కావ్యశ్రీ(21), కుమారుడు ఉన్నారు. మూడేళ్ళ క్రితం ఆమె భర్త రవీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజేశ్వరి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఆమె కుమార్తె కావ్యశ్రీ ఏడాదిన్నరగా మాదాపూర్‌లోని డీఎల్ఎఫ్ సంస్థకు అనుబంధమైన యూనిసిస్లో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తోంది. సోమవారం ఉదయం నిద్ర లేచేసరికి కావ్యశ్రీ కనిపించకపోవడంతో విధులకు వెళ్లి ఉంటుందని తల్లి భావించింది. అయితే ఉదయం 7.30 ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం.74 సమీపంలోని ర్యాంపు దారిపై అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన వాహనచోదకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న లంగర్‌హౌస్ పోలీసులు క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కావ్యశ్రీ సెల్‌ఫోన్ కాల్ డిటేల్స్,, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అన్నీ అనుమానాలే... ♦ కావ్యశ్రీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావ్యశ్రీ ఇళ్లు అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.130 సమీపంలో ఉండగా, ఆఫీస్‌కు వెళ్లేందుకు ఆమె తరచూ పిల్లర్ నెం.128 వద్ద ఆటో ఎక్కేది. ♦ మృతదేహం లభ్యమైన పిల్లర్ నెం.74 నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఫ్లైఓవర్ పైకి వెళ్ళే వాహనాలు మాత్రమే నడుస్తుంటాయి. ద్విచక్ర వాహనాలకు కూడా ఈ రోడ్డులో అనుమతి లేదు. మృతురాలు అక్కడికి ఎందుకు వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ♦ కావ్యశ్రీ యూనిఫాం, టిఫిన్ బాక్సు సోమవారం ఆమె మృతదేహం వద్ద లభించలేదు. మృతదేçహానికి 150 మీటర్ల దూరంలో ఆమె చెప్పులు పడి ఉండటమూ అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఫోన్ సైతం మరికొంత దూరంలో పడుంది. ♦ ఒక వేళ ఏదైనా వాహనం ఆమెను ఢీ కొట్టి ఉన్నా ఆమె ఒంటిపై గాయాలు ఉండాలి. అయితే మృతదేహంపై నడుము వద్ద మాత్రమే గాయమైంది. ఆమె ముక్కు, నోరు, చెవుల నుంచి తీవ్ర రక్తస్రావమైంది. నుదురు తదితర ప్రాంతాల్లో కమిలిన గాయాలు కనిపిస్తున్నాయి. ♦ కావ్యశ్రీ ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వచ్చిందనే అంశం పైనా స్పష్టత లేదు. సోమవారం ఉదయం తమకు కనిపించలేదని, రోజూ బయటకు వచ్చే సమయంలో మాత్రం రాలేదని కుటుంబీకులు చెబుతున్నారు. -
మిస్టరీగా మారిన కావ్యశ్రీ మరణం
-
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై యువతి అనుమానాస్పద మృతి
-
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : నగరంలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సోమవారం కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన కావ్యశ్రీ(23) అనే యువతి మాదాపూర్‌లోని డీఎన్‌ఎస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తోంది. ఆమె మెహిదీపట్నం అత్తాపూర్‌లో నివాసం ఉంటోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి బయల్దేరిన ఆమె పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై మృతురాలై కనిపించింది. కావ్యశ్రీ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆమె చెవులు, ముక్కు నుంచి రక్తం వస్తూ రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెకు సంబంధించిన బ్యాగ్, ఫోన్ మరోవైపు పడి ఉన్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.