టైటిల్ ట్రోఫీ అందుకుంటున్న కావ్యశ్రీ
సాక్షి, తాండూరు టౌన్(వికారాబాద్): తాండూరు పట్టణానికి చెందిన కావ్యశ్రీ ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమైన ఢీ– 13 డ్యాన్స్ పోటీల్లో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో కార్తీక్‌ను ఓడించి టైటిల్ దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంది. పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన లారీ డ్రైవర్ మహేశ్, పద్మావతి దంపతుల కూతురు దువచర్ల కావ్యశ్రీ, స్థానిక భాష్యం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది.
చిన్ననాటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్న ఆమెకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఢీ– 13లోఅవకాశం దక్కింది. ప్రతీ రౌండ్‌లో సత్తా చాటుతూ పోటీదారులకు సవాలు విసిరింది. ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా విజేతగా నిలిచింది. కావ్యశ్రీ విజయంపై భాష్యం కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పట్టణ వాసులు ఆనందం వ్యక్తంచేశారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్‌గా ఎదగాలనేదే తన లక్ష్యమని కావ్యశ్రీ తెలిపింది.
చదవండి: కపిల్ దేవ్ బయోపిక్‌కు షాక్, నిర్మాతలపై చీటింగ్ కేసు
చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment