సాక్షి, వికారాబాద్: తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. దీంతో ప్రశ్నాపత్రం లీకైందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మిగతా పరీక్షల నిర్వహణపై సందిగ్దం నెలకొంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన క్లారిటీ ఇచ్చారు.
రేపటి పదో తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపారు. టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ బహిర్గతం కావడంపై జిల్లా కలెక్టర్, వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. చట్టం 25/1997, CrPC సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.
‘సెంటర్ నెం. 24033, గవర్నమెంట్, హైస్కూల్ నెం.1, తాండూరు, వికారాబాద్ జిల్లాలోని ఇన్విజిలేటర్ బందెప్ప పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు ఉదయం 9.37 గంటలకు పంపినట్లు గుర్తించాం. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 9.30 తర్వాత బయటి వ్యక్తిని కేంద్రంలోకి రాలేదు. కేంద్రం నుంచి బయటకు ఎవరూ వెళ్లలేదు. పరీక్షా నిర్వహణ విషయంలో రాజీపడలేదు. విచారణ తర్వాత ఇది కేవలం ఇన్విజిలేటర్ బందెప్ప దుర్వినియోగమేనని నిర్ధారించాం’ అని చెప్పారు..
సస్పెండ్ అయ్యింది వీళ్లే..
1. శివ కుమార్, GHM, ZPHS, ముద్దాయిపేట, యాలాల్(M) (చీఫ్ సూపరింటెండెంట్)
2. K. గోపాల్, SA, Govt., No.1 ఉన్నత పాఠశాల, తాండూరు (డిపార్ట్‌మెంట్ అధికారి)
3. S. బండప్ప, SA(BS), Govt., No. 1 ఉన్నత పాఠశాల, తాండూరు. (ఇన్విజిలేటర్)
4. సమ్మప్ప, SA(PS), ZPHS, చెంగోలు, తాండూరు మండలం (ఇన్విజిలేటర్)
చదవండి: టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్..
Comments
Please login to add a commentAdd a comment