tenth paper leak
-
నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా: సీపీ రంగనాథ్
వరంగల్: తెలంగాణలో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి తాను సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపించారని, అది నిరూపిస్తే తన సీపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు సీపీ రంగనాథ్. కేసు విషయంలో నిజాయితీ ఉంటే మూడు సింహాలపై సీపీ ప్రమాణం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సీపీపై పలు ఆరోపణలు చేశారు బండి సంజయ్. ఈ వ్యవహారంపై ఈరోజు(మంగళవారం) మీడియా ముందుకొచ్చిన సీపీ.. తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తనకు బీజేపీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టాలనే ఉద్దేశం లేదని, రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నాని తెలిపారు. తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసని, కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్లే వారికి బాధ కలిగి ఉండొచ్చని ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. సత్యంబాబు కేసులో తాను విచారణ అధికారిని కాదని, స్పెషల్ ఆఫీసర్‌గా నందిగామకు పంపించారన్నారు. ప్రతి కేసులో ప్రమాణాలు చేస్తే తాను ఇప్పటివరకూ 10 వేలసార్లు ప్రమాణాలు చేయాలని, ప్రమాణం అనే మాట వినడానికే ఆశ్చర్యం వేస్తోందన్నారు సీపీ. చదవండి: బండి సంజయ్ సంచలన నిర్ణయం.. వరంగల్ సీపీకి షాక్! టెన్త్ పేపర్ లీక్ పెద్ద గేమ్‌ప్లాన్ -
టెన్త్ పేపర్ లీక్ కేసు.. డిబార్ అయిన విద్యార్థికి ఊరట
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పేపర్ లీకేజీ ఆరోపణలతో డిబార్ అయిన టెన్త్ విద్యార్థి హరీష్‌కు ఊరట లభించింది. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది కాగా హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్ లీక్ చేసిన ఆరోపణలతో అధికారులు హరీష్‌ను డిబార్ చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుకు హరీష్ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్ లాక్కున్నారని తెలిపారు. కమలాపూర్‌లో నమోదైన ఎఫ్ఐఆర్లో కూడా హరీష్ పేరు ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా అధికారులు శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు అనుమంతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని ఆరోపిస్తూ.. హరీష్‌ను టెన్త్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. విద్యార్థిని మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని అధికారులను ఆదేశించింది. చదవండి: టెన్త్ పేపర్ లీక్ కేసు.. ఎగ్జామ్ సెంటర్లో జరిగింది ఇదేనా..? -
పేపర్ లీక్.. టెన్త్ పరీక్షలు వాయిదా?.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ
సాక్షి, వికారాబాద్: తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. దీంతో ప్రశ్నాపత్రం లీకైందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మిగతా పరీక్షల నిర్వహణపై సందిగ్దం నెలకొంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన క్లారిటీ ఇచ్చారు. రేపటి పదో తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపారు. టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ బహిర్గతం కావడంపై జిల్లా కలెక్టర్, వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. చట్టం 25/1997, CrPC సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ‘సెంటర్ నెం. 24033, గవర్నమెంట్, హైస్కూల్ నెం.1, తాండూరు, వికారాబాద్ జిల్లాలోని ఇన్విజిలేటర్ బందెప్ప పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు ఉదయం 9.37 గంటలకు పంపినట్లు గుర్తించాం. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 9.30 తర్వాత బయటి వ్యక్తిని కేంద్రంలోకి రాలేదు. కేంద్రం నుంచి బయటకు ఎవరూ వెళ్లలేదు. పరీక్షా నిర్వహణ విషయంలో రాజీపడలేదు. విచారణ తర్వాత ఇది కేవలం ఇన్విజిలేటర్ బందెప్ప దుర్వినియోగమేనని నిర్ధారించాం’ అని చెప్పారు.. సస్పెండ్ అయ్యింది వీళ్లే.. 1. శివ కుమార్, GHM, ZPHS, ముద్దాయిపేట, యాలాల్(M) (చీఫ్ సూపరింటెండెంట్) 2. K. గోపాల్, SA, Govt., No.1 ఉన్నత పాఠశాల, తాండూరు (డిపార్ట్మెంట్ అధికారి) 3. S. బండప్ప, SA(BS), Govt., No. 1 ఉన్నత పాఠశాల, తాండూరు. (ఇన్విజిలేటర్) 4. సమ్మప్ప, SA(PS), ZPHS, చెంగోలు, తాండూరు మండలం (ఇన్విజిలేటర్) చదవండి: టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్.. -
టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్.. వారిపై వేటు
సాక్షి, వికారాబాద్: తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. సెల్‌ఫోన్‌ను లోపలికి అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్‌పై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు సస్పెండ్ పేపర్ లీక్ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ బందప్ప, మరొకరిపై వేటు వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా పేపర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో లీక్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. 2017లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పాఠశాల గదిలో ఒక విద్యార్థినిని వేధించడంతో కేసు నమోదు చేశారు. బందప్ప భార్య అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది. కేసు నమోదు టెన్త్ పేపర్ బయటకు పంపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే పేపర్ ఎక్కడా లీక్ కాలేదని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష మొదలైన తర్వాతే పేపర్ బయటకు వచ్చిందని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్‌ను మీడియా గ్రూప్‌లో పెట్టిన్నట్లు గుర్తించారు. ఉదయం 9:30 గంటలకు పదో తరగతి పరీక్ష ప్రారంభమవ్వగా.. 9:37 గంటలకు పేపర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో షేర్‌చేశారని పోలీసులు తెలిపారు. ఎగ్జామ్ హాల్‌నుంచి పేపర్ పంపినందుకు ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. టెన్త్ పేపర్ లీక్ కలకలం ఆదివారం ఉదయం వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పేపర్ బయటకు లీక్ కావడం, వాట్సప్‌లో వైరల్ కావడంపై తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసు శాఖతోపాటు విద్యాశాఖ విచారణ ప్రారంభించింది. -
అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే యత్నం
-
అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే యత్నం
అమరావతి: కష్టపడి చదువుకునే విద్యార్థుల భవిష్యత్‌ను కాలరాసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై తాము అసెంబ్లీలో ఇవాళ ఉదయం నుంచి చర్చకు పట్టుబడితే... అదేమీ సమస్య కాదని, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని చెప్పడం దారుణమన్నారు. తాము ఆందోళన ఉధృతం చేసిన తర్వాతే లీకేజీ అంశంపై స్టేట్మెంట్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే అది ఇవాళ కాకుండా, ఎల్లుండి ఇస్తామనడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సీఎం అందుబాటులోనే ఉన్నా లీకేజీ అంశంపై ఇవాళ ఎందుకు ప్రకటన చేయడం లేదని ఎమ్మెల్యే సురేష్ సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని, వాస్తవాలు చెబుతామని కోరినప్పటికీ, మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు. పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ విద్యాసంస్థల యజమాని మంత్రి నారాయణ దీనికి బాధ్యత వహించాలని ఎమ్మెల్యే సురేష్ డిమాండ్ చేశారు. -
‘నారాయణ విద్యాసంస్థలను ఐదేళ్లు బ్యాన్ చేయాలి’
అమరావతి : పరీక్షల్లో విద్యార్థి కాపీ కొడితే ఎలా డిబారు చేస్తారో... టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ అయినందుకు నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రంలో ఐదేళ్లు బ్యాన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రశ్నాపత్రం లీకేజీపై ఓ మంత్రి లీక్ కాలేదంటే...మరో మంత్రి పేపర్ లీక్ అయిందంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రులకే ఓ స్పష్టత లేదని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ముడిపడి ఉన్న ఈ అంశాన్ని... సభలో చర్చించాల్సిన విషయం కాదని చెప్పడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే అనీల్ కుమార్ అన్నారు. తాము సభలో చర్చకు పట్టుబడితే చివరకూ... లీకేజీ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 30న ప్రకటన చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సభను రెండుసార్లు వాయిదా వేశారని, అదే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరినా... టైమ్ కేటాయించకపోవడం దారుణమన్నారు. ఈ అంశంపై వైఎస్ జగన్ మాట్లాడితే దొంగలు దొరికిపోతారని ప్రభుత్వం భయపడుతోందన్నారు. వియ్యంకులు నారాయణ, గంటా శ్రీనివాసరావును కాపాడేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అటెండర్ ద్వారా లీక్ అయ్యిదంటూ ఓ మంత్రి చెప్పడం, అబ్బే అసలు పేపరే లీక్ కాలేదని మరొక మంత్రి చెప్పడం సిగ్గు చేటు అన్నారు. పరీక్షలు పూర్తయి, ఫలితాలు వచ్చాక ప్రకటన చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే అనీల్ కుమార్ ఎద్దేవా చేశారు. టెన్త్ పేపర్ లీకేజీపై ఇవాళే సభలో ప్రకటన చేయాలని, వైఎస్ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీక్ చేసిన నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనీల్ కుమార్ పేర్కొన్నారు. -
‘నారాయణ విద్యాసంస్థలను ఐదేళ్లు బ్యాన్ చేయాలి’