కష్టపడి చదువుకునే విద్యార్థుల భవిష్యత్‌ను కాలరాసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై తాము అసెంబ్లీలో ఇవాళ ఉదయం నుంచి చర్చకు పట్టుబడితే... అదేమీ సమస్య కాదని, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని చెప్పడం దారుణమన్నారు.