Narayana schools
-
‘నారాయణ’ నాటకాలు.. స్కూల్ భవనం లేదు, అనుమతులు లేవు! కానీ ఫీజులు మాత్రం..
సాక్షి,పుత్తూరు రూరల్(తిరుపతి): ‘‘ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం’’అన్న సామెత పుత్తూరు పట్టణంలో నారాయణ విద్యా సంస్థ నాటకాలకు తెరదీసింది. సదరు సంస్థ గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులను ప్రలోభ పెడుతూ అడ్మిషన్ల పేరిట వేల రూపాయలను వసూలు చేస్తోంది. నారాయణ స్కూల్ పేరుతో బస్సు ఒకటి పట్టణంలో తిరుగుతూ, అందులోంచి కొంత మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభించామని, కరపత్రాలను పంచుతూ తల్లిదండ్రులను ప్రలోభ పెడుతున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు రూ.3,500 అని, 6వ తరగతికి రూ.28 వేలు, 8వ తరగతికి రూ.30 వేలుగా చెబుతూ వాట్సాప్, ఫోన్ల ద్వారా ఊదరగొట్టేస్తున్నారు. కనీసం భవనం లేకుండా అడ్మిషన్లు ఏంటని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులకు నిర్మాణం జరుగుతోందని, త్వరలోనే చూపిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కొందరు అడ్మిషన్ ఫీజులు చెల్లించి సీటును రిజర్వు చేసుకుంటున్నారు. వాస్తవానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి పుత్తూరు పట్టణంలో ఎక్కడా భవనం లేదు. విద్యాశాఖ అధికారులు సైతం నారాయణ విద్యా సంస్థకు పుత్తూరులో ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తొందర పడి వేలాది రూపాయలను చెల్లించి మోసపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ‘నారాయణ’కు అనుమతులు లేవు నారాయణ విద్యా సంస్థకు పుత్తూరు పట్టణంలో ఎలాంటి అనుమతులు లేవు. దరఖాస్తు చేసుకోలేదు. అయినా పుత్తూ రు ప్రచారం నిర్వహిస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. విషయాన్ని డీఈఓ దృష్టికి తసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. – ఎంఈఓ తిరుమలరాజు -
‘బెల్టు’ స్కూళ్లు..!
బెల్టు షాపులు అంటూ మద్యం అమ్మకాలకు సంబంధించి తరచూ వింటూ ఉంటాం.. అంటే అనుమతులు లేకుండా చిన్న బడ్డీ కొట్లలో అక్రమంగా మద్యం విక్రయించడం. ఈ జాడ్యం ఇప్పుడు విద్యావ్యవస్థకూ పాకింది. ఒక పాఠశాల నిర్వహించేందుకు అనుమతి తీసుకుంటారు.. అదే అనుమతితో రెండు మూడు సబ్ బ్రాంచ్‌లు పెట్టేస్తారు. వీటికి అనుమతులుండవు.. అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్ సెంటర్లంటూ నమ్మిస్తారు. దీంతో జిల్లాలో ‘బెల్టు’ స్కూళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో బెల్టు షాప్‌ల మాదిరి బెల్టు స్కూళ్లు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. గుర్తింపు పొందితే అధికారుల తనిఖీలు, ఫీజులు, పద్ధతులు పాటించాల్సి వస్తుందని చాలా స్కూళ్లు అనుమతి జోలికి పోవడం లేదు. కార్పొరేట్, పేరు మోసిన ప్రైవేట్ సంస్థలు ఒక్క స్కూల్‌కు అనుమతి తీసుకొని, వాటితో రెండు మూడు బ్రాంచ్‌లను నడుపుతూ క్యాష్ చేసుకుంటున్నాయి. స్థానిక అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్లు నడుపుతున్నామని చెప్పి తప్పించుకుంటున్నారు. గుర్తింపు లేకపోతే సరి..! స్కూల్ పెట్టాలంటే స్థానిక సంస్థల అనుమతితో పాటు ట్రాఫిక్ పోలీసు, అగ్నిమాపక శాఖ, భవననిర్మాణ శాఖ, విద్యాశాఖ, పట్టణ పారిశుద్ధ్యశాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. వీటితో పాటు వాహనాలు ఉంటే వాటికి రవాణా శాఖ అనుమతి కూడా పొందాలి. విద్యార్థి ఒకొక్కరి పేరిట గుర్తింపు ఫీజులను చెల్లించాలి. ఇంత పెద్ద ఎత్తున ఫీజులు చెల్లించి తడిసిమోపెడు ఖర్చు చేసే బదులు ఎలాంటి గుర్తింపు లేకుండా పాఠశాలలను నడపడం, అక్కడ చదివే విద్యార్థులను ఇతర స్కూళ్ల నుంచి పరీక్షకు అనుమతించడం చాలా తేలికైన అంశంగా మారింది. ప్రతి పాఠశాల నుంచి ఎగ్జంప్షన్ ఫీజు చెల్లించి ప్రైవేటు స్టడీ విద్యార్థులు, రెగ్యులర్ విద్యార్థులు హాజరుకావచ్చు. కొన్ని స్కూళ్లు తమ స్కూళ్లలో చదవకపోయినా ఇతర స్కూళ్ల వారిని కూడా తమ విద్యార్థులుగానే రికార్డుల్లో చూపిస్తున్నాయి. వాటిని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆడిందే ఆటగా వారు రాసిందే రికార్డుగా మారిపోయింది. జిల్లాలో దాదాపు 80 స్కూళ్లు... కృష్ణా జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న పాఠశాలలు దాదాపు 80 వరకు ఉన్నాయి. ఇందులో ఒక్క విజయవాడ నగరంలోనే 60 స్కూళ్ల వరకు గుర్తింపు లేని పాఠశాలలు ఉండగా, ఇతర ప్రాంతాల్లో మరో 20 దాకా ఉన్నాయని సమాచారం. వీటిలో అగ్రభాగం నారాయణ, శ్రీచైతన్య, తదితర కార్పొరేట్ పాఠశాలలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా.. ఇది వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండటం, భారీగా ముడుపులు అందజేయటం వంటి కారణాల వల్ల వీటిపై దాడులు జరగకుండా పోయాయి. కొత్త ప్రభుత్వం విద్యా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి చూపటంతో వీటిపై దాడులు మొదలయ్యాయి. బుధవారం విజయవాడలోని సత్యనారాయణపురంలోని అనుమతి లేని నారాయణ స్కూల్‌పై విద్యాశాఖాధికారులు దాడి చేసి లక్ష రూపాయలు జరిమానా, తాత్కాలికంగా సీజ్ చేశారు. విద్యాసంవత్సరం ఆరంభంలో కేవలం నోటీసులు, జరిమానాలతో సరిపెడుతున్నారు తప్ప కఠిన చర్యలు తీసుకోవటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
అంతా మంత్రి నారాయణే చేశాడు!
సాక్షి, అనంతపురం: మంత్రి నారాయణ విద్యా సంస్థ నారాయణ స్కూల్లో చోటుచేసుకున్న ఓ విద్యార్థి మరణం, తీవ్రస్థాయిలో దుమారం రేపుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన సాయిచరణ్ నాయక్ అనే విద్యార్థి తిరుపతి నారాయణ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం పాఠశాలలో శవమై కనిపించాడు. పోలీసు కానిస్టేబుల్ మోహన్ కృష్ణ, సాలెమ్మల ఒక్కగానొక్క కొడుకు సాయి చరణ్. కొడుకు మరణంతో కుంగిపోయింది. ఇప్పటికీ ఆకుటుంబం కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అయితే స్కూల్ యాజమాన్యమే తమ కుమారుడిని చంపేశారని చరణ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈకేసుకు సంభంధించిన విచారణ తూతూ మంత్రంగా సాగుతోందంటూ ఇప్పటిదాకా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి మరణానికి మంత్రి నారాయణ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను కొట్టి చంపుతూ, ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ విద్యాసంస్థలను మూసేయాలని సాయి చరణ్ తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే యత్నం
-
అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే యత్నం
అమరావతి: కష్టపడి చదువుకునే విద్యార్థుల భవిష్యత్‌ను కాలరాసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై తాము అసెంబ్లీలో ఇవాళ ఉదయం నుంచి చర్చకు పట్టుబడితే... అదేమీ సమస్య కాదని, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని చెప్పడం దారుణమన్నారు. తాము ఆందోళన ఉధృతం చేసిన తర్వాతే లీకేజీ అంశంపై స్టేట్మెంట్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే అది ఇవాళ కాకుండా, ఎల్లుండి ఇస్తామనడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సీఎం అందుబాటులోనే ఉన్నా లీకేజీ అంశంపై ఇవాళ ఎందుకు ప్రకటన చేయడం లేదని ఎమ్మెల్యే సురేష్ సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని, వాస్తవాలు చెబుతామని కోరినప్పటికీ, మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు. పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ విద్యాసంస్థల యజమాని మంత్రి నారాయణ దీనికి బాధ్యత వహించాలని ఎమ్మెల్యే సురేష్ డిమాండ్ చేశారు. -
‘నారాయణ విద్యాసంస్థలను ఐదేళ్లు బ్యాన్ చేయాలి’
అమరావతి : పరీక్షల్లో విద్యార్థి కాపీ కొడితే ఎలా డిబారు చేస్తారో... టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ అయినందుకు నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రంలో ఐదేళ్లు బ్యాన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రశ్నాపత్రం లీకేజీపై ఓ మంత్రి లీక్ కాలేదంటే...మరో మంత్రి పేపర్ లీక్ అయిందంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రులకే ఓ స్పష్టత లేదని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ముడిపడి ఉన్న ఈ అంశాన్ని... సభలో చర్చించాల్సిన విషయం కాదని చెప్పడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే అనీల్ కుమార్ అన్నారు. తాము సభలో చర్చకు పట్టుబడితే చివరకూ... లీకేజీ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 30న ప్రకటన చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సభను రెండుసార్లు వాయిదా వేశారని, అదే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరినా... టైమ్ కేటాయించకపోవడం దారుణమన్నారు. ఈ అంశంపై వైఎస్ జగన్ మాట్లాడితే దొంగలు దొరికిపోతారని ప్రభుత్వం భయపడుతోందన్నారు. వియ్యంకులు నారాయణ, గంటా శ్రీనివాసరావును కాపాడేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అటెండర్ ద్వారా లీక్ అయ్యిదంటూ ఓ మంత్రి చెప్పడం, అబ్బే అసలు పేపరే లీక్ కాలేదని మరొక మంత్రి చెప్పడం సిగ్గు చేటు అన్నారు. పరీక్షలు పూర్తయి, ఫలితాలు వచ్చాక ప్రకటన చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే అనీల్ కుమార్ ఎద్దేవా చేశారు. టెన్త్ పేపర్ లీకేజీపై ఇవాళే సభలో ప్రకటన చేయాలని, వైఎస్ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీక్ చేసిన నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనీల్ కుమార్ పేర్కొన్నారు. -
‘నారాయణ విద్యాసంస్థలను ఐదేళ్లు బ్యాన్ చేయాలి’
-
'టెన్త్'కు లీక్ తెగులు
‘నారాయణ’ సంస్థల నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ - పరీక్షా కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాల సేకరణ - తమ విద్యార్థులకు వాట్సాప్‌లో సమాధానాల చేరవేత - నెల్లూరులో సైన్స్ పేపర్ –1, మడకశిరలో తెలుగుపేపర్ –1 లీక్ - కదిరిలో ముందుగానే బయటకొచ్చిన హిందీ పేపర్ - జవాబులు సిద్ధం చేస్తూ మీడియాకు చిక్కిన ‘నారాయణ’ సిబ్బంది - రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయిన లీకేజీలు - పరీక్షల ప్రారంభానికి ముందే వాట్సప్‌లలో ప్రత్యక్షం - టెన్త్ పత్రాలు రోజూ బయటకు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం - కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం సాక్షి, అమరావతి లీక్... లీక్... లీక్... ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకొచ్చేస్తున్నాయి. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థ ‘నారాయణ’ హస్తం ఉండడం నిర్ఘాంతపరుస్తోంది. ఇప్పటివరకు పరీక్ష పత్రాల లీకేజీలు జరిగిన కేంద్రాలన్నీ నారాయణ స్కూళ్లే కావడం గమనార్హం. అయితే పరీక్షా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతరులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం వరకే విద్యాశాఖ పరిమితమవుతోంది. ఈ సంస్థ మంత్రి నారాయణకు సంబంధించినది కావడం, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయనా స్వయానా వియ్యంకులు కావడం వల్లే అధికారులు ప్రశ్నాపత్రాల లీకేజీలపై కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకో ప్రశ్నపత్రం లీకవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేకపోవడం పట్ల విద్యారంగ నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని చోట్లా ‘నారాయణ’ నుంచే... – నెల్లూరులోని నారాయణ హైస్కూల్నుంచి టెన్త్ సైన్స్ పేపర్–1ను శనివారం వాట్సప్ ద్వారా బయటకు పంపించారు. అధికారులు చీఫ్‌సూపరింటెండెంటు, డిపార్టుమెంటల్ ఆఫీసర్‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. నారాయణ సంస్థకు చెందిన వ్యక్తులతో పాటు కొంతమంది ప్రభుత్వ టీచర్లుకూడా ఈ లీకేజీ వెనుక ఉన్నారని చెబుతున్నారు. – పదో తరగతి పరీక్షలు ఈనెల 17నుంచి ప్రారంభం కాగా, తొలిరోజే తెలుగు పేపర్–1 ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి లీకైంది. అరగంటకే నలుగురు యువకులు కిటికీలోనుంచి ప్రశ్నపత్రం సెల్ఫోన్లో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఘటనకు కారకుడైన హిందూపురం పట్టణంలో నారాయణ పాఠశాలకు సంబంధించిన ఏఓ ముత్యాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన మొబైల్ ఫోన్ నుంచి పలువురికి ప్రశ్నపత్రం పంపాడని తేలింది. – ఆ తర్వాత రెండు రోజులకే కదిరి పట్టణంలో హిందీ ప్రశ్నపత్రం లీక్ అయింది. నారాయణకు చెందిన పాఠశాలలో సిబ్బంది జవాబులు సిద్ధం చేస్తూ మీడియా కంట పడ్డారు. పట్టణంలో నారాయణ పాఠశాల విద్యార్థులు రాస్తున్న అన్ని కేంద్రాలకు జవాబులు పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు కదిరి పట్టణంలోని అన్ని కేంద్రాల నుంచి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల సెల్ఫోన్లు సీజ్ చేసి విచారణ చేశారు. ప్రశ్నపత్రం ఈ ప్రాంతం నుంచి లీక్ కాలేదని తేల్చారు. అయితే ఈ ప్రశ్నపత్రం, సమాధానాల పత్రాలు నారాయణ పాఠశాలకు అనంతపురం జిల్లా నుంచి కాకుండా బయట జిల్లాల నుంచి వచ్చినట్లు విద్యాశాఖాధికారులు అనుమానిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నారాయణ పాఠశాలలకు ఇదే తరహాలో ప్రశ్నపత్రం వెళ్లిందని, అందులో భాగంగానే కదిరి బ్రాంచ్‌కు వచ్చిందని వారు అంతర్గతంగా చెబుతున్నారు. ఆ సంస్థల్లో ఏటా ఇదేతంతు సాగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై డీఈఓ లక్ష్మినారాయణ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. వేరే ప్రాంతం నుంచి ఈ ప్రశ్నపత్రం వచ్చిందని వారు పేర్కొనగా తమ పరిధిలో ఈ ఘటన జరిగితేనే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కేసు నమోదుకు అంగీకరించకపోవడం విశేషం. –చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, పీలేరు, పుత్తూరు పరీక్షా కేంద్రాల్లో రోజు ప్రశ్నాపత్రాలు బయటకు వస్తున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి సెల్ఫోన్లో ఫోటోలు తీసి సంబంధిత సబ్జెక్టు నిపుణులకు వాట్సాప్‌లో పంపిస్తున్నారు. వారి నుంచి సమాధానాలు సేకరించి పిల్లలతో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ చేయిస్తున్నారు. – కడప జిల్లాలోనూ ఇదే తరహా లీకేజీలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాట్సప్‌లలో ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే దర్శనమిస్తున్నా మౌనం దాలుస్తున్నారు. గ్రేడ్ల పోటీ వల్లే లీకేజీలు.. నారాయణ సంస్థలో ఆయా స్కూళ్ల డీన్లు, ప్రిన్సిపాళ్లకు ఎవరు ఎక్కువ ఏ గ్రేడ్లు సాధిస్తే వారికి అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతుండడంతో ఆ స్కూళ్లన్నీ ఈ అక్రమాలకు తెగబడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ముందుగానే ఆయా స్కూళ్ల సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాలను బయటకు తెస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ షరామామూలుగా మారినా ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. ఈ లీకేజీల వ్యవహారంపై మంత్రి గంటాతోపాటు ఉన్నతాధికారులు కూడా పట్టీపట్టనట్లుంటున్నారు. కఠిన చర్యలు శూన్యం పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రాలు వాట్సప్‌లలో ప్రత్యక్షమవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రాలను ముందుగానే బయటకు తెచ్చి, ఫోన్లలో వాట్సాప్‌ల ద్వారా తమ విద్యార్థులకు పంపించి, పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నా విద్యాశాఖ కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. అప్పుడప్పుడు మొక్కుబడిగా ఆయా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలు చేపట్టకపోవడంతో లీకేజీ ఆగడాలకు బ్రేకులు పడడం లేదు. పరీక్షా కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్లను నిషేధించామని అధికారులు చెబుతున్నారు. అయితే, నిత్యం పరీక్షకు ముందుగానే ఈ ఫోన్లలోనే ప్రశ్నపత్రాలు çబయటకు వస్తున్నాయి. సమాధానాలు వాట్సాప్‌ల ద్వారా పరీక్ష కేంద్రాల్లో ఎంపిక చేసిన కొందరు విద్యార్థులకు చేరుతున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు ఈ లీకేజీలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు. ప్రశ్నపత్రాల లీక్ నిజమే: పరీక్షల విభాగం డైరెక్టర్ పదో తరగతి ప్రశ్నపత్రాలు బయటకు వస్తున్న మాట నిజమేనని, వీటిపై విచారణ జరుగుతోందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ భార్గవ చెప్పారు. నెల్లూరు నారాయణ హైస్కూల్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై ఇంకా తమకు పూర్తి నివేదిక రావాల్సి ఉందన్నారు. ‘నారాయణ’లో లీక్‌లపై ఫిర్యాదులు.. సస్పెన్షన్లు.. నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకుపై నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని నారాయణ హైస్కూల్లో ఫిజిక్స్ ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నారాయణ స్కూల్లో జరుగుతున్న పరీక్షల్లో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. మహేష్ ఈదూరు హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అక్కడి చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిపార్ట్మెంటల్ అధికారి ముంతాజ్ తెహజాలను పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఫిజిక్స్ పేపర్ లీకుపై నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం సైబర్ క్రైం కింద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రశ్నపత్రం లీకైన పాఠశాల మంత్రి నారాయణకు చెందినది కావడంతో ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారా? లేక తూతూమంత్రంగా ముగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.