
సాక్షి, అనంతపురం: మంత్రి నారాయణ విద్యా సంస్థ నారాయణ స్కూల్‌లో చోటుచేసుకున్న ఓ విద్యార్థి మరణం, తీవ్రస్థాయిలో దుమారం రేపుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన సాయిచరణ్ నాయక్ అనే విద్యార్థి తిరుపతి నారాయణ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం పాఠశాలలో శవమై కనిపించాడు. పోలీసు కానిస్టేబుల్ మోహన్ కృష్ణ, సాలెమ్మల ఒక్కగానొక్క కొడుకు సాయి చరణ్. కొడుకు మరణంతో కుంగిపోయింది. ఇప్పటికీ ఆకుటుంబం కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
అయితే స్కూల్ యాజమాన్యమే తమ కుమారుడిని చంపేశారని చరణ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈకేసుకు సంభంధించిన విచారణ తూతూ మంత్రంగా సాగుతోందంటూ ఇప్పటిదాకా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి మరణానికి మంత్రి నారాయణ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను కొట్టి చంపుతూ, ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ విద్యాసంస్థలను మూసేయాలని సాయి చరణ్ తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment