నిబంధనలకు విరుద్ధం!..జుట్టు కత్తిరించిన ప్రిన్స్‌పాల్‌ | Principal Cuts Students Hair At Maharashtra | Sakshi
Sakshi News home page

నిబంధనలకు విరుద్ధం!..జుట్టు కత్తిరించిన ప్రిన్స్‌పాల్‌

Published Tue, Dec 21 2021 9:30 PM | Last Updated on Tue, Dec 21 2021 9:49 PM

Principal Cuts Students Hair At Maharashtra   - Sakshi

Principal Cuts Students Hair: ఇంతవరకు మనం పిల్లలు మాట వినకపోతే అ‍త్యంత దారుణంగా పిల్లలను కొట్టడం వంటి వాటి గురించి విన్నాం. అంతెందుకు కొంతమంది టీచర్లు పిల్లలను సరిగా చదవడం లేదంటూ వేరే విద్యార్థులతో పోలుస్తూ తిట్టడం వంటి ఘటనలు చూశాం. కానీ ఇక్కడొక ప్రిన్స్‌పాల్‌ నిబంధనలకు విరుద్ధం అంటూ ఎంత పని చేశాడో చూడండి.

(చదవండి:  వృక్షాన్ని వివాహం చేసుకున్న మహిళ!...ఎందుకో తెలుసా!!)

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ చాలా మంది విద్యార్థులకు జుట్టు పెంచవద్దు  అని పదేపదే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో వారికి హెయిర్‌ కట్‌ చేయించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు పొడవాటి జుట్టుతో తరగతులకు వస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని మీడియాకి తెలిపారు. అయితే ఈ ఘటన పై పలువురుతల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్స్‌పాల్‌ చర్యను ఖండించారు.

(చదవండి: ప్రధాని ఫోటో తొలగించాలంటూ పిటిషన్‌.. లక్ష జరిమానా వేసిన హైకోర్టు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement