hair cutting
-
విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై విచారణ
జి.మాడుగుల: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అసెంబ్లీకి సమయానికి రాలేదని ఇంటర్ సెకండియర్‌కు చెందిన 18 మంది విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై సోమవారం అధికారులు విచారణ చేపట్టారు. డీఈవో బ్రహ్మాజీరావు, కేజీబీవీ జీసీడీవో కె.సూర్యకుమారి సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం జీఎం కొత్తూరులోని కేజీబీవీకి వచ్చి విద్యార్థినులను విచారించారు. కార్తీక పౌర్ణమి కావడంతో శుక్రవారం పూజలకు వెళ్లి అసెంబ్లీకి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ప్రత్యేక అధికారి(ఎస్వో) సాయిప్రసన్న తమను కొట్టి.. జత్తు కత్తిరించారని విద్యార్థినులు వాపోయారు. దేవుని మొక్కు ఉందని చెప్పినా వినలేదని చెప్పారు. ఎస్వో ప్రవర్తనపై విద్యార్థినుల నుంచి అధికారులు లిఖితపూర్వకంగా వివరాలను నమోదు చేసుకున్నారు. ఎస్వో సాయిప్రసన్న మాట్లాడుతూ.. క్రమశిక్షణలో భాగంగా విద్యార్థినుల జుత్తు కత్తిరించానని.. చేసింది తప్పేనని.. తనను క్షమించాలని కోరింది. చిన్నచిన్న తప్పులకు ఇంత దారుణంగా దండిస్తారా? అంటూ ఎస్వో సాయిప్రసన్నపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవో బ్రహ్మాజీరావు మాట్లాడుతూ.. నివేదికను ఉన్నతాధికారులకు అందించి.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదికను తమకు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు, సభ్యుడు గొండు సీతారాం చెప్పారు. నివేదిక ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.ఎస్వోను బ్లాక్మెయిల్ చేసిన టీడీపీ నేతఈ ఘటన బయటకు రాకుండా చూసుకుంటానని.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, విద్యార్థినుల తల్లిదండ్రులకు ఇచ్చేందుకు రూ.లక్ష కావాలంటూ వంజంగిపాటుకి చెందిన టీడీపీ నేత లకే రామకృష్ణ ఎస్వోను బ్లాక్మెయిల్ చేశాడు. తమ పేర్లు వాడినందుకు రామకృష్ణపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పిల్లలకు క్లాస్ రూంలో పిచ్చిగ కటింగ్ చేసిన టీచర్
-
బీఆర్ఎస్ సర్కార్ ధోబీ ఘాట్లకు కరెంటు బిల్లులు చెల్లించలేదు
సాక్షి, హైదరాబాద్: లాండ్రీలు, ధోబీఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిందని, అందుకయ్యే వ్యయాన్ని మాత్రం డిస్కంలకు చెల్లించలేదని మంత్రి పేర్కొన్నారు. అయితే బకాయిల పేరిట విద్యుత్ కనెక్షన్ తొలగించొద్దని డిస్కంలకు మంత్రి సూచించారు. ఈ విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరుతామన్నారు. ఈ ఏడాది జనవరి మూడోతేదీ వరకు వాషర్‌మె న్లో లబ్ధిదారులు 76,060 మంది కాగా, బకాయిలు రూ.78.55 కోట్లు అని, నాయీ బ్రాహ్మణ లబ్ధిదారులు 36,526 మంది కాగా, బకాయిలు రూ.12.34 కోట్లు ఉన్నాయన్నారు. -
ఇచ్చట తల వెంట్రుకలు ఖండించబడును
సొంతంగా హెయిర్ కటింగ్ చేసుకోవాలనుకోవడం తేలికేగానీ, ్ర΄ాక్టికల్ విషయానికి వస్తేగానీ కష్టమేమిటో తెలియదు. బోలెడు ఓపిక ఉండాలి. దానికి నైపుణ్యం తోడు కావాలి. ‘ఇదంతా ఎందుకండీ... నా రోబోను చూడండి’ అంటున్నాడు షేన్ వైటన్. అమెరికన్ ఇంజినీర్ షేన్ వైటన్ హెయిర్ కట్ చేసే రోబోను తయారు చేశాడు. రోబో ఒక కుర్రాడికి హెయిర్ కట్ చేసే వీడియోను ‘గెట్టింగ్ ఏ రోబో టు కట్ యువర్ హెయిర్’ కాప్షన్‌తో తన యూ ట్యూబ్ చానల్లో ΄ోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. ‘వీడియోను జాగ్రత్తగా గమనిస్తే అతడి కళ్లలో అంతులేని భయం కనిపిస్తుంది. అంతవసరమంటారా?’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. -
కార్పొరేట్ కత్తిరింపు మొదలైతే... వారి అస్తిత్వానికి ముప్పు!
పారిశ్రామికీకరణ కర్కశ పాదాల కింద ఎన్నో చేతివృత్తులు నలిగి పోయాయి. ఇంతకాలం మైల పనిగా భావించిన వృత్తుల్లో సైతం ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో సాంప్రదాయిక మంగలి (నాయీ బ్రాహ్మణ) వృత్తిపై కార్పొరేట్ కన్ను పడింది. కేశాలంకరణకు, రూప సౌందర్యానికి ఎంతైనా ఖర్చుపెట్టేవాళ్లు పెరుగుతున్న క్రమంలో వారి అవసరాలు తీర్చే రీతిలో కులవృత్తి మంగళ్ళు ఎదిగివచ్చే పరిస్థితులు లేవు. దీన్ని కార్పొరేట్లు చేజిక్కించుకొని, క్షుర కర్మ ఒక కుల వృత్తి అనే ముద్రని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం 45 శాతం కస్టమర్లు మాములు కటింగ్ చేయించుకోగా మిగతావారు చూడచక్కగా కనబడేందుకు సెలూన్లకు వస్తున్నారు. ఐదేళ్లలో ఈ ఫ్యాషన్ కస్టమర్ల సంఖ్య 60 శాతం పెరిగిందట. 2014లో రిలయన్స్ రిటైల్ తరపున హెయిర్ కటింగ్ షాపులు ఆరంభిస్తామన్న ప్రకటన రాగానే క్షురకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆ ప్రతిపాదన వెనక్కి పోయింది. ఈ నవంబర్ మొదటివారంలో మరో వార్త వచ్చింది. నేచురల్స్ స్పా సంస్థలో 49 శాతం భాగస్వామ్యాన్ని కొనుగోలుకు ముకేశ్ అంబానీ సిద్ధపడినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన నేచురల్స్‌కి దేశంలోని ప్రముఖ నగరాల్లో 700 పైగా సెలూన్లు ఉన్నాయి. 2025 నాటికి ఆ సంఖ్యను 3,000కి పెంచాలనే ఆలోచనతో ముకేశ్ పావులు కదుపుతున్నారని వార్త. ఆయన సొంత సొమ్ముతో కొన్ని దుకాణాలు తెరిచినా కొంత కాలం తర్వాత ఫ్రాంచైజీ విధానాన్ని మొదలు పెడతారు. బ్రాండ్ పేరు కస్టమర్లలో చొచ్చుకు పోయాక ఆ పేరుతో షాపు తెరిచేందుకు వచ్చినవారి నుండి డిపాజిట్లు వసూలు చేసి రోజువారీ వ్యాపారంలో కమిషన్ తీసుకుంటారు. సొంత షాపుల బేరాలు దెబ్బ తింటే మంగలి కులంవారు ఈ సెలూన్లలో పనికి కుదరక తప్పదు. వారు తమ అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు తమ వృత్తిలోనే కూలీలుగా మారే దుఃస్థితి వస్తుంది. అందుకే కార్పొరేట్లు ఈ వ్యాపారంలోకి రాకుండా ప్రభుత్వాలు అడ్డుకోవాలని నాయీబ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయి. (క్లిక్ చేయండి: ఆ వృత్తిని మాకు మాత్రమే పరిమితం చేయాలి) – బి. నర్సన్, రచయిత 94401 28169 -
స్టూడెంట్స్‌కి డిప్ప కటింగ్ కొట్టించిన ప్రిన్సిపల్
-
విద్యార్థులకు ఫ్రీ హెయిర్ కటింగ్ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే!
తిరువళ్లూరు(చెన్నై): విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచేందుకు గాను.. ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలోనే విద్యార్థులకు ఉచితంగా హెయిర్ కటింగ్ చేయించారు. తిరువళ్లూరు జిల్లా తిరువూర్‌లో ప్రభుత్వ మోడల్ పాఠశాల ఉంది. ఇక్కడ 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే పాఠశాలకు వచ్చే బాలురల్లో ఎక్కువ మంది స్టైయిల్ కటింగ్‌తో వస్తున్నట్టు ఉపాధ్యాయులు గుర్తించారు. జుట్టు ఎక్కువగా పెంచుకోవడం, వన్‌సైడ్ కటింగ్, పంక్ కటింగ్ పేరుతో తరగతులకు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ లేదనే భావన స్థానిక ప్రజల్లో ఏర్పడినట్లు తెలుస్తుంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు విద్యార్థుల ప్రవర్తన సైతం ఇబ్బందికరంగా మారింది. దీంల్ స్టైయిల్ కటింగ్ చేసుకున్న100 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠశాలలోనే సాధారణ కటింగ్ చేయించారు. టీచర్లను పలువురు స్థానికులు అభినందించారు. ఇది ఇలా ఉండగా విద్యార్థులకు స్టైయిల్ హెయిర్ కటింగ్‌లు చేయవద్దని కోరుతూ సెలూన్ నిర్వాహకులకు సైతం ఉపాధ్యాయులు కరపత్రాలను పంపిణీ చేయడం గమనార్హం. చదవండి: సున్నం కొడుతుంటే రహస్య గది కనిపించింది.. అందులోకి వెళ్లి చూడగా.. -
@ హెయిర్ బై సీమ
కట్టుబాట్లు, హద్దులు ఎన్ని ఉన్నా.. అన్నింటిని చెరిపేసి అనేక రంగాల్లో తమదైన ముద్రవేస్తున్న మహిళలెందరినో చూస్తున్నాం. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తమలోని ప్రతిభతో వెలుగులోకి వచ్చి ప్రపంచానికి తామేంటో నిరూపిస్తూ ఎంత మందికి ఉదాహరణగా నిలుస్తున్నారు మరికొందరు. ఈ కోవకు చెందిన వారే సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ సీమా మనే. షోలాపూర్‌లోని బర్షీలో పుట్టింది సీమా మనే. చిన్నతనంలో అనేక కష్టాలను చూస్తూ ఆశ్రమంలో పెరిగిన సీమ.. తొమ్మిదో తరగతి అయిన తరువాత చదువు మానేసింది. ఆశ్రమంలోనే హెల్త్ సెంటర్లో పనికి చేరింది. తర్వాత కొన్నేళ్లకు పెళ్లి కుదిరింది సీమకు. వివాహం తరువాత భర్త అండతో తన కష్టాలు కాస్త కుదుటపడ్డాయి. దీంతో ఐదేళ్ల తరువాత భర్త ప్రోత్సాహంతో తనకెంతో ఇష్టమైన హెయిర్ కటింగ్ కోర్సు చేయాలనుకుంది. భర్త సహకారం అందించడంతో పదోతరగతి చదువుతూనే హెయిర్ కటింగ్‌లో డిప్లొమా చేసింది. కోర్సు పూర్తయ్యాక ఇంట్లోనే ఒక సెలూన్ ఏర్పాటు చేసుకుంది. అలా రెండేళ్లపాటు సెలూన్ నిర్వహించిన తరువాత సీమకు ఓ ఫ్యాషన్ షోలో హెయిర్ స్టైలిస్ట్‌గా అవకాశం వచ్చింది. తక్కువ సమయంలో వెరైటీ, మోడ్రన్ హెయిర్ స్టైల్స్‌తో మోడల్స్‌ను తీర్చిదిద్దడంతో ఈ ఫ్యాషన్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. దీంతో సీమకు మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతో ‘ఎట్ ది రేట్ హెయిర్బై సీమ’ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ను ప్రారంభించింది. ఈ అకౌంట్లో సరికొత్త హెయిర్ స్టైల్స్‌ను పోస్టు చేస్తుండేది. ఈ హెయిర్ స్టైల్స్ నచ్చడంలో గ్లామర్ ప్రపంచంలో సీమ బాగా పాపులర్ అయ్యింది. దీంతో సినిమాలు, ఫ్యాషన్ షోలు, ఫోటోషూట్స్‌లో పనిచేయడానికి అవకాశాలు వచ్చేవి. వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ప్రతిభతో సరికొత్త హెయిర్‌స్టైల్స్‌ను రూపొందించి తానేంటో నిరూపించింది. దీంతో సెలబ్రిటీల దృష్టిలో పడింది సీమ. ఒక్కోమెట్టు ఎక్కుతూ... అంతర్జాతీయంగానూ సీమ హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేసిన సెలబ్రెటీలలో మాధురీ దీక్షిత్, అలియా భట్, తాప్సీ పన్ను, కియరా అడ్వాణి, బిపాషా బసు, కత్రినా కైఫ్, అంబాని కుటుంబానికి చెందిన విభూతి ఉన్నారు. అంతర్జాతీయ వెబ్ సిరీస్ ‘ఏ సూటబుల్‌బాయ్’ లో టబుకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేసింది. ‘ఘాజీ’ సినిమాలో తాప్సీకి, నామ్ షబాన, లక్ష్మీబాంబ్, సూర్మ, మన్ మర్జియా, జుడ్వా–2 సినిమాలకు పనిచేసింది. కళంక్, గుడ్‌న్యూస్, ఎంఎస్ ధోణి, కబీర్ సింగ్ సినిమాల్లో కియరా అడ్వాణికి హెయిర్ స్టైల్స్ చేసింది. తెలుగు సినిమా బాద్షాలో కాజల్ అగర్వాల్‌కు మోడ్రన్ హెయిర్ స్టైల్స్‌ను అందించింది. ఒక్క ఇండియాలోనేగాక అంతర్జాతీయ స్థాయిలోనూ సీమకు మంచి గుర్తింపు లభించింది. 2016లో ఓ పెళ్లిలో హెయిర్‌స్టైల్స్ చేయడానికి ఇటలీ వెళ్లగా, ఆ ఏడాది విడుదలైన ‘ద వోగ్ వెడ్డింగ్ బుక్’లో సీమ పేరు ప్రస్తావించారు. చేసే పనిలో నిజాయితీ ఉండాలి ‘‘నిజాయితీగా పనిచేస్తే ఫలితం మనకు వందశాతం అనుకూలంగా వస్తుందని అమ్మ చెప్పేవారు. ఎన్ని సమస్యలు ఉన్నా నిబద్ధతతో పని చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. తాప్సీ, కియరా లాంటి సెలబ్రెటీల సాయంతో బాలీవుడ్లో నాకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోగలిగాను. ప్రస్తుతం ప్రారంభించబోయే హెయిర్ అకాడమీ, స్టూడియోల ద్వారా నాలా మరికొంతమందిని ఇండస్ట్రీకి అందించడమే నా లక్ష్యం’’ అని చెబుతోంది సీమ. మనలో కష్టపడే తత్వం, ప్రతిభ ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చనడానికి సీమ జీవితమే నిదర్శనం. -
నిబంధనలకు విరుద్ధం!..జుట్టు కత్తిరించిన ప్రిన్స్‌పాల్
Principal Cuts Students Hair: ఇంతవరకు మనం పిల్లలు మాట వినకపోతే అత్యంత దారుణంగా పిల్లలను కొట్టడం వంటి వాటి గురించి విన్నాం. అంతెందుకు కొంతమంది టీచర్లు పిల్లలను సరిగా చదవడం లేదంటూ వేరే విద్యార్థులతో పోలుస్తూ తిట్టడం వంటి ఘటనలు చూశాం. కానీ ఇక్కడొక ప్రిన్స్‌పాల్ నిబంధనలకు విరుద్ధం అంటూ ఎంత పని చేశాడో చూడండి. (చదవండి: వృక్షాన్ని వివాహం చేసుకున్న మహిళ!...ఎందుకో తెలుసా!!) మహారాష్ట్రలోని పాల్ఘర్లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ చాలా మంది విద్యార్థులకు జుట్టు పెంచవద్దు అని పదేపదే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో వారికి హెయిర్ కట్ చేయించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు పొడవాటి జుట్టుతో తరగతులకు వస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని మీడియాకి తెలిపారు. అయితే ఈ ఘటన పై పలువురుతల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్స్‌పాల్ చర్యను ఖండించారు. (చదవండి: ప్రధాని ఫోటో తొలగించాలంటూ పిటిషన్.. లక్ష జరిమానా వేసిన హైకోర్టు!) -
డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చిన మినిస్టర్
మధ్యప్రదేశ్ ఖండ్వా జిల్లాలోని గులైమల్లో ఉంటాడు రోహీదాస్. లోకల్ కుర్రాడు. చేతిలో పనుంది. చేతికి పని లేదు. హెయిర్ కటింగ్ అతడికి తెలిసిన విద్య. ఎక్కడో పని చేస్తూ కరోనా వల్ల ఆ సెలూన్ మూత పడటంతో తను రోడ్డున పడ్డాడు. సొంతంగా షాప్ పెట్టుకోడానికి కత్తెర్లు క్రీముల వరకు కొనగలడు కానీ, పి.పి.ఇ. సరంజామా కష్టం. అవి లేందే ఎవరూ ధైర్యం చేసి రావడం లేదు. చూసి చూసి తనే ధైర్యం చేశాడు. నేరుగా మంత్రి గారిని కలిశాడు. అడవుల శాఖ మంత్రి ఆయన. పేరు విజయ్ షా. గులైమల్లో చిన్న కార్యక్రమానికి వస్తే అక్కడికి వెళ్లి ఆయనకు తన పరిస్థితి చెప్పుకున్నాడు రోహీదాస్. ‘సరే నేను స్టేజి మీద ఉంటాను. నువ్వెళ్లి నీ కటింగ్ కిట్ తెచ్చుకో..’ అన్నారు మంత్రిగారు. రోహీదాస్కి అర్ధం అయిపోయింది. మంత్రిగారు కటింగ్ చేయించుకుని చేతికొచ్చినంత చేతిలో పెట్టి వెళ్లిపోతారని. వెళ్లి టూల్ బాక్స్ తెచ్చుకున్నాడు. మంత్రిగారు స్టేజ్ పైకి రమ్మన్నారు. వెళ్లాడు. కటింగ్ చెయ్యమన్నారు. చేశాడు. షేవింగ్ కూడా అన్నారు. అదీ చేశాడు. ఎలా చేసిందీ అద్దంలో చూపించాడు. ‘బాగా చేశావోయ్’ అన్నారు మంత్రిగారు. రోహీదాస్ ఊహించినట్లే చేతికి అందినంతా ఇచ్చి స్టేజ్ దిగి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ భుజం తట్టారు. ఆయన దాటి పోయాక, గుప్పెట తెరిచి చూసుకున్నాడు రోహీదాస్. అన్నీ రెండువేల నోట్లు! లెక్కపెట్టుకున్నాడు. 30 ఉన్నాయి. అరవై వేల రూపాయలు!! అంతకన్నా పెద్ద అమౌంట్ మంత్రిగారు భుజం తట్టడం. డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చి వెళ్లారు విజయ్ షా. -
ఇవేం కష్టాలు.. భగవంతుడా..!
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి మొక్కుబడులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేవస్థానం కేశఖండనశాలను మూసివేయడంతో, ప్రస్తుతం చుట్టుపక్కల క్షురకులు, దళారుల దందా ఎక్కువైంది. ఏదో ఒక మూల మొక్కులు సమర్పిస్తే సరిపోతుందని భావిస్తున్న భక్తులను వారు దోచుకుతింటున్నారు. అంతే కాకుండా స్వామివారికి చెందాల్సిన తలనీలాలను వ్యర్థాలపాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పెద్ద ఎత్తున యాత్రికులకు సత్తెన్నగూడెం, వెంకటకృష్ణాపురానికి వెళ్లే మార్గాల్లోని తోటలు, ముళ్ల పొదల్లో క్షురకులు గుండ్లు గీశారు. అలాగే సుద్ద గనుల్లో సైతం గుండ్లు గీసి, ఒక్కో భక్తుడి నుంచి రూ.500 వసూలు చేశారు. ఇదిలా ఉంటే స్థానిక నాయీ బ్రాహ్మణులు గుండ్లు గీస్తున్న పలువురు క్షురకులను పట్టుకుని, తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమయంలో సగం గీసిన గుండ్లతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. మిగిలిన సగం గుండ్లను వేరే క్షురకులతో గీయించుకుని, వారికి పెద్ద మొత్తంలో సొమ్ములు సమర్పించుకున్నారు. ఈ కష్టాలేమిట్రా భగవంతుడా.. అంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇళ్ల వద్దే యాత్రికులు తలనీలాలను తీయించుకుని, ముడుపులు కట్టి తమకు అందించాలని దేవస్థానం అధికారులు నిత్యం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా భక్తులు వాటిని లెక్కచేయకుండా క్షేత్రానికి వచ్చి అష్టకష్టాలు పడుతున్నారు. -
నాయి బ్రాహ్మణులకు మంత్రి హరీశ్ సూచనలు
సాక్షి, మెదక్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జిల్లా కేంద్రంలో సోమవారం పర్యటించారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన పండ్లు అందించారు. దాంతోపాటు నాయి బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయన వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణ కులస్తులకు మంత్రి సలహాలు, సూచనలు ఇచ్చారు. హెయిర్ కటింగ్ చేసేటప్పుడు శానిటేషన్ చేయడం తప్పకుండా అలవాటు చేసుకోవాలని చెప్పారు. కటింగ్‌కు ముందు, తర్వాత కటింగ్ చేయించుకునే వ్యక్తి, చేసే వ్యక్తి డెటాల్ లేదా శానిటైజర్ వాడాలని సూచించారు. కటింగ్ పూర్తయిన తర్వాత కూడా శానిటేషన్ చేసుకోవాలని అన్నారు. మనం బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుటుందన్నారు. ప్రజల బాగుకోసం అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గడం శుభసూచకమన్నారు. నాయి బ్రాహ్మణులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. -
ఆనంద్ మహీంద్ర లుంగీ గిఫ్ట్..
-
జుట్టు తీయించిదనే మనస్తాపంతో బాలుడు..
చెన్నై: పండగ సెలవులకు విద్యార్థులు ఇంటికి వెళ్లితే.. సరిగా తినటం లేదా? ఏంటి ఇంత చిక్కిపోయావని తల్లిదండ్రులు అంటారు. అదేవిధంగా ఏంటి ఆ జుట్టు.. కట్టింగ్ చేసుకోలేకపోయావా? అని ప్రతి తల్లి తమ పిల్లలను ప్రశ్నిస్తుందన్న విషయం తెలిసిందే. మోహన అనే ఓ తల్లి సంక్రాంత్రి సెలవులకు ఇంటికి వచ్చిన తన కొడుకు భారీ జుట్టును చూసి కట్టింగ్ చేసుకోమ్మని కోరింది. దీనిపై తల్లీకొడుకు ఇద్దరూ వాదులడుకున్నారు. అయితే ఆదివారం తల్లి మోహన తన కొడుకును బలవంతంగా కట్టింగ్ షాప్‌కి తీసుకువెళ్లి మరీ అతని జుట్టును తీయించారు. దాంతో కట్టింగ్ చేసుకోవటం వల్ల భారీ జుట్టు కాస్త చిన్నగా మారిపోయిందని ఆ యువకుడు తీవ్ర మనస్తాపంతో ఉరి వేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం రాత్రి ఇంటికి వచ్చిన తల్లి మోహనకు తన కొడుకు విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటన చెన్నైలోని కుంద్రతూర్లో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మృతిపై పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఎత్తిపొడుపులకు కత్తెర
మగవాళ్ల హెయిర్ కటింగ్‌కి బ్రాండ్ ఇమేజ్‌గా నిలిచిన ఒక మహిళ సక్సెస్ స్టోరీ ఇది. అయితే ఈ స్టోరీ వెనుక ఆమె సక్సెస్ కన్నా, స్ట్రగులే ఎక్కువగా ఉంది. సక్సెస్, స్ట్రగుల్‌తో పాటు.. కులమతాలకు అతీతంగా.. బంధుత్వంగా మారిన స్నేహబంధమూ ఉంది. తిరుచ్చిలోని సర్కార్ పాలయంకు చెందిన పెట్రీషియా మేరి తండ్రి, ఆమె మామగారు బాల్య స్నేహితులు. పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఆ స్నేహం.. బంధుత్వం అయింది. మేరి అత్తమామలు హిందువులు. మేరీతో పెళ్లికి తమ కుమారుడు రూబన్ షణ్మగనాథన్ను క్రైస్తవమతంలోకి మార్చి మేరీతో వివాహం జరిపించారు. రూబన్ షణ్ముగనాథన్ తన తండ్రి నడిపే వేంబులి సెలూన్ షాపులో పనిచేసేవాడు. వివాహం తర్వాత, తిరుచ్చి చింతామణిలోని బజారు వీధిలో ఉన్న ఆ వేంబులి సెలూన్‌ను 2008 నుండి రూబన్నే నడిపేవాడు. టైలరింగ్ తెలిసిన మేరి సెలూన్ షాపులోనే ఓ పక్కనే మిషన్ పెట్టుకుని బట్టలు కుట్టేవారు. ఖాళీ సమయాల్లో భర్తకు సాయంగా కలర్ డై కలపటం, చిన్నపిల్లలకు చిన్న చిన్న కటింగ్స్ చేసేవారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. రూబన్ కటింగ్ సెలూన్, మేరి కుట్టు మిషన్.. వీటితో కుటుంబం సాఫీగా సాగేది. ఈ క్రమంలో 2014లో రూబన్కు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై దాదాపు తొమ్మిది నెలలు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. మధ్య తరగతి కుటుంబాలలో కుటుంబ యజమాని మంచాన పడితే జరిగేదే మేరి విషయంలోనూ జరిగింది. ఇద్దరు పిల్లల పోషణ, భర్త ఆస్పత్రి ఖర్చులు ఒక్కసారి మేరీని తీవ్రస్థాయిలో కష్టాల్లోకి నెట్టాయి. కుట్టుమిషన్ ఒక్కటే ఆమెకు చేయూతనిఇవ్వలేకపోయింది. వేరే పనులు తెలియవు. ఆ సమయంలో భర్త నడిపే సెలూన్ షాప్ కళ్లముందు కనిపించింది. తెలిసిన ఆ కాస్తంత విద్యను అలవాటు చేసుకుంటే అదే జీవనధారాన్ని ఇస్తుందని నమ్మారు మేరీ. అందుకే సెలూన్ షాపును తానే నడిపాలని నిర్ణయించుకుని తండ్రిని తోడుగా తీసుకుని, షాపులో సాయంగా పెట్టుకుని కటింగ్ వృత్తిని స్వీకరించారు. అయితే బజారు వీధిలోని పురుషులకు ఆమె అలా చేయడం నచ్చలేదు. ఆడమనిషి సెలూన్ షాప్‌ను నడపటానికి వీలులేదు అని ఆక్షేపించారు. ఆమె వారిని పట్టించుకోలేదు. తన వద్దకు వచ్చే వారికి కటింగ్, షేవింగ్ చేస్తూ వచ్చారు. మధ్యలో స్థానికులు పెట్టే ఇబ్బందులు, సూటిపోటీ మాటలు ఆమె మనో ధైర్యాన్ని చెరిపేయలేక పోయాయి. అదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త రూబన్ మృతి చెందటం ఆమె కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆమె నిబ్బరం కాస్త సడలింది. అయినా ఎదుగుతున్న పిల్లలను చూసి మళ్లీ ధైర్యం కూడగట్టుకున్నారు మేరీ. తిరిగి సెలూన్ వెళ్లటం మొదలు పెట్టారు. ఆడవాళ్లు కటింగ్ ఏమిటీ, అసలు మా మధ్య ఆడమనిషి నడిపే ఈ సెలూన్ ఏమిటి అని మళ్లీ ఒత్తిళ్లు మొదలయ్యాయి. అయినా మేరి గట్టిగా నిలబడ్డారు. నేనెందుకు చేయకూడదు అని ప్రశ్నించారు. నా భర్త వృత్తిని కొనసాగించి తీరుతా అని స్పష్టం చేశారు. ఆ మాటపైనే సెలూన్ నడపటం మొదలు పెట్టారు. ఆరంభంలో ఈ ఒడిదుడుకులు ఎన్నున్నా.. ఇప్పుడు మాత్రం హెయిర్ డ్రెస్సింగ్ లో పెట్రిసియా మేరి ఓ బ్రాండ్ గా మారారు. ‘నువ్వు ఈ పని ఎన్నాళ్లో చెయ్యలేవు’ అని ఆ వీధిలో సవాళ్లు విసిరిన వాళ్లు సైతం ఇప్పుడు ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. ‘‘కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ తో మేరి అక్క మా స్టెయిల్‌కి బ్రాండ్ అయిం ది’’ అని అక్కడి యువత చెప్పుకుంటున్నారు. ఆ మాట నిజం. ఎక్కడ కోల్పోయానో అక్కడే సాధించి తీరుతా అని జీవితానికి ఎదురీదిన మేరి ఇప్పుడు తిరుచ్చి హెయిర్ స్టెయిల్కు ఒక ఇమేజ్ తెచ్చిపెట్టారు. అంతేకాదు, పెట్రిసియా మేరి ఇప్పుడు తిరుచ్చిలో చాలా మంది మహిళలకు మార్గదర్శి! సంజయ్ గుండ్ల, సాక్షి టీవీ, చెన్నై బ్యూరో -
నాన్నకు వారసులు
దీపక్, రాజు అని పేర్లు మార్చుకుని, మగవాళ్లలా హెయిర్ కట్ చేసుకుని, ప్యాంటు షర్ట్ వేసుకుని జ్యోతి, నేహ చేస్తున్న జీవిత పోరాటం అసాధారణం మాత్రమే కాదు.. సాహసవంతమైన జీవన విన్యాసం కూడా! అమ్మానాన్న, ఇద్దరమ్మాయిలు. ‘పదిలంగా అల్లుకొన్న పొదరిల్లు మాది’.. అన్నట్లే వాళ్లది ముచ్చటైన కుటుంబం. ఆ ముచ్చట అలాగే కొనసాగితే ఆ ఇద్దరు అమ్మాయిలు అందరు అమ్మాయిల్లాగే ఉండేవాళ్లు.అబ్బాయిలుగా వారే వాళ్లే కాదు. ‘మారడం’ అంటే.. అబ్బాయిలుగా నటించాల్సి రావడం. ఆ నటన కూడా వెండి తెర మీదో, రంగస్థలం మీదో కాదు, నిత్య జీవితంలో! తెర మీద నటిస్తే చప్పట్లు కొడతారు. హర్షిస్తారు. నిజ జీవితంలో నటిస్తే అవేం ఉండవు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. జీవితంలో నటించక తప్పని ఆ ఇద్దరు అమ్మాయిల్ని సమాజం గౌరవించింది. ప్రభుత్వం కూడా వాళ్లను సత్కరించింది. ఆ గౌరవాన్ని, ఆ సత్కారాన్ని అందుకున్న అమ్మాయిలే జ్యోతికుమారి, నేహ. షాపు తెరిచారు.. వేషం మార్చారు జ్యోతి కుమారి వయసు 18, నేహకు పదహారేళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నగరానికి దగ్గరగా ఉన్న భన్వారీతోలి వాళ్లుండే గ్రామం. వాళ్ల నాన్న ధృవ నారాయణ. సెలూన్ నడిపేవాడు. నాలుగేళ్ల కిందటి వరకు ఆయన సెలూన్ నడుపుతూనే ఇంటిని పోషించాడు. పిల్లలిద్దరినీ చదివించాడు. 2014లో ఉన్నట్లుండి అనారోగ్యం పాలయ్యాడు. మంచం మీద నుంచి లేచి సెలూన్‌కు రావడానికి కూడా వీల్లేని పరిస్థితి.సెలూన్ మూతపడింది. అతడు మంచాన పడటంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. ఇల్లు జరగాలంటే సెలూన్ తెరవాలి. తెరిచినా సెలూన్లో పని ఎవరు చేయాలి? ఇంట్లో ఒక్క మగపిల్లాడు కూడా లేడు. ధృవ నారాయణ భార్యకు భర్తను చూసుకోవడంతోనే సరిపోతోంది. పైగా సెలూన్ అన్నది ఆడపిల్లలు చేసే పని కాదు. మరి.. ఇల్లు గడవాలంటే, ఆ ఇద్దరే ఏదో ఒక పని చేయాలి. వేరే మార్గం లేదు. బాగా ఆలోచించాక ఓ రోజు.. అక్కాచెల్లెళ్లిద్దరూ వెళ్లి సెలూన్ తలుపులు తెరిచి శుభ్రం చేశారు. నాన్న పని చేసేటప్పుడు చూసిన అనుభవం తప్ప స్వయంగా చేసిన అనుభవం లేదు. ‘సవ్యంగా చేస్తారా ఈ ఆడపిల్లలు’ అని సెలూన్‌కి వచ్చే మగవాళ్లకు భయం. ‘‘జాగ్రత్తగా చేస్తాం’’ అని బతిమిలాడి వచ్చిన వాళ్లకు హెయిర్‌కటింగ్‌లు, షేవింగ్‌లు చేశారు. ‘ఫర్వాలేదు, పిల్లలకు పని సులువుగానే పట్టుపడింది’ అనుకున్న పెద్దవాళ్లు భరోసాగా వీళ్ల సెలూన్‌కు రావడం మొదలు పెట్టారు. కొత్త వాళ్లు సెలూన్ వరకు వచ్చి అమ్మాయిలను చూసి వెనుదిరిగి వెళుతున్నారు. వెళ్లేవాళ్లు వెళ్లిపోతుంటే, ‘ఈ సెలూన్లో అయితే అమ్మాయిలు షేవ్ చేస్తార్రా’ అని వచ్చే పోకిరీ కుర్రాళ్లతో వాళ్లకు కష్టాలొచ్చిపడ్డాయి. హెయిర్ కటింగ్ చేసేటప్పుడు, షేవ్ చేసేటప్పుడు ఆకతాయిలు వెకిలి వేషాలు వేసేవాళ్లు. అప్పుడు తీసుకున్నారా అమ్మాయిలు ఓ నిర్ణయం. సెలూన్‌కి వచ్చిన వాళ్ల హెయిర్ కట్ చేయడం కాదు, ముందు తమ హెయిర్ కట్ చేసుకోవాలని. ఒకరికొకరు హెయిర్ కట్ చేసుకుని, జీన్స్, టీ షర్టులు వేసుకున్నారు. రాజు, దీపక్ అని పేర్లు పెట్టుకున్నారు. ఊరికి దూరంగా హైవేకు దగ్గరగా ఉన్న సెలూన్ కావడంతో కస్టమర్లలో సొంతూరి వాళ్లకంటే బయటి వాళ్లే ఎక్కువ. అమ్మాయిలే అబ్బాయిలుగా మారారనే వాస్తవం త్వరగానే మరుగున పడిపోయింది. ఊర్లో ఉన్న వంద కుటుంబాల వాళ్లకూ వీళ్లు అబ్బాయిలు కాదు అమ్మాయిలని తెలుసు. ఆ నిజాన్ని పనిగట్టుకుని సెలూన్‌కి వచ్చే వాళ్లకు చెప్పి ఆడపిల్లల పొట్టకొట్టే అనైతికానికి ఎవరూ పాల్పడలేదు. చదువును కుంటుపడనివ్వలేదు దీపక్, రాజు (జ్యోతి, నేహ)ల సంపాదన రోజుకు నాలుగు వందలు. ఇంట్లో నలుగురూ కడుపు నిండా తింటున్నారు, ధృవ నారాయణకు మందులకూ డబ్బులు ఉంటున్నాయి. ఇదే మాట చెబుతూ ‘‘ఆడపిల్లలను సెలూన్‌కి పంపించేటప్పుడు మనసు మెలిపెట్టినట్లయింది. ఇప్పుడు నా కూతుళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. సెలూన్ నడుపుతూ మమ్మల్ని పోషించడమే కాదు, వాళ్లు చదువుకుంటున్నారు కూడా’’ అని సంతోషిస్తున్నారు ధృవ నారాయణ. జ్యోతి డిగ్రీ పూర్తి చేసింది. నేహ ఉదయం కాలేజీకెళ్లి, మధ్యాహ్నం నుంచి సెలూన్లో పని చేస్తుంది. ‘‘మగవాళ్లకు హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తున్నామని, మగవాళ్లలాగ హెయిర్ కట్ చేసుకుని, షర్టు–ప్యాంటు వేసుకుంటున్నామని మమ్మల్ని వెక్కిరించిన వాళ్లున్నారు. వాళ్లు వెక్కిరించారని పని మానుకునే పరిస్థితి కాదు మాది. అందుకే ఎవరు ఏమన్నా ఈ పనిని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మేము ఎవరికీ భయçపడటం లేదు. ధైర్యంగా పని చేసుకుపోతున్నాం. మాకు అబ్బాయిల్లా నటించాల్సిన అవసరం కూడా లేదిప్పుడు. మేము అమ్మాయిలం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అక్క కూడా జుట్టు పెంచుకుంటోందిప్పుడు’’ అంటోంది నేహ. వీళ్లకు ఒక అవార్డు కూడా వచ్చింది! ఆ వివరాలు చెబుతూ ‘‘ఓ రోజు గోరఖ్‌పూర్ నుంచి ఓ విలేఖరి ఇటువైపు వచ్చినప్పుడు మా సెలూన్కొచ్చారు. మమ్మల్ని చూసి ఆశ్చర్యంగా మా వివరాలడిగారు. మా కథనాన్ని పత్రికలో రాశారు. ఆ క«థనాన్ని చూసిన ప్రభుత్వ అధికారులు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అభినందించారు.అది మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది’’ అంటోంది జ్యోతి.ఆర్థిక అవసరాలు వెంటాడినప్పుడు మహిళలు ఇంటి అవసరాలను తీర్చడానికి ఎన్నో పనులు చేస్తుంటారు. గ్రామాల్లో పొలం పనులకు పోతుంటారు.ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉపాధి అనగానే కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ అనే అనుకుంటాయి. ఈ అమ్మాయిలు వాళ్ల ఇంటి వృత్తిలోనే ఉపాధి పొందుతున్నారు. తండ్రికి వారసులుగా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త మార్గాన్ని నిర్మించుకున్నారు. చేసింది చిన్న యుద్ధం కాదు జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులను మించిన శత్రువులుండరు. ఆ శత్రువుతో పోరాడాలంటే దృఢమైన సంకల్పబలం ఉండాలి. టీనేజ్ దాటని ఈ అమ్మాయిలు చేసిన యుద్ధం చిన్నది కాదు. స్ఫూర్తిదాయకమైన ఈ సిస్టర్స్ గురించి సమాజానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. – అభిషేక్ పాండే, అవార్డును అందజేసిన ప్రభుత్వాధికారి – మంజీర అవార్డు అందుకుంటున్న అక్కచెల్లెళ్లు : నేహ (ఎడమ), జ్యోతి -
కౌన్సెలింగ్‌తో పాటు కటింగ్ !
బొమ్మనహళ్లి (కల్బుర్గి) : కల్బుర్గి జిల్లాతో పాటు తాలూకా పరిధి పీఎస్‌లలో ఉన్న రౌడీషీటర్లకు పోలీసులు పరేడ్ నిర్వహించి హెయిర్ కటింగ్ చేయించిన ఘటన ఆదివారం జరిగింది. త్వరలో జరుగనున్న టిప్పు జయంతి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా రౌడీషీటర్లను పిలిపించి కౌన్సెలింగ్‌తో పాటు అతిగా జట్టు పెంచుకున్న వారికి కటింగ్ కూడా చేయించారు. నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని, ఒకేరోజు 900 మందికి కటింగ్ చేయించి హెచ్చరించినట్లు ఎస్పీ శశికుమార్ తెలిపారు. -
ఇదేమి ‘కటింగ్’ బాబూ!
సౌత్‌వేల్స్: చిన్నపిల్లలు సాధారణంగానే హెయిర్ సెలూన్లో కటింగ్ చేసుకోవాలంటే మారాం చేస్తారు, గోల చేస్తారు, ఏడుస్తారు, నానాయాగి చేస్తారు. వారికి కటింగ్ చేయాలంటే సెలూన్ వాడికి కూడా తలప్రాణం తోకకొస్తుంది. ఆదే ఆటిజం(మెదడు సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్న పిల్లలకు కటింగ్ చేయించాలన్నా, చేయాలన్నా దేవతలు దిగిరావాలి! ఈ బాధను భరించలేననుకొనే డెనైన్ డీవీస్ అనే ఓ తల్లి ఆటిజంతో బాధ పడుతున్న తన నాలుగేళ్ల కొడుకు మాసన్కు 18 నెలల నుంచి కటింగ్ చేయించలేదు. మాసన్ జుట్టు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయింది. క్షణం కూడా నిలకడగా కూర్చోని మాసన్ నిద్రలో ఉన్నప్పుడు కొంచెం, కొంచెం జుట్టు కత్తిరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే మేల్కొన్నాక మాసన్ తన జుట్టును చూసుకొని ఇల్లుపీకి పందిరేసేవాడట. సౌత్‌వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్‌లో నివసిస్తున్న డీ వీస్, చిన్న పిల్లలకు అతి నైపుణ్యంతో హేర్ కట్‌చేసే బార్బర్ కోసం వాకబు చేసింది. జేమ్స్ విలియమ్స్ అనే 26 ఏళ్ల బార్బర్ అందులో స్పెషలిస్ట్ అని తెలుసుకుంది. తన పార్టనర్ జామీ లెవీస్‌తో కలసి బాబును తీసుకొని ఓ రోజు ఆ బార్బర్ దగ్గరకు వెళ్లింది. ఆటిజమ్‌తో బాధపడుతున్న పిల్లలకు హేర్ కటింగ్ చేయడం అంత ఈజీ కాదని, ముందుగా వారితో చనువు పెంచుకోవాల్సి ఉంటుందని బార్బర్ విలియమ్స్ సూచించారు. వారికిచ్చిన మాట మేరకు బార్బర్ ప్రతిరోజు సెలూన్ తెరవడానికి ముందు ఆ బాలుడు ఇంటికెళ్లి బాలుడితో స్నేహం చేయడం ప్రారంభించారు. అలా ఒకరోజు ఇంటికొచ్చేసరికి బాలుడు నేలమీద పడుకొని తన తల్లి సెల్‌ఫోన్‌తో ఆడుకుంటున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్న బార్బర్ విలియమ్స్ తాను కూడా బోర్లా నేలమీద పడుకొని బాలుడికి హేర్ కటింగ్ చేశారు. ఈ దృశ్యాలను మాసన్ తండ్రి లెవీస్ ఫొటోలుతీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలకు ఇప్పటివరకు 25వేల మంది లైక్స్ కొట్టగా, ఐదేవేల మంది షేర్ చేసుకున్నారు. ఒక్కసారిగా ఆన్లైన్ బార్బర్ విలియమ్స్ సెలబ్రిటిగా మారిపోయారు. తమ పిల్లలకు హెయిర్ కట్ చేయాలంటూ బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి రిక్వెస్టులు పెరిగాయి. ముఖ్యంగా ఆటిజమ్‌తో బాధ పడుతున్న పిల్లల తల్లిదండ్రులే వారిలో ఎక్కువగా ఉన్నారు. ‘నా వృత్తిని నేను నిర్వహించాను. ఇందులో గొప్పతనమేమి లేదు. కాకపోతే ఊహించని విధంగా డిమాండ్ పెరగడం ఆనందంగా ఉంది’ అని బార్బర్ వ్యాఖ్యానించారు. కటింగ్ అనంతరం అద్దంలో తన ముఖం చూసుకున్న మాసన్ అసలు ఏడ్వకపోగా తనపని ముగించుకొని వెళుతున్న బార్బర్ విలియమ్స్ వద్దకు వెళ్లి బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడని తల్లీ డీవీస్ మురిపింగా తెలిపింది. బార్బర్‌కు థాంక్స్ తెలిపింది. -
విద్యార్థినికి జుత్తు కత్తిరించిన ఆగంతకులు
జామి: విజయనగరం జిల్లా జామి మండలంలో 9వ తరతగతి చదువుతున్న విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు వేధింపులకు గురిచేసి, జుత్తుకత్తిరించారు. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఎంకే వలస గ్రామానికి చెందిన విద్యార్థిని కుమరాంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ బాలిక సైకిల్‌పై పాఠశాలకు వెళ్లివస్తుంది. రెండు రోజుల క్రితం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో బలరాంపురం, ఎంకే వలస గ్రామాలకు మధ్యలో ఉన్న మామిడితోటలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వెనుక నుంచి వచ్చి బాలిక కళ్లకు గంతలు కట్టి గాయపరిచారు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థిని విషయాన్ని ఇంటి వద్ద చెప్పి, తర్వాత రోజు పాఠశాలకు వెళ్లలేదు. తిరిగి శుక్రవారం పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో మళ్లీ ఆ గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి జుత్తును కత్తిరించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు శనివారం జామి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఈఘటనకు పాల్పడినట్లు విద్యార్థిని చెప్పింది. -
మా బుజ్జిగాడూ... వాడి ఐన్‌స్టీన్ కటింగ్ !
హ్యూమర్ మా బుజ్జిగాడిని తీసుకొని హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్తుంటే ఎదురొచ్చాడు మా బ్రహ్మంగాడు. ‘‘ఏంట్రా వాడి జుట్టు అలా పెంచేశావ్. ఈ వయసులో వెంట్రుకలు చిన్నగా ఉండాలి. స్మార్ట్‌గా కనిపిస్తూనే చిన్నగా ఉండేలా కట్ చేయమని బార్బర్‌తో చెప్పు’’ అని సలహా ఇచ్చాడు వాడు. ‘‘అబ్బే లేదురా. మా బుజ్జిగాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించమంది మా ఆవిడ. అందుకోసమే ఇంత పెరిగేదాకా ఆగి, ఇప్పుడా కటింగ్ చేయించబోతున్నా’’ అన్నాన్నేను. ‘‘ఐన్‌స్టీన్ కటింగా? అదెందుకూ’’ ఆశ్చర్యపోయాడు వాడు. ఇక ఒక శ్రోత దొరికిన ఆనందంలో కారణాలు వివరించా. మా బుజ్జిగాడికి సైన్స్ బాగా రావాలని ఫిజిక్స్ సూత్రాలు చెప్పడం మొదలుపెట్టా. ఏదైనా వస్తువుకు వేడి తగిలితే అది కరుగుతుందనీ, ఘన పదార్థమైతే ద్రవంగా మారుతుందనీ వివరించా. పేరిన నెయ్యిని కరిగించడానికి వేడి చేస్తామనీ, చలికాలంలో కొబ్బరినూనె పేరుకుంటే దాన్ని రాసుకోడానికి వీలుగా మార్చడానికి ఎండలో పెడతామనీ సోదాహరణంగా చెప్పా. వాడూ ఇంటరెస్టింగ్‌గానే విన్నాడు. ఓరోజు రాత్రి వాడు అకస్మాత్తుగా ‘‘నాన్నా... వేడిచేస్తే ఘనపదార్థాలు ద్రవంగా మారతాయని నువ్వు చెప్పిన ఫిజిక్స్ సిద్ధాంతం తప్పు’’ అంటూ ఓ బాంబు పేల్చాడు. ‘‘అదెలారా? కొబ్బరినూనెనూ,పేరిన నెయ్యినీ ఎగ్జాంపుల్స్‌గా చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా ఇలా ఎర్రర్స్ మాట్లాడితే ఎలారా?’’ అని అడిగా. అప్పుడు వాడు వివరించిన విషయాలు ఇవి. ‘‘ఇప్పుడు నువ్వు చెప్పిందే నిజమని అనుకుందాం. కోడిగుడ్డు కొన్నప్పుడు దాని లోపలి సొనలు ద్రవరూపంలో ఉంటాయి. కానీ అమ్మ నీకోసం బాయిల్డ్ ఎగ్ చేయడానికి వాటిని ఉడక బెడుతుంది. అంటే కొన్ని నీళ్లు పోసి వేడి చేస్తుంది. నీ లెక్క ప్రకారం ద్రవరూపంలో ఉన్నవి, వేడి చేశాక వాయు రూపంలోకి రావాలి. కానీ ఇక్కడంతా రివర్సు. వేడిచేశాక గుడ్డులో ఉన్న ద్రవం కాస్తా ఘన రూపంలోకి మారుతుంది కదా’’ అన్నాడు వాడు. ‘‘నువ్వు మొండిగా వాదిస్తున్నావ్. గుడ్డు ఉడకబెట్టడం వేరు. ఈ ఒక్క అంశాన్నీ పట్టుకొని ఫిజిక్స్ సూత్రాలు తప్పు అనడం తప్పురా’’ అంటూ నేనేదో సర్దిచెప్పబోయా. కానీ వాడు ఒప్పుకోలేదు. ‘‘ఇదొక్కటే కాదు నాన్నా. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంతెందుకు... ఇడ్లీలు వండే సమయంలో ఇడ్లీ పాత్రలో దాదాపు ద్రవరూపంలో ఉన్న పిండిని అమ్మ ఇడ్లీ పళ్లేలలో పోస్తుంది. వాటిని ఇడ్లీపాత్రలో ఉంచి, కింద నీరుపోసి వేడిచేస్తుంది. నిజానికి నేరుగా తగిలే మంట కంటే... ఆవిరిలోనే వేడి ఎక్కువగా ఉంటుంది. అంటే నీ లెక్క ప్రకారం ఆవిరికి మరింత వేడి ఎక్కువ కాబట్టి దాదాపు ద్రవరూపంలో ఉన్న పిండి, ఈ వేడికి వాయురూపంలోకి మారాలి. కానీ మళ్లీ ఇక్కడ పిండి కాస్తా రుచికరమైన ఇడ్లీలా... అంటే ఓ ఘనపదార్థంగా, ఘనమైన వంటకంగా మారిపోతుంది. అంతేకాదు, పాలు కాచి వేడి పాలలో తోడేసి, వెంటనే ఫ్రిజ్‌లో పెడితే అది పెరుగులా అంటే ఘన పదార్థంగా మారదు. బయట ఉంచితేనే గట్టిగా పేరుకుపోయి పెరుగవుతుంది. అలా అయ్యాకే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. కాబట్టి నువ్వు చెప్పే ఫిజిక్స్ సూత్రాలు నెయ్యికీ, కొబ్బరి నూనెకీ ఒక రకంగానూ, ఇడ్లీకీ, కోడిగుడ్డుకూ మరోరకంగానూ వర్తిస్తాయని నా మెదడు ల్యాబ్‌లో చేసిన ఆలోచనల ఎక్స్‌పెరిమెంట్స్‌లో తేలింది. పైగా అది మన కిచెన్ల్యాబ్లో ప్రూవ్ కూడా అయింది కదా నాన్నా. అలాంటప్పుడు వేడి తగిలితే ఘనపదార్థాలు కరుగుతాయనీ, ద్రవాలు వాయురూపంలోకి మారతాయని, చల్లబరిస్తే ద్రవపదార్థాలు ఘనరూపంలోకి మారతాయని నువ్వు చెప్పింది తప్పు కదా?’’ అని అడిగాడు వాడు. ‘‘మరి మీవాడి ఎక్స్పెరిమెంట్స్కూ, ఐన్‌స్టీన్ కటింగ్కీ సంబంధమేమిట్రా’’ అడిగాడు బ్రహ్మం. ‘‘ఈ సంభాషణ మొత్తం మా ఆవిడ విన్నది. ఐన్‌స్టీన్ తెలివితేటలన్నీ ఆయన విలక్షణమైన జుట్టులోనే ఉన్నాయని ఎవరో అన్నారట. అందుకే ఆమె మావాడి తెలివి తేటలకు అబ్బురపడిపోయి... వెంటనే వాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించమంది. ఇక మావాడు అన్నీ సైంటిఫిగ్గా ప్రూవ్ చేశాడు కాబట్టి, పైగా నేను మా ఆవిడ మాట కాదనను కాబట్టి మా బుజ్జిగాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించడానికే ఫిక్సయిపోయా’’ అంటూ కారణాన్ని వివరించా. ‘‘అవున్రా... నువ్వు చెప్పింది కరెక్టే. పైగా జుట్టు పొడవుగా ఉన్నందువల్ల దాన్ని సర్దుకోవడానికి తల ఎగరేసినప్పుడల్లా మెదడు కూడా కదలి మరింత చురుగ్గా మారవచ్చు. దాంతో మీవాడికి మరిన్ని ఐడియాలు రావచ్చు’’ అంటూ వాడు మరింత సైంటిఫిగ్గా వివరించేసరికి మా ఆవిడ నిర్ణయం సరైనదే అన్న భావన నాలో మరింత బలపడింది. - యాసీన్ -
తాగి నడపవద్దు... కాన్సెప్ట్
♦ హెయిర్ కటింగ్‌లోనూ సామాజిక కోణం ♦ తాగి వాహనాలు నడపొద్దన్న కాన్సెప్ట్ ♦ విజయ్‌కుమార్ సృజన గోపాలపట్నం (విశాఖపట్నం) : ఎంఎఫ్‌డీ సెలూన్ నిర్వాహకుడు ఆతవ విజయకుమార్ తన నైపుణ్యాన్ని మరోమారు ప్రదర్శించారు. తన సృజనాత్మకతకు సామాజిక కోణాన్ని జోడించి హెర్ స్టయిల్ రూపొందించారు. తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న అనర్ధాలపై ప్రచారం చేపట్టాలని భావించిన ఆయన పరమేశ్వర్ అనే ఔత్సాహికుని తలపై శనివారం ‘డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్’ అని మోడలింగ్ హెయిర్ డిజైనింగ్ చేశారు. విజయకుమార్లో వున్న సామాజిక స్పృహను ట్రాఫిక్ సీఐ మళ్ల మహేష్, ఎస్ఐ డీవీఎస్ వర్మ, ట్రాఫిక్ పోలీసులు అభినందించారు. -
‘బాజీరావు మస్తానీ’ కోసం రణవీర్ కేశత్యాగం!
సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బాజీరావు మస్తానీ’ చిత్రంలో పాత్ర కోసం రణవీర్‌సింగ్ కేశత్యాగం చేయనున్నాడు. పూర్తిగా ఏడాది సమయం ఈ చిత్రం కోసమే కేటాయించనున్నట్లు రణవీర్ చెబుతున్నాడు. ఏడాది వ్యవధిలో నిజానికి మూడు సినిమాలు చేయవచ్చని, అయితే, ఈ సినిమా కోసం తాను రిస్క్ చేయదలచు కున్నానని అంటున్నాడు. అక్టోబర్ నుంచి ‘మొహెంజదారో’ షూటింగ్ హృతిక్ రోషన్ హీరోగా అశుతోష్ గోవారికర్ తెరకెక్కించనున్న ‘మొహెంజదారో’ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ‘జోధా అక్బర్’ తర్వాత హృతిక్, అశుతోష్‌ల కాంబినేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం. ‘మొహెంజదారో’ షూటింగ్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లేందుకు ఈ చిత్ర బృందం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది.