
సాక్షి, మెదక్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జిల్లా కేంద్రంలో సోమవారం పర్యటించారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన పండ్లు అందించారు. దాంతోపాటు నాయి బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయన వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణ కులస్తులకు మంత్రి సలహాలు, సూచనలు ఇచ్చారు. హెయిర్ కటింగ్ చేసేటప్పుడు శానిటేషన్ చేయడం తప్పకుండా అలవాటు చేసుకోవాలని చెప్పారు.
కటింగ్‌కు ముందు, తర్వాత కటింగ్ చేయించుకునే వ్యక్తి, చేసే వ్యక్తి డెటాల్ లేదా శానిటైజర్ వాడాలని సూచించారు. కటింగ్ పూర్తయిన తర్వాత కూడా శానిటేషన్ చేసుకోవాలని అన్నారు. మనం బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుటుందన్నారు. ప్రజల బాగుకోసం అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గడం శుభసూచకమన్నారు. నాయి బ్రాహ్మణులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment