ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారికి కౌన్సెలింగ్ ఇస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: ‘ఏందయ్యా.. ఎంత బతిమిలాడి చెప్పినా అర్థం చేసుకోరా’అని రోడ్ల పై తిరుగుతున్న వాహనదారులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు క్లాస్ పీకారు. సోమ వారం సిద్దిపేటలో ద్విచక్ర వాహనదారులు వెళుతుండటాన్ని గమనించి ఆపారు. ఈ సం దర్భంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరోనా వైరస్ నివారణకు మందు లేదు.. స్వీయ నిర్బంధం.. భౌతిక దూరం పాటించడమే సమస్యకు పరిష్కారం. ఈ వైరస్ నుం చి ప్రపంచమే గడగడలాడుతోంది. మీరేమో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు’అని మండిపడ్డారు. అధికారులు ప్రమాదం పొంచి ఉం దని తెలిసినా లెక్క చేయకుండా మీ కోసం పని చేస్తున్నా.. సహకరించడం మీ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. వైఖరి మార్చుకోకపోతే కేసులు పెట్టేందుకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు. కాగా, దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహాయ, సహకారాలు అందించాలని మంత్రి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment