Nai Brhmans
-
నాయీబ్రాహ్మణులు కాలర్ ఎగిరేసి బతికేలా సీఎం జగన్ చేశారు: సజ్జల
తాడేపల్లి: బీసీలకు నిజమైన న్యాయం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సంక్షేమం అంటే ఎలా ఉండాలో చేసి చూపించిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. తాడేపల్లిలోని నాయీబ్రహ్మణ కృతజ్ఞతా సభలో సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో జరిగిందంతా నీచ రాజకీయమేనని ధ్వజమెత్తారు. మీడియాని అడ్డం పెట్టుకుని కావాల్సిన రీతిలో వార్తలు రాయించుకునేతత్వం చంద్రబాబుదని మండిపడ్డారు. నాయీ బ్రహ్మణులకు చట్ట సభల్లో అవకాశం నాయీ బ్రాహ్మణులు కాలర్ ఎగిరేసి బతికేలా సీఎం జగన్ చేశారని సజ్జల పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి నాయీ బ్రాహ్మణులు అండగా నిలవాలని సూచించారు. నాయీ బ్రాహ్మణులకు ఇప్పటికే ఆలయాల పాలక మండళ్లలో అవకాశం కల్పించారని, చట్ట సభల్లో కూడా అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. త్వరలో ఎమ్మెల్సీ కూడా వచ్చి తీరుతుందన్నారు. టీడీపీ ప్రచార ఆర్భాటాలలో పడిపోకుండా వాస్తవాలేంటో గ్రహించాలని తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాకే ఈ పథకాలు అందుబాటులోకి ‘దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ను తెచ్చి అందరికీ న్యాయం చేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ఆ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్ళీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాకనే ఆ పథకాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. చంద్రబాబు తాను చదువుకున్న స్కూల్‌నే పట్టించుకోలేదు. జగన్ నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని స్కూల్స్‌ను బాగు చేయించారు. ఎల్కేజీ నుంచి విదేశాల్లో చదువుకునే వరకు మన పిల్లలకు అన్నీ అవకాశాలు కల్పిస్తున్నారు. బాబు ప్రభుత్వంలో అన్ని అవినీతి, అక్రమాలే ఏనాడూ చంద్రబాబు సొంతంగా అధికారంలోకి రాలేదు. 2014-19 మధ్య అవకాశం వచ్చినా ప్రజలకు ఏమీ చేయలేదు. అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు అంతటా అవినీతి, అక్రమాలే. టిడ్కో ఇళ్లు కట్టించలేక పునాదుల దశలోనే వదిలేశారు. జగన్ వచ్చాకే వాటిని పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నారు. మనం కట్టించిన ఇళ్ల దగ్గర సెల్ఫీలు తీసుకుని మనకే సవాల్ చేస్తున్నారు. వీటిని ఎల్లోమీడియాలో తెగ ప్రచారం చేసుకుంటోంది. లోకేష్‌కు ఏం పీకుతున్నారనే మాట తప్ప మరేమీ నేర్పలేదేమో?. నోరు తెరిస్తే ఆ పీకుడు భాషే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు మీడియా బలం తప్ప మరేమీలేదు. వంచనతోనే గెలవాలనుకునే వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు చీకటికి ప్రతినిధి, జగన్ వెలుగులకు ప్రతినిధి. చంద్రబాబు ఒక దోపిడీ మందను తయారు చేసుకున్నారు. కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్పటం ఆయనకే సాధ్యం. నిజాలు చెప్తే చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అవుతుందని వైఎస్సార్ అంటూ ఉండేవారు. అది నిజమే అన్నట్టుగా ఆయన తీరు కనిపిస్తుంది. వంచనతోనే గెలవాలనుకునే వ్యక్తి చంద్రబాబు. నా వల్ల మేలు జరిగితేనే ఓటెయ్యమని అడిగే ధైర్యం జగన్‌ది. కుల వృత్తులకు అండగా సీఎం జగన్ ప్రభుత్వం బీసీలకు ఇప్పటికే అధికభాగం పదవులు ఇవ్వగలిగాం. నిజమైన అర్హత బీసీలకు కూడా ఉన్నందునే జగన్ అన్ని పదవులు ఇవ్వగలిగారు. జగన్ ఓట్ల కోసం చేయటం లేదు. అందరి ఆత్మగౌరవం పెరగాలని చూస్తారు. కులవృత్తులకు అండగా నిలవటం ప్రభుత్వం బాధ్యతగా చూస్తుంది. చేదోడు పథకం ద్వారా పదివేలు చొప్పున మూడేళ్లుగా అందిస్తున్నాం. పోటీతత్వం పెరుగుతున్నందున మనం కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. వంచనతోనే గెలవాలనుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయన పార్టీని వచ్చే ఎన్నికలలో భూస్థాపితం చేయాలి. లేకపోతే సామాన్యులు బతకలేరు. గత ఎన్నికలలోనే గట్టిగా దెబ్బ కొట్టినా మళ్ళీ వస్తున్నాడు. ఈసారి రాజకీయంగా అంతం చేయాలి. 175కి 175 సీట్లు కొట్టటమే లక్ష్యంగా పని చేయాలి.’ అని సజ్జల వ్యాఖ్యానించారు. -
బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశారు: మంత్రులు
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో మంగళవారం నాయీబ్రాహ్మణ కృతజ్ఙతాసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యాక్రమానికి బీసీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నాయీబ్రాహ్మణ సంఘం నేతలు హాజరయ్యారు. సంప్రదాయ వృత్తిదారులకు జగనన్న చేదోడు కింద ప్రతి ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందించడం, ఆలయాలలో పనిచేసే వారికి రూ, 20 వేల వేతనం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆలయాల పాలకమండలిలో స్థానం కల్పించడంపై నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ మంత్రులు మాట్లాడుతూ.. బీసీలకు సీఎం జగన్ అన్ని విధాల అండగా నిలిచారని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ బీసీల కష్టాల చూశారని గుర్తు చేశారు. ఆలయాల పాలక మండలిలో నాయీబ్రాహ్మణులు సభ్యులయ్యారని, త్వరలోనే నాయీ బ్రాహ్మణులు సైతం చట్టసభల్లో అడుగుపెడతారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని విమర్శించారు. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశారని, ఆయనకు బీసీలంటే చిన్నచూపని దుయ్యబట్టారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య వాతావరణం.. వాతావరణ శాఖ హెచ్చరికలు -
నాయి బ్రాహ్మణులకు మంత్రి హరీశ్ సూచనలు
సాక్షి, మెదక్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జిల్లా కేంద్రంలో సోమవారం పర్యటించారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన పండ్లు అందించారు. దాంతోపాటు నాయి బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయన వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణ కులస్తులకు మంత్రి సలహాలు, సూచనలు ఇచ్చారు. హెయిర్ కటింగ్ చేసేటప్పుడు శానిటేషన్ చేయడం తప్పకుండా అలవాటు చేసుకోవాలని చెప్పారు. కటింగ్‌కు ముందు, తర్వాత కటింగ్ చేయించుకునే వ్యక్తి, చేసే వ్యక్తి డెటాల్ లేదా శానిటైజర్ వాడాలని సూచించారు. కటింగ్ పూర్తయిన తర్వాత కూడా శానిటేషన్ చేసుకోవాలని అన్నారు. మనం బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుటుందన్నారు. ప్రజల బాగుకోసం అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గడం శుభసూచకమన్నారు. నాయి బ్రాహ్మణులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. -
‘విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు తామంతా సంపూర్ణంగా సహకరిస్తామని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ప్రకటించారు. గురువారం కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌కు సహకరించాలని, క్షౌరశాలలను తెరవొద్దని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం, స్వయం నియంత్రణ పాటించాలని సూచించారు. క్షురకర్మ అనేది మనుషులకు దగ్గరగా ఉండే చేసే వృత్తి కాబట్టి కరోనా వైరస్ సులభంగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. దగ్గు, తుమ్ము, స్పర్శ ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వ సూచనల ప్రకారం నడుచుకోవాలని కోరారు. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన నిరుపేద నాయీ బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సెలూన్ల విద్యుత్ బిల్లులను మాఫీ చేయడంతో పాటు తగినవిధంగా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రకటించిన వ్యక్తిగత రుణాలు, సొసైటీ రుణాలు వెంటనే మంజూరు చేస్తే నాయీ బ్రాహ్మణులను ఆదుకున్నట్టు అవుతుందని ప్రభుత్వానికి తెలిపారు. (కరోనా.. 'నడక'యాతన!) కేసు ఎత్తివేయండి లాక్డౌన్ సందర్భంగా నల్లగొండ జిల్లా వలిగొండలో నిరుపేద నాయీ బ్రాహ్మణుడిపై పోలీసులు ఐపీసీ 188 కింద కేసు పెట్టడాన్ని లింగం నాయీ ఖండించారు. ప్రజ్ఞాపురం శేఖర్ అనే వ్యక్తిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాష్ట్రంలో ఎక్కడైనా తెలిసి తెలియక క్షౌరశాలలు తెరిస్తే వారికి అవగాహన కల్పించాలి గానీ, కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షురకులను బెదిరించి బలవంతంగా క్షురకర్మ చేయించుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్డౌన్ ముగిసేవరకు క్షురకర్మకు దూరంగా ఉండాలని వృత్తిదారులకు ఆయన పిలుపునిచ్చారు. ఆపత్కాలంలో నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటామని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు మహేశ్‌చంద్ర నాయీ, ఉపాధ్యక్షుడు అనంతయ్య నాయీ, కార్యదర్శి జి. శ్రీనివాస్ నాయీ, అడ్వకేట్ మసాయి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. (కోవిడ్ ఎఫెక్ట్: వారి కోసం ‘క్రౌడ్ ఫండింగ్’) -
హామీలు అమలయ్యేలా చూడండి
సాక్షి, హైదరాబాద్: తమ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలయ్యేలా చూడాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక శుక్రవారం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరింది. తమ సంఘీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చేయాలని విన్నవించారు. ఐక్యవేదిక ప్రతినిధులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది నాయీ బ్రాహ్మణుల్లో మెజారిటీ వర్గం ఇప్పటికి క్షురకులుగా జీవనం సాగిస్తున్నారని వీరిని ఆదుకోవాలని కోరారు. ఇతర కులాలకు చెందిన వారు క్షౌరవృత్తి చేపట్టకుండా సామాజిక రక్షణ కల్పించాలని, కార్పొరేట్ కంపెనీలు క్షౌరవృత్తి దారుల కడుపుకొట్టకుండా చూడాలన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదల చేసి నాయీబ్రాహ్మణులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి తగిన శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సెలూన్లను కమర్షియల్ విద్యుత్ టారిఫ్ నుంచి తప్పించాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతిభవన్ సాక్షిగా హామీయిచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఏళ్ల తరబడి ఆలయాల్లో సేవలు అందిస్తున్న నాయీబ్రాహ్మణులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. చట్టప్రకారం ఐఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని కోరారు. దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. 50 ఏళ్లు పైబడిన క్షౌరవృత్తిదారులకు ఫించన్ ఇవ్వాలని, ప్రభుత్వం మంజూరు చేసిన నాయీబ్రాహ్మణ కమ్యునిటీ భవనాన్ని రాజధాని హైదరాబాద్‌లో వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞాపనపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం, గౌరవ అధ్యక్షుడు మహేశ్‌చంద్ర, మాదాల కిషన్, నర్సింహులు, అనంతయ్య, శ్రీనివాస్ ఉన్నారు. -
నాయీ బ్రాహ్మణ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లింగం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నాయీ బ్రాహ్మణ అడ్డకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హైకోర్టు అడ్వకేటు మద్దికుంట లింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కర్మాన్‌ఘాట్‌లోని జస్టిస్ వేణుగోపాలరావు కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. కార్యవర్గ సమావేశంలో న్యాయవాదులు సీఎల్ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను అధ్యక్షుడిగా ఎన్నుకుందుకు కమ్యూనిటీ న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల హక్కుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్థానని పేర్కొన్నారు. మద్దికుంట లింగం గతంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. -
నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
-
వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం
సాక్షి, బయ్యనగూడెం: తమ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాల పట్ల నాయీ బ్రాహ్మణులు సంతృప్తి వ్యక్తం చేశారు. సెలూన్లకు ఏడాదికి రూ. 10 వేలు సాయంగా ఇవ్వాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పోతన తాతారావు, తుమ్మలపల్లి గంగరాజు, మీసాల సూర్యానారాయణ, కంభంపాటి బుజ్జిబాబు పాల్గొన్నారు. లింగుశెట్టి సురేశష్, లింగుశెట్టి అంజిబాబు, పొలకంపల్లి శ్రీనివాస్, మాధవరం సర్వారాయుడు, లింగుశెట్టి అప్పారావు తదితర నాయీ బ్రాహ్మణ నేతలు ర్యాలీకి హాజరయ్యారు. -
జగనన్న వరాలతో కష్టాలకు కత్తెర
సాక్షి, నంద్యాల: ప్రతి గ్రామంలో అన్ని కూలాల మాదిరిగానే నాయీబ్రాహ్మణుల కుటుంబాలూ ఉన్నాయి. వారిలో క్షౌ రవృత్తిని కొనసాగిస్తున్నవారు కొందరైతే మరికొందరు బాజా భజంత్రీలు వాయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలిలో రకరకాల ఫ్యాషన్లు అందుబాటులోకి రావడం, కార్పొరేట్ సంస్థలు కూడా బ్యూటీ సెలూన్ల అవతారమెత్తి పోటీలోకి వచ్చాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు నాయీబ్రాహ్మణులకు పోటీ పెరిగిపోయింది. దీంతో ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్న నాయీబ్రాహ్మణులు నిరాదరణకు గురవుతున్నారు. కులవృత్తిని నమ్ముకొని మనుగడ సాగించలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాయీబ్రాహ్మణులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన వరాలు వారిలో ఆశలు చిగురింపజేశాయి. క్షౌ ర వృత్తి దారుల పరిస్థితులను గమనించిన వైఎస్ జగన్ తాము అధికారంలోకి రాగానే సెలూన్ షాపులకు 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం లేదా ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో నియోజకవర్గంలోని 4వేల కుటుంబాలకు లబ్ధిచేకూరుతుంది. వైఎస్సార్ హయాంలో... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నాయీబ్రాహ్మణులు ఎంతో మేలు చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాల్లో ధూప, దీప నైవేద్య పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా అర్చకులతో పాటు ఆలయాల్లో మంగళవాయిద్యాల కోసం చాలామంది నాయీబ్రాహ్మణులకు పర్మినెంట్ కొలువులు లభించాయి. వారంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్చించబడుతున్నారు. అలాగే సెలూన్ల ఏర్పాటు కోసం తక్కువ వడ్డీకే రుణాలు కూడా అందజేశారు. వైఎస్సార్ తర్వాత ఏ నాయకుడూ వారి గురించి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో నాయీబ్రాహ్మణులకు వరాలు కురిపించారు. నాయీబ్రాహ్మణులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రతి పేద నాయీబ్రాహ్మణ కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. దీంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని నాయీబ్రాహ్మణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సీఎం అయితే మంచిరోజులు ప్రజల కష్టాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా చూశారు. క్షౌ రవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న నాయీబ్రాహ్మణ పరిస్థితిని గమనించారు. సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడం గొప్ప నిర్ణయం. కరెంట్ బిల్లుల కష్టాలు దీని ద్వారా తగ్గుతాయి. – శీను, సెలూన్ నిర్వాహకుడు జనన్నకు జీవితాంతం రుణపడి ఉంటా వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితంతం రుణపడి ఉంటా. ఇతర పార్టీల నాయకులు నాయీబ్రాహ్మణులకు ఓటు బ్యాంక్‌గా చూస్తున్నారే తప్ప మా బాగోగులు పట్టించుకోవడం లేదు. ఈ తరుణలో వైఎస్ జగన్ మాగురించి ఆలోచించి ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. దీంతో ప్రతి నెల కొంత వరకు ఆదా అవుతుంది. మా ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. – సుభాష్ -
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
మరికల్ (ధన్వాడ) : నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని నాయి మిత్ర మండలి రాష్ట్ర కన్వీనర్ అశ్వినిచంద్రశేఖర్ అన్నారు. ఆదివారం మరికల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన తమకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించాలని కోరారు. క్షీరవృత్తి, వాయిద్య కళాకారులకు చేయూత నిచ్చేందుకు నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ పాలక కమిటీని ఏర్పాటు చేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. నాయిబ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు జిల్లాకు ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్‌కుమార్, నాయకులు గోపాల్, దేవరాజ్, వేణు, శేఖర్ పాల్గొన్నారు.