సాక్షి, నంద్యాల: ప్రతి గ్రామంలో అన్ని కూలాల మాదిరిగానే నాయీబ్రాహ్మణుల కుటుంబాలూ ఉన్నాయి. వారిలో క్షౌ రవృత్తిని కొనసాగిస్తున్నవారు కొందరైతే మరికొందరు బాజా భజంత్రీలు వాయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలిలో రకరకాల ఫ్యాషన్‌లు అందుబాటులోకి రావడం, కార్పొరేట్ సంస్థలు కూడా బ్యూటీ సెలూన్‌ల అవతారమెత్తి పోటీలోకి వచ్చాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు నాయీబ్రాహ్మణులకు పోటీ పెరిగిపోయింది.
దీంతో ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్న నాయీబ్రాహ్మణులు నిరాదరణకు గురవుతున్నారు. కులవృత్తిని నమ్ముకొని మనుగడ సాగించలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాయీబ్రాహ్మణులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వరాలు వారిలో ఆశలు చిగురింపజేశాయి. క్షౌ ర వృత్తి దారుల పరిస్థితులను గమనించిన వైఎస్ జగన్ తాము అధికారంలోకి రాగానే సెలూన్ షాపులకు 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం లేదా ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో నియోజకవర్గంలోని 4వేల కుటుంబాలకు లబ్ధిచేకూరుతుంది.
వైఎస్సార్ హయాంలో...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నాయీబ్రాహ్మణులు ఎంతో మేలు చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాల్లో ధూప, దీప నైవేద్య పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా అర్చకులతో పాటు ఆలయాల్లో మంగళవాయిద్యాల కోసం చాలామంది నాయీబ్రాహ్మణులకు పర్మినెంట్ కొలువులు లభించాయి. వారంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్చించబడుతున్నారు. అలాగే సెలూన్‌ల ఏర్పాటు కోసం తక్కువ వడ్డీకే రుణాలు కూడా అందజేశారు.
వైఎస్సార్ తర్వాత ఏ నాయకుడూ వారి గురించి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో నాయీబ్రాహ్మణులకు వరాలు కురిపించారు. నాయీబ్రాహ్మణులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రతి పేద నాయీబ్రాహ్మణ కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని నాయీబ్రాహ్మణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ సీఎం అయితే మంచిరోజులు
ప్రజల కష్టాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా చూశారు. క్షౌ రవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న నాయీబ్రాహ్మణ పరిస్థితిని గమనించారు. సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడం గొప్ప నిర్ణయం. కరెంట్ బిల్లుల కష్టాలు దీని ద్వారా తగ్గుతాయి.
– శీను, సెలూన్ నిర్వాహకుడు
జనన్నకు జీవితాంతం రుణపడి ఉంటా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితంతం రుణపడి ఉంటా. ఇతర పార్టీల నాయకులు నాయీబ్రాహ్మణులకు ఓటు బ్యాంక్‌గా చూస్తున్నారే తప్ప మా బాగోగులు పట్టించుకోవడం లేదు. ఈ తరుణలో వైఎస్ జగన్ మాగురించి ఆలోచించి ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. దీంతో ప్రతి నెల కొంత వరకు ఆదా అవుతుంది. మా ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది.
– సుభాష్
Comments
Please login to add a commentAdd a comment