corporatation
-
మరో ఆరు నెలలు.. వాయిదా వేసిన దిగ్గజ కంపెనీ
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చాలా కంపెనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా ఎంతోమంది ఉద్యోగులను తొలగించిన దిగ్గజ కంపెనీలు.. ఇప్పుడు వేతనాలను పెంచడానికి ససేమిరా అంటున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు జీతాల పెంపును నిలిపివేయడమే కాకుండా.. ప్రమోషన్స్, బోనస్ వంటి వాటిని కూడా వాయిదా వేస్తూ వస్తున్నాయి.సాధారణంగా జూన్ లేదా జులై నెలలో వేతనాల పెరుగుదల, ప్రమోషన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీలు దీనిని వాయిదా వేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో అతి పెద్ద ఐటీ కంపెనీ 'అసెంచర్' 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్, శ్రీలంకలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచలేదు. ఎక్కువ పర్ఫామెన్స్ చేసినవాళ్ళకైనా జీతాలు పెంచే అవకాశం ఉందేమో అని ఎదురు చూస్తే.. వారికి కూడా చుక్కెదురైంది.ఇటీవల అసెంచర్ చేసిన ప్రకటనలో.. ప్రమోషన్లకు సంబంధించిన గడువును మరో ఆరు నెలలకు వాయిదా వీడింది. ఇంతకు ముందు ప్రమోషన్స్ ఈ ఏడాది చివరకు ఉంటాయని చెప్పిన కంపెనీ.. ఇప్పుడు వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేసింది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటం చేత ఈ ఆలస్యం జరుగుతోందని సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: 10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీటెక్నాలజీ దిగ్గజం అసెంచర్ ప్రపంచవ్యాప్తంగా 7,50,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కన్సల్టింగ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీ ఆర్థిక పరమైన అనిశ్చితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉద్యోగుల మీద పడింది. ఏది ఏమైనా త్వరలోనే ఉద్యోగులకు శుభవార్త వినిపించనుంది. -
కోలీవుడ్‌లో షాక్: ప్రముఖ నటుడి ఇంటికి సీల్..
సాక్షి, తమిళసినిమా: నటుడు మన్సూర్ అలీఖాన్ ఇంటికి చెన్నై నగర కార్పొరేషన్ అధికారులు సీలు వేశారు. సంచలన నటుడు, నిర్మాత, రాజకీయవాది మన్సూర్ అలీఖాన్‌కు స్థానిక చూలైమేడులో ఇల్లు ఉంది. అందులోనే ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి నివసిస్తున్నారు. అయితే ఆయన ప్రభుత్వానికి చెందిన 2,400 గజాల పొరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని ఇంటిని నిర్మించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై చెన్నై నగర కార్పొరేషన్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో తనను మోసం చేసి పొరంబోకు స్థలాన్ని విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని మన్సూర్ అలీఖాన్ 2019లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టి వేసింది. దీంతో శనివారం అధికారులు మన్సూర్ అలీఖాన్ ఇంటికి సీల్ వేశారు. వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో కలకలం రేకెత్తిస్తోంది. చదవండి: Telangana Devudu: వెండితెరపై సీఎం కేసీఆర్ బయోపిక్.. తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్ -
ఏపీ గిరిజన కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా శోభ స్వాతి ప్రమాణం
-
నేడు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు మరో ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీ కోసం శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుంది. కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుం టారు. ఈ నెల 3న వెలువడిన ఫలితాల్లో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో మెజారిటీ డివిజన్లు, వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో అన్ని చోట్లా ఇతర పార్టీలు, కో ఆప్షన్ సభ్యుల మద్దతు లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. అయితే సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు టీఆర్ఎస్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చం పేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు రెండు రోజుల క్రితమే పరిశీలకులను నియమించింది. పలువురు మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతోపాటు కొందరు ముఖ్య నేతలకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఆయా ప్రాం తాల పరిధిలోని మంత్రులు, స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశావహుల జాబితాకు తుది రూపం ఇచ్చారు. పేర్లను సీల్డ్ కవర్లలో గురువారం మధ్యా హ్నం పార్టీ పరిశీలకులకు అందజేశారు. వీరు గురువారంరాత్రికే తమకు కేటాయించిన కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నిక జరగనుండగా, పార్టీ కొత్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పరిశీలకులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమవుతారు. ఎన్నిక జరిగే తీరుతెన్నులను వివరించడంతోపాటు, సీల్డ్ కవర్లోని పార్టీ నిర్ణయాన్ని కూడా తెలియచేస్తారు. కో ఆప్షన్ సభ్యులతోపాటు కొత్తగా ఎన్నికైన వారితో కలిసి ఎన్నిక జరిగే సమావేశ మందిరానికి చేరుకుంటారు. రిజర్వేషన్ కేటగిరీ, విధేయత, సీనియారిటీ తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని కేసీఆర్ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. కార్పొరేషన్/ మేయర్/చైర్మన్ మున్సిపాలిటీ ఆశావహులు వరంగల్ గుండు సుధారాణి ఖమ్మం బీసీ లేదా కమ్మ సామాజికవర్గం సిద్దిపేట కడవేర్గు మంజుల/ కొండం కవిత అచ్చంపేట నర్సింహ గౌడ్/ గోపిశెట్టి శివ/ పోరెడ్డి శైలజ జడ్చర్ల దోరేపల్లి లక్ష్మి కొత్తూరు కరుణ/ లావణ్య నకిరేకల్ రాచకొండ శ్రీనివాస్/ కొండ శ్రీనుగౌడ్ -
‘మద్దతు’ కోసం మట్టిమనుషుల పోరాటం!!
రైతే ఒక పారిశ్రామికవేత్తగా మారేలా వ్యవసాయ రంగంలో చరిత్రాత్మక చట్టాల్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెప్పుకున్నారు. కానీ ఆ చట్టాలను రద్దు చేయాలంటూ గత పది రోజులుగా ఢిల్లీ వీధుల్లో బైఠాయించిన రైతన్నలు చరిత్ర సృష్టిస్తున్నారు. ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువగా ఉండే పంజాబ్, హరియాణా రైతులు పోరాటానికి తొలి అడుగు వేస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల రైతులు వారి అడుగులో అడుగు వేసి కదం తొక్కారు. ఈ చట్టాల అమలుతో వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ జరుగుతుందన్న ఆందోళన అన్నదాతల్ని వెంటాడుతోంది. అందుకే నిత్యావసర సరుకుల సవరణ చట్టం.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక చట్టం... రైతుల సాధికారత, రక్షణ ధరల హామీ సేవల ఒప్పంద చట్టాలను వెనక్కి తీసుకోవాలని, మద్దతు ధరను చట్టంలో చేర్చాలని రేయింబగళ్లు నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాల లక్ష్యంలోనే తప్పులు ఉన్నాయని రైతు ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ‘ఏదైనా చట్టం లక్ష్యమే తప్పుగా ఉంటే దానిలో సవరణలు చేసినా అవి తప్పుదారి పడతాయి. దాని వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు’’ అని 40 మంది రైతులున్న ప్రతినిధి బృందంలోని ఏకైక మహిళా కవితా కురుగంటి తెలిపారు. పీట ముడి ఎక్కడ ? సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. ఎంఎస్పీపై రైతులను విపక్షాలు పక్కదారి పట్టిస్తున్నాయనీ, అందుకే రైతులు ఆందోళన తీవ్ర చేస్తున్నారన్నది కేంద్రం ఆరోపిస్తోంది. రైతుల అభ్యంతరాలు, డిమాండ్లు.. వ్యవసాయ రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఒకే దేశం ఒకే మార్కెట్ విధానం వల్ల భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుందంటున్నారు. అందుకే ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. కేంద్రం ఏమంటోంది ? ► వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ససేమిరా కుదరదని తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్ట సవరణలకు అంగీకరించింది. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా బడా కంపెనీలు రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► మండీల్లో ప్రైవేటు వ్యక్తులు వస్తే పోటీ ఉండి రైతులకే ప్రయోజనమని వాదిస్తున్న కేంద్రం రాష్ట్రాల పరిధిలో నడిచే మండీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒప్పుకుంది. ప్రైవేటు మార్కెట్లు, ప్రభుత్వ మార్కెట్ యార్డుల్లో పన్నులు సమానంగా వసూలు చేయడానికి అంగీకరించింది. ► ప్రైవేటు వ్యాపారులు పాన్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి బదులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ► కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని, దానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని పదే పదే చెబుతూ వస్తోంది. -
7 కొత్త కార్పొరేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, కొత్త మున్సిపల్ చట్టం ద్వారా మరో ఏడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని కార్పొరేషన్ల సంఖ్య 13కు చేరనుంది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో శివారు గ్రామాలు చేరడంతో జనాభా పెరిగిందని, ఆ మేరకు వార్డుల సంఖ్య సైతం పెంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ చట్టాలకు సవరణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీంతో అత్యవసర ఆదేశాల(ఆర్డినెన్స్) రూపంలో మున్సిపల్ చట్టాలకు సవరణ చేసి వార్డుల సంఖ్యను పెంచామన్నారు. మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్ బిల్లును ఆయన గురువారం సభలో ప్రవేశపెట్టి మాట్లాడారు. రాష్ట్రం లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రజల సౌకర్యం, సౌలభ్యం, సంక్షేమం కాంక్షించి చాలా మార్పులు తీసుకొచ్చామన్నారు. మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్ బిల్లును కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఆమోదించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. -
ఎన్నికల బరిలో వైఎస్సార్ టీయూసీ
జీవీఎంసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర సంఘంగా బరిలోకి దిగిన వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌పై ఏఐటీయూసీ అనుబంధ సంస్థ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించి గుర్తింపు యూనియన్‌గా అవతరించింది. దీని కాలపరిమితి ఈ నెల 9వ తేదీతో ముగిసింది. దీంతో ఎన్నికలు నిర్వహించాలంటూ వివిధ సంఘాలు కోరుతున్నాయి. తొలిసారిగా బరిలో వైఎస్సార్ టీయూసీ ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ బరిలోకి దిగుతోంది. జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వైఎస్సార్టీయూసీ అనుబంధ సంస్థగా పోటీలో నిలుస్తోంది. వైఎస్సార్టీయూసీతో పాటు జీవీఎంసీ పరిధిలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ ఉన్నాయి. ఏఐటీయూసీతో విబేధాలు రావడంతో ప్రస్తుత గుర్తింపు యూనియన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తోంది. శాశ్వత ఉద్యోగులకు మాత్రమే ఓటు హక్కు కార్పొరేషన్ పరిధిలో సుమారు 11 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పర్మినెంట్, ఇతర శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే జీవీఎంసీకి సంబంధించిన పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. జీవీఎంసీలోని శానిటరీ వర్కర్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ వరకూ వివిధ కేడర్లలో ఉన్న శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. 2017లో జరిగిన ఎన్నికల్లో 3,238 మంది ఓటర్లుండగా ఈసారి ఎన్నికలు నెలాఖరులోగా జరిగితే 3,400 మంది ఓటర్లుంటారు. ఒక నెల ఆలస్యమైతే ఓటర్ల సంఖ్య తగ్గనుంది. జూన్ నెలలో 120 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ కానున్నారు. ఏ కార్పొరేషన్లో లేని విధంగా.. రాష్ట్రంలో ఉన్న ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లోనూ గుర్తింపు యూనియన్ అంటూ ప్రత్యేకంగా ఉండదు. కేవలం జీవీఎంసీలో మాత్రమే ఈ తరహా ఎన్నికలు జరుగుతున్నాయి. 2002లో తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. 2004లో టీఎన్టీయూసీ, 2007లో ఏఐటీయూసీ, 2010లో స్వతంత్ర యూనియన్ వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, 2012లో ఏఐటీయూసీ, 2014లో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, 2017లో ఏఐటీయూసీ గెలుపొందాయి. ఈ ఏడాది వైఎస్సార్టీయూసీ విజయం సాధిస్తుందన్న ధీమా యూనియన్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది బూత్‌లు ఏర్పాటు మొత్తంగా ఈ నెలాఖరులోగానీ, జూన్ మొదటి వారంలో గానీ జరగనున్న ఈ ఎన్నికల కోసం తొమ్మిది బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆరు బూత్‌లు, గాజువాక, మధురవాడ, అనకాపల్లిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం తొమ్మిది బూత్‌లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌కు వైఎస్సార్టీయూసీ అనుబంధ సంస్థ ప్రతినిధులు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. కమిషనర్ సైతం కార్మిక శాఖతో మాట్లాడి ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతాయని ప్రకటించడంతో ఈ నెలాఖరులోగానీ, జూన్ మొదటి వారంలో గానీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరుగుతాయని ఆయా సంఘాలు భావిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలు తొలిసారిగా కార్పొరేషన్ యూనియన్ ఎన్నికల్లో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోటీ చేస్తోంది. అనుబంధ సంస్థ జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించింది. ఈసారి జరగనున్న ఎన్నికల్లో గుర్తింపు యూనియన్‌గా అవతరించి కార్పొరేషన్ పై వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌ను కోరగా సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు యూనియన్ బలోపేతానికి ఇప్పటికే పావులు కదుపుతున్నాం. – వీవీ వామనరావు, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
జగనన్న వరాలతో కష్టాలకు కత్తెర
సాక్షి, నంద్యాల: ప్రతి గ్రామంలో అన్ని కూలాల మాదిరిగానే నాయీబ్రాహ్మణుల కుటుంబాలూ ఉన్నాయి. వారిలో క్షౌ రవృత్తిని కొనసాగిస్తున్నవారు కొందరైతే మరికొందరు బాజా భజంత్రీలు వాయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలిలో రకరకాల ఫ్యాషన్లు అందుబాటులోకి రావడం, కార్పొరేట్ సంస్థలు కూడా బ్యూటీ సెలూన్ల అవతారమెత్తి పోటీలోకి వచ్చాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు నాయీబ్రాహ్మణులకు పోటీ పెరిగిపోయింది. దీంతో ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్న నాయీబ్రాహ్మణులు నిరాదరణకు గురవుతున్నారు. కులవృత్తిని నమ్ముకొని మనుగడ సాగించలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాయీబ్రాహ్మణులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన వరాలు వారిలో ఆశలు చిగురింపజేశాయి. క్షౌ ర వృత్తి దారుల పరిస్థితులను గమనించిన వైఎస్ జగన్ తాము అధికారంలోకి రాగానే సెలూన్ షాపులకు 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం లేదా ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో నియోజకవర్గంలోని 4వేల కుటుంబాలకు లబ్ధిచేకూరుతుంది. వైఎస్సార్ హయాంలో... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నాయీబ్రాహ్మణులు ఎంతో మేలు చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాల్లో ధూప, దీప నైవేద్య పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా అర్చకులతో పాటు ఆలయాల్లో మంగళవాయిద్యాల కోసం చాలామంది నాయీబ్రాహ్మణులకు పర్మినెంట్ కొలువులు లభించాయి. వారంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్చించబడుతున్నారు. అలాగే సెలూన్ల ఏర్పాటు కోసం తక్కువ వడ్డీకే రుణాలు కూడా అందజేశారు. వైఎస్సార్ తర్వాత ఏ నాయకుడూ వారి గురించి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో నాయీబ్రాహ్మణులకు వరాలు కురిపించారు. నాయీబ్రాహ్మణులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రతి పేద నాయీబ్రాహ్మణ కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. దీంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని నాయీబ్రాహ్మణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సీఎం అయితే మంచిరోజులు ప్రజల కష్టాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా చూశారు. క్షౌ రవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న నాయీబ్రాహ్మణ పరిస్థితిని గమనించారు. సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడం గొప్ప నిర్ణయం. కరెంట్ బిల్లుల కష్టాలు దీని ద్వారా తగ్గుతాయి. – శీను, సెలూన్ నిర్వాహకుడు జనన్నకు జీవితాంతం రుణపడి ఉంటా వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితంతం రుణపడి ఉంటా. ఇతర పార్టీల నాయకులు నాయీబ్రాహ్మణులకు ఓటు బ్యాంక్‌గా చూస్తున్నారే తప్ప మా బాగోగులు పట్టించుకోవడం లేదు. ఈ తరుణలో వైఎస్ జగన్ మాగురించి ఆలోచించి ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. దీంతో ప్రతి నెల కొంత వరకు ఆదా అవుతుంది. మా ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. – సుభాష్ -
ఏమిటీ ధోరణి..బాబు!
కడప కార్పొరేషన్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై), ఎన్టీఆర్ నగర్ హౌసింగ్ స్కీం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘అందరికీ ఇళ్లు’ పథకంలో ఇళ్ల కేటాయింపు కార్యక్రమం టీడీపీ ప్రచార సభను తలపించింది. స్థానిక సరోజినీ నగర్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ నగర్లో 516 మంది లబ్ధిదారులకు సోమవారం కంప్యూటర్ ద్వారా డిప్ పద్ధతిలో ప్లాట్లను కేటాయించారు. కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ అరీఫుల్లా, 10వ డివిజన్ కార్పొరేటర్ అందూరి రాజగోపాల్‌రెడ్డి మినహా ప్రొటోకాల్ ఉన్న ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా హాజరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో పేదలకు నిర్మించిన ఇచ్చిన ఇళ్లను ఎలాంటి అర్హత, హోదా లేని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డితో పంపిణీ చేయించడంపై విమర్శలువ్యక్తమయ్యాయి. వేదికంతా టీడీపీ నాయకులే పంచుకోవడంతో కమిషనర్ మినహా ఏ ఒక్క అధికారికి కుర్చీ కూడా మిగల్లేదు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి వికాస్ హరి మాట్లాడుతూ లబ్ధిదారులంతా టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటేసి రుణం తీర్చుకోవాలని పిలుపునివ్వడంపై సభికులంతా విస్మయం వ్యక్తం చేశారు. కేంద్రం 1.50లక్షలు.రాష్ట్ర ప్రభుత్వ 1.50లక్షలు సబ్సిడీ ఇస్తుండగా.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి మాత్రం మొత్తం రూ. 3లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని చెప్పడం గమనార్హం. డిప్యూటీ మేయర్ అరీఫుల్లా మాట్లాడుతూ ఈ ఇళ్లు వంద ఏళ్లు చెక్కుచెదరకుండా ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ డబ్బు చెల్లించి ప్లాట్లు సొంతం చేసుకోవాలని కోరారు. గేటెడ్ కమ్యునిటీ తరహాలో అభివవృద్ధి – కమిషనర్ గేటెడ్ కమ్యునిటీ తరహాలో ఎన్టీఆర్ నగర్లో సదుపాయాలు కల్పిస్తామని కమిషనర్ ఎస్. లవన్న తెలిపారు. కింది ఫ్లోర్లో ఇళ్లు కావాలని ఎవరూ సిఫారసులు తీసుకురావద్దని, అక్కడ అంధులు, వికలాంగులకు కేటాయిస్తున్నామని చెప్పారు. 60 శాతం వైకల్యం ఉన్న వారికి గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లు కేటాయిస్తామన్నారు.అనంతరం కంప్యూటర్ పద్దతిలో మూడు కేటగిరీల ఇళ్లను డిప్ పద్దతిలో కేటాయించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రం«థాలయ సంస్థ ఛైర్మెన్ అందూరి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ నాయకులు మన్మోహన్రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, బాలకొండయ్య, బర్కతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
స్థలం నీది.. అప్పు నాది
∙కార్పొరేషన్ స్థలాలకు ప్రైవేట్ పూతలు ∙వీటి ఆధారంగా నకిలీ దస్త్రాల సృష్టి ∙ష్యూరిటీగా చూపిస్తూ బ్యాంక్ నుంచి రుణాలు ∙ వచ్చిన రుణంలో అందరికీ వాటాలు ∙‘గ్రేటర్’లో అవినీతి భూ భాగోతం సాక్షి, హన్మకొండ : కాసుల వర్షం కురిపిస్తే చాలు వరంగల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తిమ్మినిబమ్మిని చేయడానికి వెనుకాడటం లేదు. కార్పొరేషన్ స్థలాలను ప్రైవేట్ పరం చేసేందుకు సహకారం అందిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా బాలసముద్రం లే అవుట్ నిలుస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్‌కు చెందిన 800 గజాల స్థలం నకిలీ దస్తావేజుల వివాదం కొనసాగుతుండగా, మరో నకిలీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ నకిలీ దస్తావేజులతో ఏకంగా బ్యాంకునే బురిడీ కొట్టించి రూ. 21 లక్షలు స్వాహా చేశారు. కరెన్సీ కొడితే చాలు వరంగల్ నగరం దినాదినాభివృద్ధి చెందుతోంది. రోజుకో రియ ల్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఎవరు రియల్ వెంచర్ చేపట్టినా అందులో పది శాతం స్థలాన్ని సామాజిక అవసరాల కోసం కా ర్పొరేషన్‌కు వదిలేయాల్సి ఉంటుంది. ఇలాంటి స్థలాల్లో కార్పొరేషన్ మార్కెట్లు, పార్కులు తదితర సామాజిక అవసరాలకు తగ్గట్లు అభివృద్ధి చేస్తుంది. ఇలా వందలాది వెంచర్లకు సంబంధించి గ్రేటర్ పరిధిలో వేలగజాల స్థలం కార్పొరేషన్ ఆధీనంలో ఉంది. ఈఖాళీ స్థలాలనుతమవేనని పేర్కొంటున్నారు. నమ్మకం కలిగించేందుకు ఈ ఖాళీ స్థలాల చుట్టూ కంచెలు, ప్రహారీలు నిర్మిస్తున్నారు. ఈ తతంగం అంతా బల్దియా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కనుసన్నల్లోనే నడుస్తుంది. అనంతరం ప్రహారీలు కట్టిన స్థలానికి రిజిస్ట్రేషన్ దస్త్రాలు సృష్టిస్తున్నారు. ఈ పేపర్ల ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. ఇలా స్వాహా చేసిన సొమ్మును వాటాలుగా పంచుకుంటున్నారు. మోసం ఇలా... ప్రస్తుతం నగరం నడిబొడ్డున హన్మకొండలో ఉన్న బాలసముద్రం లే అవుట్‌ను ఐదు దశాబ్దాల కిందట చేశారు. ఈ స్థలాలను విక్రయించగా పలువురు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ప్రాంతం నగరం నడిబొడ్డుకు రావడంతో ఇక్కడి స్థలాలు విలువ చుక్కలను అంటుతోంది. ఈ లేవుట్ 1066 సర్వేనంబర్‌లో ఉండగా నిబంధనల ప్రకారం పార్కులు, ఆలయం తది తర సామాజిక అవసరాల కోసం దాదాపు 5,500 గజాల స్థలా న్ని కార్పొరేషన్‌కు కేటాయించారు. ఈ స్థలం బాలసముద్రం లే అవుట్లో మొత్తం 15 చోట్ల వేర్వేరుగా ఉంది. ఇందులో 360 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. చుట్టూ ప్రహా రి నిర్మించారు. ఈ స్థలాన్ని 2007లో కొనుగోలు చేసినట్లు నకిలీ దస్తావేజులు సృష్టించారు. అనంతరం ఈ విలువైన స్థలాన్ని ఘ్యూరిటా చూపిస్తూ జనగామలో ఓ ప్రభుత్వ బ్యాంక్ నుంచి దాదాపు రూ.21 లక్షల రుణం పొందారు. ఈ విషయం బయటకుపొక్కడంతో ప్రహారి కూల్చేస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ బ్యాంక్ భారీగా నష్టపోగా....అక్కడి నుంచి వచ్చిన రుణంలో ఎవరి వాటాలు వారికి క్షేమంగా చేరాయి. అదమరిస్తే అంతే... కార్పొరేషన్ ఖాళీ స్థలాలను ప్రైవేట్ స్థలాలుగా నమ్మిస్తూ బ్యాంకులను బోల్తా కొట్టిస్తున్న మోసాల్లో బల్దియా టౌన్‌ప్లానింగ్ సిబ్బంది సహకారాలు మెండుగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మొత్తం స్థలాలనే ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తూ అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. గ్రేటర్ వరంగల్ తాజాసర్వే ప్రకారం నగర పరిధిలో కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాలు 600 వరకు ఉన్నాయి. ఇందులో చాలా స్థలాలపై తప్పుడు దస్త్రాలను సృష్టించి అప్పు లు తీసుకోవడం, అవకాశం ఉంటే కబ్జా చేయడం జరుగుతోంది. పదిరోజుల వ్యవధిలో ఒక్క బాలసముద్రం లే అవుట్‌కు సంబంధించి రెండు వివాదాలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాలపై సమగ్ర విచారణ జరిపించి, కాపాడుకోవాల్సిన బాధ్యత బల్దియాపై ఉంది. -
మట్టి రోడ్లు కనపడనీయం : మంత్రి
కరీంనగర్ కార్పొరేషన్ : జిల్లాకేంద్రంలో మట్టిరోడ్లు కనబడకుండా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం 49, 35 డివిజన్లలో రూ.29 లక్షలు, రూ.12 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. 40 ఏళ్లుగా జరగని అభివృద్ధిని టీఆర్ఎస్ రెండేళ్లలో చేసి చూపెడుతోందని, తెలంగాణకు గుండెకాయలాంటి కరీంనగరాన్ని సీఎం కేసీఆర్ హామీలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.100 కోట్లకుపైగా రోడ్ల అభివృద్ధికి మంజూరు చేశామని, దసరా వరకు ప్రధాన రోడ్ల పనులన్నీ పూర్తవుతాయని పేర్కొన్నారు. రూ.300 కోట్లతో మానేరు వాగుపై చెక్‌డ్యాం నిర్మాణం, బోటింగ్ ఏర్పాటు, రూ.150 కోట్లతో బృందావనం వంటి గార్డెన్ నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ టెండర్లలో లెస్‌కు పనులు దక్కించుకున్నా నాణ్యత పాటించాల్సిందేనన్నారు.