
సాక్షి, తమిళసినిమా: నటుడు మన్సూర్ అలీఖాన్ ఇంటికి చెన్నై నగర కార్పొరేషన్ అధికారులు సీలు వేశారు. సంచలన నటుడు, నిర్మాత, రాజకీయవాది మన్సూర్ అలీఖాన్‌కు స్థానిక చూలైమేడులో ఇల్లు ఉంది. అందులోనే ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి నివసిస్తున్నారు. అయితే ఆయన ప్రభుత్వానికి చెందిన 2,400 గజాల పొరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని ఇంటిని నిర్మించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఈ విషయమై చెన్నై నగర కార్పొరేషన్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో తనను మోసం చేసి పొరంబోకు స్థలాన్ని విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని మన్సూర్ అలీఖాన్ 2019లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టి వేసింది. దీంతో శనివారం అధికారులు మన్సూర్ అలీఖాన్ ఇంటికి సీల్ వేశారు. వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో కలకలం రేకెత్తిస్తోంది.
చదవండి: Telangana Devudu: వెండితెరపై సీఎం కేసీఆర్ బయోపిక్.. తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment