Mansoor Ali Khan
-
వివాదాస్పద నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన ఆరోపణలు....!
కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్‌పై విష ప్రయో గం జగిందనే వార్త లు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారాయి. బుధవారం వరకు అన్ని రాజకీయపార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచా రం సాగించారు. కాగా నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈయన బుధవారం వేలూ రు పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేస్తుండగా కొందరు బలవంతంగా పండ్ల జ్యూస్‌ను తాగించారు. ఆ తరువాత మజ్జిగను కూ డా తాగించడంతో కడుపునొప్పికి గురైన నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ వెంటనే కిందకు పడిపోయాడు. కార్యకర్తలు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను మన్సూర్ అలీఖాన్ సన్నిహితులు మీడియాకు విడుదల చేశారు. అందులో నటుడు మన్సూర్‌అలీఖాన్ పేర్కొంటూ తాను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా కొందరు తనతో బలవంతంగా పండ్ల రసాన్ని తాగించారని.. ఆ వెంటనే మజ్జిగను కూడా ఇచ్చారని, అది తాగిన తాను తీవ్ర కడుపు నొప్పితో కిందికి పడిపోయానని పేర్కొన్నారు. తన వెంట ఉన్న కార్యకర్తలు వెంటనే ఆస్పతికి తీసుకెళ్లారని.. పరీక్షించిన వైద్యులు విష ప్రయోగం జరిగిందని చెప్పారన్నారు. ప్రస్తుతం తాను ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాననే నమ్మకముందని మన్సూర్ అలీఖాన్ వ్యక్తం చేశారు. -
మన్సూర్‌కు ఊహించని దెబ్బ.. స్థాపించిన పార్టీలోనే వేటు!
సంచలన నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. తను స్థాపించిన సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఇండియా జననాయక పులిగళ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. మన్సూర్.. ఇండియా జననాయక పులిగళ్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల గురించి చర్చించడానికి పార్టీ కార్యవర్గ సమావేశం ఇటీవల స్థానిక వలసరవాక్కంలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడినే తప్పించారా? ఆ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా జననాయక పులిగళ్ పార్టీ ఎవరితో కూటమి ఏర్పరచాలన్న అంశం నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రధాన కార్యదర్శి కన్నదాసన్‌కు ఇచ్చేలా తీర్మానం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కన్నదాసన్నే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా పార్టీ అధ్యక్ష పదవి నుంచి మన్సూర్ అలీఖాన్‌ను తొలగించేలా కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమ్మతి లేకుండా ఏఐఏడీఎమ్‌కే పార్టీతో పొత్తుకు ప్రయత్నించినందువల్లే మన్సూర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. ఆఫీస్ బాయ్ దీనిపై నటుడు మన్సూర్ అలీఖాన్ స్పందిస్తూ.. ఇండియా జననాయక పులిగళ్ పార్టీకి కుండ్రత్తూర్ బాలమురుగన్ ప్రధాన కార్యదర్శి అని పేర్కొన్నారు. కన్నదాసన్ అనే వ్యక్తి పార్టీ శాశ్వత సభ్యుడు సెల్వపాండియన్ ద్వారా ఆఫీస్ బాయ్‌గా చేరారన్నారు. ఆఫీస్‌లో రూ. 70 వేలు విలువైన రబ్బర్ స్టాంప్, ఖరీదైన ల్యాప్‌టాప్‌లను అతను దొంగిలించారన్నారు. తర్వాత పార్టీ నాయకుడిగా మారాడు. అయితే ప్రస్తుతం తాను రానున్న ఎన్నికల్లో భాగంగా ఆరణీ, పెరంబలూర్ నియోజక వర్గాల్లో ప్రచారంలో మునిగిపోయానని, ఆ విషయం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు. చదవండి: రజనీకాంత్ పేరుతో మోసాలు.. రూ. 4 లక్షలు పోగొట్టుకున్న యువతి -
త్రిష,చిరంజీవి కేసు విషయంలో మన్సూర్ అలీఖాన్‌కు ఊరట
కోలీవుడ్ నటుడు,రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్రంగా ఖండించారు. అయితే నటి త్రిషకు మహిళా కమిషన్ సభ్యులు అండగా నిలిచి, చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటుడు మన్సూర్ అలీఖాన్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే త్రిషకు టాలీవుడ్ నటుడు చిరంజీవి మద్దతు పలికారు. వారిద్దరూ మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో తన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నటి త్రిష, కుష్బూ, చిరంజీవి ప్రవర్తించారంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన పిటిషన్ విచారించిన న్యాయస్థానం నిజానికి నటి త్రిషనే మీపై పిటీషన్ దాఖలు చేయాలని మందలించడంతోపాటు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను నటుడు మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని చైన్నె, అడయార్ క్యాన్సర్ ఆస్పత్రికి అందించాలని ఆదేశించింది. అయితే తనపై విధించిన జరిమానాలు రద్దు చేయాలంటూ నటుడు మన్సూర్ చైన్నె హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆయనపై విధించిన రూ.లక్ష జరిమానాను రద్దు చేస్తూ, ఈ కేసును కూడా కొట్టివేయాలని సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది. -
త్రిషపై మరోసారి అలాంటి కామెంట్స్.. ఇంతటి నీచానికి దిగుజారుతారా?
గతేడాది లియోతో సూపర్ హిట్ కొట్టిన భామ త్రిష. విజయ్ సరసన హీరోయిన్గా నటించి బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదస్పదమయ్యాయి. ఏకంగా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడ్డారు. అయితే తాజాగా అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు చేసిన అసభ్యకర కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్రిషపై ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ అతనిపై మండిపడుతున్నారు. తక్షణమే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో త్రిషకు పలువురు అండగా నిలుస్తున్నారు. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలవుతోంది. (ఇది చదవండి: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!) తాజాగా ఈ విషయంపై హీరోయిన్ త్రిష స్పందించింది. ఫేమస్ కావడం కోసం ఏంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు అవీ.. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. దీనిపై త్వరలోనే న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ తదుపరి చర్యలు తీసుకుంటుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్‌కు తీసుకొచ్చారని ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఏవీ రాజు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది చూసిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా త్రిషపై అసభ్యంగా మాట్లాడిన ఏవీ రాజును అరెస్ట్ చేయాలని నటుడు, దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై నటీనటుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బహిరంగంగా సినీ పరిశ్రమలోని సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. WTF this Trisha should file legal action against him,nowdays these guys are behaving very cheaply #Trisha | #TrishaKrishnan pic.twitter.com/Ip1ZClB8xS — Sekar 𝕏 (@itzSekar) February 20, 2024 It's disgusting to repeatedly see low lives and despicable human beings who will stoop down to any level to gain https://t.co/dcxBo5K7vL assured,necessary and severe action will be taken.Anything that needs to be said and done henceforth will be from my legal department. — Trish (@trishtrashers) February 20, 2024 வன்மையாக கண்டிக்கிறேன்.. எந்த ஆதரமுமின்றி பொது வெளியில் திரைத்துறையினர் பற்றி பெயர் சொல்லி அவதூறு கிளப்பிய இவரை சட்டமும் காவல்துறையும் உரிய நடவடிக்கை எடுக்க வேண்டும்... @VishalKOfficial @Karthi_Offl நடிகர் சங்கம் இதற்கு தகுந்த பதிலும் நடவடிக்கையும் எடுக்கும் என நம்புகிறேன் https://t.co/fRNYxH5DAV — Cheran (@directorcheran) February 20, 2024 Shocked & disgusted by the behaviour of Ex AIADMK functionary A. V. Raju for making unwarranted , baseless, loose and completely false allegations about Trisha. It is 2024; we talk about women empowerment & equality - why drag an unrelated person into personal mud slinging. There… — Aditi Ravindranath (@aditi1231) February 20, 2024 -
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మళ్లీ మొదలుపెట్టిన నటుడు!
తప్పు చేసిందే కాకుండా తప్పించుకోవాలని చూశాడు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్. హీరోయిన్ త్రిషపై ఈయన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే! 'లియో సినిమాలో హీరోయిన్ త్రిష అని తెలిశాక తనతో బెడ్రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను, కానీ అది జరగలేదు' అని వ్యాఖ్యానించాడు. ఇందులో అశ్లీల ధ్వనికి హీరోయిన్ త్రిష స్పందించింది. తనతో ఇంకే సినిమాలోనూ నటించేదే లేదని తేల్చి చెప్పింది. చిరంజీవి, ఖుష్బూ వంటి పలువురు తారలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. తన మాటల్లో తప్పు కనిపించలేదుకానీ అందరూ తనను తప్పుపడుతున్నారని ఫీలయ్యాడు మన్సూర్. కోటి అడిగాడు.. రూ.1 లక్ష కట్టమన్న కోర్టు త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేశాడు. ఈ వ్యవహారంలో తాను అమాయకుడినని, తనకు ముగ్గురి నుంచి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్ వేశాడు. ఇది చూసి బిత్తరపోయిన కోర్టు మన్సూర్‌కు గడ్డిపెట్టింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన నీవు వారిపై పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కోర్టు సమయం వృథా చేసినందుకుగానూ చెన్నైలో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు రూ.1 లక్ష చెల్లించాలంటూ సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల్లో కడతానంటూ ట్విస్ట్ ఇది జరిగి నెల రోజుల పైనే అవుతోంది. ఇప్పటివరకు మన్సూర్ ఆ రుసుమును కట్టనేలేదు. వారం రోజుల క్రితం కోర్టు ఇదే విషయాన్ని గుర్తు చేయగా మరో పది రోజుల గడువు కావాలన్నాడు నటుడు. అతడి అవస్థను చూసిన న్యాయస్థానం.. ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ఆచితూచి మాట్లాడటం నేర్చుకోమని మొట్టికాయలు వేస్తూనే మరో పది రోజుల గడువు ఇచ్చింది. చివరకు ఆ డబ్బు ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు నటుడు. స్టేకు నిరాకరించిన న్యాయస్థానం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలుకు దరఖాస్తు చేశాడు. మన్సూర్ వైఖరికి విస్తుపోయిన న్యాయస్థానం.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించింది. డబ్బు కడతానని అంగీకరించాక ఆ తీర్పును ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఎదుటే ఏ విషయమో తేల్చుకుని రావాలని చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. గొడవ సద్దుమణిగిందనుకుంటే ఈయన మళ్లీ మొదలుపెట్టాడేంట్రా బాబూ అని తల బాదుకుంటున్నారు సినీప్రేక్షకులు. చదవండి: థియేటర్లో హనుమాన్ చూస్తూ మహిళ వింత చేష్టలు.. వీడియో వైరల్ -
హీరోగా కాంట్రవర్సీ నటుడు మన్సూర్.. అలాంటి సినిమాలో
నటుడు మన్సూర్ అలీఖాన్ పేరు ఈ మధ్య తెగ వినిపించింది. విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. నిజ జీవితంలోనూ విలన్‌గా ప్రవర్తించాడు. 'లియో' మూవీలో ఓ సీన్లో హీరోయిన్ త్రిషని మానభంగం చేయాలని ఉందని మైండ్ పోయే కామెంట్స్ చేశాడు. ఈ మాటల వల్ల కోర్టు, కేసులని గొడవ చాలా దూరం పోయింది. ప్రస్తుతం దాని గురించి అందరూ మర్చిపోయారు. అయితే మన్సూర్ హీరోగా నటించిన ఓ సినిమా తాజాగా రిలీజైంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తపై దాడి చేసిన యువకుడు) సరక్కు పేరుతో తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమాలో మన్సూర్ అలీఖాన్ న్యాయవాదిగా నటించాడు. మద్యానికి బానిసై, డబ్బు కోసం అందరినీ మోసం చేస్తూ, కుటుంబాన్ని కూడా సరిగా పట్టించుకోని వ్యక్తి పాత్రలో మన్సూర్ నటించాడు. ఇది చూస్తే మన్సూర్ నిజ జీవిత పాత్రలా అనిపించింది పలువురు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మన్సూర్ హీరో కావడం, మద్యం కాన్సెప్ట్ మూవీ కావడంతో ఇది కాస్త ఆసక్తికరంగా అనిపించింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
చిరంజీవిపై కేసు.. మన్సూర్‌కు గడ్డిపెట్టిన కోర్టు!
మన్సూర్ అలీ ఖాన్.. కొంతకాలంగా ఈ నటుడి పేరు వార్తల్లో మారుమోగుతోంది. గతంలో తాను ఎన్నో అత్యాచార సీన్లలో నటించానని, లియో మూవీలో కూడా త్రిషతో అలాంటి సీన్ ఉంటుందనుకున్నానని, కానీ ఆ సీన్ లేకపోవడంతో బాధేసిందంటూ చిల్లర కామెంట్లు చేశాడు. అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారగా త్రిష మన్సూర్‌పై ఫైర్ అయింది. కోటి కావాలంటూ కోర్టుకు.. చిరంజీవి, ఖుష్బూ, చిన్మయి.. తదితర సెలబ్రిటీలు సైతం త్రిషకు మద్దతుగా నిలిచి మన్సూర్ వైఖరిని తప్పుపట్టారు. దీంతో త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూపై పరువునష్టం దావా వేశాడు మన్సూర్. ఈ వ్యవహారంలో తాను అమాయకుడినని, తనకు ముగ్గురి నుంచి చెరో కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలంటూ పిటిషన్ వేశాడు. దీనిపై శుక్రవారం నాడు విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు.. మన్సూర్‌పై మండిపడింది. పబ్లిసిటీ స్టంట్ 'ఒక నటిపై మన్సూర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకుగానూ మిగతా ముగ్గురు నటులు ఆమెకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. అలాంటి మాటలు మాట్లాడితే ఏ మనిషైనా అలాగే స్పందిస్తాడు. ఈ విషయంలో వారికి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేసినట్లే ఉంది' అంటూ మన్సూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ సతీశ్ కుమార్ సదరు పిటిషన్‌ను కొట్టివేశాడు. అంతేకాకుండా తమ సమయం వృథా చేసినందుకుగానూ లక్ష రూపాయలు చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెల్లించాలని మన్సూర్‌ను ఆదేశించాడు. చదవండి: ఏడాది కింద నటుడితో నిశ్చితార్థం.. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పిన బ్యూటీ -
హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!
కొన్నిరోజుల ముందు త్రిష-మన్సూర్ వివాదం.. ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైపోయింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా 'లియో' మూవీ గురించి మాట్లాడిన నటుడు మన్సూర్.. ఓ సీన్ చూస్తున్నప్పుడు హీరోయిన్ త్రిషని బలత్కారం చేయాలనిపించిందని చిల్లర కామెంట్స్ చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. చాలామంది మన్సూర్ కామెంట్స్ ఖండిస్తూ, త్రిషకు అండగా నిలిచారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?) అయితే త్రిషకు సపోర్ట్ చేసిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి, ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో మన్సూర్ అస్సలు సైలెంట్‌గా ఉండలేదు. తనని విమర్శించిన చిరు, ఖుష్బూతో పాటు త్రిషపై పరువు నష్టం దావా కేసు వేశాడు. ఈ వ్యవహారంలో తన అమయాకుడినంటూ హైకోర్టుని ఆశ్రయించాడు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మన్సూర్‌కి మొట్టికాయలు వేసేలా తీర్పు ఇచ్చింది. 'పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్‌లో హీనమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ త్రిష నీపై కేసు పెట్టాలి. మీకు(మన్సూర్ అలీఖాన్) వివాదాల్లో తలదూర్చడం అనే అలవాటు ఉంది. ప్రతిసారి అలా చేయడం.. ఆ తర్వాత వచ్చి అమాయకుడినని అనడం అలవాటైపోయింది' అని మన్సూర్ కేసుపై మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఇప్పటికైనా మన్సూర్ మారతాడా అనేది సందేహమే? (ఇదీ చదవండి: మంచు విష్ణు మూవీ షూటింగ్.. గాయపడ్డ స్టార్ కొరియోగ్రాఫర్) -
అన్నంత పని చేసిన మన్సూర్ అలీఖాన్
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ శుక్రవారం నటి త్రిష కృష్ణన్, నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్, నటుడు చిరంజీవిపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో కోరారు. మన్సూర్ అలీఖాన్ వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని ఆరోపించారు. ఈ కేసు డిసెంబర్ 11వ తేదీ సోమవారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. నటి త్రిష కృష్ణన్‌పై మన్సూర్ ఖాన్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనను నటి త్రిష కృష్ణన్, LEO డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, మాళవిక మోహనన్, చిరంజీవి, మరికొందరు నటీనటులతో పాటు తమిళ నటుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దీని తర్వాత నటి, పొలిటీషియన్, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలీఖాన్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో కోరారు. దీంతో చెన్నై థౌజండ్ లైట్ పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (ఇదీ చదవండి: 'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్) ఫిర్యాదు దాఖలైన సమయంలో, మన్సూర్ అలీఖాన్ చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు, మన్సూర్ అలీఖాన్ ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో త్రిషకు మన్సూర్ క్షమాపణలు చెప్పాడు. ఆయన క్షమాపణలను కూడా త్రిష అంగీకరించింది. త్రిష Vs మన్సూర్ మధ్య ఏం జరిగిందంటే నటుడు మన్సూర్ అలీఖాన్ కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్ త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, 'లియో'లో కూడా అలాంటి ఛాన్స్ త్రిషతో కూడా ఉంటుందని భావించినట్లు వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. కానీ లియో సినిమాలో అలాంటి సీన్ లేకపోవడంతో తనకు బాధ కలిగిందన్నాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో త్రిష కూడా మన్సూర్‌పై ఫైర్ అయింది. ఇలాంటి వారితో ఒక్క సినిమాలో కూడా నటించనందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో త్రిషకు మెగా స్టార్ చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, సింగర్ చిన్మయి,లోకేశ్ కనగరాజ్,కుష్బూ నిలిచారు. -
యానిమల్ చిత్రంపై త్రిష పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు తొలగింపు
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవల విడుదల చేసిన చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్- రష్మిక కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం ఈ చిత్రంలో హింసాత్మక, స్త్రీ ద్వేషపూరితమైన కంటెంట్ ఉందంటూ విస్తృతంగా విమర్శించబడింది. యానిమల్‌లో యాక్షన్ సన్నివేశాల్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ అదరగొట్టారని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో ఎక్కువగా లైంగిక, గృహ హింసకు సంబంధించిన సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ తీవ్ర ప్రతిఘటనను ఈ చిత్రం ఎదుర్కొంది. (ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) ఈ నేపథ్యంలో నటి త్రిష కృష్ణన్ ఇటీవల యానిమల్ చిత్రాన్ని సోషల్ మీడియాలో సమీక్షించి, దానిని 'కల్ట్'గా అభివర్ణిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇది నెటిజన్లకు పెద్దగా నచ్చలేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై త్రిష చేసిన కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సినిమాపై 'కల్ట్... Pppppppaaaaaahhhhhh.' అని తన ఎక్స్ పేజీలో రాసింది. అయితే త్రిష కామెంట్‌పై సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు. దీంతో ఆమె తన పోస్ట్‌ను తొలగించింది. అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం దానిని స్క్రీన్‌షాట్‌ను తీశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Trisha's review on #Animal. Deleted the story now..!! pic.twitter.com/hDuwecUAps — AB George (@AbGeorge_) December 3, 2023 లియో చిత్రంలో త్రిషతో 'బెడ్రూమ్ సీన్' లేకపోవడంతో నిరాశ చెందాననని మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. అతను గతంలో ఇతర మహిళా నటీనటులతో అనేక 'రేప్ సన్నివేశాలలో' తన ప్రమేయం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అతని ప్రకటనపై త్రిష స్పందిస్తూ తన అసమ్మతిని ట్వీట్ చేసి భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయడానికి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. పలువురు ప్రముఖులు కూడా త్రిషకు మద్దతుగా నిలిచారు. అయితే సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాపై త్రిష ప్రశంసలు కురిపించడంతో మరోసారి ఇంటర్నెట్ దద్దరిల్లింది. గృహ హింస, లైంగిక హింసను కలిగి ఉన్న సినిమాని త్రిష మెచ్చుకున్నారని చాలా మంది విమర్శించారు. అయితే, మరికొందరు త్రిషను సమర్థించారు. యానిమల్‌లో ఎక్కువగా బోల్డ్, హింసకు సంబంధించిన సీన్లే ఉన్నాయి. అలాంటి సినిమాను త్రిష ఎందుకు మెచ్చుకున్నారు. ఈ సినిమాను కొందరు పురుషులు కూడా విమర్శిస్తున్నారు.. అలాంటిది త్రిష ఎందుకు హైప్ చేస్తున్నారని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. ఒకవైపు మన్సూర్ వ్యాఖ్యలను ఆమె ఖండిస్తూనే మరోవైపు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే చిత్రానికి మద్దతిస్తున్నట్లు మరోక నెటిజన్ తెలిపాడు. అయితే, కొంతమంది త్రిషకు మద్దతుగా కామెంట్ చేశారు. మన్సూర్ అలీ ఖాన్‌తో ఆమెకు ఉన్న వివాదాన్ని తీసుకొచ్చి యానిమల్ చిత్రంపై ఆమెకు ఉన్న అభిప్రాయాన్ని పోల్చకూడదని వాదించారు. Trisha's review on #Animal. Deleted the story now..!! pic.twitter.com/hDuwecUAps — AB George (@AbGeorge_) December 3, 2023 Trisha praised #Animal movie and wokes started bullying her with hate Tweets. 😐 — . (@Midz13) December 3, 2023 Trisha’s comment on Animal does not invalidate that she does not like what happened to her. Her being verbally harassed matters and holds value regardless of her being a misogynist. — Lakshita Shankar (@lakshitposts) December 3, 2023 Trisha praised #Animal movie and wokes started bullying her with hate Tweets. 😐 — . (@Midz13) December 3, 2023 -
త్రిషపై నటుడి అనుచిత వ్యాఖ్యలు.. హీరోయిన్ ఇలా చేసిందేంటి?
స్టార్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. మహిళా కమిషన్.. మన్సూర్‌పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేశారు. మన్సూర్ పోలీసుల ఎదుట విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే అక్కడ నటుడికి చుక్కెదురైంది. దీంతో మన్సూర్ త్రిషకు క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత మాత్రం తన మాటలను వక్రీకరించారంటూ తానెవరికీ సారీ చెప్పలేదని బుకాయించాడు. అంతేకాదు త్రిషతో పాటు ఆమె మద్దతుగా నిలబడ్డ కుష్బూ, టాలీవుడ్ చిరంజీవిపై పరువు నష్టం దావా వేస్తానని మాట్లాడారు. ఈ వ్యవహారం పక్కన పెడితే పోలీసులు మన్సూర్ అలీఖాన్ విషయంలో త్రిషను విచారించడానికి ఆమెకు లేఖ రాశారు. అందుకు త్రిష స్పందిస్తూ శుక్రవారంనాడు పోలీసులకు తిరిగి లేఖ రాశారు. అందులో మన్సూర్ అలీ ఖాన్ తనకు క్షమాపణ చెప్పారని ఆయనపై చర్యలు తీసుకోవద్దని పేర్కొన్నారు. మరి ఈ వ్యవహారం మున్ముందు ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి! చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. అందుకే టాస్క్‌లు.. -
త్రిషకు చిరంజీవి మద్ధతు.. అసలు కారణం ఇదా..?
బురదలో రాయి వేస్తే ఏమౌతుంది..? ఆ బురద మనకే అంటుతుంది అనేలా ఉంది కోలీవుడ్‌లో మన్సూర్ వివాదం. మొదట హీరోయిన్ త్రిషపై ఆయన చేసిన అసభ్య కామెంట్లతో మొదలైన గొడవ టాలీవుడ్‌పై కూడా ప్రభావం చూపింది. త్రిషకు మద్ధతుగా మెగాస్టార్ చిరంజీవి నిలిచిన పాపానికి తిరిగి అతనిపైన చెత్త మాటలు విసిరాడు మన్సూర్. త్రిష, ఖుష్భూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా వేస్తానంటూ ప్రకటించిన మన్సూర్ అంతటితో ఆపలేదు. తనది వక్రబుద్ధి అన్న చిరంజీవి గతంలో పార్టీ పెట్టి వేల కోట్లు దండుకున్నాడని, కనీసం పేదలకు కూడా ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించాడు. అంతే కాకుండా రీయూనియన్ పేరుతో అలనాటి హీరోయిన్లతో పార్టీలు చేసుకోవడం వంటి మాటలు విసిరాడు. సౌత్ ఇండియాలో 1980-1990 దశకంలో రానించిన హీరో,హీరోయిన్లతో చిరంజీవి రీయూనియన్ అవుతున్నాడు. కానీ దీనిని మన్సూర్ తప్పుగా క్రియేట్ చేశాడు. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే మన్సూర్ చేశాడనేది చెన్నై ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అందుకే ఆయన రోజుకో మాట మాట్లాడుతున్నాడని చెప్పుకొచ్చింది. త్రిషకు చిరంజీవి సపోర్ట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటని చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న... మెగాస్టార్- వశిష్ట కాంబోలో విశ్వంభర చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో త్రిష ఒక హీరోయిన్గా తీసుకున్నారని టాక్ ఉంది. అందుకే త్రిష కోసం సపోర్టుగా చిరంజీవి నిలిచారని సమాచారం. చాలా వరకు వివాదాలకు దూరంగా ఉండే చిరు.. త్రిష కారణంగా అవసరంలేని మాటలు పడుతున్నాడు. అంతేకాకుండా ఆధారాల్లేని ఆరోపణలు ఎదర్కొవాల్సి వస్తుంది. ఈ అంశంపై మన్సూర్ పట్ల చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. -
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పలేదన్న నటుడు
ఈ మధ్య ఫిల్మీదునియాలో, సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు మన్సూర్ అలీ ఖాన్. ఇటీవల ఈయన హీరోయిన్ త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద తుపానునే సృష్టించాయి. లియో సినిమాలో త్రిషతో బెడ్ రూమ్ సీన్స్ ఉంటాయని భావించానని, కానీ అలాంటి సన్నివేశాలు లేకపోవడంతో నిరాశపడ్డానని నటుడు మన్సూర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేయగా మొదట క్షమాపణలు చెప్పడానికి మొండికేసిన మన్సూర్ తర్వాత సారీ చెప్తూ ఓ లేఖ కూడా విడుదల చేశాడు. వ్యంగ్యంగా సారీ చెప్పిన నటుడు 'నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్దం చేశాను. ఈ వార్‌లో రక్తపాతం లేకుండానే గెలిచాను! ఏదేమైనా నా వ్యాఖ్యలతో త్రిష మనసు బాధపెట్టినందుకు క్షమాపణ చెబుతున్నా. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది. అప్పుడు లక్షలాది మంది చనిపోవడంతో, అశోక చక్రవర్తి గుండె నుంచి రక్తం ఏరులై పారింది. దీంతో ఆయన అహింసను స్వీకరించాడు. ఇక్కడ నేను కూడా అహింస మార్గం వైపే నిలబడ్డాను' అని లేఖలో రాసుకొచ్చాడు. నేను ఒకటి చెప్తే తనకు మరోలా అర్థమైంది అయితే ఇప్పుడు మాత్రం ప్లేటు తిప్పేశాడు మన్సూర్. తానసలు క్షమాపణలు చెప్పలేదని అంటున్నాడు. 'నేను నా మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడు మారనితువిడు (నన్ను చంపేయండి) అని చెప్పాను. కానీ నేను చెప్పింది అతడికి మన్నితువిడు(క్షమించండి)లా వినిపించింది. అందుకే లేఖలో అలా రాసినట్లున్నాడు. నేను త్రిషకు సారీ చెప్పడమనేది పెద్ద జోక్' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వివాదంలో త్రిషకు అండగా నిలబడ్డ చిరంజీవి, ఖుష్బూలపైనా పరువు నష్టం దావా వేశాడు మన్సూర్ అలీ ఖాన్. చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలివే! -
చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నాడు..మన్సూర్ సంచలన వాఖ్యలు!
త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చిరంజీవి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. త్రిషకు మద్దతు ప్రకటిస్తూ.. వక్రబుద్ది కలిగిన వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తారంటూ..మన్సూర్‌ని విమర్శించాడు. అయితే అసలు విషయం తెలుసుకోకుండా తనను విమర్శించాడంటూ చిరంజీవిపై మండిపడ్డాడు మన్సూర్ అలీఖాన్. అంతేకాదు త్రిష, కుష్భూలతో పాటు చిరంజీవిపై కూడా పరువునష్టం దావా వేశాడు. చిరంజీవి మీద రూ. 20 కోట్లు, త్రిష కుష్బూల మీద రూ. 10 కోట్ల చొప్పున దావా వేస్తున్నట్టుగా తాజాగా మన్సూర్ తెలిపాడు. ఇంతటితో ఆగకుండా.. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించుకున్నాడు కానీ పేదవాళ్లకు సహాయం చేయలేదని విమర్శించాడు. ‘నాది వక్రబుద్ధి అని చిరంజీవి అన్నాడు కదా..మరి ఆయన ఏం చేశాడు? పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవారికి సాయం చేయలేదు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ నాకు తెలీదు.. ఆయన కూడా పార్టీ పెట్టాడు.. వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలీదు.. ఆ డబ్బంతా వాళ్ల కోసమే వాడుకుంటున్నారు. ప్రతి సంవత్సరం చిరంజీవి ఓల్డ్ హీరోయిన్లకు పార్టీ ఇస్తుంటాడు. ఆ పార్టీకి ఎప్పుడూ నన్ను పిలవలేదు అనుకోండి. ఆయన కేవలం హీరోయిన్లకు మాత్రమే పార్టీ ఇస్తాడు. అది ఆయన ఇష్టం. కానీ నాపై విమర్శలు వచ్చినప్పుడు.. అసలు ఏం జరిగిందనే విషయాన్ని నాకు ఫోన్ చేసి తెలుసుకొని ఉంటే బాగుండేది. అలా కాకుండా ఆయన ఏదోదో మాట్లాడాడు. అవి నన్ను బాధించాయి. త్రిష, కుష్భూలపై రూ. 10 కోట్ల చొప్పున, చిరంజీవిపై రూ. 20 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. వచ్చిన డబ్బును తమిళనాడులో మద్యం దాగి చనిపోయిన కుటుంబాలకు అందజేస్తా’అని మన్సూర్ అన్నారు. ప్రస్తుతం మన్సూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #MansoorAliKhan Comments on #Chiranjeevi: 👉 Aayana Old Heroines tho Every Year Party Cheskuntadu. 👉 Okasari Naku Call Chesi Asal Em Jarigindhi ani Adagalsindi. pic.twitter.com/b44tLcpSmc — Movies4u Official (@Movies4u_Officl) November 28, 2023 -
త్రిష, చిరంజీవిపై కేసు.. మళ్లీ రచ్చ చేస్తున్న మన్సూర్..!
తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కొద్దిరోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని తరువాత, నటి త్రిష తన సోషల్ మీడియా పేజీలో మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. 'మహిళలను కించపరిచే విధంగా మన్సూర్ అలీఖాన్ మాట్లాడాడు. ఆయనతో మళ్లీ నటించను. అతనిపై చర్యలు తీసుకోవాలని పోస్ట్ చేశారు. దీని తరువాత, నటి ఖుష్బూ, చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై తమ నిరసనను వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: నటుడు నరేశ్‌కు దక్కిన అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్ కల్నల్‌గా గుర్తింపు) అయితే తానేమీ తప్పుగా మాట్లాడలేదని మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. మరోవైపు నటుడు మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు లేఖ పంపింది. దీంతో చెన్నై పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. నటుడు మన్సూర్ అలీఖాన్ అదృశ్యమయ్యారనే వార్తల నేపథ్యంలో, దానిని ఖండిస్తూ ఆడియోను విడుదల చేశారు. అనంతరం నవంబర్ 23న మన్సూర్ అలీఖాన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంలో, త్రిష గురించి మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతూ మన్సూర్ అలీఖాన్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటనలో, 'నా తోటి నటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి' అని చెప్పాడు. ఈ నేపథ్యంలో నటి త్రిష తన సోషల్ మీడియా పేజీలో 'తప్పు చేయడం మానవుడి సహజం, క్షమించడం అనేది దైవం చూసుకుంటుంది' అని పోస్ట్ చేసింది.దీంతో ఈ గొడవ ముగిసింది అనుకుంటే.. తాజాగా మళ్లీ మన్సూర్ తెరపైకి వచ్చాడు. ఆ ముగ్గురిపై కేసు ఖుష్బు, త్రిష, చిరంజీవిలపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రకటించారు. తన లాయర్ గురు ధనంజయన్ ద్వారా రేపు కోర్టులో కేసు వేయబోతున్నట్లు తెలిపారు. వారి ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని ఆయన ప్రకటించాడు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ వల్ల రచ్చ.. వనిత విజయ్‌కుమార్‌పై దాడి) నవంబర్ 11న విలేకరుల సమావేశంలో తాను మాట్లాడిన ‘నిజమైన వీడియో’ని వారికి పంపించానని మన్సూర్ తెలిపాడు. సరిగ్గా వారం తర్వాత నవంబర్ 19న జరిగిన ఈ వీడియోనే తన ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించారన్నారు. ఈ కేసులో తాను నిజమైన వీడియోను పంపానని, మరికొన్ని ఆధారాలతో రేపు కేసు నమోదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ముగిసిపోయిన గొడవను మళ్లీ మన్సూర్ తెరపైకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. -
త్రిష చుట్టూ మన్సూర్ వివాదం.. విచారణకు రెడీ అవుతున్న పోలీసులు
వారం రోజులుగా పెద్ద వివాదానికి దారి తీసిన ఘటన ఏదైనా ఉందంటే అది నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యల అంశమే. ఈ వ్యవహారంలో పలువురు సినీ తారలు త్రిషకు మద్దతుగా నిలిస్తే కొందరు రాజకీయ నాయకులు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోరాదంటూ ఆయనకు సపోర్ట్ చేశారు. ఇక మహిళా కమిషన్ ఈ వివాదంలో కలుగ చేసుకోవడంతో పరిణామాలు తీవ్ర రూపం దాల్చాయి. ఆ కమిషన్ నిర్వాహకులు మన్సూర్ అలీ ఖాన్ పై డీజీపీకి ఫిర్యాదు చేయడం సమన్లు, విచారణ, కోర్టు పిటిషన్లు వెంట వెంటనే జరిగి పోయాయి. వ్యవహారం ముదిరి పాకాన పడటంతో మన్సూర్ అలీ ఖాన్ తన పంతాన్ని పక్కన పెట్టి త్రిషమ్మా క్షమించమ్మా అంటూ ఆమె ప్రసన్నం అయ్యేలా మాట్లాడారు. దీంతో త్రిష శాంతి కాముకురాలిగా తప్పులు చేయడం మానవ లక్షణం. క్షమించడం దైవీకం అంటూ పెద్ద పెద్ద డైలాగ్‌తో ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీంతో ఈ వివాదం సమసి పోయినట్లేనా? అంటే అది ప్రశ్నార్థకంగా మారుతోంది. కారణం మన్సూర్ అలీ ఖాన్ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడమే. ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలీసులు నటి త్రిషను విచారించడానికి సిద్ధం అవుతున్నారు. మరి దీనికి ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో అనే చర్చ సాగుతోంది. -
త్రిషను క్షమాపణ కోరిన మన్సూర్.. రక్తపాతం లేని యుద్ధం అంటూ..!
కోలీవుడ్‌లో హీరోయిన్ త్రిష గురించి సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడడం వివాదాస్పదమైంది. దీనిపై త్రిష, చిరంజీవి, లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్ తదితరులు తీవ్రంగా విమర్శించారు. ఇలా చాలామంది నటీనటులు మన్సూర్ అలీఖాన్‌ను తప్పుబట్టారు. అయితే తాను తప్పుగా మాట్లాడలేదని మన్సూర్ అన్నారు. మరోవైపు మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఆయనకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. దీని ఆధారంగా నిన్న(నవంబర్23) ఉదయం 11 గంటలకు స్వయంగా హాజరు కావాలని మన్సూర్ అలీఖాన్‌కు సమన్లు పంపారు. అయితే ముందస్తు బెయిల్ కోసం మన్సూర్ అలీఖాన్ చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు నవంబర్ 24న విచారణకు వస్తానని ఆయన చెప్పాడు. కానీ తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే త్రిషకు మన్సూర్ అలీఖాన్ క్షమాపణలు చెప్పాడు. కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఈ కేసులో ఫైనల్‌గా త్రిషకు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పడంతో ఈ గొడవ ఇంతటితో క్లోజ్ కానుంది. అతను ప్రచురించిన ప్రకటనలో ఇలా పేర్కొన్నాడు. 'నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్దం చేశాను. ఈ వార్‌లో రక్తపాతం లేకుండానే నేను గెలిచాను! నాకు అండగా నిలిచిన నాయకులు, నటీనటులు, పాత్రికేయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను తప్పుపట్టిన వ్యక్తులకు వినయపూర్వకమైన నమస్కారములు. నా వ్యాఖ్యలతో త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణ చెబుతున్నా. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది. అప్పుడు లక్షలాది మంది చనిపోవడంతో, సామ్రాట్ అశోకుడి గుండె నుంచి రక్తం ఏరులైపారింది. దీంతో ఆయన అహింసను స్వీకరించాడు. ఇక్కడ నేను కూడా అహింస మార్గం వైపే నిలబడ్డాను.' అని మన్సూర్ తెలిపాడు. -
ముందస్తు బెయిల్‌కు మన్సూర్ అలీఖాన్ పిటిషన్
నటి త్రిష వ్యవహారంలో నటుడు మన్సూర్ అలీఖాన్ చైన్నె హైకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేశారు. ఈయన ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన చర్యలను త్రిషతో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా నటి కుష్భు మన్సూర్ అలీఖాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రపంచ మహిళా కమిషన్ మద్దతుగా నిలిచింది. మన్సూర్ అలీఖాన్ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తమిళనాడు డీజీపీ శంకర్ జివ్వాల్‌కు ఫిర్యాదుచేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై 354(ఏ), 509 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కాగా గురువారం ఉదయం 10 గంటలకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా మన్సూర్ అలీఖాన్‌కు పోలీసు అధికారులు సమన్లు జారీ చేశారు. ఏ దురుద్దేశంలో తాను త్రిషపై వ్యాఖలు చేయలేదని కమిషనర్‌కు విన్నవించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు తన ముందస్తు బెయిల్ కోసం చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా త్రిష వ్యవహారంలో నటి కుష్భు మన్సూర్ అలీఖాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన త్రిషపై వాడిన భాష చేరి (స్లమ్) ప్రాంత ప్రజలువాడే వాషలో ఉందని విమర్శించారు. చేరి అనే భాషను రావడంపై సినీ దర్శకుడు పా.రంజిత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నటి ఖుష్భు మాట మార్చారు. తాను ఫ్రెంచ్ భాషలోని చేరి అనే పదాన్ని వాడానని తన ఎక్స్ మీడియాలో వివరణ ఇచ్చారు. -
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. లియో నటుడికి మరో షాక్!
లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అతనిపై నడిగర్ సంఘం నిషేధం విధించింది. హీరోయిన్ త్రిషపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వివాదానికి దారితీయడంతో.. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వ్యక్తిగతంగా హజరై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేశారు. దీంతో అతను ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్ విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. అయితే పిటిషన్లో ఉన్న తప్పుల కారణంగా బెయిల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయంలో కోర్టు సమయం వృథా చేశారని మన్సూర్ అలీ ఖాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. కాగా.. ఈ కేసులో చెన్నైలోని థౌజండ్ ఐలాండ్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఇవాళ విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యాడు. ఖండించిన అగ్రతారలు త్రిషపై అతను చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ అగ్రతారలు ఖండించారు. టాలీవుడ్ నటులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, నటి ఖుష్బూ సుందర్ త్రిషకు మద్దతుగా పోస్టులు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే లియో డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ సైతం ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. -
మన్సూర్ అలీఖాన్‌కు సమన్లు.. నేడు విచారణ
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్‌కు థౌజండ్ లైట్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. గురువారం తమ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వివరాలు.. సినీ నటి త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదుతో డీజీపీ శంకర్‌జివ్వాల్ ఆదేశాల మేరకు మన్సూర్‌పై రెండు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆయన్ని విచారించేందుకు థౌజండ్ లైట్స్ పోలీసులు సిద్ధమయ్యారు. విచారణకు రావాలని ఆదేశిస్తూ ఆయనకు సమన్లు పంపించారు. ఇదిలా ఉండగా మన్సూర్ అలీఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో నటి ఖుష్భు ‘చేరి’(స్లం) భాష గురించి తనకు తెలియదని, తాను మాట్లడలేనని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ చేరి భాష మద్దతు దారులు కుష్భుకు వ్యతిరేకంగా గళాన్ని విప్పే పనిలో పడ్డాడు. దర్శకుడు పా రంజిత్ , నటి గాయత్రి రఘురాం కుష్భు వ్యాఖ్యలను ఖండించారు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కుష్భుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో స్వరాన్ని పెంచిన వాళ్లు ఎక్కువే. మన్సూర్ వ్యవహారంలో ఆగమేఘాలపై స్పందించిన కుష్భు మణిపూర్ వ్యవహారంలో ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించడం గమనార్హం. -
మగవారూ... భాష జాగ్రత్త
గతంలో ఎం.ఎల్.ఏ అయిన ఒక పెద్ద హీరో స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడి అసెంబ్లీలో సంజాయిషీ ఇచ్చాడు. డెబ్బయి ఏళ్లు దాటిన ఒక సీనియర్ నటుడు నోరు పారేసుకుని పరువు పోగొట్టుకున్నాడు. పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న మరో నటుడు స్త్రీల దుస్తుల గురించి సుద్దులు చెప్పి నిరసన ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్. సెలబ్రిటీలుగా ఉన్నవారు ఎంతో బాధ్యతగా ఉండి యువతకు మార్గం చూపేలా ఉండాలి. వారు ఇలా తగలడితే స్త్రీలతో ఎలా వ్యవహరించాలో ఇంటినే బడిగా మార్చి తల్లిదండ్రులు నేర్పించాల్సి ఉంటుంది. అయితే ఇంటి ఆడవారికి తండ్రి, భర్త గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారా అనేది ప్రశ్న. అతడో ప్రసిద్ధ నటుడు. ‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’ అంటుంటాడు. కాని ఒక సభలో అభిమానులను చూసి పూనకం వచ్చి స్త్రీల గురించి అశ్లీలమైన వ్యాఖ్యలు చేశాడు. వందల సినిమాల్లో తండ్రిగానో బాబాయిగానో వేసిన ఒక నటుడు ‘స్త్రీల మీద మీ అభిప్రాయం ఏమిటి?’ అని సభలో యాంకర్ అడిగితే పరమ రోతగా సమాధానం ఇచ్చాడు. ఇక నటుడుగా, రియల్టర్‌గా గుర్తింపు పొందిన మరో పెద్ద మనిషి పార్లమెంట్ మెంబర్ అయ్యాక పార్లమెంట్లో నిలబడి మరీ ‘స్త్రీల దుస్తుల వల్లే వారికి సమస్యలు వస్తున్నాయి’ అన్నాడు. స్త్రీలను ఏదో ఒకటి అనేయొచ్చు, అంటే వాళ్లు పడతారు, అనడానికే మేము పుట్టాము అనే చులకనభావం పురుష సమాజంలో నరనరాన జీర్ణించుకుని పోబట్టే ఈ ప్రతిఫలాలు. అదృష్టవశాత్తు ఇలాంటి వ్యాఖ్యలకు వెంటనే నిరసన పెల్లుబుకుతున్నా పురుషుల నోటి దురుసు తగ్గడం లేదు. తాజాగా తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల త్రిషతో ‘లియో’ సినిమాలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘ఆమె హీరోయిన్ అని తెలిశాక (గత సినిమాల్లో తాను చేసిన) బెడ్రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను’ అని వ్యాఖ్యానించాడు. ‘ఇది సినిమా లాంగ్వేజ్’ అని మన్సూర్ అనుకుని ఉండొచ్చుగాని దానిలోని అశ్లీల ధ్వనికి త్రిష రియాక్ట్ అయ్యింది. ‘ఇతనితో ఇంకెప్పుడూ సినిమాల్లో నటించను’ అని చెప్పింది. ఆ తర్వాత చినికి చినికి గాలివానై ఇప్పుడు మన్సూర్ మీద కేసు బుక్ అయ్యేంతగా వెళ్లింది. మగవాళ్లు ‘సరదాగా మాట్లాడుతున్నామని’ అనుకుంటూ కూడా స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. సరదాగా కించపరచడం ఏమిటో... కించపరచడం ఎలాంటి సరదానో వీరే చెప్పాలి. ► ప్రసిద్ధులే దారి తప్పితే రాజకీయ నేతలు, సినిమా నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు... ఇలా సమాజంలో గుర్తింపు పొందినవారు స్త్రీల పట్ల మరింత గౌరవంతో మెలగుతూ ఆదర్శంగా నిలవాలి. కాని చాలాసార్లు రాజకీయ నాయకుల దగ్గరి నుంచి అన్ని రకాల ప్రముఖులు ఏదో ఒక సందర్భంలో చులకన మాటలు మాట్లాడుతూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాదిలో మంత్రులు ‘మేం వేసిన రోడ్లు ఫలానా హీరోయిన్ బుగ్గల్లా ఉంటాయి’ అంటూ వదరుతుంటారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో కుస్తీ వీరుడిగా నటించి ‘ఈ సినిమాలో కుస్తీలు చేస్తే రేప్ జరిగినంత పనయ్యింది నాకు’ అని వ్యాఖ్యానించి మొట్టికాయలు తిన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రిగా ఉన్న నటిపై దారుణమైన వ్యాఖ్యలు చేసి కోర్టు కేసును ఎదుర్కొనబోతున్నాడు. ► బాల్యం నుంచి భావజాల ప్రభావం ‘కుటుంబంలో తండ్రి (మగాడు) ముఖ్యం’ అనే భావన బాల్యం నుంచి పిల్లల్లో ఎక్కించడం ద్వారా పురుష సమాజం తన ఆధిక్యతను స్త్రీలపై ఆధిపత్యాన్ని కొనసాగించేలా చేస్తుంది. తండ్రిని ‘మీరు’ అని, తల్లిని ‘నువ్వు’ అని అనడంలో ప్రేమ, గౌరవం, దగ్గరితనం ఉన్నా ‘నువ్వు’ అనడం వల్ల ‘లెక్క చేయవలసిన పని లేదు’ అనే భావన కలిగితే కష్టం. తిట్లు, బూతులు అన్నీ స్త్రీలను అవమానించేవే. వాటిని విని, పలికి స్త్రీల పట్ల అలా మాట్లాడవచ్చు అనుకుంటారు మగవారు. ఇంట్లో చెల్లెని, అక్కని, తల్లిని తండ్రి అదుపు చేసే తీరు చూసి, తామూ బయట స్త్రీలను అలాగే అదుపు చేయవచ్చనుకుంటారు. ఫైటర్ జెట్స్‌ను స్త్రీలు నడుపుతున్న ఈ కాలంలో కూడా ‘మేమేమీ గాజులు తొడుక్కోలేదు’, ‘మూతి మీద మీసముంటే రా’లాంటి పౌరుష వచనాలను పురుషులు ఇంకా పలికేటంత వెనుకబాటుతనంలో ఉండటం విషాదకరం. శారీరక పరిమితులు ఉన్నంత మాత్రాన స్త్రీలు బలహీనులు, పురుషులు బలవంతులు కాబోరు. ► తల్లిదండ్రులూ జాగ్రత్త అబ్బాయిలను ఆడపిల్లలను గౌరవించేలా పెంచడం, టీనేజ్‌లో ఉన్న అబ్బాయిలకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వడం ఇప్పటి తల్లిదండ్రుల తక్షణ కర్తవ్యం. చట్టాలు పకడ్బందీగా ఉన్న ప్రస్తుత రోజుల్లో తెలిసో తెలియకో అహంకారంతోనో పరుష వ్యాఖ్య, అసభ్య చేష్ట నేరుగా కాని సోషల్ మీడియాలోగాని చేస్తే వారు ప్రమాదంలో పడతారని హెచ్చరించాలి. చైతన్యం పెరిగింది. అబ్బాయిలూ భాష జాగ్రత్త. -
నటి త్రిషకు మద్దతుగా నిలిచిన సినీ సెలబ్రిటీలు
-
ఐశ్వర్య రాయ్‌పై అత్యాచారం చేస్తానంటే స్పందించలేదేంటి?: చిన్మయి
స్టార్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దూమారం రేపుతున్నాయి. లియో సినిమాలో త్రిషతో బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయని భావించానని, అలాంటి సీన్స్ లేకపోవడం నిరాశకలిగించిందని మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా మండిపడింది. ఇకపై అతనితో నటించబోనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సినీ ప్రముఖులంతా త్రిషకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోహీరోయిన్లు త్రిషకు మద్దతు ప్రకటిస్తూ..మన్సూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఒక అడుగు ముందుకేసి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని మన్సూర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే మన్సూర్ మాత్రం త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. తాను సరదాగా అన్న మాటలను కొంతమంది కావాలనే వక్రీకరించారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఈ వివాదంపై గాయని చిన్మయి శ్రీపాద తనదైన స్టైల్లో స్పందించింది. మన్సూర్ మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేయలేదని..గతంలో చాలా మంది హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నటుడు రాధా రవికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (చదవండి: త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్న మన్సూర్) అందులో రాధా రవి ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ..‘నాకు హిందీ భాష రాదు. ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్యను రేప్ చేసే వాడ్ని. ఎందుకంటే అక్కడి వాళ్లు ఎలాగో నాకు మంచి పాత్రలు ఇచ్చేవాళ్లు కాదు. అత్యాచారం చేసే పాత్రలే ఇచ్చేవాళ్లు’ అని సరదాగా అన్నారు. రాధ రవి మాటలకు అక్కడి వారంతా నవ్వేశారు. ఈ వీడియోని చిన్మయి ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. రాధరవి..ఐశ్వర్య రాయ్‌ని రేప్ చేస్తానంటే అంతా జోక్‌గా తీసుకొని నవ్వేశారు. అలాంటి వ్యాఖ్యలే చేసిన మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. మరి రాధ రవి వ్యాఖ్యల మీద ఎవరూ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది’అని చిన్మయి రాసుకొచ్చింది. (చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) చిన్మయి షేర్ చేసిన వీడియోపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతను రేప్ సన్నివేశాల గురించి మాత్రమే మాట్లాడరని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది రాధరవిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. "I have once said that if I had known Hindi, I would have had the opportunity to rape Aishwarya Rai. What I meant was I would have acted in Bollywood. Why the hell should I then act with these saniyans (idots/sinners in Tamil)." - Radha Ravi Here in this video in Tamil where you… pic.twitter.com/j9qLQwdRA7 — Chinmayi Sripaada (@Chinmayi) November 21, 2023 -
త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్న మన్సూర్
నటి త్రిష గురించి నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారం పేరిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇటీవల విజయ్ హీరోగా నటించిన లియో చిత్రంలో నటించారు. దీంతో ఆ చిత్రంలో త్రిష నటిస్తున్న విషయం తెలిసి ఆమెతో తనకు బెడ్ రూం సన్నివేశాలు ఉంటాయని భావించానని, అయితే అ లాంటివి లేకపోవడం నిరాశ పరిచిందనని మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఈ రచ్చకు కారణం. ఆయన వ్యాఖ్యలను త్రిషతో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఈ వ్యవహారంపై మన్సూర్ అలీ ఖాన్‌కు నోటీసు జారీ చేసింది. అందులో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మిమ్మల్ని సంఘం సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించ కూడదో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మన్సూర్ అలీ ఖాన్ మంగళవారం చైన్నెలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొంటూ తాను త్రిష గురించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాన కొందరు కావాలనే వక్రీకరించారని పేర్కొన్నారు. తాను త్రిషకు క్షమాపణ చెప్పే అవకాశమే లేదని స్పష్టం చేశారు. తాను మరీ అంత తీసేసిన వాడినా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా విషయం తెలుసుకోకుండా మాట్లాడారని, ఆయన చిత్రాల్లో నటించనని, అయితే గియితే హీరోగా మాత్రమే నటిస్తానన్నారు. ఇక దక్షిణ భారత నటీనటుల సంఘం తనకు ఈ వ్యవహారంలో నోటీసులు పంపి పెద్ద పొరపాటు చేసిందన్నారు. అందులో పేర్కొన్న విధంగా నటి త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తాను మాట్లాడితే అగ్నిగోళం బద్ధలవుతుందన్నారు. తనకు జారీ చేసిన నోటీసును నటీనటుల సంఘం ముందు వాపస్ తీసుకోవాలని, ఆ తరువాత పిలిపిస్తే వివరణ ఇవ్వడానికి తాను సిద్ధమని ప్రకటించారు. కాగా త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మన్సూర్ అలీఖాన్‌పై నుంగంబాకం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. -
నటి త్రిషకు అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి
-
త్రిషకు అండగా నిలిచిన చిరంజీవి!
హీరోయిన్ త్రిషపై కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మన్సూర్ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తూ త్రిషకు మద్దతు ప్రకటిస్తున్నారు. మన్సూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సీనియర్ హీరోయిన్ కుష్భూ అయితే ఏకంగా మహిళా కమీషన్ నుంచి కేసు కూడా నమోదు చేయించింది. టాలీవుడ్ నుంచే ఇప్పటికే హీరో నితిన్ ఈ వివాదంపై స్పందిస్తూ.. త్రిషకు మద్దతుగా నిలిచాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిష-మన్సూర్ వివాదంపై ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు. (చదవండి: త్రిషతో వివాదం.. మన్సూర్ అలీఖాన్‌పై రెడ్ కార్డ్.. రియాక్ట్ అయిన నితిన్) ‘త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు ఏ మహిళపై చేసినా అసహ్యంగా ఉంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయిపై చేసినా నేను ఖండిస్తూ.. మహిళను అండగా, సపోర్ట్ గా నిలబడతాను అని’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి, త్రిష స్టాలిన్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అసలు మన్సూర్ చేసిన వ్యాఖ్యలేంటి? లోకేశ్ కనగరాజ్-విజయ్ కాంబోలో వచ్చిన ‘లియో’చిత్రంలో మన్సూర్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. అందులో త్రిష హీరోయిన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మన్సూర్ మాట్లాడుతూ..‘గతంలో నేను ఎన్నో రేప్ సీన్లలో నటించాను. ‘లియో’ ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతో కూడా రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను. కాకపోతే.. నాకు అలాంటి సన్నివేశం లేదు. అందుకు బాధగా ఉంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారడంతో.. మన్సూర్ వివరణ కూడా ఇచ్చాడు. తనకు త్రిషపై చాలా గౌరవం ఉందని.. సరదాగా మాట్లాడిన మాటలు..కొంతమంది కావాలనే వివాదస్పదం చేశారని ఆరోపించారు. (ఇది చదవండి: త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!) My attention was drawn to some reprehensible comments made by actor Mansoor Ali Khan about Trisha. The comments are distasteful and disgusting not just for an Artiste but for any woman or girl. These comments must be condemned in the strongest words. They reek of perversion.… — Chiranjeevi Konidela (@KChiruTweets) November 21, 2023 -
త్రిషతో వివాదం.. మన్సూర్ అలీఖాన్‌పై రెడ్ కార్డ్.. రియాక్ట్ అయిన నితిన్
కోలీవుడ్‌లో నటి త్రిష, నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ ఒక భేటీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటి త్రిష తీవ్రంగా స్పందించారు. ఆమెకు నటి కుష్బూ, మాళవిక నాయర్, లియో చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్వాహకులు మద్దతుగా నిలిచారు. త్రిషకు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన మన్సూర్ అలీ ఖాన్ తాను సరదాగా అన్నానని, దాన్ని వివాదాస్పదం చేయవద్దని కోరారు. తనపై రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కోరితే తాను వివరణ ఇవ్వడానికి సిద్ధం ఉన్నానని అన్నారు. దీంతో ఆయనపై మూకుమ్మడి ఒత్తిడి వస్తోంది. (ఇదీ చదవండి: విజయకాంత్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన తమిళనాడు మంత్రి) మన్సూర్ అలీఖాన్‌పై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఆయనపై రెడ్ కార్డ్ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ వరకు వెళ్లింది. త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై 509 బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి కమిషన్ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో చూడాలి. అహంకారపూరిత వ్యాఖ్యలకు చోటులేదు: నితిన్ 'త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో చోటులేదు. ఇలా మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసే వారిపై పోరాడలని, మహిళలకు మద్దతుగా నిలబడాలని సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను' అని నితిన్ తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. గతంలో 'అల్లరి బుల్లోడు' చిత్రంలో త్రిష, నితిన్ కలిసి నటించిన విషయం తెలిసిందే. త్రిషకు కోలీవుడ్‌లో మాత్రమే కాదు టాలీవుడ్లో కూడా సపోర్ట్ దొరుకుతుంది. -
త్రిషపై లియో నటుడి కామెంట్స్.. ఎన్సీడబ్ల్యూ సీరియస్!
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. లియో సినిమాలో ఓ పాత్రలో నటించిన ఆయన హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు. దీంతో అతనిపై సినీతారలు, డైరెక్టర్ లోకేశ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్సీడబ్ల్యూ.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. త్రిషపై ఆయన చేసిన కామెంట్స్ తమను ఎంతగానో బాధించాయని.. మహిళల గురించి ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే సహించేదిలేదని తెలిపింది. ఈ మేరకు ఎన్సీడబ్ల్యూ ట్వీట్ చేసింది. ఎన్సీడబ్ల్యూ తన ట్వీట్లో.. 'త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అతడిపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి వాటిని సహించేది లేదంటూ పోస్ట్ చేసింది. The National Commission for Women is deeply concerned about the derogatory remarks made by actor Mansoor Ali Khan towards actress Trisha Krishna. We're taking suo motu in this matter directing the DGP to invoke IPC Section 509 B and other relevant laws.Such remarks normalize… — NCW (@NCWIndia) November 20, 2023 -
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!
దక్షిణాది నటుడు మన్సూర్ అలీ ఖాన్ తాజాగా 'లియో' చిత్రంలో కనిపించాడు. అందులో ఆయనతో పాటు నటించిన హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే త్రిషతో పాటు తమిళనాడులోని చాలామంది ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మన్సూర్ అలీ ఖాన్ క్లారిఫికేషన్: నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదం గురించి తన సోషల్ మీడియాలో ఇలా తెలిపాడు. తన మాటలను తప్పుగా చూపించినందుకు నటుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నటి త్రిష కృష్ణన్‌ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని మీడియా సమావేశంలో అన్నారు.. లియోలో నటి త్రిష కృష్ణన్ పాత్రను 'పర్వతాన్ని ఎత్తుకున్న హనుమాన్'తో పోల్చారు. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. ఆమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చాను. 'దురదృష్టవశాత్తూ, ఆ స్టేట్మెంట్ తీసివేయబడింది. కొన్ని స్టేట్మెంట్లు మాత్రమే ఆక్కడ ఎడిట్ చేసి ఎవరో కావాలనే వైరల్ చేశారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదు. తాను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. అంటూ మన్సూర్ అలీ ఖాన్ తమిళంలో ఇలా రాశారు. 'నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా చూపించి నాపై రాజకీయాలు చేస్తున్నారు. నా సినిమాల గమనాన్ని ప్రభావితం చేసేందుకే ఇలా చేస్తున్నారు. స్త్రీల పట్ల నాకెంతో గౌరవం ఉంది. నేను గతంలో చాలా మంది నటీమణులతో పనిచేశాను. నేనెప్పుడూ ఎవరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదు.' అని తెలిపాడు. ఏం జరిగిందంటే..? కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ‘లియో’ సినిమాలో త్రిషతో ఓ సీన్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నేను గతంలో ఎన్నో చిత్రాల్లో రేప్ సీన్లలో నటించాను. ‘లియో’లో కూడా త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధగా అనిపించింది.' అని మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశాడు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సినీ పరిశ్రమ నుంచి తీవ్ర అసంతృప్తి వచ్చింది. నటి ఖుష్బూ సుందర్, దర్శకుడు లోకేష్ కనకరాజ్, గాయని చిన్మయి శ్రీపాద తదితరులు ఆయన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. View this post on Instagram A post shared by Mansoor Ali Khan (@mansoor_alikhan_offl) -
అలాంటి వ్యక్తితో నటించకపోవడం సంతోషం
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ–‘‘నేను గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్లతో బెడ్ సీన్లలో నటించా. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను. అయితే అలాంటి సన్నివేశం లేకపోవడం బాధపడ్డాను. కశ్మీర్ షెడ్యూల్ అయిపోయే వరకు త్రిషను చూసే అవకాశం కూడా చిత్రయూనిట్ ఇవ్వలేదు’’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్తలు త్రిష వద్దకు చేరడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ‘‘మన్సూర్ అలీఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది.. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి వ్యక్తులతో నటించకపోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులోనూ ఆయనతో, అలాంటి వారితో నటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది’’ అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో మన్సూర్ అలీఖాన్ స్పందిస్తూ–‘‘త్రిష అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదు.. నా మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు’’ అన్నారు. -
ఇలాంటి నీచమైన వ్యక్తితో ఇకపై నటించను: త్రిష
లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అలా మాట్లాడటంపై కోలీవుడ్ సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండి చేస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. త్రిష ట్వీట్లో రాస్తూ.. 'మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తోంది. అతని లాంటి నీచమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను ఇకపై ఎప్పుడూ పంచుకోను. నా మిగిలిన సినిమా కెరీర్లో కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను. అతని లాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సైతం మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. లోకేశ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. "మేమంతా ఒకే టీమ్‌లో పనిచేశాం. మన్సూర్ అలీ ఖాన్ చేసిన స్త్రీల పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చూస్తే చాలా కోపంగా ఉంది. ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళలు, తోటి నటీనటులను మనం గౌరవించాలి. ఏ పరిశ్రమలోనైనా ఇలాగే ఉండాలి. ' అని పోస్ట్ చేశారు. కాగా.. లియో చిత్రంలో ఖాన్ మరణశిక్ష విధించబడిన దోషి పాత్రలో కనిపించారు. తమన్నా సాంగ్‌పై మన్సూర్ కామెంట్స్ అయితే గతంలో జైలర్ సినిమాలోని కావాలయ్యా.. అనే పాటపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట మ్యూజిక్, స్టెప్పులు ఏవీ బాగోలేదని మాట్లాడాడు. 'కావాలయ్యా పాటలో తమన్నా వేసే స్టెప్పు చాలా దరిద్రంగా ఉంటుంది. కావాలా.. అంటూ తన చేతిని ఓరకంగా ఆడించడం అస్సలు బాగోలేదు. చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇటువంటి పాటకు, స్టెప్పులకు సెన్సార్ వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని మన్సూర్ అలీ ఖాన్ విమర్శలు చేశారు. A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen… — Trish (@trishtrashers) November 18, 2023 Disheartened and enraged to hear the misogynistic comments made by Mr.Mansoor Ali Khan, given that we all worked in the same team. Respect for women, fellow artists and professionals should be a non-negotiable in any industry and I absolutely condemn this behaviour. https://t.co/PBlMzsoDZ3 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 18, 2023 The thing about men like Mansoor Ali Khan - they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl — Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023 -
త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!
నటి త్రిషై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్‌పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలసుకుందాం. విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మన్సూర్ త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను చేసిన అసభ్యకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. కానీ సినిమాలో ఒక్క బెడ్రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్రూమ్కు తీసుకెళ్తానని అనుకున్నా. ఇంతకుముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్‌పై పలువురు తారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నాంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The thing about men like Mansoor Ali Khan - they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl — Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023 -
కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు
జైలర్.. సినిమాయే కాదు ఇందులోని పాటలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాయి. అందులో తమన్నా ఆడిపాడిన నువ్వు కావాలయ్యా సాంగ్‌కు జనాలు థియేటర్లలో, సోషల్ మీడియాలో అలిసిపోయేదాకా స్టెప్పులేశారు. ఈ పాట తమిళ వర్షన్‌కు 75 మిలియన్స్ (ఏడున్నర కోట్లు), తెలుగు వీడియో సాంగ్‌కు 20 మిలియన్స్ (రెండు కోట్లు) వ్యూస్ వచ్చాయి. ఒక్క వీడియో సాంగ్‌కు కోట్లల్లో వ్యూస్ వచ్చాయంటే అది ఏ రేంజ్లో హిట్టయిందో తెలుస్తోంది. దరిద్రంగా హుక్ స్టెప్.. అయితే ఈ పాటపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట మ్యూజిక్, స్టెప్పులు ఏవీ బాగోలేదని మాట్లాడాడు. తను నటించిన సరకు సినిమాలో సెన్సార్‌వాళ్లు చాలా సన్నివేశాలను కత్తిరించేశారట. శనివారం నాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'కావాలయ్యా పాటలో తమన్నా వేసే స్టెప్పు చాలా దరిద్రంగా ఉంటుంది. కావాలా.. అంటూ తన చేతిని ఓరకంగా ఆడించడం అస్సలు బాగోలేదు. చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇటువంటి పాటకు, స్టెప్పులకు సెన్సార్ వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మరీ అంత అవసరం లేదులే సెన్సార్ సభ్యుల తీరే అర్థం కావట్లేదు' అని మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'తన సినిమాలో కొన్ని సీన్లు సెన్సార్ బోర్డు ఎత్తేసినందుకు బాధపడటంలో తప్పు లేదు కానీ, అవతలి వారి సినిమాల్లో తప్పులను ఎత్తి చూపడం దేనికి' అని ప్రశ్నిస్తున్నారు. 'సినిమాను ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలేగానీ.. ఇలా ప్రతిదాన్ని భూతద్దంలో చూడనవసరం లేదు. ఈయన అలా మాట్లాడటం సరికాదు' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Highly condemn #Leo actor Mansoor Ali Khan's disrespectful speech about actress Tamannaah's #Jailer Kaavaalaa song in yesterday's press meet. This not the right way to… pic.twitter.com/mrOzPMUfQ1 — Manobala Vijayabalan (@ManobalaV) October 21, 2023 చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు బిగ్ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్ -
మరోసారి ఇలాంటి పని చేస్తే చెంప పగలగొడతా.. నటుడికి వార్నింగ్ ఇచ్చిన యాంకర్
కోలీవుడ్‌లో తాజాగా తమిళ నటుడు కూల్ సురేశ్ స్టేజీపై ఉన్న మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. సరక్కు సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయిన ఆయన స్టేజీపైన మాట్లాడుతూనే పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలమాల వేశాడు. దీన్ని ఊహించని యాంకర్ ఐశ్వర్య.. వేదికపై ఉన్న దండను విసిరేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. అనంతరం మాట్లాడిన మన్సూర్ అలీఖాన్ కూల్ సురేశ్‌ను ఖండిస్తూ ఆయన తరపున క్షమాపణలు చెప్పారు. (ఇదీ చదవండి: 'కింగ్ ఆఫ్ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు) దీని తర్వాత, కూల్ సురేష్ తన చర్యలకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశాడు. సినిమా ప్రమోషన్ కోసమే అలాంటి పనిచేశానని చెత్త రీజన్ చెబుతూనే తాను ఒకరిని బాధపెట్టినందుకు చింతిస్తున్నాను. నిజంగానే తాను చేసింది చాలా పెద్ద తప్పేనని కూల్ సురేశ్ ఒప్పుకున్నాడు. అందుకు గాను బహిరంగంగా క్షమాపణలు కోరాడు. ఇకపై అలాంటి తప్పులు చేయనని చెప్పాడు. తాజాగా యాంకర్ ఐశ్వర్య కూడా స్పందించింది. 'ఆ సంఘటన గురించి తలచుకుంటే ఇప్పటికీ షాక్‌కి గురవుతున్నాను. ఎవరూ ఊహించని తరుణంలో తను కూడా నా భుజాన్ని బలవంతంగా నొక్కేసి అలా ప్రవర్తించాడు. ఎవరైనా అకస్మాత్తుగా బహిరంగంగా ఇలా ప్రవర్తిస్తే మీరు ఏమి చేయగలరు? చెంప పగుల కొడతారు కదా..? అలాగే ఇప్పుడు నేను అతని చెంప మీద ఎందుకు కొట్టలేదని ఆశ్చర్యపోతున్నాను. మొరటుగా ప్రవర్తించడంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.. అది వ్యక్తిగతంగా ఎవరినీ ప్రభావితం చేయకూడదు. ఇంతకు ముందు కూల్ సురేష్ ఓ షోలో నాపై రచ్చ చేశాడు. సాధారణంగా అతని చర్యలు నాకు నచ్చని మాట నిజమే. అందుకే అతన్ని స్టేజీపైకి పిలిచేముందు నేను నటుడు కూల్ సురేశ్ అని సింపుల్‌గా పిలుస్తాను. కానీ అది అతనికి ఇష్టం ఉండదు.. అతనిని అలా పిలవకూడదని కూడా కండీషన్ పెడతాడు. తనకు యూట్యూబ్ సూపర్‌స్టార్ అనే బిరుదు ఉంది. ఆ విధంగానే తనను ఎందుకు పిలవరని పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు. కానీ అతని ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను అలా పలువనని చెప్పడం జరిగింది.' అని ఆమె తెలిపింది. (ఇదీ చదవండి: నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్‌కు గోల్డెన్ ఛాన్స్) అందుకే ఈసారి తన మెడలో దండ వేసి అవమానించాలని కూల్ సురేశ్ ప్లాన్ వేసినట్లు తెలిపింది. ఇంకోసారి తన పట్ల ఇలా చేస్తే చెంప మీద కొట్టినా కొట్టేస్తానని తెలిపింది. కనీసం అలాంటి పని చేయలేకున్నా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఐశ్వర్య వ్యక్తం తెలిపింది. For the kind attention of Tamil Film Producers, Directors, Artistes & PRO's: The activity of junior artiste #CoolSuresh is becoming worse day-by-day. Yesterday during the audio launch of #MansoorAliKhan #Saraku movie,@chennaipolice_ @tnpoliceoffl @MuraliRamasamy4 @Udhaystalin pic.twitter.com/b5kcaX1MUL — Ottran Dorai (@ottrandorai) September 20, 2023 -
యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన, వీడియో వైరల్
కొందరు చేసే తిక్క పనుల వల్ల అవతలివారు ఇబ్బందిపడుతుంటారు. తాము చేసేది తప్పా? ఒప్పా? అని క్షణం కూడా ఆలోచించకుండా అప్రతిష్ట మూటగట్టుకుంటారు. తాజాగా తమిళ నటుడు కూల్ సురేశ్ స్టేజీపై ఉన్న మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇతర చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు సురేశ్. ఈ క్రమంలో తాజాగా సరక్కు సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలమాల వేశాడు. చేసింది తప్పని గద్దించిన నటుడు దీంతో ఇబ్బందిగా ఫీలైన సదరు యాంకర్ చిరాకుగా ఆ మాలను తీసి పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె అనుమతి లేకుండా అలా దండ వేసేయడం సంస్కారమేనా? అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కూల్ సురేశ్ ప్రవర్తనకుగానూ అదే స్టేజీపై ఉన్న నటుడు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా సురేశ్‌ను సైతం క్షమాపణలు చెప్పాలని కోరాడు. దీంతో సురేశ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మొదటి నుంచి మేము సరదాగానే మాట్లాడుకుంటున్నాం.. అని తన తప్పిదాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ చప్పట్లేంటి? చిన్మయి ఆగ్రహం మధ్యలో మన్సూర్ అలీ కలగజేసుకుంటూ ఏదైతేనేం.. నువ్వు చేసిన పని తవ్వు అని నొక్కి చెప్పడంతో సురేశ్ క్షమాపణలు చెప్పాడు. కానీ నెట్టింట మాత్రం నటుడి ప్రవర్తనను ఏకిపారేస్తున్నారు. తాజాగా సింగర్ చిన్మయి సైతం దీన్ని తప్పుపట్టింది. 'ఇది భయంకరమైన ప్రవర్తన.. ఇలాంటివారిపై ఎవరూ చర్యలు తీసుకోరు. పైగా దీన్ని వివాదంగా మార్చవద్దని ఆ అమ్మాయి నోరే మూయిస్తారు. అక్కడ ఉన్న కొందరు అబ్బాయిలైతే అతడు పూలమాల వేస్తుంటే చప్పట్లు కొడుతున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. Uncouth and horrible behaviour. Anyway based on how Tamilnadu deals with such behaviour, Nobody is going to take action on him and perhaps they’ll ask the girl not to make a fuss. And honestly - you should know how some men are - listen to male voices in the audience hooting… https://t.co/HO5pmWxb3b — Chinmayi Sripaada (@Chinmayi) September 20, 2023 Worst Behaviour #CoolSuresh 🥴 Evan Da Adhu Clap Panni Sirikurathu !! 🙄😠pic.twitter.com/n60oBovPy7 — 𝐕𝐢𝐣𝐚𝐲 𝐊𝐚𝐫𝐭𝐡𝐢𝐤𝐞𝐲𝐚𝐧ツ🦁 (@Vijay_Karthik27) September 20, 2023 చదవండి: అక్కినేని శతజయంతి వేడుకలు.. కాంస్య విగ్రహం ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు -
నా సినిమాకు థియేటర్స్ దొరకట్లేదు: ప్రముఖ నటుడి ఆవేదన
తమిళసినిమా: సంచలన నటుడు మన్సూర్ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తాజాగా ఈయన తన కొడుకు అలీఖాన్ తుగ్లక్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ కడమాన్‌పారై అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈయన కీలక పాత్రలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇటీవల విడుదలైన ధనుష్ చిత్రం తిరుచిట్రంఫలం ఇంకా థియేటర్లలో ప్రదర్శింపబడటం, గురువారం విజయ్‌దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం విడుదల కావడం, శుక్రవారం అరుళ్‌నిధి నటించిన డైరీ చిత్రం తెరపైకి రానుండంతో తన చిత్రానికి ఎక్కువగా థియేటర్లు దొరకలేదని మన్సూర్ అలీఖాన్ మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అందులో చిత్ర ప్రచారానికి రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు, అయినా అనుకున్నట్లు చిత్రం విడుదల కాకపోవడంతో విరక్తికి గురైనట్లు తెలిపారు. దీంతో తమ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
కోలీవుడ్‌లో షాక్: ప్రముఖ నటుడి ఇంటికి సీల్..
సాక్షి, తమిళసినిమా: నటుడు మన్సూర్ అలీఖాన్ ఇంటికి చెన్నై నగర కార్పొరేషన్ అధికారులు సీలు వేశారు. సంచలన నటుడు, నిర్మాత, రాజకీయవాది మన్సూర్ అలీఖాన్‌కు స్థానిక చూలైమేడులో ఇల్లు ఉంది. అందులోనే ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి నివసిస్తున్నారు. అయితే ఆయన ప్రభుత్వానికి చెందిన 2,400 గజాల పొరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని ఇంటిని నిర్మించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై చెన్నై నగర కార్పొరేషన్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో తనను మోసం చేసి పొరంబోకు స్థలాన్ని విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని మన్సూర్ అలీఖాన్ 2019లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టి వేసింది. దీంతో శనివారం అధికారులు మన్సూర్ అలీఖాన్ ఇంటికి సీల్ వేశారు. వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో కలకలం రేకెత్తిస్తోంది. చదవండి: Telangana Devudu: వెండితెరపై సీఎం కేసీఆర్ బయోపిక్.. తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్ -
కమల్‌తో మన్సూర్ అలీఖాన్ భేటీ
సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌తో నటుడు మన్సూర్ అలీఖాన్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మన్సూర్ అలీఖాన్‌తో పాటు తమిళ దేశీయ పులిగళ్ పార్టీ నాయకులు ఉండడంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాము మర్యాద పూర్వకంగానే కమల్‌హాసన్ ఇంట్లో కలిసినట్లు మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు. -
మూత్రపిండాల్లో రాళ్లు, ఐసీయూలో నటుడు
తమిళ సినిమా: నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేరారు. మన్సూర్ అలీఖాన్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇక కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు. చదవండి: తల్లి ఆశీస్సులతో 16 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చా.. -
టీకాపై వివాదాస్పద వ్యాఖ్యలు: నటుడు మన్సూర్‌కు బెయిల్
సాక్షి, చెన్నై: సినీ నటుడు మన్సూర్ అలీఖాన్‌కు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీకా కొనుగోలు నిమిత్తం రూ. రెండు లక్షలు ఆరోగ్య శాఖకు చెల్లించాలన్న నిబంధనతో ఈ బెయిల్‌ను కోర్టు మంజూరు చేయడం గమనార్హం. కరోనా టీకా వేయించుకున్న హాస్య నటుడు వివేక్ ఆస్పత్రి పాలు కావడంతో నటుడు మన్సూర్ అలీఖాన్ తీవ్ర ఉద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివేక్ మరణించడం వంటి పరిణామాలతో కరోనా టీకా విషయంగా మన్సూర్ తీవ్రంగానే స్పందించారు. దీంతో టీకాపై అనుమానాలు, ఆందోళనలు బయలుదేరాయి. చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు నుంచి గట్టెక్కేందుకు తొలుత సెషన్స్ కోర్టును మన్సూర్ అలీఖాన్ ఆశ్రయించారు. అయితే, ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. టీకా కోసం...రూ. రెండు లక్షలు.. సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో మద్రాసు హైకోర్టును మన్సూర్ అలీఖాన్ ఆశ్రయించాల్సి వచ్చింది. గురువారం ఈ పిటిషన్ న్యాయమూర్తి దండపాణి నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. మన్సూర్ తరఫు న్యాయవాది రాధాకృష్ణన్ వాదన వినిపిస్తూ, పథకం ప్రకారం లేదా, దురుద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉద్వేగానికి లోనై ఆ వ్యా ఖ్యలు చేశారని, ఇందుకు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసినట్టు వివరించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో టీకాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని మందలించారు. విజ్ఞానశాస్త్రంపై నమ్మకం ఉంచాలని, పరిశోధకులు, వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు అంటూ కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. చివరకు మన్సూర్ అలీఖాన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే, కరోనా టీకా కొనుగోలు నిమిత్తం ఆరోగ్యశాఖ కార్యదర్శిని కలిసి రూ. 2 లక్షలు అందజేయాలన్న నిబంధనను విధించారు. -
ప్యాలెస్ కోసం రూ. 800 కోట్లు చెల్లించిన నటుడు!
చుట్టూ పచ్చని చెట్లతో అలరారే అందమైన ఉద్యానవనాలు.. సరస్సును తలపించే స్విమ్మింగ్ పూల్.. వీటన్నింటి నడుమ రాజసం ఉట్టిపడే భవంతి.. అందమైన ఇంటీరియర్ డెకరేషన్.. అడుగడుగునా పూర్వీకుల ఫొటోలతో దర్శనమిచ్చే గోడలు.. ఇంతటి వైభవం ఉన్న బంగ్లా కనుకే పటౌడీ వారసుడు, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన రాజభవనాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. హర్యానాలోని పటౌడీ ప్యాలెస్‌లో నివాసం ఉండేలా సర్వహక్కులు పొందాడు. నీమరానా హోటల్ గ్రూపు లీజు నుంచి దీనిని విడిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాజభవంతి కోసం అతడు అక్షరాలా 800 కోట్లర రూపాయలు చెల్లించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన సైఫ్.. ఇది కేవలం ఓ చారిత్రక కట్టడం మాత్రమే కాదని, ఆ ప్యాలెస్‌తో తనకున్న అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. విలువైన జ్ఞాపకాలతో నిండి ఉన్న రాజభవనాన్ని డబ్బుతో వెలకట్టలేనని చెప్పుకొచ్చాడు.(చదవండి: ‘నా కొడుకు కంటే దాదాపు ఐదేళ్లు పెద్దది’) ప్రముఖ క్రికెటర్, పటౌడీ నవాబ్ మన్సూర్ అలీఖాన్ తనయుడే సైఫ్ అలీఖాన్ అన్న సంగతి తెలిసిందే. రాచకుటుంబానికి చెందిన ఏకైక వారసుడైన సైఫ్ తన తల్లి, నటి షర్మిలా ఠాగూర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినీరంగంలో అడుగుపెట్టాడు. నటుడిగా తనకంటూ గుర్తింపు పొందిన సైఫ్, వివిధ రకాల వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నాడు. ఈ క్రమంలో తాను సంపాదించిన సొమ్ము నుంచి భారీ మొత్తం చెల్లించి వారసత్వంగా వచ్చిన పటౌడీ ప్యాలెస్‌ను హోటల్ గ్రూపు నుంచి విడిపించుకున్నాడు.(చదవండి: కాస్తైనా సిగ్గుపడండి; మమ్మల్ని క్షమించండి!) ఈ విషయం గురించి సైఫ్ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ..‘‘నా తండ్రి ఈ భవనాన్ని ఓ హోటల్ గ్రూపునకు లీజుకు ఇచ్చారు. ఫ్రాన్సిస్, అమన్(హోటల్ నిర్వాహకులు) ఈ భవనాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మా అమ్మ షర్మిలా ఠాగూర్‌కు అక్కడ ప్రత్యేకంగా ఓ కాటేజీ కూడా ఉంది. అందరూ అనుకుంటున్నట్లుగా నేను ఈ ప్యాలెస్‌ను కొనుగోలు చేయలేదు. ఎందుకంటే మేం ఎప్పుడూ దానిని అమ్మలేదు. అది మా సొంతం. లీజుకు ఇచ్చాం అంతే. ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి దానికి వెలకట్టలేను. మా బామ్మాతాతయ్యలు, మా నాన్న సమాధులు అక్కడే ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఎంతో భద్రంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆధ్యాత్మిక భావనలు స్ఫురిస్తాయి. వందల ఏళ్ల క్రితం నాటి నుంచే మాకు అక్కడ భూమి ఉంది. అయితే మా తాతయ్య, మా బామ్మ మీద కోసం దాదాపు వందేళ్ల క్రితం ఈ భవనాన్ని కట్టించారు. తనకంటూ రాజ్యం ఉండేది. కాలక్రమంలో ఈ భవంతిని హోటల్ గ్రూపునకు అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నేను దానిని తిరిగి దక్కించకున్నాను’’అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా సైఫ్ కొన్నిరోజుల క్రితం తన భార్యాపిల్లలు కరీనా కపూర్, తైమూన్ అలీఖాన్‌లతో కలిసి పటౌడీ ప్యాలెస్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. నెలరోజుల పాటు వారు అక్కడే గడిపి ఇటీవలే ముంబైకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం కరీనా గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఇక సైఫ్ అలీఖాన్‌కు సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య అమృతా సింగ్ ద్వారా కలిగిన సంతానం వీరు. -
ఈ ప్రభుత్వం ఎంతపనికి మాలినదంటే
తమిళసినిమా: పెద్ద నోట్ల రద్దు తరువాత సినిమా నాశనం, వ్యవసాయం నాశనం. అంతా నాశనం ఇదేనా కేంద్రప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా పథకమా అంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ ఆవేశంగా ప్రశ్నించారు. ఇంతకు ముందు గ్యాస్ పథకం ద్వారా వ్యవసాయానికి, రైతులకు కలిగే నష్టం గురించి చర్చించిన తెరు నాయ్‌గళ్ చిత్రాన్ని నిర్మించిన ఐ క్రియేషన్స్ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం పడిత్తవుడన్ కిళిత్తు విడవుమ్. తెరు నాయ్‌గళ్ చిత్ర దర్శకుడు హరి ఉత్రనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నటుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ సాధారణంగా తానే ఏ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నా చిత్రం బాగుంది, పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి లాంటివి మాట్లాడనన్నారు. అయితే ఈ చిత్ర టైటిల్ చూడగానే చిత్ర యూనిట్ ధైర్యాన్ని తెలుపుతుందన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు పథకానికి ముందు తమిళసినిమానే కాకుండా దక్షిణాది సినిమా బాగుందన్నారు. నోట్ల రద్దు తరువాత 500 మంచి చిన్న నిర్మాతలు కనిపించకుండా పోయారన్నారు. అదే విధంగా జంతు సంరక్షణ అనే సమాఖ్య ఏ జంతువుతోనూ సినిమా తీయకుండా చేస్తోందన్నారు. ఒక చిత్ర ప్రమోషన్ కోసం ఆడియో ఆవిష్కరణ, టీజర్ విడుదల వంటి కార్యక్రమాలు నిర్వహించి చిత్రంలో ఆసక్తికరమైన విషయాలను తెలిపి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకుంటున్నామన్నారు. అలాంటిది సడన్‌గా 8 రోడ్డు పథకాన్ని ప్రారంభిస్తున్నామంటోంది ప్రభుత్వం అని అన్నారు. దాన్ని ఎవరు అడిగారు? దాని అవసరం ఏమిటి? అందువల్ల ఎవరికి ఉపాధి కలుగుతుంది. ఎవరికి ప్రయెజనం? వంటివి వివరించాలిగా అన్నారు. సినిమాకు ప్రేక్షకులను రప్పించుకునే విధంగా ప్రభుత్వం 8 రోడ్ల పథక నిర్మాణం గురించి ఎందుకు వివరించడం లేదూ అని ప్రశ్నించారు. దీనికి బదులివ్వని ఈ ప్రభుత్వం ఎంతపనికి మాలినదంటే రూ.10 వేలకోట్లు వస్తుందని గ్రీన్‌వేస్ పథకం కోసం ఆరాటపడుతోందని ధ్వజమెత్తారు. కైవై, చిరువాణిల నీటిని ప్రయివేట్ సంస్థలకు అమ్ముకోవాలని ప్రయత్నిస్తోందన్నారు.ఆ తరువాత గాలి, ఆక్సిజన్ కూడా అమ్ముకుంటుందని అన్నారు. ఆపై తల్లి పాలను లీటర్ల లెక్కన పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తుందని దుయ్యపట్టారు. తమిళన్ మెలకువతో ఉండగానే అతని ప్యాంటును ఊడదీయాలని చూస్తోందన్నారు. తమిళుడంటే అంత అలుసైపోయ్యిందన్నారు. ప్రశ్నిస్తే ఇదంతా కేంద్రప్రభుత్వ పథకం అని అంటున్నారన్నారు. అప్పుడు నువ్వు ఉన్నదెందుకు ఉల్లిపాయలు అమ్ముకోవడానికా? వెంట్రుకలు పీక్కోవడానికా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రూ.7 లక్షల కోట్లలో ఏం ఖర్చు చేశారు? అందులో 5 పైసలు సాధారణ ప్రజలకు అందిందా? సినిమా నాశనం, వ్యవసాయం నాశనం. అంతా నాశనం ఇదేనా కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా పథకమా? అంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రశ్నించారు. -
నాలుగు భాషల్లో మన్సూర్ అలీఖాన్ చిత్రం
తమిళసినిమా: దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో మన్సూర్‌అలీఖాన్ ఒకరు. ఆయనకు విలన్‌గా గుర్తింపు తెచ్చిన చిత్రం విజయ్‌కాంత్‌తో నటించిన కెప్టెన్ ప్రభాకరన్. ఆ తరువాత అన్ని భాషల్లోనూ నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా వివిధ పాత్రల్లో 250 పైగా చిత్రాలలో నటించిన నటుడు మన్సూర్ అలీఖాన్. నటుడిగా సినీ కెరీర్ ప్రారంభించి ఆ తరువాత దర్శకుడిగా, కథకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న ఆయన నటుడిగా పరిచయం అయిన తొలి తమిళ చిత్రం వేలైకిడైచ్చురుచ్చు. తాజాగా తన రాజ్కెణడీ ఫిలింస్ పతాకంపై కడమాన్‌పారై అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తమిళం, తెలుగు,మలయాళం, హింది భాషల్లో ఏక కాలంలో రూపొందించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన కొడుకు అలీఖాన్ తుగ్లక్ కథానాయకుడిగా పరిచయ అవ్వడం మరో విశేషం. ఇందులో అలీఖాన్ సిం హం,పులి,గాడిద,చిరుతలా జీవించే మనిషిలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కథానాయకులుగా అనురాగవి జెనీ ఫెర్నాండస్ నటిస్తున్నారు. శివశంకర్, ఛార్మీ, దేవీతేజూ, బ్లాక్‌పాండి, అముదవానన్, మల్లై, కోదండం, పళనీ, కనల్‌కన్నన్, బోండామణి, పైయిల్మాన్ రంగనాధన్, లొల్లుసభ మనోహర్, వెంగళరావ్, ఆదిశివన్, విశింద్రన్, కూల్‌సురేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను మన్సూర్‌అలీఖాన్ తెలుపుతూ ఈ తరం కళాశాల విద్యార్థుల జీవన విధానాలను ఆవి ష్కరించే చిత్రమిదన్నారు. వినోదాన్ని జోడించి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని తెలిపారు. దీనికి మహేశ్ ఛాయాగ్రహణ,రవివర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. -
రాత్రికిరాత్రే బిచ్చగాళ్లను చేశారు
ప్రధాని నరేంద్రమోదీ ప్రజల్ని రాత్రికి రాత్రే బిచ్చగాళ్లను చేశారని నటుడు, దర్శక నిర్మాత మన్సూర్ అలీఖాన్ ధ్వజమెత్తారు. మైమోసా పతాకంపై పెట్టి సీకేపీఆర్.మోహన్ నిర్మించిన చిత్రం కొంచెం కొంచెం. నవ తారలు గోకుల్, నీనూ, ప్రియా మోహన్ నాయకానారుుకలుగా నటించిన ఈ చిత్రానికి ఉదయ్‌శేఖర్ దర్శకత్వం వహించారు.వల్లవన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ మలయాళ నిర్మాతలు నిర్మించిన చిత్రం ఇదన్నారు.మన కళాకారులు తెలుగు చిత్ర పరిశ్రమలో విజయం సాధిస్తునట్లుగానే వీరు ఇక్కడ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. తాను ఈ చిత్రంలో నటించానని, ఇది చాలా మంచి కథా చిత్రం అని పేర్కొన్నారు. ప్రధాని నిర్ణయాన్ని ఖండించాలి కాగా తానీ రోజు ఒక చిత్ర షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని,అరుుతే కళాకారులకు, కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి ఉండడంతో నిర్మాతలు డబ్బును మార్చడానికి బ్యాంకుకు వెళ్లడంతో షూటింగ్‌ను ఒక పూట రద్దు చేశారని తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోదీని నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారని అన్నారు. ఇది నల్లధనాన్ని అరికట్టే చర్య అని చాలా మంది అంటున్నారన్నారని నిజానికి ప్రధాని ప్రకటన ప్రజలను రాత్రికి రాత్రే బిచ్చగాళ్లను చేసిందని ధ్వజమెత్తారు.ఆర్థిక సమస్యలతో చిత్ర పరిశ్రమ అతలాకుతలం అవుతోందన్నారు.ప్రజలు చిల్లర డబ్బులు లేక వీధిన పడ్డారని పేర్కొన్నారు. ఇక ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడం లేదన్నారు.నిత్యావసర ఖర్చులకు కూడా డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నారని, డబ్బును మార్చుకోవడానికి బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు పడుతున్నారని అన్నారు.దీంతో గత ఐదు రోజులుగా థియేటర్లు జనాలు లేక మూత పడే పరిస్థితి నెలకొందన్నారు. చిత్రపరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటోందన్నారు.ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. సినీ కళాకారులందరూ పోరాటం చేయాలని మన్సూర్ అలీఖాన్ ఉద్వేగంగా మాట్లాడారు. మంలో సీనియర్ దర్శకుడు ఎస్పీ.ముత్తురామన్, శీనూరామసామి సుశీందర్, జాగ్వర్ తంగం పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నటుడి కుమారుడికి గాయాలు
చెన్నై : నటుడు మన్సూర్ ఆలీఖాన్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్ (17). బుధవారం సాయంత్రం మసీదులో ప్రార్థనలు ముగించుకుని అడయారు వెళ్లారు. తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో సర్ధార్ పటేల్ రోడ్డు మీదుగా బైక్‌లో స్నేహితునితో కలిసి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన వాహనం తుగ్లక్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వస్తున్న ఇద్దరు గాయపడ్డాడు. అడయారు ట్రాఫిక్ పోలీసులు తుగ్లక్తోపాటు అతడి స్నేహితుడిని సమీపంలోగల ఆస్పత్రిలో తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.