![Mansoor Ali Khan Gets Poisoned In Election Campaign In Tamilnadu - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/19/Mansoor-Ali-Khan-Gets-Poisoned.jpg.webp?itok=1Vvrwy2t)
కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్‌పై విష ప్రయో గం జగిందనే వార్త లు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారాయి. బుధవారం వరకు అన్ని రాజకీయపార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచా రం సాగించారు. కాగా నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈయన బుధవారం వేలూ రు పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేస్తుండగా కొందరు బలవంతంగా పండ్ల జ్యూస్‌ను తాగించారు. ఆ తరువాత మజ్జిగను కూ డా తాగించడంతో కడుపునొప్పికి గురైన నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ వెంటనే కిందకు పడిపోయాడు.
కార్యకర్తలు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను మన్సూర్ అలీఖాన్ సన్నిహితులు మీడియాకు విడుదల చేశారు. అందులో నటుడు మన్సూర్‌అలీఖాన్ పేర్కొంటూ తాను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా కొందరు తనతో బలవంతంగా పండ్ల రసాన్ని తాగించారని.. ఆ వెంటనే మజ్జిగను కూడా ఇచ్చారని, అది తాగిన తాను తీవ్ర కడుపు నొప్పితో కిందికి పడిపోయానని పేర్కొన్నారు. తన వెంట ఉన్న కార్యకర్తలు వెంటనే ఆస్పతికి తీసుకెళ్లారని.. పరీక్షించిన వైద్యులు విష ప్రయోగం జరిగిందని చెప్పారన్నారు. ప్రస్తుతం తాను ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాననే నమ్మకముందని మన్సూర్ అలీఖాన్ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment