Poison
-
ఆ మొక్కలే ఏనుగుల మృతికి కారణం
భోపాల్: ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ అభయారణ్యంలో 10 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాయి. దీనినిపై విచారణ జరిపిన అటవీశాఖ అధికారులు వీటి మృతికి ‘న్యూరోటాక్సిన్ సైక్లోపియాజోనిక్ ఆమ్లం’ కారణమని తెలిపారు. ఏనుగులకు విషం ఇవ్వడం కారణంగానే అవి మరణించాయని వస్తున్న వార్తలను ఒక అటవీశాఖ అధికారి ఖండించారు. వాటి మృతికి విషపూరితమైన మొక్కలు కారణమని స్పష్టం చేశారు.అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్) ఎల్. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏనుగులు పెద్ద మొత్తంలో ‘కోడో’ మొక్కలను తినడం వలన వాటి శరీరంలోకి విషం వ్యాపించిందని అన్నారు. అక్టోబర్ 29 బాంధవ్‌గఢ్ పులుల అభయారణ్యంలో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఆ తరువాత వాటి మరణాల సంఖ్య 10కి చేరింది.ఇంత పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోయిన దరిమిలా ప్రభుత్వం దీనిపై దర్యాప్తునకు ఒక కమిటీని నియమించింది. ఈ దర్యాప్తులో కోడో మొక్కలే ఆ ఏనుగుల మృతికి కారణమై ఉండవచ్చని తేలింది. కాగా ఏనుగుల మృతి గురించి తెలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెంటనే స్పందించారు. ఏనుగుల మరణాలను నివారించడం, మానవులపై వాటి దాడులను ఆపడం అనే లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.ఇది కూడా చదవండి: ప్లీజ్... ఇంకో బిడ్డను కనవచ్చు కదా! -
రిపబ్లికన్లకు ‘ఉడుత సాయం’!
న్యూయార్క్: నేడు మొదలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ట్యాక్స్‌లు, అబార్షన్ హక్కులు, అక్రమ వలసలు ప్రధాన అంశాలుకాగా చిట్టచివర్లో ఒక ఉడుత చొరబడింది! రేబిస్ అనుమానంతో దాన్ని అధికారులు చంపేయడం చర్చనీయంగా మారింది. రిపబ్లికన్లు దీన్ని తమ ప్రచారాంశంగా మార్చుకున్నారు. బుల్లి టోపీలు, గమ్మతైన ట్రిక్కులతో మిఠాయిలపై గెంతుతూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఈ ఉడుతకు ‘పీనట్’ అని పేరు. న్యూయార్క్‌లో మార్క్ లాంగో అనే వ్యక్తి ఏడేళ్లుగా పెంచుతున్నాడు. దీంతోపాటు నక్కలా చిన్నగా ఉండే రఖూన్ అనే జీవినీ పెంచుతున్నాడు. ఈ వన్య ప్రాణుల పెంపకానికి అనుమతి, లైసెన్స్ తప్పనిసరి. అవి లేకపోవడంతో అధికారులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఉడుత ఇటీవల ఒకరిని కరిచిందట. దాంతో ప్రాణాంతకర రేబిస్ వ్యాధి ప్రబలే ఆస్కారముందంటూ పీనట్, రఖూన్ రెండింటినీ గత వారం విషమిచ్చి చంపేశారు. దీన్ని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ రన్నింగ్ మేట్ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బైడెన్ సర్కారు నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం. ప్రభుత్వం మతిలేని, దయలేని యంత్రంగా మారింది. అనాథ ఉడుతను నిర్దయగా చంపేసింది. ఇలాంటి ఉడుతలను సైతం ట్రంప్ కాపాడగలరు’’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. ‘‘6 లక్షల మంది నేరస్తులు, 13 వేల మంది హంతకులు, 16 వేల మంది రేపిస్టులు స్వేచ్ఛగా అమెరికాలోకి అడుగు పెట్టేలా చేసిన డెమొక్రటిక్ ప్రభుత్వం ఒక పెంపుడు ఉడుతను మాత్రం బతకనీయలేదు’’ అంటూ వాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషమిచ్చి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.మృతులను గుల్ బేగ్ బ్రోహి, అతని భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ పెద్దకు కొందరితో భూవివాదం ఉన్నదని పోలీసుల దర్యాప్తులో తేలింది. సకూర్‌లోని కెమికల్ లేబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో కుటుంబ సభ్యులు మృతిచెందిన రోజు తాగిన పాలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాల్లో విషపదార్థాలు ఉన్నట్లు కూడా నివేదికలో నిర్ధారణ అయ్యిందన్నారు.ఖైర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పి) డాక్టర్ సమీవుల్లా సూమ్రో మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని సమీవుల్లా సూమ్రో తెలిపారు.ఇది కూడా చదవండి: Ghaziabad: పండ్ల రసాల్లో మూత్రం కలిపిన వ్యాపారి అరెస్ట్ -
షిప్పింగ్ కంపెనీలో విష వాయువు లీక్
విశాఖపట్నం, సాక్షి: శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎసిటానిలైడ్ బ్యాగ్స్‌ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్‌కు మార్చుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎసిటానిలైడ్ అనే విష వాయువును పీల్చటంతో కార్మికులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి కంపెనీ తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి 2:00 గంటల సమయంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురవ్వగా.. దేముడు బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
Madhya Pradesh: తవ్వకాల్లో 35 కల్తీ మద్యం డ్రమ్ములు.. కంగుతిన్న పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఆశ్చర్యకర ఉదంతం చోటుచేసుకుంది. కరౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో విషపూరిత మద్యాన్ని (ఓవర్ ప్రూఫ్ స్పిరిట్) స్వాధీనం చేసుకున్నారు.మద్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న కొందరు విషపూరితమైన మద్యాన్ని డ్రమ్ముల్లో దాచి ఉంచారు. పోలీసులు జేసీబీతో తవ్వకాలు జరపగా 35 కల్తీ మద్యం డ్రమ్ములు బయటపడ్డాయి. దీనిని చూసి పోలీసులు కంగుతిన్నారు. పోలీసులు రాకను గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ డ్రమ్ములకు పైపులైన్‌కు కనెక్షన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా కల్తీ మద్యాన్ని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. దీని గురించి పోలీసులకు ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఒక పథకం ప్రకారం ఈ స్థావరంపై దాడి చేశారు. అనంతరం జేసీబీతో తవ్వకాలు జరిపి 35 కల్తీ మద్యం డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. -
Uttar Pradesh: కలుషిత ఆహారం తిన్న 60 మందికి అస్వస్థత
మధురలో శ్రీకృష్ణాష్టమి వేళ విషాదం చోటుచేసుకుంది. పండుగ నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ బక్వీట్(గోధుమ తరహా ఆహారధాన్యం) పిండితో చేసిన పకోడీలు తిన్న 60 మందికిపైగా జనం అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన మధురలోని ఫరా ప్రాంతంలో చోటుచేసుకుంది. బక్వీట్ పకోడీలు తిన్న కొద్దిసేపటికే చాలామంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. స్థానికులు వీరిని వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆరోగ్యం మరింతగా క్షీణించిన ఆరుగురిని ఆగ్రాలోని ఎస్ఎన్ ఆస్పత్రికి తరలించారు. అలాగే 15 మంది బాధితులను మధుర జిల్లా ఆస్పత్రికి, 11 మందిని బృందావన్‌లోని ఆస్పత్రికి తరలించారు.కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్టాఫ్ నర్సు జస్వంత్ యాదవ్ మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కారణంగా 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారన్నారు. వీరింతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన అనంతరం జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అధికారులు బక్వీట్ పిండి విక్రయించిన ఇద్దరు దుకాణదారులపై కేసు నమోదు చేశారు. -
ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలు.. ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. అనకాపల్లి అనాథా శ్రయంలో ముగ్గురు విద్యార్థుల మృతి చెందగా, 37 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. మరో ఘటనలో చిత్తూరు అపోలో ఆసుపత్రిలో 70 మంది విద్యార్థులు విషాహారం తిని అస్వస్థత గురయ్యారు.ఈ కేసులను జాతీయ మానవ హక్కుల సంఘం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీ , డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో నివేదిక పంపాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. -
కలుషితాహారం తిని విద్యార్థులు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు.చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు, బురద జల్లుడు కార్యక్రమాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.కాగా అనకాపల్లి జిల్లా కైలాసపట్టణంలోని అనాథాశ్రమంలో.. కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జాషువా, భవాని, శ్రద్ధ మరణించారు. మిగతా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి ఏరియా ఆసుప్రతిలో 17 మంది విద్యార్ధులకు చికిత్సం అందిస్తుండగా.. నర్సీపట్నం ఆసుపత్రిలో ఏడుగురు విద్యార్ధులకు చికిత్స పొందుతున్నారు. -
'వాటర్ పాయిజనింగ్'తో ఆస్పత్రిపాలైన వ్యక్తి! ఎందువల్ల వస్తుందంటే..?
ఫుడ్ పాయిజనింగ్‌లా ఏంటీ వాటర్ పాయిజనింగ్. నీళ్లు కూడా పాయిజన్‌గా అవుతాయా..? లేక కలుషిత నీటి వల్ల ఇలా జరుగుతుందా అంటే..?. అవేమీ కాదు. తాగాల్సిన నీటికంటే అధికంగా తాగితే ఈ పరిస్థితికి గురవ్వుతామని చెబుతున్నారు నిపుణుల. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. అసలేంటి వాటర్ పాయిజనింగ్? ఎలా ప్రాణాంతకమో? సవివరంగా చూద్దాం.టెక్సాస్‌కి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు జూన్‌లో తీవ్ర వేసవి వేడికి గురయ్యాడు. చెప్పాలంటే తీవ్ర వేడిమికి తాళ్లలేక అధికంగా నీటిని తాగాడు. సుమారు 11 లీటర్ల మేర నీళ్లు ఆత్రంగా తాగేశాడు. అంతే కాసేపటికి కారం, అలసట, ఛాతీ నొప్పిని వంటి సమస్యలతో స్ప్రుహ కోల్పోయాడు. వెంటనే అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు నీటి పాయిజన్కి గురయ్యినట్లు నిర్థారించారు. అసలేంటి నీటి పాయిజన్ అంటే..వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో నివశించే ప్రజలు అధిక దాహానికి గురవ్వుతారు. త్వరగా నీటిని తాగి డీహైడ్రేషన్ నష్టాన్ని భర్తీ చేయాల్సిఉంటుంది. ఇలా తాగేటప్పుడూ అధికంగా తాగితే నీటిపాయిజన్కి గురవ్వుతారు. వెంటనే ఇది కిడ్నీలు, ఎలక్ట్రోలైట్లు, సోడియంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ నీటిని అధికంగా తీసుకున్న వెంటనే ఎలక్ట్రోలైట్లు, ఉప్పు కరిగిపోవడం జరుగుతుంది. దీంతో ఆ అధిక నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేక పాయిజన్‌గా మారిపోవడం జరుగుతుంది.ఇది ఉబ్బరం, పాలీయూరియా, హైపోనాట్రేమియా (సీరం సోడియం గాఢత 135 mEq/L కంటే తక్కువ), వాపు, బలహీనమైన జీవక్రియకు దారితీస్తుంది. మూత్రపిండాలు ఒక సమయంలో పరిమిత నీటిని మాత్రమే నిర్వహించగలవు. తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో ద్రవాలను నిర్వహించడం తీవ్రమైన పరిణామలకు దారితీసి.. కణాల వాపు, గుండెపోటు వంటి లక్షణాలు ఎదురవ్వుతాయి. లక్షణాలు..కండరాల బలహీనత లేదా తిమ్మిరిరక్తపోటు పెరుగుదలద్వంద్వ దృష్టిగందరగోళంఇంద్రియ సమాచారాన్ని గుర్తించలేకపోవడంశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిమానసిక రుగ్మతలో బాధపడుతున్నవారు, క్రీడాకారులు, సైనిక శిక్షణ, అధిక శ్రమతో కూడిన పనులు చేసేవారు అధికంగా నీటిని తాగకూడదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) ప్రకారం అమెరికాలో ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు మిలియన్ల మంది ఈ వాటర్ పాయిజనింగ్ బారినపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఎంత నీరు తాగితే మంచిదంటే..ఒక వ్యక్తి రోజూలో ఎంత నీరు తాగొచ్చు అని చెప్పేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అయితే ఆరోగ్యానికి అవసరమైనంత మేర నీటిని తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. హైపోనట్రేమియాకి గురై, మూత్రపిండాలపై ప్రభావం పడేలా నీటిని అధికంగా తీసుకోకూడదు. విపరీతమైన వేడి వాతావరణంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కాపాడుకునేలా రోజుకి సుమారు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: రోజూ ఎనిమిది గ్లాసుల పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్.. దీని వల్ల వచ్చే సమస్యలివే..!) -
విజయవాడ: మదర్సాలో ఫుడ్ పాయిజన్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
సాక్షి, విజయవాడ: నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. నిన్న( గురువారం) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలిక ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.. అయితే, ఆహారం కలుషితమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, మదరసా చారిటబుల్ ట్రస్ట్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురు కరిష్మా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందల కేజీల కుళ్లిపోయిన మాంసాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ట్రస్ట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. డీప్ ఫ్రీజ్‌లో ఫుడ్ ఇన్స్పెక్టర్ గౌస్.. మాంసాన్ని పరిశీలించారు.ఫ్రీజ్‌లో 100 కేజీల మటన్ ఉందని.. ఈ నెల 17వ తేదీన తెచ్చిన మటన్ నేటికి వాడుతున్నారని తెలిపారు. బుధవారం పుడ్ పాయిజన్ జరిగింది.. కరిష్మా అనే బాలిక మృతి చెందింది. 8 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు. మదర్సాకు నోటీసులు ఇచ్చాం’ అని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఈ వాసనకి.. పాములిక పరారే..!
మారుతున్న కాలానుగుణంగా ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఎండాకాలం, చలికాలం కాస్త వాతావరణంలో పొడిగా, ఎండుగా ఉన్నా.. వర్షాకాలం మాత్రం నేల చాలావరకు తడిగానే ఉంటుంది. దీంతో చెట్లు, పొదలు విపరీతంగా పెరగడంతోపాటు విషజీవులకు నెలవుగా మారుతుంది.. ఆ విషయానికొస్తే పాములు అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు.పాము కనిపించగానే భయానికిలోనై ప్రాణరక్షణలో దానిని చంపడమో? తప్పించుకోవడమో? చేస్తుంటాము. మనుషులకు నచ్చని దుర్వాసనలు ఎలాగైతే ఉంటాయో.. నిపుణుల పరిశోధన ప్రకారం.. పాములకు కూడా నచ్చని కొన్ని వస్తువుల వాసనలున్నాయి. పాములు మన చుట్టూ పరిసరాలలో కనిపించకుండా, రక్షణగా ఉండడానికి ఈ వాసనలను వెదజల్లితే చాలు. ఇక దరిదాపుల్లో కూడా కనిపిచకుండాపోతాయి.అవి...- ప్రతీ ఇంట్లో సహజంగా నిల్వఉండే వెల్లుల్లి, ఉల్లిపాయలు పదార్థాల వాసనకు పాములు తట్టుకోలేవట.- పుదీనా, తులసి మొక్కల నుంచి వెలువడే వాసనను పాములు ఇష్టపడవు. బహుశా ఏళ్ల తరబడి భారతీయ ఇళ్లల్లో తులసి మొక్కను నాటడానికి కారణం ఇదే.- అలాగే నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే కూడా పాములు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.- అమ్మోనియా వాయువు వాసనను పాములు తీవ్ర ఇబ్బందిగా, అశాంతిగా భావిస్తాయి.- పాములు కిరోసిన్ వాసనను కూడా తట్టుకోలేవు.ఇవి చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే.. -
ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే?
చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. అలాగని అన్ని చేపలూ తినడానికి పనికొచ్చేవి కాదు. చేపల్లో కొన్ని రకాలు విషపూరితమైనవి కూడా ఉంటాయి. ప్రపంచంలోని విషపూరితమైన చేపల్లోకెల్లా అత్యంత విషపూరితమైన చేప ‘స్టోన్‌ఫిష్’. ఇది ఎక్కువగా సముద్రం అడుగున ఉంటుంది. చూడటానికి అచ్చంగా రాయిలా కనిపిస్తుంది.సముద్రగర్భంలో డైవింగ్ చేసేవారికి తప్ప ఒడ్డున ఉన్నవారికి ఇది కనిపించడం చాలా అరుదు. డైవింగ్ చేసేవారు దీనిని చూస్తే చేప అనుకోరు. సముద్రం అడుగున ఉండే ఎన్నో రాళ్లలో ఇది కూడా ఒక రాయేనని పొరబడుతుంటారు. పొరపాటున దీనిపైన అడుగు వేసినా, తాకినా ప్రమాదం తప్పదు. స్కార్పియన్‌ఫిష్ జాతికి చెందినది ఈ స్టోన్‌ఫిష్.ఇది ఎక్కువగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూగినీ, ఆస్ట్రేలియా పరిధిలోని సముద్ర జలాల్లో కనిపిస్తుంది. దీని కాటు అత్యంత విషపూరితమైనది. ఇది కాటు వేస్తే గంటల తరబడి నొప్పితో విలవిలలాడాల్సి వస్తుంది. దీని కాటుకు విరుగుడు మందు కూడా ఇంతవరకు లేదు. ఒక్కోసారి దీని కాటు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది.ఈ సంగతి గురించి మీకు తెలుసా?‘మర్డర్’ అంటే హత్య అనే అర్థమే అందరికీ తెలుసు. అయితే, కాకుల గుంపును కూడా ‘మర్డర్’ అనే అంటారు.ఇవి చదవండి: ఇదేం చేప కాదు.. నీటిలో దిగితే దానికంటే తక్కువేం కాదు! -
తాగునీటిలో విష ప్రయోగం
కణేకల్లు: ప్రజలు తాగే నీళ్లలో విషాన్ని కలిపారు.. ఆ నీరు తాగినోళ్లు ప్రాణాలతో ఉండకూడదనుకున్నారో.. లేక వాంతులు, విరేచనాలొచ్చి నిర్వహణ చేసే వారికి చెడ్డపేరు రావాలనుకున్నారో గానీ అత్యంత అమానుష ఘటనకు ఒడిగట్టారు. వాటర్‌ప్లాంట్ నిర్వాహకులు సకాలంలో గుర్తించడంతో ముప్పు తప్పింది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం తుంబిగనూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తుంబిగనూరులో సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్.. రెండేళ్ల క్రితం మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి అప్పగించింది. గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు ఫణీంద్ర గౌడ్ వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తన తండ్రి తిప్పయ్యను ప్లాంట్ వద్దే ఉంచారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పంచాయతీ ఆధ్వర్యంలో రూ.5కే రెండు బిందెల నీటిని పంí³ణీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దుప్పటి కప్పుకుని మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కిటికీలు తీసి నీటి ట్యాంకులో టెర్మినేటర్ పురుగుల మందు కలిపారు. అదే సమయంలో బహిర్భూమి కోసం లేచిన తిప్పయ్య ప్లాంట్ వద్ద వ్యక్తులు ఉండటాన్ని గమనించి.. ఎవరక్కడ అంటూ గద్దించాడు. దీంతో పొరుగున ఉండే తలారి హనుమంతు, కొట్రేగౌడ్ నిద్ర లేచి అక్కడికి వచ్చారు. ఇంతలోనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వాటర్‌ప్లాంట్‌ను పరిశీలించగా.. అందులో పురుగుల మందు కలిపినట్టు తేలింది. ఈ ఘటనను అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని ఉపేక్షించొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, కణేకల్లు ఎస్ఐ శ్రీనివాసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను రంగంలో దింపి ఆధారాలను సేకరించారు. జరిగిన ఘటనపై తిప్పయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎల్లో మీడియాలో దుష్ప్రచారం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ రాలేదన్న ఉద్దేశంతో నేనే కొందరితో తాగునీటిలో విషం కలిపించానంటూ ఎల్లో మీడియాలో ప్రసారం చేయడం దుర్మార్గం. గ్రామ సర్పంచ్‌గా నేను 365 ఓట్ల మెజార్టీతో గెలిచాను. గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 494 ఓట్లు రాగా.. టీడీపీకి 512 ఓట్లు వచ్చాయి. ఓట్లు వేయలేదని ప్రజలను బెదిరించడం, దౌర్జన్యం చేయడం లాంటివి నేను ఏరోజూ చేయలేదు. ఎల్లో మీడియా నాపై నింద వేయడంబాధాకరం.– ఫణీంద్ర గౌడ్, గ్రామ సర్పంచ్, తుంబిగనూరు -
ఈ చెట్టుని కోతులు కూడా ఎక్కలేవు! ఎందుకో తెలుసా?
కోతులు ఏ చెట్టు మీదకైనా ఇట్టే ఎక్కేస్తాయి. ఈ చెట్టు మీద మాత్రం కోతులు అడుగుపెట్టవు. దీనిని ‘శాండ్బాక్స్ ట్రీ’ అంటారు. దీని కాండం నిండా పదునైన విషపు ముళ్లు ఉంటాయి.దాదాపు రెండువందల అడుగు ఎత్తు వరకు పెరిగే ఈ చెట్ల ఆకులు రెండడుగుల పరిమాణంలో ఉంటాయి. ఈ చెట్లకు చిన్నసైజు గుమ్మడికాయల వంటి కాయలు కాస్తాయి. ఇవి పూర్తిగా పండిపోయాక పేలిపోతాయి. ఈ పండ్ల పేలుడు ధాటికి వాటి నుంచి గింజలు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తాయి. ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లోని తడినేలల్లో పెరుగుతాయి.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా.. -
వివాదాస్పద నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన ఆరోపణలు....!
కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్‌పై విష ప్రయో గం జగిందనే వార్త లు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారాయి. బుధవారం వరకు అన్ని రాజకీయపార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచా రం సాగించారు. కాగా నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈయన బుధవారం వేలూ రు పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేస్తుండగా కొందరు బలవంతంగా పండ్ల జ్యూస్‌ను తాగించారు. ఆ తరువాత మజ్జిగను కూ డా తాగించడంతో కడుపునొప్పికి గురైన నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ వెంటనే కిందకు పడిపోయాడు. కార్యకర్తలు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను మన్సూర్ అలీఖాన్ సన్నిహితులు మీడియాకు విడుదల చేశారు. అందులో నటుడు మన్సూర్‌అలీఖాన్ పేర్కొంటూ తాను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా కొందరు తనతో బలవంతంగా పండ్ల రసాన్ని తాగించారని.. ఆ వెంటనే మజ్జిగను కూడా ఇచ్చారని, అది తాగిన తాను తీవ్ర కడుపు నొప్పితో కిందికి పడిపోయానని పేర్కొన్నారు. తన వెంట ఉన్న కార్యకర్తలు వెంటనే ఆస్పతికి తీసుకెళ్లారని.. పరీక్షించిన వైద్యులు విష ప్రయోగం జరిగిందని చెప్పారన్నారు. ప్రస్తుతం తాను ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాననే నమ్మకముందని మన్సూర్ అలీఖాన్ వ్యక్తం చేశారు. -
విషాదం: ప్రాణం తీసిన బర్త్ డే కేక్?
ఛండీఘర్: పుట్టినరోజు నాడు కేక్ తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె పుట్టినరోజే చిన్నారికి చివరి రోజు కావడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. మార్చి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఓ బ్యాకరీ నుంచి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేశారు. సాయంత్రం ఏడు గంటలకు కేక్ కట్ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఇక, గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి కల్లా ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో, సదరు బేకరీపై చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అనంతరం.. దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు, కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం పంపారు. నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, పుట్టినరోజే తన బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
Mukhtar Ansari: అన్సారీపై విష ప్రయోగం?
లక్నో: బాందా జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ (63) గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందుతుండగానే.. గుండెపోటుకు గురై చనిపోయినట్లు దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం అన్సారీ మృతిపై సంచలన ఆరోపణలకు దిగారు. ముఖ్తార్ అన్సారీపై విషప్రయోగం జరిగిందని.. 2005 నుంచి బాందా జైలులో ఉన్న ఆయనపై విషప్రయోగం జరగడం ఇప్పుడు రెండోసారి ఆయన సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. ‘జైలులో అన్సారీకి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. సుమారు 40 రోజుల పాటు ఆహారంలో విషం కలిపారు. మార్చి 19వ తేదీన ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకంగా మారి ఆస్పత్రిలో చేరారు’ అని అఫ్జల్ అన్సారీ అంటున్నారు. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు ఉమర్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ‘ మా నాన్న(ముఖ్తార్)పై విష ప్రయోగం జరుగుతోందన్న విషయాన్ని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడూ కూడా అదే చెబుతున్నాం. మార్చి 19న మా నాన్న( ముఖ్తార్)కు రాత్రి భోజనంలో విషం కలిపారు. మేము ఈ విషయంలో కోర్టును సంప్రదిస్తాం. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని ఉమర్ తెలిపారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం విషయమించటంతో ఆయన్ను మంగళవారం బాందాలోని దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఆయనపై విష ప్రయోగం జరిగిందా? అనేదానిపై వైద్యులు స్పందించలేదు. బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఇవాళ ముఖ్తార్ అన్సారీ మృతదేహానికి శవపరీక్ష జరగనుంది. ఆపై ఈ ఆరోపణలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ యూపీలోని మౌకు చెందిన అన్సారీపై గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ రెండు సార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఆయన మృతికి ఆ పార్టీ ఎక్స్(ట్విటర్)లో సంతాపం ప్రకటించింది. అన్సారీ మృతితో యూపీ మొత్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్ రిజర్వ్ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముఖ్తార్ అన్సారీ మృతిపై దర్యాప్తు జరగాలి: మాయావతి జైలులో ముఖ్తార్ అన్సారీపై మృతిపై ఆయన కుటుంబం వ్యక్తం చేస్తున్న భయాలు, విష ప్రయోగానికి సంబంధించి ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ వేదిక స్పందించారు. ‘ ముఖ్తార్ మృతి దార్యప్తు జరగాలి. మృతికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 -
మిస్టరీ: 'డోంట్ టచ్’ అనే హెచ్చరికతో.. 'చెచెన్, చాకా' ట్రీస్
'మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ప్రతి చెచెన్ చెట్టుకు ‘డోంట్ టచ్’ అనే హెచ్చరిక బోర్డ్ మీద డేంజర్ బొమ్మ గీసి మరీ ఉంటుంది. అవును ఆ చెట్టు బెరడు తాకితే.. భయంకరమైన దద్దుర్లు వస్తాయి. తట్టుకోలేనంత దురద పుడుతుంది. భరించలేనంత మంట వస్తుంది. దాని బెరడు నుంచి నల్లటి జిగురు పొంగుతుంది. కొన్నేళ్లక్రితమే ఆ చెట్టుపై ఎన్నో ప్రయోగాలు జరిపి.. అది విషపూరితమని, పట్టుకుంటే ప్రమాదమని నిపుణులు తేల్చేశారు. అందుకే ఆ చెట్టుకు ‘బ్లాక్ పాయిజన్ వుడ్ ట్రీ’ అని పేరు పెట్టారు. కొన్నిసార్లు ఆ చెట్టు సమీపంలో తిరిగితే.. దద్దుర్లు వచ్చేవరకు తెలియదట ఆ చెట్టును మనం తాకామన్న సంగతి'. అయితే విచిత్రమేమిటంటే.. ఆ చెట్టుకు పక్కనే లేదా సమీపంలో ‘చాకా’ అనే మరో చెట్టూ కచ్చితంగా పెరుగుతుంది. చెచెన్ చేసిన గాయాలకు.. చాకా చెట్టు బెరడు విరుగుడుగా పనిచేస్తుంది. దద్దుర్లు రాగానే.. చాకా బెరడును కత్తిరించి.. దాని నుంచి వచ్చే జిగురును దద్దుర్లొచ్చిన చోట రాయాలి. బాడీ లోపలి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే.. ఈ చాకా బెరడుతో టీ పెట్టుకుని తాగొచ్చు. చెచెన్ ట్రీ బెరడు తగిలిన వెంటనే చాకా ట్రీ బెరడును ఔషధంలా ఉపయోగించకపోతే.. వైద్యుల్ని సంప్రదించాల్సిందే. అయితే ఒక ప్రమాదం, దానికి పరిష్కారం రెండూ ఒకేచోట పుట్టిపెరగడం విశేషం. నిజానికి ఈ చెచెన్ – చాకా ట్రీస్ పుట్టుక వెనుక పెద్ద చరిత్రే ఉంది. కొన్ని వందల ఏళ్లక్రితం ఆగ్నేయ మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో ముగిసిన ఓ విషాద ప్రేమగాథే ఈ చెట్ల వెనుకున్న పురాణం. మాయన్ యోధులైన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. టిజిక్, కినిచ్ అనే సోదరులు.. గొప్ప యుద్ధవీరులు.. ఆ రాజ్యానికి యువరాజులు కూడా. అయితే కినిచ్ దయా హృదయంతో, మంచివాడిగా ఉండేవాడు. ప్రేమతో, నిస్వార్థంగా జీవించేవాడు. అందరినీ ఆదరించేవాడు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవాడు. చెచెన్ చెట్టు, పక్కపక్కనే ఉన్న చెచెన్, చాకా చెట్లు కానీ అతని సోదరుడు టిజిక్ మాత్రం.. కోపంతో, ఆవేశంతో నిత్యం అసహనంతో జీవించేవాడు. అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు. అహంకారం ప్రదర్శించేవాడు. ఒకరోజు కినిచ్, టిజిక్లు రాజ్యపర్యటనలో ఉండగా.. ‘నిక్టే హా’ అనే అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారట. ‘ఆమె నాకు సొంతమంటే నాకు సొంతం’ అని అన్నదమ్ములిద్దరూ వాదులాటకు దిగారు. అది కాస్తా గొడవకు దారితీసి.. యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి నిక్టే కళ్లముందే.. ఇద్దరు అన్నదమ్ములు యుద్ధానికి తెగబడ్డారట. కొన్నిరోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో.. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసిన ఒకనాడు.. సోదరులిద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చనిపోయారు. తనను ప్రేమించిన ఇద్దరు మహాయోధులు చనిపోయారన్న బెంగతో నిక్టే కూడా మరణించింది. మరణానంతరం స్వర్గానికి వెళ్లిన ఇద్దరు సోదరులూ.. దైవాన్ని క్షమాపణ కోరి, మళ్లీ పుట్టించమని కోరుకున్నారు. అనుగ్రహించిన దేవతలు వారికి పునర్జన్మను ప్రసాదించారు. టిజిక్.. చెచెన్ చెట్టులా.. కినిచ్.. చాకా చెట్టుగా తిరిగి జన్మించారు. అప్పుడే వారికి సమీపంలోనే నిక్టేహా అందమైన తెల్లటి పువ్వులా జన్మించిందట. నిజానికి టిజిక్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా.. చెచెన్ చెట్టు విషాన్ని చిమ్మితే.. దాన్ని సరిచేసే ఔషధంలా కినిచ్.. చాకాలా ప్రేమను పంచుతున్నాడట. అందుకే ఈ పురాణగాథలో చెప్పినట్లే.. అన్నదమ్ములిద్దరూ ఆ చెట్ల రూపంలో ఎక్కడ పుట్టినా కలసే పుడతారట. వారి సమీపంలో నిక్టే కూడా అందమైన పువ్వు రూపంలో జన్మిస్తుందని నమ్ముతారు. ఏదేమైనా.. చెచెన్, చాకా చెట్ల జన్మరహస్యం నేటికీ ఓ మిస్టరీనే. ఈ సృష్టిలో అద్భుతమే. — సంహిత నిమ్మన -
పాము విషానికి విరుగుడు.. ఒంటె కన్నీరు!
ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనికివస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటువేసినప్పుడు మనిషి బతికేందుకు అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (సీవీఆర్ఎల్) ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. దుబాయ్‌లోని ఈ ల్యాబ్‌లో దీనిపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని సీవీఆర్ఎల్ పేర్కొంది. తాము త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు. ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. -
కనీసం చివరిచూపు చూసుకోనివ్వండి
మాస్కో: రష్యా మారుమూల జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు అలెక్సీ నవాల్నీ పార్థివదేహాన్ని వెంటనే అప్పగించాలని ఆయన తల్లి ఆవేదనతో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చనిపోయాక మృతదేహాన్ని వేరే చోటుకు తరలించామంటూ తల్లి, నవాల్నీ న్యాయవాదులను అటూ ఇటూ తిప్పుతూ అధికారులు తిప్పలు పెడుతున్నారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలు చేయిస్తేగానీ విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలియని పరిస్థితి. అందుకే కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించట్లేరనే వాదన వినిపిస్తోంది. మాస్కోకు 1,900 కిలోమీటర్ల దూరంలోని ఆర్కిటిక్ ధృవ సమీపంలో మంచుమయ మారుమూల కారాగారంలో శుక్రవారం నవాల్నీ మరణించిన విషయం తెల్సిందే. విషయం తెల్సి నవాల్నీ తల్లితో కలిసి న్యాయవాది కిరా యామిష్క్ ఆ జైలుకెళ్లారు. అక్కడ మృతదేహం లేదు. దర్యాప్తులో భాగంగా సలేఖర్డ్ సిటీకి తరలించామని అధికారులు చెప్పారు. తీరా అక్కడి సిటీ మార్చురీకి వెళ్తే మూసేసి ఉంది. ఇక్కడికి తీసుకురాలేదని అక్కడి అధికారులు చెప్పారు. ‘మరణానికి కారణాన్ని రష్యా ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. మృతదేహాన్ని అయినా అప్పగించాలి’ అని లాయర్ డిమాండ్‌చేశారు. -
పక్కా ప్లాన్‌తోనే...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశువులను చంపుతున్నాయన్న ప్రతీకారంతోనే కొందరు పులులను మట్టుబెట్టుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లో రెండు పులుల్లో ఒకటి స్పష్టంగా ఇదే కారణంగా చనిపోయినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. తమ పశువులను చంపి తింటున్న పులులను లేకుండా చేయాలని భావించి వాంకిడి మండలం సర్కెపల్లికి చెందిన పశువు యజమాని, ముగ్గురు పశువుల కాపరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇందుకోసం ఉచ్చులు, విష ప్రయోగం కూడా చేసినట్టు తెలుస్తోంది. కళేబరంపై గడ్డి మందు చల్లి.. ఇటీవలే ఓ రైతుకు చెందిన పశువును పులి చంపి తినేసింది. సాధారణంగా ఒకసారి వేటాడితే, పులి ఆ మాంసాన్ని వారం దాకా భుజిస్తుంది. మళ్లీ వస్తుందని తెలుసుకొని ఎద్దు కళేబరంపై గడ్డి మందు చల్లి మట్టుబెట్టారు. మొదట ఉచ్చులు కూడా వేసినట్టు సమాచారం. గడ్డి మందు చల్లిన పశువు కళేబరాన్ని తిని ఎస్9 మగపులి చనిపోగా, ఆ పరిసరాల్లోనే ఉన్న ఎస్6కు చెందిన రెండు పిల్లల జాడ ఇంకా తెలియదు. వాటిని ట్రేస్ చేస్తేనే అసలు విషయం తెలుస్తుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ పులిపై ఎలా విష ప్రయోగం చేశారో నలుగురు నిందితులు బుధవారం అడవిలో అధికారుల ముందు యథాతథంగా చేసి చూపించారు. కేసు దర్యాప్తులో భాగంగా చనిపోయిన పశువుల రైతుల వివరాలు అటవీ అధికారులు సేకరిస్తుండగా, నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో కాగజ్‌నగర్ పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు నిజం ఒప్పుకున్నట్టు తెలిసింది. పరిహారంలో జాప్యం కాగజ్‌నగర్ రేంజ్ దరిగాం, సర్కెపల్లి పరిధిలోనే ఆరు పులులు ఉన్నాయి. తరచూ పశువులపై దా డులు చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అయితే నిబంధనల ప్రకారం పశువుల విలువ మేరకు వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో పశువులను చంపుతున్నాయనే కోపంతోనే కొందరు విష ప్రయోగం చేసి పులుల మరణానికి కారణమవుతున్నారనే వాదనలు ఉన్నాయి.పులుల సంరక్షణ పకడ్బందీగా చేస్తున్నామని చెప్పే అధికారులు కిందిస్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరో పశువుపై దాడి రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్ రేంజ్ ఉట్పల్లి శివారులో ఓ పశువును పులి చంపేసింది. అప్రమత్తమైన అధికారులు కెమెరాలు బిగించారు. అక్కడకు మళ్లీ భుజించేందుకు పులి వస్తే ట్రేస్ అవుతాయి. ఇక్కడ సంచరించే ఆరింటిలో రెండు చనిపోగా, మరో నాలుగింటి జాడపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే అటవీ అధికారులు ఈ కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. గురువారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. -
సంతకం పెట్టలేదని భార్యకు విషమిచ్చి చంపిన భర్త!
మద్దిరాల: మద్దిరాల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరికొందరి సహకారంతో భార్యకు బలవంతంగా గడ్డిమందు తాపగా ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కుంచం వెంకన్న, కళమ్మ (46) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు సంతానం. మండల కేంద్రంలో రెండు షటర్లను నిర్మించుకుని ఒకటి అద్దెకి ఇచ్చి మరో దాంట్లో వీరు నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అద్దెకిచ్చిన షటర్‌ను వెంకన్న మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడు. ఈ విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం చేయాలని వెంకన్న కొద్ది రోజులుగా భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకన్న రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం కళమ్మను కోరాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో మరికొందరి సహకారంతో కళమ్మ బలవంతంగా గడ్డి మందు తాపించాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు ఇంటికి రావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఆమెను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. భర్త పురుగుల మందు తాపిన విషయం ఆస్పత్రిలో వంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంకన్నతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కళమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బ్రహ్మమురారి తెలిపారు. -
ప్రేమించి.. నమ్మించి.. మోసంచేసిన యువకుడు!
బల్మూర్: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి.. పెద్దల సమక్షంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. బల్మూర్ మండలంలోని బాణాలకు చెందిన కోట్ర శారద, అదే గ్రామానికి చెందిన మల్లేష్లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడాది కిందట యువతి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. అతడికి విడాకులు ఇవ్వాలని.. నేను పెళ్లి చేసుకుంటానని మల్లేష్ నమ్మించడంతో మూడు నెలల కిందట శారద తన భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం మల్లేష్ వద్ద పెళ్లి ప్రస్తావన తేగా.. అతడు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో బుధవారం ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు బల్మూర్‌లో పంచాయితీ పెట్టి మాట్లాడుతుండగా.. మల్లేష్ పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో పాటు కొందరు పెద్దలు శారదను దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ విషయంపై యువతితో పాటు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తున్నారని, ప్రేమికుడితో పెళ్లి చేయించాలని కోరుతున్నారని ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. -
గజరాజుల మృత్యుఘోష
సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల మరణాలు ఇటీవల పెరిగాయి. విద్యుదాఘాతం, రైళ్లు ఢీకొనడం వంటి కారణాలతో పెద్దఎత్తున ఏనుగులు మరణిస్తున్నాయి. వీటికితోడు వేటాడటం, విష ప్రయోగం వంటి కారణాల వల్ల ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 522 ఏనుగులు మృత్యువాత పడ్డాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇటీవల వెల్లడించింది. విద్యుదాఘాతాల కారణంగా ఐదేళ్లలో (2018–19 నుంచి 2022–23 వరకు) అత్యధికంగా 379 ఏనుగులు మృతి చెందినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తరువాత రైలు ప్రమాదాల బారినపడి ఐదేళ్లలో 75 ఏనుగులు మరణించాయి. వేటాడటం ద్వారా 47 గజరాజులను చంపేశారు. దంతాల కోసం విష ప్రయోగం చేసి 21 ఏనుగులను హతమార్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. విద్యుత్ కంచెలతోనే తీవ్ర సమస్య విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో ఐదేళ్లలో 80 ఏనుగులు, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో ఒక్కొక్కచోట 53 చొప్పున ఏనుగులు మృతి చెందాయి. రైళ్లు ఢీకొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఒడిశాలో 18 ఏనుగులను రైలు ప్రమాదాలు పొట్టనపెట్టుకున్నాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 15 ఏనుగులను హతమార్చారు. మేఘాలయలో 15 ఏనుగులను చంపేశారు. అసోంలో విషప్రయోగంతో ఏకంగా 17 ఏనుగులను హతమార్చారు. అలాంటి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటవీ ప్రాంత సమీప పొలాల్లో పంటల్ని కాపాడుకునేందుకు విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేస్తుండటంతో విద్యుదాఘాతానికి గురై ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. రైల్వేతో సమన్వయ కమిటీ రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైళ్లు నడిపే పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగుల ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్ పాస్, ఓవర్ పాస్‌లను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు రైల్వే ట్రాక్‌లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రం చేసిన సూచనలివి! ♦ విద్యుదాఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెల్ని తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ♦ భూమిపై విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. అండర్ గ్రౌండ్ లేదా పోల్స్‌పై మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ♦‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తోంది. ♦ ఏనుగుల కదలికలను పర్యవేక్షించడానికి స్థానిక సంఘాలతో ట్రాకర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మానవుల వల్ల నష్టాన్ని నివారించడానికి స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ♦ మానవ–వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్లను గుర్తించడంతోపాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. ♦ అడవి జంతువులకు రుచించని పంటల్ని వేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది. -
ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?
ఇటీవల కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ మంచిదికాదని స్టీల్ లేదా రాగి వాటర్ బాటిల్స్ వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ ఉంటే ఒక రకమైన వాసన రావడమే గాక ఆరోగ్యానికి పర్యావరణానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో విరివిగా మార్కెట్లోకి వస్తున్న స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ వాడుతున్నారు చాలామంది. ఇలాంటి పునర్వినియోగ వాటర్ బాటిల్స్‌ని ఉపయోగించేటప్పుడ తగు జాగ్రత్తుల తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయం. అందుకు నెట్టింట వైరల్ అవుతున్న.. యూఎస్ఏకి చెందిన మహిళ ఉదంతమే ఉదహారణ. ఆమె ఈ పునర్వినియోగ వాటర్ బాటిల్స్‌తో ఎలా అనారోగ్యం పాలైందో టిక్‌టాక్‌లో వివరించింది. మీరు కూడా ఆమెలానే చేస్తున్నట్లయితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకన్నట్లే అవుతుంది. అందువల్ల ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో సదరు మహిళ.. ఇలాంటి పునర్వినయోగ స్టెయిన్ లెస్ బాటిల్స్‌నే తాను వాడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తనకు ఒక రోజు ఉన్నట్లు జలుబు చేసిందిని, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్నాక తగ్గింది మళ్లీ రెండు రోజులకే జలుబు, దగ్గు రెండు విపరీతంగా వచ్చాయి. దీంతో డాక్టర్లను సంప్రదించి యాంటీబయోటిక్ మందులు వాడింది. త్వరితగతినే కోలుకుంది కూడా. అయితే మళ్లీ వారం రోజులకే మళ్లీ సైనస్ వంటి లక్షణాలతో జలబు రావడం జరిగింది. తనకు జలుబు చేయడం అన్నదే చాలా అరుదు అలాంటిది ఇలా తరచుగా ఒక నెలలోనే రెండు మూడు సార్లు జలుబున బారిన పడుతున్నానేంటీ ఏమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నాయా అని భయపడింది. దీంతో సమస్య ఎక్కడ ఉందా అని చెక్చేసుకుంది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర నుంచి తీసుకునే ఆహార పదార్థల వరకు ఎక్కడ తలెత్తుంది ఈ సమస్య, దేనివల్ల తనకు ఇలా అయ్యిందని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా..తాగే వాటర్ సురక్షితంగా ఉందా లేదా అన్న ఆలోచన తట్టింది. వెంటనే బాటిల్స్ అన్ని చెక్‌చేయగా ఆమె తాగే వాటర్ బాటిల్ అడుగున నాచులా ఆకుపచ్చిన బూజు(శిలింధ్రం) ఉండటం చూసి అవాక్కయ్యింది. అన్ని శుభ్రంగా ఉంచే నేను బాటిల్స్ మాత్ర అస్సలు క్లీన్ చేయడం లేదని తెలిసింది. బహుశా దీని వల్ల ఇన్నిసార్లు జలుబు బారిన పడ్డానని అర్థమయ్యే తక్షణమే వాటిని క్లీన్ చేసినట్లు వివరించింది. ఈ విషయాన్నే వైద్యులకు తెలపగా, వారు కూడా ఇలాంటి ఆకుపచ్చ నాచు కారణంగా ఫుడ్ పాయిజినింగ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి పలు రకాల ఇన్పెక్షన్లు వస్తాయని చెప్పారు. తాగే నీరు, తీసుకునే ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని సూచించారని పేర్కొంది. ఈ స్టీల్ బాటిల్స్ పర్యావరణానికి హితమైనప్పటికీ వాడేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే తనలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని చెబుతోంది సదరు మహిళ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. ఏ బాటిల్ అయినా దానిలో వాటర్ అలానే ఉండిపోతే కచ్చితంగా కింద బాటిట్ అడుగుభాగన జిగురులాంటి సిలికాన్ మాదిరి పదార్థం ఏర్పడుతుంది. కొద్దిరోజులక ఆకుపచ్చని బూజులాంటి శిలిధ్రం ఫామ్ అయ్యిపోతుంది. మనం అందులో ఉన్న నీటిని అలాగే తాగితే ముందుగా గొంతునొప్పి, జలుబు వంటి అనారోగ్యాల బారిన పడతాం. తరుచుగా జలుబుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాటిల్స్‌ని కనీసం మూడు లేదా ఐదు రోజుల కొకసారి వేడినీటితో క్లీన్ చేసుకోవాలి లోపల జిగురు వంటి సిలాకాన్లాంటి పదార్థం రాకుండా మార్కెట్లో దొరికే బ్రెష్‌తో క్లన్ చేసుకోవాలి. తాగే బాటిల్ బాగుందో లేదో కూడా చెక్‌చేసుకుని తాగండి ఏ బాటిల్లోనైన నీరు నిశ్చలంగా మూడు నుంచి నాలుగు రోజులు ఉండిపోతే ఒక విధమైన వాసన వస్తుంది. ఇలాంటి వాటర్ అత్యంత ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు బాటిల్లో ఎక్కువకాలం నిల్వ ఉండే వాటర్‌ని తాగొద్దు, వాటిని ఎప్పిటికప్పుడూ లేదా కనీసం మూడు నుంచి నాలుగురోజుల కొకసారి క్లీన్ చేసుకుని తాగేందుకు యత్నించండి. (చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?)