
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బనశంకరి: విషం తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన డెలివరి బాయ్‌ని పోలీసులు ఆస్పత్రికి తరలించిన ఘటన చంద్రాలేఔట్‌లో చోటుచేసుకుంది. వివరాలు...డెలివరి బాయ్ అనిల్ (30)కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం కొద్దిరోజుల క్రితం మహిళ భర్తకు తెలిసింది. దీంతో అతను అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనిల్‌ను హెచ్చరించినప్పటికీ మహిళను కలవడానికి ప్రయత్నించాడు. తనతో సంబంధం కొనసాగించాలని మహిళను వేధింపులకు పాల్పడ్డాడు.
మనస్తాపం చెందిన మహిళ అనిల్‌పై ఫిర్యాదు చేయడానికి గురువారం చంద్రాలేఔట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. తనపై కేసు నమోదు అవుతుందని తెలియగానే పోలీస్‌స్టేషన్‌కు అనిల్ వచ్చాడు. తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని, తాను చనిపోవడానికి విషం తాగానని అనిల్ పోలీసులకు తెలిపాడు. తక్షణం పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
(చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం)