marital affairs
-
చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...!
చైనాకు చెందిన ఒక కంపెనీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు నూతన నియమనిబంధనలను జారీ చేసింది. దీని ప్రకారం సిబ్బందిలో ఏ ఒక్క రూ కూడా వివాహేతర సంబంధాలుకలిగివుండ కూడదు. అలాగే విడాకులు తీసుకోనివారై ఉండాలి. ఈ నియమ నిబంధనలను సదరు కంపెనీలో పనిచేస్తున్న అధికారులు మొదలుకొన్ని కింది స్థాయి ఉద్యోగుల వరకూ అందరికీ వర్తిస్తాయని పేర్కొంది. కంపెనీలో పనిచేసే ప్రతీ ఉద్యోగి కుటుంబానికి కట్టుబడి ఉండాలని ఒక చైనా కంపెనీ స్పష్టం చేసింది. ఇలాంటివారే ఇక్కడ ఉద్యోగం చేసేందుకు అర్హులని, వారికే కంపెనీలో ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. చైనాలోని ఝోజియాంగ్ ప్రాంతానికి చెందిన ఒక కంపెనీ సంస్థాగత సిబ్బందికి ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ చైనా కంపెనీ జూన్ 9న ‘వివాహేతర సంబంధాల నిషేధం’నకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నియమం సంస్థలోని వివాహిత ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. వివాహేతర సంబంధాలు నడిపేవారిపై సంస్థ వెంటనే చర్యలు చేపడుతుంది. అంతేకాదు ఇటువంటి వారి విషయంలో సంస్థ కఠినంగా వ్యవహరిస్తుంది. భవిష్యత్‌లోనూ అటువంటివారికి సంస్థలో ఉద్యోగం చేసే అవకాశం కల్పించదు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతునిస్తూ ఉద్యోగులంతా వారి కుటుంబ సభ్యుల విషయంలో జవాబుదారీగా వ్యవహరించాలని పేర్కొంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తప్పనిసరిగా ఉండాలి. కుటుంబంలోని అందరికీ భద్రత కల్పించాలి. వివాహమైనవారు వివాహేతర సంబంధాలు పెట్టుకోకూడదు. ఉద్యోగులలో ఎవరూ విడాకులు తీసుకున్నవారై ఉండకూడదు. ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. అయితే ఉద్యోగులంతా కంపెనీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారని, ఎవరూ ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడరని, వారి భాగస్వామితో మంచి వ్యవహారశైలి కలిగివుంటారాని బావిస్తున్నామని సదరు కంపెనీ పేర్కొంది. ఇది కూడా చదవండి: 34 ఏళ్లుగా సముద్రంలో తేలియాడిన ఆ బాటిల్ ఆమె చేతికి చిక్కడంతో.. -
వివాహేతర సంబంధం వివాదం: విషం తాగి పోలీస్‌స్టేషన్‌కి వచ్చి..
సాక్షి, బనశంకరి: విషం తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన డెలివరి బాయ్‌ని పోలీసులు ఆస్పత్రికి తరలించిన ఘటన చంద్రాలేఔట్లో చోటుచేసుకుంది. వివరాలు...డెలివరి బాయ్ అనిల్ (30)కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం కొద్దిరోజుల క్రితం మహిళ భర్తకు తెలిసింది. దీంతో అతను అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనిల్‌ను హెచ్చరించినప్పటికీ మహిళను కలవడానికి ప్రయత్నించాడు. తనతో సంబంధం కొనసాగించాలని మహిళను వేధింపులకు పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన మహిళ అనిల్‌పై ఫిర్యాదు చేయడానికి గురువారం చంద్రాలేఔట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. తనపై కేసు నమోదు అవుతుందని తెలియగానే పోలీస్‌స్టేషన్‌కు అనిల్ వచ్చాడు. తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని, తాను చనిపోవడానికి విషం తాగానని అనిల్ పోలీసులకు తెలిపాడు. తక్షణం పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. (చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం) -
ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష
జకార్తా: సహజీవనం, వివాహేతర సంబంధాలు వంటి వాటిని ఇకపై నేరంగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేస్తూ ఇండోనేసియా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. ఆ మేరకు నవంబర్‌లో తుదిరూపునిచ్చిన వివాదాస్పద నేర శిక్షాస్మృతి సవరణ బిల్లును మంగళవారం ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరించిన నేర శిక్షాస్మృతి ప్రకారం వివాహేతర సంబంధం నెరిపితే నేరంగా భావించి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. సహజీవనం చేస్తే ఆరునెలల శిక్ష వేస్తారు. వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం వీరిలో ఎవరైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తేనే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. పర్యాటకంలో భాగంగా ఇండోనేసియాకు వచ్చే విదేశీయులకూ ఇదే చట్టం వర్తిస్తుంది. అబార్షన్, దైవ దూషణలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను విమర్శించడాన్ని నిషేధించారు. తనపై విమర్శలను నేరుగా దేశాధ్యక్షుడే ఫిర్యాదుచేస్తే నిందితులపై మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కమ్యూనిజాన్ని వ్యాప్తిచేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కాగా, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా కొన్ని నిబంధలను తెచ్చారని మానవహక్కుల కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్ -
వివాహేతర సంబంధం.. ఎంత చెప్పినా వినలేదు.. చివరికి
బెంగళూరు: వివాహేతర సంబంధం... ఓ వ్యక్తి మృతికి కారణమవడమే గాక అతని కుటుంబాన్ని కటకటాలపాలు చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లా అచాపుర గ్రామానికి చెందిన వినోద్(45)కు భార్య బిను(42), ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే వినోద్‌కు సమీప పట్టణానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం వినోద్ ఇంట్లో తెలియడంతో దీనిపై ఇటీవల పలు మార్లు గొడవలు కూడా అయ్యాయి. పద్దతి మార్చుకోవాలని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అతను వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల వినోద్ ఓ ప్రాపర్టీని అమ్మగా అందులో పెద్దమొత్తం వాటాను సదరు మహిళకు ఇవ్వాలనుకున్నాడు. అంతేకాకుండా మరో ప్రాపర్టీని కూడా అమ్మేందుకు సిద్దమయ్యాడు. ఈ పరిణామాలతో విసుగుచెందిన కుటుంబ సభ్యులు విసుగు చెంది తను ఇంక మార్పురాదని నిశ్చయించుకుని వినోద్ ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం వినోద్ భార్య బిను, ఇద్దరు కొడుకులు, మరో ఇద్దరి బంధువులతో కలిసి ప్రణాళికలు రచించారు. పథకంలో భాగంగా ఇనుప తీగను వినోద్ గొంతుకు బిగించి, తలపై ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి హునాసెకొప్ప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ కారుని తగలబెట్టారు. ఇందుకు సంబంధించి వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు పోలీసులతో పాటు అందరినీ చెప్పారు. అయితే విచారణలో వినోద్ కుటుంబ సభ్యులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అతని కుటుంబ సభ్యులను కాస్త గట్టిగా అడగడంతో నిజం బయటపడింది. దీంతో పోలీసులు వినోద్ భార్య బిను, కొడుకులు వివేక్, విష్ణు, బంధువులు అశోక్, సంజయ్‌లను శుక్రవారం అరెస్ట్ చేశారు. చదవండి: కర్ణాటక: మహిళా ఎస్ఐ దాష్టీకం -
దారుణం: ప్రియుడిని చంపి శవాన్ని ఇంట్లోనే..
సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడిని హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఉదంతం చెరుకుపల్లిలో వెలుగు చూసింది. వివరాలు.. గుంటూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటూ శిరీష అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చి రూ. 15 లక్షలు భరణం ఇచ్చేందుకు చిరంజీవి తన మెడికల్ షాపును విక్రయించాడు. ఆ డబ్బు మీద ఆశతో శిరీష చిరంజీవిని చంపాలని నిర్ణయించుకుంది. అయితే శిరీషకు మరోకరితో కూడా వివాహేతర సంబంధం ఉంది. దీంతో అతడితో కలిసి చిరంజీవిని చంపేందుకు శిరీష పథకం రచించింది. అనుకున్నట్టుగానే ప్రియుడితో కలిసి చిరంజీవిని హతమార్చి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. మృతుడు తండ్రి సుబ్బారావు ఫిర్యాదుతో విషయం వెలుగులో వచ్చింది. చిరంజీవి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శిరీషతో పాటు ఆమె ప్రియుడు భానుప్రకాష్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రియుడితో కలిసి క్వారంటైన్ కు.. ఆపై..
ముంబై: క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఒక మహిళా కానిస్టేబుల్ తన పాడు బుద్ధిని చూపించింది. తన ప్రియుడితో కలిసి క్వారంటైన్లో ఉండటానికి స్కెచ్ వేసి అధికారులను సైతం బురిడి కొట్టించింది. ప్రియుడినే భర్త అని నమ్మించి అధికారుల నుంచి అనుమతి తీసుకుంది. అయితే, ప్రియుడి భార్యకు విషయం తెలిసి ఆమె రావడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగింది. నాగపూర్‌లో పనిచేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్‌కు, మరో ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. చదవండి: సీఎం ఇంటి ఎదుట కరోనా బాధితుడి ఆందోళన దీంతో వారిద్దరిని క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా ఉన్నాతాధికారులు అదేశించారు. అయితే ఆ లేడీ కానిస్టేబుల్ ప్రియుడిని భర్తగా చూపి అతనికి కూడా కరోనా సోకి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అతనిని కూడా ఆమెతో పాటు పంపి క్వారంటైన్లో ఒకే గదిలో ఉంచారు. దీని తరువాత తన భర్త, ప్రియురాలితో కలిసి క్వారంటైన్ సెంటర్ లో ఉన్నాడని తెలుసుకున్న అతని భార్య, అక్కడికి వచ్చినా ఆమెను క్వారంటైన్ సెంటర్లోకి అనుమతించలేదు. దీంతో ఆమె బజాజ్ నగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి, తన భర్తపై ఫిర్యాదు చేసింది. లేడీ కానిస్టేబుల్‌కు, తన భర్తతో ఉన్న బంధం గురించి వివరించింది. విచారణ జరిపిన అధికారులు, ఆమె నిజం చెప్పిందని నిర్ధారించుకొని, అతన్ని మరో క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. సదరు మహిళా కానిస్టేబుల్ నిర్వాకంపై విచారణ చేపట్టారు. చదవండి: ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఆ తర్వాత! -
ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఆ తర్వాత!
సాక్షి, వికారాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఈనెల 7వ తేదీన జరిగింది. రంగారెడ్డి జిల్లా చేగురూకు చెందిన బైండ్ల చెన్నయ్య(38)ను అతడి భార్య శశికళ, ఆమె ప్రియుడు కలిసి అనంతగిరి అడవిలో హత్య చేశారు. చెన్నయ్య మృతిపై అనుమానం రావడంతో గ్రామస్థులు ప్రియుడిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు రావడంతో మృతుడి భార్య శశికళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నంచింది. దీంతో స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రి తరలించగా ప్రస్తుతం శశికళ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: విశాఖ ప్రమాదం.. అనాథలైన పిల్లలు -
మోదీ పేరిట ట్రిపుల్ తలాక్!
బరేలీ : ఇస్లాం వ్యతిరేక విధానం ట్రిపుల్ తలాక్ పై తాత్కాలిక నిషేధం అమలులో ఉన్నా... అలాంటి ఘటనలు మాత్రం ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో మరో ట్రిపుల్ తలాక్ వెలుగు చూడగా.. భార్య భర్తల పరస్పర ఆరోపణల నేపథ్యంలో కేసు ఆసక్తికరంగా మారింది. బరేలీకి చెందిన ఫైరాకు ఆమె భర్త దానిష్ మూడు సార్లు తలాక్ చెప్పేసి విడాకులు ఇచ్చాడు. అయితే తాను ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి హాజరు అయిన క్రమంలోనే భర్త విడాకులు ఇచ్చాడని సదరు మహిళ వాపోతుంది. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని హర్షిస్తూ తాను మోదీ సభకు హాజరయ్యానని కానీ, తన భర్త అది అర్థం చేసుకోవట్లేదని చెబుతున్నారు. అంతేకాదు ఓ ఆంటీతో తన భర్తకి సంబంధం ఉందని.. అందుకే తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించారు. సభ నుంచి రాగానే మోదీ ర్యాలీకి వెళ్లావంటూ తనని, తన కొడుకును కొట్టి ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటివేశాడని ఫైరా ఆరోపిస్తున్నారు. అయితే భర్త మాత్రం కారణం అది కాదని చెబుతున్నారు. తన భార్య మరో వ్యక్తితో సంబంధం నడుపుతున్న నేపథ్యంలోనే విడాకులు ఇచ్చేశానని, తాను ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నదాంట్లో వాస్తవం లేదంటున్నాడు. ఇస్లాం సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆమె దుస్తులు ధరిస్తోంది. అది నాకు నచ్చలేదు. పైగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఇంక నా భార్యను భరించటం నా వల్ల కాదు. అని భర్త దానిష్ చెబుతున్నాడు. పరస్పర వివాహేతర సంబంధాల ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎటూ తేల్చలేక దర్యాప్తు ద్వారా చిక్కుముడి విప్పేందుకు బరేలీ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. -
అనుమానంతో హతమార్చాడు
అశ్వారావుపేట రూరల్ : అక్రమ సంబంధం అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన సంఘటన శుక్రవారం మండల పరిధిలోని నారంవారిగూడెం శివారు అల్లిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని కుక్కునూరు మండలం చీదర గ్రామానికి చెందిన డి. ప్రేమ్‌కుమార్ (33) ఖమ్మం జిల్లా సారపాకలోని బీపీఎల్‌లో పనిచేస్తున్నాడు. అదే మండలంలోని రారుుగూడెం గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ భార్యతో అక్రమ సంబంధం ఉందని భర్తకు అనుమానం. దీంతో ప్రేమ్‌కుమార్‌ను ఎలాగైనా చంపాలని రాజేంద్రప్రసాద్ పథకం పన్నాడు. దీనికి తన బావమరిది సిద్దిని ప్రసాద్ సహాయం తీసుకున్నాడు. పథకంలో భాగంగా అశ్వారావుపేటలో ఆటో కొనుగోలు చేయూలని శుక్రవారం రాజేంద్రప్రసాద్ ప్రేమ్‌కుమార్‌కు ఫోన్‌చేసి రమ్మన్నాడు. దీన్ని నమ్మిన ప్రేమ్‌కుమార్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై అశ్వారావుపేటకు వచ్చారు. అప్పటికే రాజేంద్రప్రసాద్ బావమరిది సిద్దిని ప్రసాద్ అశ్వారావుపేటలో ఉన్నాడు. అక్కడ నుంచి ముగ్గురూ ఒకే వాహనంపై నారంవారిగూడెం బయలు దేరారు. వారు నారంవారిగూడెం వెళ్లకుండా దారి మార్చి అల్లిగూడెం తోటల వైపు తీసుకెళ్లారు. ఓ అరటి తోట వద్దకు వెళ్లగానే ప్రేమ్‌కుమార్‌పై కత్తితో దాడికి పూనుకున్నారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు ప్రేమ్‌కుమార్ పరుగులు తీసారు. రాజేంద్రప్రసాద్, సిద్దిని ప్రసాద్‌లు వెంబడించి ప్రేమ్‌కుమార్‌ను నరికి చంపారు. అదే సమయంలో తాటి చెట్టుపై కల్లు గీస్తున్న ఓ వ్యక్తి ప్రేమ్‌కుమార్‌పై దాడిని చూసి కేకలు పెట్టాడు. దీంతో అక్కడ ఉన్న పెంపుడు కుక్కలు వారిని వెంబడించాయి. దీంతో సిద్దిని ప్రసాద్ పరారు కాగా, రాజేంద్రప్రసాద్ పొదల్లో దాక్కున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజేంద్రప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఐ రవికుమార్ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.