వివాహేతర సంబంధం.. ఎంత చెప్పినా వినలేదు.. చివరికి | Karnataka: Mother Kids Arrested For Murdering Family Man | Sakshi
Sakshi News home page

Marital Affair: వివాహేతర సంబంధం.. ఎంత చెప్పినా వినలేదు.. చివరికి

Published Sat, Oct 2 2021 6:28 PM | Last Updated on Sat, Oct 2 2021 6:50 PM

Karnataka: Mother Kids Arrested For Murdering Family Man  - Sakshi

బెంగళూరు: వివాహేతర సంబంధం... ఓ వ్యక్తి మృతికి కారణమవడమే గాక అతని కుటుంబాన్ని కటకటాలపాలు చేసింది. ​ ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లా అచాపుర గ్రామానికి చెందిన వినోద్​(45)కు భార్య బిను(42), ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే వినోద్‌కు సమీప పట్టణానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం వినోద్‌ ఇంట్లో తెలియడంతో దీనిపై ఇటీవల పలు మార్లు గొడవలు కూడా అయ్యాయి.

 పద్దతి మార్చుకోవాలని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అతను వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల వినోద్ ఓ ప్రాపర్టీని అమ్మగా అందులో పెద్దమొత్తం వాటాను సదరు మహిళకు ఇవ్వాలనుకున్నాడు. అంతేకాకుండా మరో ప్రాపర్టీని కూడా అమ్మేందుకు సిద్దమయ్యాడు. ఈ పరిణామాలతో విసుగుచెందిన కుటుంబ సభ్యులు విసుగు చెంది తను ఇంక మార్పురాదని నిశ్చయించుకుని వినోద్‌ ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం వినోద్ భార్య బిను, ఇద్దరు కొడుకులు, మరో ఇద్దరి బంధువులతో కలిసి ప్రణాళికలు రచించారు.

పథకంలో భాగంగా ఇనుప తీగను వినోద్‌ గొంతుకు బిగించి, తలపై ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి హునాసెకొప్ప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ కారుని తగలబెట్టారు. ఇందుకు సంబంధించి వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు పోలీసులతో పాటు అందరినీ చెప్పారు.  అయితే విచారణలో వినోద్ కుటుంబ సభ్యులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అతని కుటుంబ సభ్యులను కాస్త గట్టిగా అడగడంతో నిజం బయటపడింది. దీంతో పోలీసులు వినోద్ భార్య బిను, కొడుకులు వివేక్, విష్ణు, బంధువులు అశోక్, సంజయ్‌లను శుక్రవారం అరెస్ట్ చేశారు.

చదవండి: కర్ణాటక: మహిళా ఎస్‌ఐ దాష్టీకం 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement