చైనాకు చెందిన ఒక కంపెనీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు నూతన నియమనిబంధనలను జారీ చేసింది. దీని ప్రకారం సిబ్బందిలో ఏ ఒక్క రూ కూడా వివాహేతర సంబంధాలుకలిగివుండ కూడదు. అలాగే విడాకులు తీసుకోనివారై ఉండాలి. ఈ నియమ నిబంధనలను సదరు కంపెనీలో పనిచేస్తున్న అధికారులు మొదలుకొన్ని కింది స్థాయి ఉద్యోగుల వరకూ అందరికీ వర్తిస్తాయని పేర్కొంది.
కంపెనీలో పనిచేసే ప్రతీ ఉద్యోగి కుటుంబానికి కట్టుబడి ఉండాలని ఒక చైనా కంపెనీ స్పష్టం చేసింది. ఇలాంటివారే ఇక్కడ ఉద్యోగం చేసేందుకు అర్హులని, వారికే కంపెనీలో ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. చైనాలోని ఝోజియాంగ్ ప్రాంతానికి చెందిన ఒక కంపెనీ సంస్థాగత సిబ్బందికి ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ చైనా కంపెనీ జూన్ 9న ‘వివాహేతర సంబంధాల నిషేధం’నకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నియమం సంస్థలోని వివాహిత ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. వివాహేతర సంబంధాలు నడిపేవారిపై సంస్థ వెంటనే చర్యలు చేపడుతుంది. అంతేకాదు ఇటువంటి వారి విషయంలో సంస్థ కఠినంగా వ్యవహరిస్తుంది. భవిష్యత్‌లోనూ అటువంటివారికి సంస్థలో ఉద్యోగం చేసే అవకాశం కల్పించదు.
కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతునిస్తూ ఉద్యోగులంతా వారి కుటుంబ సభ్యుల విషయంలో జవాబుదారీగా వ్యవహరించాలని పేర్కొంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తప్పనిసరిగా ఉండాలి. కుటుంబంలోని అందరికీ భద్రత కల్పించాలి. వివాహమైనవారు వివాహేతర సంబంధాలు పెట్టుకోకూడదు. ఉద్యోగులలో ఎవరూ విడాకులు తీసుకున్నవారై ఉండకూడదు.
ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. అయితే ఉద్యోగులంతా కంపెనీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారని, ఎవరూ ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడరని, వారి భాగస్వామితో మంచి వ్యవహారశైలి కలిగివుంటారాని బావిస్తున్నామని సదరు కంపెనీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: 34 ఏళ్లుగా సముద్రంలో తేలియాడిన ఆ బాటిల్ ఆమె చేతికి చిక్కడంతో..
Comments
Please login to add a commentAdd a comment