condition
-
Volodymyr Zelenskyy: ‘కవచం’గా నిలబడితే ఖనిజాలిస్తాం
కీవ్: సొంత భూభాగాలను కాపాడుకునేందుకు రష్యాతో యుద్ధంచేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మూడేళ్లుగా అమెరికా చేసిన ఆయుధ, ఆర్థిక సాయానికి అత్యంత అరుదైన, విలువైన ఖనిజాల రూపంలో కృతజ్ఞత చూపేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ దేశ రక్షణ, భద్రత విషయంలో అగ్రరాజ్యం అండగా ఉండాలని కీలక షరతు విధించారు. అయితే ఈ షరతుకు అమెరికా ఏ మేరకు ఒప్పుకుంటుందో శుక్రవారంకల్లా స్పష్టత వచ్చే వీలుంది. శుక్రవారం జెలెన్స్కీ అమెరికాలో పర్యటించి ట్రంప్‌తో భేటీ అయి విస్తృతస్థాయిలో చర్చలు జరపనున్నారు. చర్చలు సఫలమైతే కీలకమైన ఖనిజ, ఆర్థిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. అరుదైన ఖనిజాల డీల్ కుదిరాక, యుద్ధంలో రష్యాకు ఎదురునిలబడి అమెరికా తమకు ఏమేరకు అండగా నిలబడుతుందనే అనుమానాలు జెలెన్స్కీ మదిలో అలాగే ఉన్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి సాక్షిగా రష్యా వ్యతిరేక తీర్మానంలో తమకు మద్దతు పలకాల్సిందిపోయి రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటేసిన నేపథ్యంలో భద్రతా అంశంపై జెలెన్స్కీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో వందల బిలియన్ డాలర్ల ఆర్థిక, ఆయుధ సాయం పొందిన కారణంగా అగ్రరాజ్య ఖనిజ సంపద డిమాండ్‌కు జెలెన్స్కీ తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై బుధవారం ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. ‘‘ అమెరికాలో ఆర్థిక ఒడంబడిక చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యాచరణ ఒప్పందం త్వరలో సమగ్ర ఒడంబడికకు బాటలు వేస్తుంది. ఈ ఒప్పందంలో మా దేశ భద్రతా అంశమే అత్యంత ప్రధానమైంది. ఈ అంశాన్ని తేల్చుకునేందుకు అమెరికాలో పర్యటించి ట్రంప్‌తో భేటీ అవుతా. ఖనిజ వనరులపై పాక్షిక హక్కులు ధారాదత్తం చేయడంసహా యుద్ధంలో ఆయుధసాయంపై చర్చిస్తా. యుద్ధంలో సైనికసాయం కొనసాగించే ఉద్దేశం అమెరికాకు ఉందో లేదో తెల్సుకుంటా. నేరుగా అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు విషయమూ మాట్లాడతా. స్తంభింపజేసిన రష్యా స్థిర,చరాస్తులను మేం ఆయుధాల పెట్టుబడుల కోసం వినియోగించుకునే అంశాన్నీ ప్రస్తావిస్తా. అన్ని విషయాలు కొలిక్కివస్తే సమగ్ర ఒప్పందంపై సంతకం చేస్తా’’ అని జెలెన్స్కీ వివరించారు. భారీ డీల్ కుదుర్చుకుంటాం: ట్రంప్మూడేళ్ల సాయానికి ప్రతిఫలంగా విలువైన ఖనిజ సంపద, సహజ వనరులపై వాటా కోరుతున్న ట్రంప్ ఈ ఒప్పందంపై మాట్లాడారు. బుధవారం వాషింగ్టన్లో తమ మంత్రివర్గ తొలి భేటీ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ జెలెన్స్కీ శుక్రవారం వాషింగ్టన్కు వస్తారు. నాతో కలిసి అతిపెద్ద ఒప్పందంపై సంతకాలు చేస్తారు. అమెరికన్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టిన సొమ్మును మేం ఉక్రెయిన్ కోసం యుద్ధంలో సాయంగా ఖర్చుచేశాం. ఈ సొమ్ము అంతా ఇప్పుడు తిరిగిరాబోతోంది. ఖనిజాల తవ్వకంతో అమెరికా లాభపడనుంది. ఉక్రెయిన్‌తో దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నా’’ అని ట్రంప్ అన్నారు. ‘‘నాటోలో సభ్యత్వం ఆశను ఉక్రెయిన్ వదులుకుంటే మంచిది. నాటో కూటమి సైతం ఈ అంశాన్ని మర్చిపోతే బాగుంటుంది’’ అని ట్రంప్ అన్నారు. ప్రాథమిక ఒప్పందం ఓకేఇరుదేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం దాదాపు ఖరారైందని ఉక్రెయిన్ ప్రధాన మంత్రి డెనిస్ షెమిహాల్ బుధవారం వెల్లడించారు. ‘‘ యుద్ధంలో దెబ్బతిన్న కారణంగా ఉక్రెయిన్ పునర్ నిర్మాణం, శాంతి, పెట్టుబడుల ప్రాతిపదికన అమెరికాతో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఉక్రెయిన్ పునర్నిర్మాణ క్రతువులో అమెరికా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని భావి స్తున్నాం’’ అని ఉక్రెయిన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రధాని డెనిస్ ప్రకటించారు. -
రణబీర్ కపూర్‌కి నాసల్ డీవియేటెడ్ సెప్టం: అంటే ఏంటి..?
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ యానిమల్ మూవీలో విలక్షణమైన నటనతో ఆకట్టుకుని మంచి హిట్‌ని అందుకున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడు, బాలీవుడ్ చాక్లెట్ బాయ్‌గా పిలిచే రణబీర్ ఒక ఇంటర్వ్యూలో తాను నాసల్ డీవియేటెడ్ సెప్టెమ్తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. దీని కారణంగా తాను వేగంగా తినడం, మాట్లాడటం వంటివి చేస్తుంటానని అన్నారు. అసలేంటీ వ్యాధి..?,ఎందువల్ల వస్తుందంటే..రణబీర్ ఫేస్ చేస్తున్న నాసల్ డీవియేటెడ్ సెప్టంని తెలుగులో ముక్కు సంబంధిత విచలనం (సెప్టం)గా చెబుతారు. దీని కారణంగా రెండు నాసికా రంధ్రాలను విభజించే సన్నని గోడ మధ్య భాగం ఒకవైపు వాలుగా ఉంటుంది. ఈ అపసవ్యమైన అమరిక రెండు నాసికా మార్గాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వివిధ సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి సమస్యలు తలెత్తుతాయంటే..విచలనం సెప్టం శ్యాసను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. నాసికా రంధ్రాలను వేరు చేసే గోడ(సెప్టం) విచలనం అంటే పక్కకు వాలడం. వల్ల రెండు రంధ్రాలు చిన్నగా లేదా మూసుకుపోయినట్లుగా అయిపోతాయి. దీంతో వాయుప్రసరణ సవ్యంగా ఉండదు. ఒక్కోసారి శ్వాసతీసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఈ సమస్య కారణంగా ఆయా వ్యక్తులు నిద్రా సమసయంలో నోటి శ్వాసపై ఆధారపడుతుంటారు. ఇలా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల.. ఒక్కసారిగా వాయు మార్గాల్లో గాలి ఎక్కువై ప్రతిఘటన ఏర్పడుతుంది. ఈ గాలిని ఊపిరితిత్తుల వరకు నెట్టేందుకు మరింత శక్తి అవసరమవుతుంది. ఫలితంగా గురకకు దారితీసి అబ్స్ట్రక్టివ స్లీప్ ఆప్నియాకు దారితీస్తుంది. ఈశ్వాస లోపం కారణంగా వేగంగా సంభాషించేందుకు కారణమవుతుంది. ఈ వ్యక్తులో నాసికా రద్దీ ఏర్పుడుతుంటుంది. ఎందుకంటే ఒక వైపు రంధ్రం అత్యంత అధ్వాన్నంగా పనిచేస్తుండమే. పైగా శ్లేష్మం కూడా సరిగా బయటకి రాక సైనస్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే ముక్కు లోపల పొడిబారినట్లు అయిపోయి ముఖం నొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడతారు. నిర్థారణ..ఈఎన్టీ స్పెషలిస్ట్ వద్ద ఓటోలారిన్జాలజిస్ట్ శారీరక పరీక్ష, నాసికా ఎండోస్కోపీ లేదా సిటీ స్కాన్ వంటి వాటితో ఈ సెప్టం విచలనంని గుర్తిస్తారు. విచలనం తీవ్రతను అనుసరించి చికిత్స ఆధారపడి ఉటుంది.ఎలా నివారిస్తారు..దీన్ని నివారించడమే గాని పూర్తిగా నయం కాదు. తేలికపాటి కేసుల్లో ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. అలాకాకుండా కాస్త ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కొంటే..డీకాంగెస్టెంట్లు, యాంటిహిస్టామైన్లు, నాసల్ స్ప్రేలతో ఈ వ్యాదిని నిర్వహిస్తారు. అవన్నీ కేవలం సౌకర్యాన్ని అందిస్తాయే తప్ప సవస్యను పూర్తిగా నివారించలేవు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు పొగ తాగటం, పెయింట్ పొగలు, గృహ రసాయనాలు, పరిమళ ద్రవ్యాలు వంటి అలెర్జీ కారకాలకు దూరంగా ఉండాలి. దీన్ని సక్రమమైన జీవనశైలితో అధిగమించొచ్చని చెబుతున్నారు నిపుణులు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో శస్త్ర చికిత్సతో ఆ సెప్టంని సరిచేయడమే ప్రభావవంతమైన పరిష్కారం అని వెల్లడించారు వైద్య నిపుణులు.(చదవండి: 'సోలో ట్రిప్సే సో బెటర్'..! అంటున్న నిపుణులు..) -
ఉద్యమంపై ‘ఉక్కు’పాదం..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికారంలోకి రాకముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పరోక్షంగా కుట్రలకు పదును పెడుతున్నారు. కార్మికులు మీడియాతో మాట్లాడకూడదంటూ యాజమాన్యం షరతులు విధిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతూ.. యాజమాన్యం బెదిరింపులకు భయపడేదేలేదని తేల్చిచెబుతున్నాయి. కార్మిక నియామక నిబంధనల్ని సర్క్యులర్‌లో పేర్కొంటూ.. మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీచేసింది. దీంతో కార్మిక వర్గాల్లో అలజడి మొదలైంది. మరోవైపు.. 4,200 మంది కార్మికుల్ని యాజమాన్యం ఒకేసారి తొలగించి మళ్లీ తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుల మెడపై కత్తి.. ఇక పొమ్మనలేక పొగపెట్టినట్లు.. కార్మికులు, ఉద్యోగుల్ని యాజమన్యం నిరంకుశ నిర్ణయాలతో వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో నిర్ణయాన్ని అమలుచేస్తూ.. కార్మికుల మెడపై ఒక్కో కత్తి వేలాడదీస్తుండటంతో వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటీవల పొదుపు చర్యల పేరుతో 500 మంది అధికారుల్ని, ఉద్యోగుల్ని ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్‌ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపించేందుకు రంగం సిద్ధంచేయడం వారిని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. అలాగే, రోజురోజుకూ క్షీణించిపోతున్న ఆర్థిక పరిస్థితివల్ల గత ఎనిమిది నెలలుగా ఉద్యోగులు ఒకే విడతలో జీతం అందుకున్న దాఖలాల్లేవు. నెలనెలా రూ.10వేల నుంచి రూ.30వేల నష్టం.. అలాగే, 2017 జనవరి 1న జరగాల్సి వేతన ఒప్పందం జరగకపోవడంవల్ల ఉద్యోగులు ప్రతీనెలా కనీసం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అండగా ఉండే పీఎఫ్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సకాలంలో నగదు చెల్లించకపోవడంతో వారి నుంచి ఉద్యోగులకు రుణాలు సైతం నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగుల కష్టాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు అధికారులకు ప్రోత్సాహకాలు తగ్గించడం, టౌన్షిప్లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీల పెంపు అమలు, బోనస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) తాత్కాలికంగా నిలుపుదల, ఈఎల్ ఎన్‌క్యాష్ మెంట్ తాత్కాలికంగా నిలుపుదల తదితర అనేక చర్యలకు ఉపక్రమించింది.ఇలా ప్రతి అంశంలోనూ కార్మకుల్ని యాజమాన్యం రోడ్డున పడేస్తూ.. మానసికంగా వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో కఠిన నిర్ణయాన్ని అమలుచేస్తూ.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు, ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలకు అస్సలు పొంతనలేదంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మీడియాతో మాట్లాడొద్దంటూ జారీచేసిన సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి!
పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని పాటియాలా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరణ్‌దీప్ కహెల్ మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను జైలు నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారని, వారిలో ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని పటియాలాకు రిఫర్ చేశామని తెలిపారు. మరణించిన ఖైదీల పేర్లు హర్ష్, ధర్మేంద్ర అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో గగన్‌దీప్ సింగ్, మహ్మద్ హరీష్, సిమ్రాన్ గాయపడ్డారు. ఖైదీలు నిద్రించడానికి తమ బ్యారక్లకు వెళుతుండగా సిమ్రంజీత్ తన సహచరుల సహాయంతో హర్ష్, ధర్మేంద్రలపై దాడి చేశాడు. నిందితులు ధర్మేంద్ర, హర్షలపై కట్టర్‌తో మెడ, ఛాతీ, నోటిపై దాడి చేశారు. సిమ్రంజీత్‌పై హత్యతో పాటు 18 కేసులు ఉన్నాయి. ఇతను ఆరేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘర్షణ తర్వాత జైలు అధికారులు ఈ రెండు గ్రూపుల ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లలో ఉంచారు. -
ప్రధాని మోదీ దత్తత గ్రామం ఇప్పుడెలావుంది?
కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నాడు ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కింద ఎంపీలంతా తమ ప్రాంతంలోని ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ యూపీలోని సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలోగల జయపూర్ గ్రామాన్ని పదేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. మరి ఆ గ్రామ పరిస్థితి ఇప్పుడెలా ఉంది? ప్రధాని మోదీ జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈ పదేళ్లలో ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సందీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. గతంలో ఇక్కడ బ్యాంకులు, రోడ్లు ఉండేవి కావని, ఇప్పుడు గ్రామంలో కాంక్రీట్ రోడ్లు కూడా ఏర్పడ్డాయని, బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయని అన్నారు. గ్రామంలో జల్ నిగం ఏర్పాటైన తర్వాత ఇంటింటికి పైపులైన్ ద్వారా నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఏర్పడిందని, ఉజ్వల పథకం కింద పలువురు లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్లు పొందారన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులందరికీ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. గ్రామానికి చెందిన మరో యువకుడు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ జయపూర్ గ్రామంలో రెండు బ్యాంకుల శాఖలు, పోస్టాఫీసు తెరుచుకున్నాయన్నారు. రోడ్ల నిర్మాణం, నీటి వసతి ఏర్పాట్లు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు నోచుకున్నాయన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలని అన్నారు. గ్రామానికి చెందిన మహిళ ధర్మశీల మాట్లాడుతూ ప్రధాని మోదీ తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత తమకు ఉపాధి అవకాశాలు వచ్చాయని, కుటుంబాన్ని చక్కగా చూసుకోగలుగుతున్నామన్నారు. ఇంతకు ముందు గ్రామ శివార్లలోని బావి నుంచి నీటిని తెచ్చుకునేవారమని, ఇప్పుడు ఇంట్లోనే కుళాయి నీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద ప్రధాని మోదీ దత్తత తీసుకున్న ఈ జయపూర్ గ్రామ జనాభా సుమారు 3,100. ఈ గ్రామంలో మొత్తం 2,700 మంది ఓటర్లు ఉన్నారు. వారణాసి రైల్వే స్టేషన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. -
కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప అడగొద్దు: రానా ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. రాజమౌళి చిత్రం బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. దీంతో మరో హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. రానా ప్రస్తుతం రాక్షస రాజా అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి గుర్గావ్లో జరిగిన సినాప్స్ -2024 ఈవెంట్‌కు రానా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరైన రానా తన ఆరోగ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనకు కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి జరిగిందని తెలిపారు. అంతేకాదు చిన్న వయసులోనే కార్నియా మార్పిడి జరిగినట్లు వెల్లడించారు. ప్రకృతినే అన్నింటికంటే మెరుగైన వైద్యమని రానా పేర్కొన్నారు. గతంలో తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు ప్రకృతి సాయం చేసిందని రానా వివరించారు. రానా మాట్లాడుతూ.. 'అన్నీ సౌకర్యాలున్నా ఆసుపత్రిలో అసంతృప్తితో ఉన్నా. అనారోగ్యం కారణంగా యుఎస్‌లోని మాయో క్లినిక్‌లో ఉన్నా. నాకు ఏం జరిగిందో గుర్తించగలిగే ఏకైక ప్రదేశం అదే. మనం ప్రాణాంతక స్థితిలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తాం. అప్పటి నుంచే ఈ ప్రపంచాన్ని చూసే దృక్పథం మారిపోయింది' అని అన్నారు. అన్నింటిలో మనం అనుకుంటున్నట్లుగా జీవితం ఉండదని అర్థమైందని రానా తెలిపారు. హెల్త్ కండీషన్ గురించి మాట్లాడుతూ.. 'బాహుబలి సినిమా కోసమే తాను అలా మారినట్లు అందరూ భావించారు. అనారోగ్యంతో ఉన్నారా? అని కొందరు అడిగారు కూడా. కానీ నేను వారికి సమాధానం చెప్పాలనుకోలేదు. ఆ పరిస్థితుల్లో నగర ప్రజలతో జీవించడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎవరైనా నా ఆరోగ్యం గురించి అడిగితే.. మీరు కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప.. దాని గురించి అడగవద్దని చెప్పా. ఆ సమయంలో నేను చేస్తున్నది నాకే నచ్చలేదు.' అని అన్నారు. 'ప్రకృతే గొప్ప వైద్యం' రానా మాట్లాడుతూ.. 'ఒకసారి నా సినిమా కోసం అడవిలో షూట్ చేసే అవకాశం వచ్చింది. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉన్నా. అడవిలో ఏనుగులతో షూటింగ్ చేశాం. అక్కడ నన్ను అడిగేవాళ్లు లేరు. కనీసం నేను అనారోగ్యంతో ఉంటే ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో అడవిలో నిశ్శబ్దమే నా జీవితంలో అవసరమనిపించింది. అన్నింటి కంటే ప్రకృతే గొప్ప వైద్యమని తెలిసింది' అంటూ రానా చెప్పుకొచ్చారు. కాగా.. కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు సోలమన్ తెరకెక్కించిన తమళ చిత్రం కాదన్ రీమేక్‌లో రానా నటించారు. ఈ సినిమా ఎక్కువగా అడవిలోనే షూట్ చేశారు. ఈ మూవీని తెలుగులో అరణ్య, హిందీలో హాథీ మేరే సాథీ పేర్లతో విడుదలైంది. కాగా.. గతేడాది రానా పుట్టిన రోజు ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పోస్టర్లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
కిమ్‌కు ఉన్న పిచ్చి ఏంటంటే.?.. నటిని కిడ్నాప్ చేసి..
ప్రస్తుత ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 1994 జూలై నుంచి 2011 డిసెంబర్లో తానుమరణించే వరకు ఉత్తర కొరియా నియంతగా కొనసాగారు. కొరియన్ యువతపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చూపే ప్రతీ అంశాన్ని కిమ్ జోంగ్ ఇల్ నిషేధించారు. విదేశీ సినిమాలు చూడటం మొదలుకొని బ్లూ జీన్స్ ధరించడం వరకు అన్నింటినీ నిషేధించారు. జోంగ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్కు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. తన దేశంలో సినిమాలు తీయడానికి ఒక ప్రముఖ దక్షిణ కొరియా నటిని, ఆమె భర్తను కిడ్నాప్ చేశాడు. కిమ్ జోంగ్ ఇల్ నాటి ప్రముఖ దక్షిణ కొరియా నటి చోయ్ యున్ హీని కిడ్నాప్ చేసి, రెండున్నరేళ్లు నిర్బంధించి, ఆమె చేత 17 సినిమాలు చేయించాడు. ఈ సంఘటన 1978 నాటిది. ఆ కాలాన్ని దక్షిణ కొరియా చిత్రాలకు గోల్డెన్ పీరియడ్ అని అంటారు. అప్పట్లో చాలా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా విడుదలయ్యేవి. చోయ్ యున్ హీ 60వ దశాబ్ధం నుండి 70ల తొలినాళ్ల వరకు గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె భర్త షిన్ జియోంగ్ గ్యున్ సినిమా దర్శకుడు. వీరు సెలబ్రిటీ జంటగా పేరుగాంచారు. ఓ జూనియర్ నటితో ఆమె భర్తకు అక్రమ సంబంధం ఏర్పడిన కారణంగా వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో నటి చోయ్ యున్ హీ ఒక వ్యాపార ఒప్పందం కోసం హాంకాంగ్ వెళ్లారు. ఇంతలో ఉత్తర కొరియా ఏజెంట్ ఆమెను కిడ్నాప్ చేశాడు. అతను ఆమెను స్పీడ్‌బోట్‌లోకి ఎక్కించి, తమ నియంత కిమ్ జోంగ్ ఇల్ వద్దకు తీసుకెళ్లాడు. హాంకాంగ్‌లో జరిగిన వ్యాపార ఒప్పందం అనేది తనను కిడ్నాప్ చేయడానికి జరిగిన కుట్ర అని ఆ నటికి అప్పుడు అర్థమైంది. అయితే తాము ఆమెను కిడ్నాప్ చేయలేదని, ఆమె ఇష్టానుసారమే ఇక్కడికి వచ్చినట్లు కిమ్ జోంగ్ ఇల్ ప్రచారం చేయించాడు. ఉత్తర కొరియాలో రూపొందే సినిమాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాలని కిమ్ జోంగ్ ఇల్ తపించిపోయాడు. చోయ్ యున్ హీ భర్తను కూడా తమ ప్రాంతానికి బలవంతంగా తీసుకువచ్చాడు. అయితే ఆ దర్శకుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. ఐదేళ్లపాటు జైలులో ఉంచి వివిధ శిక్షలు విధించారు. నార్త్ కొరియా కోసం సినిమాలు తయాలని ఆదేశించారు. షిన్ జియోంగ్ గ్యున్ ఒక డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను, తన భార్య చోయ్ యున్ హీ కలసి రెండేళ్లలో మొత్తం 17 సినిమాలు చేశామని చెప్పారు. రాత్రిపూట మూడు గంటలకు మించి నిద్రపోకూడదని, నిరంతరం పని చేయాలని, అప్పుడే మా ప్రాణాలు నిలబడతాయని కిమ్ జోంగ్ ఇల్ ఆదేశించారని షిన్ జియోంగ్ గ్యున్ తెలిపారు. అయితే 1986లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కిమ్ నటి చోయ్ యున్ హీ, దర్శకుడు షిన్ జియోంగ్ గ్యున్లను ఉత్తర కొరియా ప్రతినిధులుగా పంపారు. వారికి కిమ్ గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. గదుల్లో కూడా గార్డులను మోహరించాడు. అయితే ఆ దంపతులు ఎలాగోలా తప్పించుకుని, అమెరికా చేరుకుని అక్కడ ఆశ్రయం పొందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!
ఎన్నో వింత వ్యాధులు. ఎందుకొస్తాయో తెలియదు. వాటి వల్ల అనుభవించే బాధ అంత ఇంత కాదు. బయటపడటం కూడా అంత ఈజీ కూడా కాదు. వైద్య శాస్త్రనికే సవాళ్లు విసిరే విచిత్రమైన వ్యాధులు రోజుకోకటి చొప్పున పుట్టుకొస్తూనే ఉన్నాయి. స్వయంకృతాపరాధమో మనిషి స్వార్థానికి పరాకాష్ట అనాలో తెలియదు. అలాంటి వింత వ్యాధినే ఇక్కడొక మహిళ ఎదుర్కొంటోంది. రోజురోజుకి పరిస్థితి దారుణంగా మారిందే తప్ప తగ్గలేదని బోరుమని విలపిస్తోంది. ఆ మహిళకు వచ్చిన వింత వ్యాధి ఏంటీ? ఎందువల్ల అంటే.. అమెరికాలో ప్రముఖ నటి జీనత్ అమన్ నాలుగు దశాబ్దాలుగా ప్టోసిస్ అనే పరిస్థితితో బాధపడుతోంది. కొన్నేళ్ల క్రితం కంటికి తగిలిన గాయమే ఇందుకు కారణం. ఆమె కుడి కన్నుకు ఏర్పడిన గాయం కారణంగా ఆమె కంటి నరాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత క్రమేణ కంటి రెప్ప కుంగిపోవడం లేదా కిందకు వాలిపోవడం జరిగింది. అలా పూర్తిగా కిందకు వచ్చేస్తోంది. అది ఆమె కంట్రోల్ లేదు. అంటే కనురెప్పను కదల్చలేదు. దీని వల్ల కనుచూపు తగ్గిపోతూ వచ్చింది. ఆఖరికి ఆపరేషన్ చేయించకున్న తన పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని ఇన్‌స్ట్రాగాం వేదికగా వాపోయింది. ఇంతకీ ప్టోసిస్ అంటే ఏంటీ.. ప్లోసిస్ అంటే 'డ్రూపింగ్ కనురెప్ప' అని అంటారు. దీని కారణంగా ఎగువ కనురెప్ప కుంగిపోవడం లేదా వైద్య పరిభాషలో స్థానభ్రంశం చెందడం అంటారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మోలజీ ప్రకారం ఈ పరిస్థితి ఒకటి లేదా రెండు కనురెప్పలను ప్రభావితం చేస్తుంది. ఇది దృష్టిని ప్రభావితం చేయొచ్చు లేదా పూర్తిగా దృష్టిని కోల్పోవచ్చు. ఈ పరిస్థితి వయస్సు సంబంధిత మార్పలు కారణంగా గానీ కండరాల బలహీనత లేదా నరాల బలహీనత/ పుట్టుకతో వచ్చే వివిధ సమస్యలు కారణం కావచ్చు. ప్టోసిస్ లక్షణాలు.. కనురెప్పలు వంగిపోవడం స్పష్టంగా చూడలేకపోవడం కనురెప్పలు పైకి లేపాలంటే భారంగా అనిపించడం కన్ను తెరవడమే కష్టంగా ఉండటం దైనందిన పనులు చేసుకోవడం కూడా కష్టమవ్వడం తదితర సమస్యలు ఉత్ఫన్నమైతే తక్షణమే కంటి నిపుణుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. (చదవండి: మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..) -
'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
అదా శర్మ బీ టౌన్‌తో పాటు తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగులో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ.. ఇటీవల ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్‌తో ఇప్పుడు అదా శర్మ పేరు ఇండియా అంతా మార్మోగిపోయింది. అయితే ఇటీవలే ఆస్పత్రిలో చేరిన అదా శర్మ.. తన ఆరోగ్యానికి సంబంధించి ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం తన హెల్త్ కండీషన్ గురించి అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: మనవరాలు ఇంటికి వచ్చిన శుభవేళ... ఉపాసన తల్లి ఏం చేసిందంటే? ) ఇన్‌స్టాలో అదా శర్మ రాస్తూ..' గత కొన్ని రోజులుగా నేను చర్మవ్యాధితో బాధపడుతున్నా. నా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. అందువల్ల ఫుల్‌గా ఉండే డ్రెస్సులు ధరించాను. కానీ ఇటీవల ఒత్తిడి వల్ల నా ముఖంపై కూడా దద్దుర్లు ఏర్పడ్డాయి. వీటి కోసం నేను కొన్ని మందులు వాడాను. కానీ మందువల్లే దద్దుర్లు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఇతర మెడిసిన్స్ వాడుతున్నా. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని అమ్మకు మాటిచ్చా. అయినప్పటికీ ఫుల్ స్లీవ్స్ ధరించిన ప్రమోషన్స్ చేస్తా. ఆ తర్వాత ఆరోగ్యం కోసం కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నా. త్వరలోనే ఆయుర్వేది చికిత్స తీసుకోబోతున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. కమాండో సిరీస్‌పై ఇన్‌స్టాలో అప్డేట్స్ ఇస్తూనే ఉంటా.' అంటూ పోస్ట్ చేసింది. దయచేసి భయపడేవారు ఉంటే ఈ ఫోటోలు చూడొద్దని కోరుతున్నా.. ఎందుకంటే కొన్ని భయంకరమైన పిక్స్ ఇందులో ఉన్నాయి అంటూ సరదాగా అభిమానులకు సూచించింది. ప్రస్తుతం అదా శర్మ నటించిన కమాండో వెబ్ సిరీస్ ఈనెల 11న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్న ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఇటీవలే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. కాగా.. అదా శర్మ తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీతో అదా శర్మకు మరింత ఫేమ్ దక్కింది. కేరళలో 32 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!
కొందరూ ఎక్కడకి వెళ్లలన్నా.. 'లేటే'. టైంకి రావడం అన్నది వారి డిక్షనరీలోనే లేదు అన్నట్లు ఉంటుంది వారి వ్యవహారం. ఇక వాళ్లకి లేట్ కామర్స్ అనే ముద్ర కూడా ఉంటుంది. పాపం వాళ్లు రావాలనుకున్నా.. రాలేరు. ఎందువల్లో గానీ వాళ్లకు తెలియకుండానే 'ఆలస్యం' అనేది వారి వెనుకే ఉందన్నట్లు ఉంటుంది వారి స్థితి. చూసేవాళ్లకు కూడా వాళ్లకి ఏమైనా జబ్బా? ఎందికిలా ప్రతిసారి లేటు అని విసుక్కుంటారు. అసలు ఇదేమైన వ్యాధా? మరేదైనానా.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..ఇలాంటి స్థితిని 'సమయ అంధత్వం' అంటున్నారు. దీన్ని సమయపాలన లోపం లేదా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని విధానం అని అంటున్నారు. అంతేగాదు దీన్ని వైద్య పరిభాషలో 'శ్రద్ధ లేకపోవడం' లేదా 'హైపర్ యాక్టివిటీ' డిజార్డర్‌గా పేర్కొన్నారు. ఒకరకంగా మానసిక ఆరోగ్య సమస్యలాంటిదేనని చెబుతున్నారు. వారికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన లేకపోవడం, దీనికి శ్రద్ధ అనేది అస్సలు ఉండకపోవడం కారణంగానే వాళ్లు ఇలా దేనికైనా..లేటుగానే వస్తారని అన్నారు. ఆఫీస్ దగ్గర నుంచి వారు నిత్యం చేసే ప్రతిపనికి ఇలాంటి వ్యక్తులు ఆలస్యంగానే వెళ్తుంటారని పేర్కొన్నారు. దీంతో వీరు తరుచుగా వ్యక్తుల నిర్లక్ష్యానికి గురవ్వుతారు. స్నేహితులు, బంధువులు కూడా ఇలాంటి వ్యక్తులను దూరంగా ఉంచుతారు. ఇంటా, బయట వీరికి గౌరవం అనేదే ఉండదు. పాపం దీంతో వారు కూడా కాస్త అసహనానికి గురవ్వుతారు. అందుకోసం అని ఎంతలా ప్రయత్నించినా..చివరికి ఆలస్యమే అవ్వుతుంది. ఇలాంటి వ్యక్తులను ముందుగా 'లేటు' అనే పదాన్ని తొలగించుకోవాలని బలంగా అనుకోవాలి. అన్నిట్లకంటే ముందు ఆరోగ్య పరంగా హెల్తీగా ఉండాలి. సమయానికి నిద్రపోవాలి.. ఆ తర్వాత పని అని ఫిక్స్ అవ్వాలి. ఇందకోసం కొద్దిగా సాంకేతికతను వాడుకుంటూ సునాయాసంగా ఆ సమస్యను తొలగించుకోవచ్చు. అలారం పెట్టుకోవడం, ముఖ్యమైన అపాయింట్మెంట్లు, వెళ్లాల్సిన ప్రాంతాల గురించి వివరాలను ఓ పుస్తకంలో లేదా మొబైల్లోని రిమైండర్స్‌లో పొందుపరుచుకోవాలి. రోజు ఉదయం లేవగానే చేయాల్సినవి ఆ బుక్‌లో చూసుకుని తదనంతరం కార్యక్రమాలను ప్రారంభించాలి. యోగా వంటి వాటితో మనసుని ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉంచుకోవాలి. ఏ పని పెండింగ్‌లో ఉండకుండా ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా ఆలస్యం అనే సమస్యను తేలిగ్గా జయించొచ్చు. అలాగే ఇలాంటి మానసిక సమస్యకు కొన్ని మాత్రలు కూడా ఉన్నాయని, వాటిని వైద్యుని పర్యవేక్షలో..వారి సలహాలు సూచనలు మేరకు వాడితే సాధ్యమైనంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: అలా చేయడం డైటింగ్ కాదు..ఈటింగ్ డిజార్డర్! అదోక మానసిక సమస్య) -
‘లివ్ ఇన్’లో ఉండాలంటే.. ఆ యువతి కండీషన్లకు నెటిజన్లు గగ్గోలు!
ఒక యువతి తన పార్ట్నర్తో లివ్ ఇన్‌లో ఉండేందుకు అతని ముందు ఉంచిన షరతుల లిస్టు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీటినన్నింటినీ నెరవేరుస్తానని హామీ ఇస్తేనే లివ్ ఇన్‌లో ఉంటానని, లేని పక్షంలో బైబై టాటా చేప్పేస్తానని బెదిరించింది. ఎవరైనా మరొకరికితో కలసి ఉండాలంటే కాస్తయినా సద్దుకుపోవాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. స్కూలులో స్నేహితులతో, కాలేజీలో రూమ్ మేట్స్‌తో సద్దుకుపోతూ కలసిమెలసి ఉండటం అనేది అందరికీ అనుభవమే. అయితే ఇప్పుడు కాలం మారింది. పెళ్లికి ముందు లేదా పెళ్లి ఊసే లేకుండా లివ్ ఇన్ రిలేషన్లో యువతీయువకులు ఉంటున్నారు. ఇలా ఉంటున్నవారిలో చాలామంది పరస్పరం అడ్జెస్ట్ కాలేక విడిపోతున్నారు. వివాహం అయినవారు ఒకరి ఇష్టాఇష్టాలు, అభిరుచులు ఎలా ఉన్నా ఒకరితో మరొకరు అడ్జెస్ట్ అవుతున్నారు. అలాగే భాగస్వామి కోసం తమ ఇష్టాఇష్టాలను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పటి యువత భాగస్వామితో అస్సలు అడ్జెస్ అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. తాజాగా ఒక లివ్ ఇన్ జంటకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లివ్ ఇన్‌లో ఉండేందుకు.. ‘ది మిర్రర్’ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన పార్ట్నర్తో పాటు లివ్ ఇన్‌లో ఉండేందుకు కొన్ని షరతులు విధించింది. ఈ షరతులకు అంగీకరించకపోతే బ్రేకప్ చెప్పేస్తానని బెదిరించింది. ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు లివ్ ఇన్ కోసం ఉంచిన షరతులను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను విధించిన నియమాలను తాను కూడా పాటిస్తానని, అదేవిధంగా తన బాయ్ ఫ్రెండ్ కూడా పాటించాలని స్పష్టం చేసింది. యువతి పెట్టిన నిబంధనలివే.. ఆ యువతి విధించిన కండీషన్లలో మొదటిది తన బాయ్ ఫ్రెండ్ అతని సామాన్లతో సహా విడిగా వేరే గదిలో ఉండాలి. రెండవ నియమం.. డైనింగ్ టేబుల్ మొదలుకొని ఇంటిలో ఎక్కడా చెత్తపోయకూడదు. అపరిశుభ్రంగా మార్చకూడదు. మూడవ నియమం.. ఇంటిలోని న్యూస్ పేపర్లు, ఇతర కాగితాలు సరిగా సద్దుకొని అతని గదిలోనే ఉంచుకోవాలి. ఈ షరతులను చూసి నెటిజన్లు కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. ఒక యూజర్.. లివ్ ఇన్‌లో ఉండేందుకు ఎటువంటి షరతులు ఉండకూడదని రాయగా,మరో యూజర్ లివ్ ఇన్‌లో ఇలాంటి తీరు అస్సలు పనికిరాదని రాశారు. ఇంకో యూజర్ సరైన జీవితం గడిపేందుకు ఆ యువతి పెట్టిన కండీషన్లలో తప్పేముందని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు! -
చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...!
చైనాకు చెందిన ఒక కంపెనీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు నూతన నియమనిబంధనలను జారీ చేసింది. దీని ప్రకారం సిబ్బందిలో ఏ ఒక్క రూ కూడా వివాహేతర సంబంధాలుకలిగివుండ కూడదు. అలాగే విడాకులు తీసుకోనివారై ఉండాలి. ఈ నియమ నిబంధనలను సదరు కంపెనీలో పనిచేస్తున్న అధికారులు మొదలుకొన్ని కింది స్థాయి ఉద్యోగుల వరకూ అందరికీ వర్తిస్తాయని పేర్కొంది. కంపెనీలో పనిచేసే ప్రతీ ఉద్యోగి కుటుంబానికి కట్టుబడి ఉండాలని ఒక చైనా కంపెనీ స్పష్టం చేసింది. ఇలాంటివారే ఇక్కడ ఉద్యోగం చేసేందుకు అర్హులని, వారికే కంపెనీలో ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. చైనాలోని ఝోజియాంగ్ ప్రాంతానికి చెందిన ఒక కంపెనీ సంస్థాగత సిబ్బందికి ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ చైనా కంపెనీ జూన్ 9న ‘వివాహేతర సంబంధాల నిషేధం’నకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నియమం సంస్థలోని వివాహిత ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. వివాహేతర సంబంధాలు నడిపేవారిపై సంస్థ వెంటనే చర్యలు చేపడుతుంది. అంతేకాదు ఇటువంటి వారి విషయంలో సంస్థ కఠినంగా వ్యవహరిస్తుంది. భవిష్యత్‌లోనూ అటువంటివారికి సంస్థలో ఉద్యోగం చేసే అవకాశం కల్పించదు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతునిస్తూ ఉద్యోగులంతా వారి కుటుంబ సభ్యుల విషయంలో జవాబుదారీగా వ్యవహరించాలని పేర్కొంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తప్పనిసరిగా ఉండాలి. కుటుంబంలోని అందరికీ భద్రత కల్పించాలి. వివాహమైనవారు వివాహేతర సంబంధాలు పెట్టుకోకూడదు. ఉద్యోగులలో ఎవరూ విడాకులు తీసుకున్నవారై ఉండకూడదు. ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. అయితే ఉద్యోగులంతా కంపెనీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారని, ఎవరూ ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడరని, వారి భాగస్వామితో మంచి వ్యవహారశైలి కలిగివుంటారాని బావిస్తున్నామని సదరు కంపెనీ పేర్కొంది. ఇది కూడా చదవండి: 34 ఏళ్లుగా సముద్రంలో తేలియాడిన ఆ బాటిల్ ఆమె చేతికి చిక్కడంతో.. -
పంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదలచేసిన బీసీసీఐ
-
చెత్తా చెదారం.. ఎలుకల సంచారం
వరంగల్‌లో పేరొందిన మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒక రోగిని ఇటీవల ఎలుకలు దారుణంగా కొరికి గాయపరిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుమారు ఐదేళ్ల క్రితం ఉస్మానియా మార్చురీలో భద్రపరిచిన యువతి శవాన్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన ఘటన కూడా అప్పట్లో కలకలం రేపింది. మెదక్ ఆస్పత్రి మార్చురీలో కూడా మూడేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పందికొక్కులు పీక్కుతిన్నాయి. తాజాగా వరంగల్ ఘటనలో రోగి (కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఇతను తర్వాత హైదరాబాద్ నిమ్స్‌లో చనిపోయాడు) కాళ్ల నుంచి రక్తస్రావం అయ్యేలా ఎలుకలు కొరికేయడం.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి, నిర్వహణపై చర్చకు తెరతీసింది. ఐసీయూలోనే ఇలా ఉంటే సాధారణ వార్డులు, గదులు ఎలా ఉంటాయోనన్న సందేహాలకు తావిచ్చింది. దీంతో ‘సాక్షి’.. రాజధాని హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రులతో పాటు పలు జిల్లా కేంద్రాల్లోని సర్కారు దవాఖానాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించింది. సాక్షి, నెట్వర్క్/గాంధీ ఆస్పత్రి/నాంపల్లి /అఫ్జల్‌గంజ్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ కొరవడింది. అపరి శుభ్ర వాతావరణం రాజ్య మేలుతోంది. ఎటు చూసినా చెత్తాచెదా రం, ప్లాస్టిక్ కవర్లు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ అపరిశుభ్ర వాతావరణం ఎలుక లు, పంది కొక్కులు ఆస్పత్రులను తమ ఆవాసాలు గా చేసుకునేందుకు దోహదపడుతోంది. మరోవైపు రోగులు, వారి సహాయకులు.. తినగా మిగిలిన ఆహారాన్ని, ఇతర తినుబండారాలను పడవేస్తున్నారు. ఈ ఆహార వ్యర్థాల కోసం ఎలుకలు, పంది కొక్కులు ఆసుపత్రుల ఆవరణలో, వార్డుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆస్పత్రి ఆవరణను, వార్డులను శుభ్రంగా ఉంచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో కుక్కలు, కోతులు, పాములు కూడా తిరుగుతున్నట్లు రోగులు, వారి సహాయకులు చెబుతున్నారు. ఇది మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దుస్థితి. పాత ఐసీయూ వెనుక భాగంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. పందులు, ఎలుకలకు ఆవాసంగా మారింది. నిర్లక్ష్యానికి కేరాఫ్ నిలోఫర్ నగరంలోని ప్రముఖ నవజాత శిశువుల సంరక్షణా కేంద్రమైన నిలోఫర్ ఆసుపత్రి అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయింది. పాత, కొత్త, లోపల, బయట అనే తేడా లేకుండా ఆసుపత్రిలోని అన్నిచోట్లా అపరిశుభ్రత నెలకొంది. రోగులు, సహాయకులు పడేసే ఆహారం కోసం చుట్టుపక్కల ఉన్న బస్తీల నుంచి ఎలుకలు ఆసుపత్రి వైపు వస్తున్నాయి. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌లో ఉంటూ రాత్రివేళ ఆస్పత్రిలో సంచరిస్తున్నాయి. గాంధీ సెల్లార్లో ఫుల్లు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెల్లార్లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక అక్కడ మురుగునీరు చేరుతోంది. ప్రధాన భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గైనకాల జీ, లేబర్‌వార్డు, పీడియాట్రిక్, పీఐసీయూ, ఎస్ఎన్సీయూ తదితర వార్డుల్లో ఎలుకల సంచా రం తరచూ కనిపిస్తోందని పలువురు రోగులు తెలిపారు. 2015లో నవజాత శిశువులకు వైద్యం అందించే ఎస్ఎన్సీయూ వార్డులో ఎలుకలు కనిపించడంతో అప్పట్లో చర్యలు చేపట్టారు. తాజాగా వరంగల్ ఎంజీఎం ఘటనతో అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి అధికార యంత్రా ంగం ఎలుకల నివారణకు గుళి కల ప్రయోగం చేపట్టడంతో పాటు పలు వార్డుల్లో బోన్లు, ర్యాట్ ప్యాడ్లను ఏర్పాటు చేశారు. పందికొక్కులకు ‘చిరునామా’ జనగామ జిల్లా వందపడకల ఆస్పత్రి ఆవరణలో డ్రెయినేజీలను తోడేస్తున్నాయి. జనరేటర్ ఏర్పాటు చేసిన గది ఆవరణ, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ముందు భాగం, జనరల్ వార్డు వెనకాల పెద్ద పెద్ద కన్నాలు ఏర్పడ్డాయి. ఎలుకల కోసం పాములు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనం ముందు భాగాన్ని ఇటీవల అం దంగా తీర్చిదిద్దారు. కానీ లోపల వార్డులు, ఆసుపత్రి పరిసరాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. వెనుక భాగం చెత్తాచెదారం, చెట్ల పొదలతో నిండిపోయింది. గత ఏడాది డిసెంబర్ 21న రాత్రి సమయంలో పేషెంట్ కేర్‌టేకర్‌గా పనిచేసే వేముల సంపత్‌ను ఆసుపత్రి ప్రాంగణంలోనే పాము కాటేసింది. అంతకుముందు కూడా ఆసుపత్రిలో పనిచేసే మరొకరిని పాము కాటు వేసింది. వార్డుల్లో ఎలుకలు తిరుగుతుండడంతో వాటి కోసం పాములు వస్తున్నాయని చెబుతున్నారు. పాత భవనం కావడంతో వార్డుల్లో గోడలకు కన్నాలు ఉండడం, అం దులో ఎలుకలు, బొద్దింకలు చేరడంతో వాటి కోసం పాములు వస్తున్నాయి. వంద పడకల యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణ చుట్టూ పందికొక్కులు రంధ్రాలు చేశాయి. పగలు, రాత్రి తేడాలేకుండా సంచరిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆస్పత్రి మార్చురీలో 4 ఫ్రీజర్ బాక్స్‌లు ఉండగా అవి పనిచేయడం లేదు. దీంతో రెండు శవాలను కిందపడేశారు. వాటి ని పురుగులు, దోమలు, ఈగలు పీక్కు తింటుండటంతో గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. కాగా శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ‘సాక్షి’కి తెలిపారు. ఉస్మానియాలో కుక్కల వీరంగం పేదల పెద్దాసుపత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియాలో కుక్కలు, కోతులు, పిల్లుల బెడద ఎక్కువగా ఉంది. ఆసుపత్రి పరిసరాల్లో కుక్కలు వీరంగం సృష్టిస్తుంటే, కోతులు రోగులు వారి సహాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆసుపత్రి నుండి రోగి కోలుకొని తిరిగి వెళ్లే సమయంలో కొబ్బరికాయలు కొడుతుండడంతో వాటి కోసం కోతులు ఎగబడుతున్నాయి. 2017లో ఆత్మహత్యకు పాల్పడిన అఫ్జల్‌సాగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులు.. ముక్కు, పెదవుల్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన స్థితిలో ఉన్న యువతి శవాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. -
రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు!
రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన ఓ రెస్టారెంట్.. కస్టమర్లకు ఓ విచిత్ర షరతు పెట్టింది. కస్టమర్ల పక్కన మహిళ ఉంటేనే లోపలికి ప్రవేశమట. అందేంటి?? అనుకుంటున్నారా... దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఆకలేసి సదరు హోటల్‌కి వెళ్లబోతే, పక్కన లేడీ ఎవ్వరూ లేరని వెనక్కి పంపారట. దీనితో ఒక మహిళను తీసుకొచ్చి, హోటల్లో కూర్చోబెట్టి కడుపునిండా తిన్నాడట. ఐతే పాపం ఆ మహిళ మాత్రం పప్పు రోటీ తినడానికి ఈ వ్యక్తి నన్నిక్కడికి తీసుకొచ్చాడనే క్యాప్షన్‌తో తన ఇమేజ్‌తో సహా ట్విటర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మార్నింగ్ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరరాలైంది!! So this guy took me here to have dal roti because pic.twitter.com/PVrgeuS4H9 — Harshita Sharma (@Harshita511) October 17, 2021 -
మాటకు బానిస
పాదుషా గారు తన తలపై నుంచి కిరీటాన్ని ఒక్క క్షణం పాటు కూడా తొలగించే వారు కాదు. మంత్రులు, సన్నిహితులు పాదుషా గారిని కాసేపు కిరీటం తీసి ఉపశమనం పొందండి అని చెప్పినా ససేమిరా అనేవారు. ఒకరోజు పాదుషా గారికి అత్యంత సన్నిహితుడైన మంత్రి ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు పాదుషాగారిని గుచ్చిగుచ్చి అడగడం మొదలెట్టాడు. పాదుషా గారు ఎంతగా దాటవేయాలనుకున్నా కుదరలేదు. చివరికి ఒక షరతుతో తన రహస్యాన్ని చెప్పారు. ‘‘నా తలపై ఒక కొమ్ము మొలిచింది అందుకే నేను ఎప్పుడూ కిరీటం తీయడానికి ఇష్టపడను’’ అని చెప్పారు. ఈ సంగతి మూడో మనిషికి చెప్పకూడదనే షరతుతో మంత్రిగారి ముందు బట్టబయలు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే రాజ్యమంతా ఈ విషయం దావానలంలా పాకింది. అది తెలిసి పాదుషా గారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే ఫలానా మంత్రిని హాజరుపరచాలని హుకుం జారీచేశారు. తన షరతును ఉల్లంఘించినందుకు శిక్షించేందుకు పాదుషాగారు ఒరలోనుంచి కత్తిని తీసి మంత్రిపై ఒక్క వేటు వేయబోయారు. అంతలోనే మంత్రి ఆ కత్తిని అడ్డుకుని ‘‘మీరు పాదుషా అయి ఉండి కూడా మీ వ్యక్తిగత రహస్యాన్ని గుట్టుగా ఉంచలేకపోయారు. మరి మేమెలా ఈ రహస్యాన్ని గుట్టుగా ఉంచగలుగుతామనుకున్నారు? నన్నెలా శిక్షించదలిచారో మీకూ అంతే శిక్ష పడాలి.’’ అని అన్నాడు. పాదుషాగారు ఆలోచనలో పడ్డారు. మాట, విల్లునుంచి వదిలిన బాణం తిరిగి రాలేవు. అంతరంగంలో ఉన్నంతవరకూ మాటలు మన బానిసలవుతాయి. అవి బయటికి రాగానే వాటికి మనం బానిసలవ్వాల్సి ఉంటుందన్నది ఇందులోని నీతి. – ముహమ్మద్ ముజాహిద్ -
మాట తప్పిన హరిశ్చంద్రుడు!
ఆ రాజుది ఇక్ష్వాకువంశం. పేరు హరిశ్చంద్రుడు. ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం ఒక్కటే లేదు. దాంతో మునులు, కుల గురువుల సలహా మేరకు వరుణుడిని బహుకాలం ఉపాసించాడు. వరుణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. సంతానం కావాలన్నాడు హరిశ్చంద్రుడు. ‘‘ఓ రాజా! పురాకృత పాపకర్మల వల్ల నీకు సంతానయోగం లేదు. అయితే, ఒక్క షరతు మీద నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను. అందుకు అంగీకరిస్తావా మరి?’’ అని అడిగాడు వరుణుడు. సంతానం ప్రాప్తిస్తోందన్న సంతోషంతో ముందు వెనుకలు ఆలోచించకుండా ‘‘స్వామీ! మీరు నిబంధన విధించడం, నేను అతిక్రమించడమూనా!? సెలవివ్వండి, తప్పక చేస్తాను’’ అన్నాడు హరిశ్చంద్రుడు. ‘‘నీ కోరిక తక్షణం నెరవేరుతుంది. ఇప్పుడు విను నా నిబంధన. నీకు సంతానం కలిగిన వెంటనే తీసుకు వచ్చి, నాకు అప్పగించాలి. అదే నా షరతు’’ అన్నాడు వరుణుడు. ఖిన్నుడయ్యాడు హరిశ్చంద్రుడు. ఇదెక్కడి న్యాయం? సంతానం కోసమే కదా నేను కఠోర తపస్సు చేసిందీ, ప్రసన్నుడిని చేసుకున్నదీ. ఇప్పుడు ఆ సంతానాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ తిరిగి వెనక్కి తీసుకుంటానంటాడేమిటి? అయినా, ముందు సంతానం కలగనీ, అప్పుడు చూద్దాం’’ అనుకుని సరేనన్నాడు హరిశ్చంద్రుడు. అయితే ఆ కొడుకును, వరుణయజ్ఞంలో వరుణుడికే బలి చేస్తానని ముందు ఒప్పుకొన్న హరిశ్చంద్రుడు, పుత్ర ప్రేమ వల్ల ఆ బలిని వాయిదా వేస్తూ వెళతాడు. చివరికి తన పుత్రుడి బదులు డబ్బుతో కొనుక్కొన్న శునశ్సేపుడు అనే క్షత్రియ పుత్రుడిని బలి చేయటానికి సిద్ధపడతాడు. శునశ్సేపుడు తనకు విశ్వామిత్రుడు ఉపదేశించిన వరుణ మంత్రం జపించి, వరుణుడిని ప్రసన్నం చేసుకొంటాడు. వరుణుడు చివరకు ఏ బలీ లేకుండానే హరిశ్చంద్రుడికి వరుణ యజ్ఞఫలం ప్రసాదించి అనుగ్రహిస్తాడు. అయితే తాను అసత్యం చెప్పడం వల్లే కదా, ఇంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనది.. కాబట్టి ఇకముందు ఎన్నడూ అసత్యం ఆడకూడదు. సత్యమే చెప్పాలి అని మనసులో బలంగా నిశ్చయించుకుంటాడు. అప్పటినుంచి అన్న మాటకు కట్టుబడి ఉండటంతో హరిశ్చంద్రుడు అసలు అబద్ధం చెప్పడు, అలా హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు అవుతాడు. (ఈ కథ ఋగ్వేద బ్రాహ్మణంలోనూ, కొన్ని మార్పులతో దేవీ భాగవత పురాణంలోనూ కనబడుతుంది) – డి.వి.ఆర్. -
షరతుల్లేకుండా ఎవరైనా చేరొచ్చు
-
షరతుల్లేకుండా ఎవరైనా చేరొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: ఏ పార్టీ నేతలైనా షరతు ల్లేకుండా కాంగ్రెస్‌లో చేరవచ్చని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా అన్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ఉహాగా నాలు జోరందుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీపై నమ్మకంతో చేరేవారిని ఎవరినైనా ఆహ్వానిస్తామని రేవంత్‌రెడ్డి చేరికను పరోక్షంగా ప్రస్తావించారు. రేవంత్ చేరికపై ఎలాంటి సమాచారం లేదని చెబుతూనే.. ఎవరొచ్చినా చేర్చుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు అన్ని చర్యలు తీసు కొని.. 2019 ఎన్నికలకు సిద్ధమవుతామన్నా రు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పి కుటుంబ అభివృద్ధికే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిన టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్సేనని పేర్కొన్నా రు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమస్యలు ఏవైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరిం చుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ మరింత బలహీనపడిందని, అమిత్ షా ప్రభా వం లేకపోవడంతో బలపడే అవకాశాలు లేవని గుర్తించే ఆ పార్టీ తెలంగాణకు చెందిన నేతను కేంద్ర కేబినెట్ నుంచి తప్పించిందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటామని పేర్కొన్నారు. -
ఫిట్‘లెస్’
నిబంధనలకు అనుగుణంగా లేని స్కూల్ బస్సులు కండీషన్‌పై దృష్టి సారించని యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం గత నెల 15తోనే ముగిసిన ఫిట్నెస్ గడువు 987 బస్సులకు గాను 341కు మాత్రమే ఫిట్నెస్ బడి గంటలు మోగే సమయం దగ్గర పడుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆర్థిక స్తోమతను బట్టి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు చేయిస్తున్నారు. అయితే.. ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై చూపడం లేదు. కండీషన్ లేకపోయినా దశాబ్దాల తరబడి పాత బస్సులనే తిప్పుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలకు, అక్కడి నుంచి తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుందనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులే అధికంగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేసిన చిన్నారులు తిరిగి పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం పిల్లల అడ్మిషన్లపై దృష్టి సారిస్తున్నాయే తప్ప వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంపై చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థుల రాకపోకలు సాగించేందుకు వినియోగిస్తున్న బస్సుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పాఠశాలలు స్థాపించి ఇరవై, ముప్పై ఏళ్లు అవుతున్నా ప్రారంభం నుంచి అవే బస్సులను తిప్పుతుండటం ఒకింత ఆందోళన కల్గిస్తోంది. ఫిట్‘లెస్’ బస్సులే ఎక్కువ.. స్కూల్ బస్సులకు గత నెల 15తోనే ఫిట్నెస్ రెన్యూవల్ గడువు ముగిసింది. జిల్లాలో మొత్తం 987 స్కూల్ బస్సులు ఉన్నాయి. గడువు మీరిపోయినా కొన్ని యాజమాన్యాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకూ 341 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందినట్లు ఆర్టీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. అనేక స్కూల్, కళాశాలల యాజమాన్యాలు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి సెకండ్‌హ్యాండ్ (ఇదివరకే వినియోగంచిన) బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. తక్కువ ధరకు వచ్చిన వీటికి పెయింటింగ్ మార్చి స్కూల్ బస్సులుగా తిప్పుతున్నారు. 20, 30 ఏళ్లుగా తిరుగుతున్నా అధికారులు వీటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఒకవేళ జరగరానిది జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు తప్పనిసరి స్కూల్ బస్సుల విషయంలో ప్రభుత్వం అనేక నిబంధనలు విధించినప్పటికీ కొన్ని యాజమాన్యాలు వాటిని తుంగలో తొక్కుతున్నాయి. ముఖ్యంగా అత్యవసర ద్వారం, అగ్నిని నిరోధించే సిలిండర్, ప్రథమ చికిత్స పరికరాల కిట్, విద్యార్థులు ఎక్కేందుకు అనువుగా మెట్లు (ఫుట్‌స్టెప్), హ్యాండ్‌బ్రేక్, హెడ్‌లైట్స్, బ్యాక్లైట్స్, ఇండికేటర్స్, అంబర్లైట్స్, ముందు భాగాన తెలుపు, వెనుక ఎరుపు, సైడ్‌కు పసుపుపచ్చ రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలి. తాజా నిబంధనల ప్రకారం 60 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లకుండా స్పీడ్ గవర్నర్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటు బస్సు కండీషన్ ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న స్కూల్ బస్సుల్లో యాభై శాతానికి పైగా నిబంధనలు పాటించడం లేదు. అయినా అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే సీజ్ : సుందర్‌వద్దీ, ఉపరవాణా కమిషనర్, అనంతపురం ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందేందుకు గడువు మే 15కే పూర్తయ్యింది. ఇప్పటికీ ఫిట్నెస్ కోసం స్కూల్ బస్సులు వస్తున్నాయి. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు కావడంతో వాటిని మరమ్మతులు చేసుకుంటున్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యే సమయానికి ప్రతి బస్సుకూ ఫిట్నెస్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అది లేకుండా నడిపితే సీజ్ చేయడంతో పాటు కోర్టుకు హాజరుపరుస్తాం. -
పెరోల్ పొడిగించాలంటే రూ. 5,092 కోట్లు!
⇒ ఏప్రిల్ 7లోపు డిపాజిట్ చేయాలి ⇒ సహారా రాయ్‌కు సుప్రీం గడువు న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను పొడిగించడానికి సుప్రీంకోర్టు కీలక షరతు విధించింది. ఏప్రిల్ 7వ తేదీలోపు సెబీ–సహారా అకౌంట్లో రూ.5,092.6 కోట్లు డిపాజిట్ చేయాలని సహారాను ఆదేశించింది. తన ఆస్తులు అమ్మడానికి ఆరు నెలల గడువు కావాలని గ్రూప్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించింది. తనకు సమర్పించిన జాబితాలోని ఆస్తులు అమ్మడానికి ఆమోదముద్ర వేసింది. మదుపరులకు డబ్బు పునఃచెల్లించడానికి వీలుగా తగిన చర్యలు తీసుకోడానికి తగిన అన్ని చర్యలపై దృష్టి సారించాల్సిందేని స్పష్టం చేసింది. ఏప్రిల్ 7లోపు డిపాజిట్ చేయడానికి వీలుగా తనకు సమర్పించిన జాబితాలోని 15 ఆస్తుల్లో పదమూడింటిని అమ్మవచ్చని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అలాగే మరో జాబితాల్లో ఉన్న తనఖాలోలేని ఆస్తుల అమ్మకానికీ సుప్రీం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం చెల్లింపు తరువాత పెరోల్ గడువును మరికొంతకాలం పొడిగించి మొత్తం డబ్బు డిపాజిట్ చేసే మార్గాలను అన్వేషించే అవకాశం కల్పిస్తామని సుప్రీం సూచించింది. ఇంటర్నేషనల్ రియల్టీ సంస్థకు సూచనలు... కాగా న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్లో సహారా వాటాలను 550 మిలియన్ డాలర్లకు కొనడానికి ముందుకు వచ్చిన ఒక అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థకు...రాజన్ గొగోయ్, ఏకే శిక్రీలు కూడా ఉన్న ఈ త్రిసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ దిశలో తన విశ్వసనీయతను నిరూపించుకోడానికి రూ.750 కోట్లను ఏప్రిల్ 10వ తేదీ లోగా అత్యున్నత స్థాయి న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
అధ్వానంగా మారిన సాంఘిక సంక్షేమ హాస్టల్
-
ఘోర ప్రమాదం
ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీ ఇద్దరి దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి విషమం ఇంకో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు పావగడ సమీపంలో ఘటన పావగడ/రొద్దం: కర్ణాటక రాష్ట్రం పావగడ-కళ్యాణదుర్గం ప్రధాన రహదారిలోని పావగడ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ-02.జెడ్-148 నంబర్ గల బస్సు 62 మంది ప్రయాణికులతో పావగడకు బయలుదేరింది. పావగడ విడ్స్ సమీపంలోని నాగలమడక మలువులోకి రాగానే పావగడ వైపు నుంచి కళ్యాణదుర్గం వెళ్తూ ఎదురొచ్చిన ఐచర్ వాహనం, ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ధ్వంసమైన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వారిలో యశోద(35)గా గుర్తించారు. మరో యువకుడు మృతి చెందగా, అతని వివరాలు తెలియరాలేదు. బస్సు డ్రైవర్ నరసింహులు(45), ఐచర్ వాహన డ్రైవర్ మణి(40) పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 20 మందిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు... ఐచర్ క్లీనర్ మూర్తి(34), వెంకటేసు(40)కంబదూరు తిమ్మాపురం, సుబ్బరాయుడు(35)కంబదూరు తిమ్మాపురం, లక్ష్మిదేవి(50), ఆదిలక్ష్మి(45)కళ్యాణదుర్గం, నరసింహప్ప(30) పావగడ, చెన్నమ్మ(65) చెన్నంపల్లి, పద్మావతి(40) బస్సు కండక్టర్, అమృత విద్యార్థి(16), గంగమ్మ(40), శ్రీనివాసులు(40) అండేపల్లి, రత్నయ్యశెట్టి(55)పావగడ, నాగభూషణ(40)కదిరిదేవరపల్లి, నారాయణ(34) తదితరులు ఉన్నారు. మరో ఆరుగురు స్వల్ప గాయాలతో చికిత్స బయటపడ్డారు. సీఐ ఆనంద్, ఎస్ఐ మజునాథ్ తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేపసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి కోసం మనీ విత్‌డ్రాకి నిబంధనలు
-
50 రోజుల్లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేసినా పాన్ ఇవ్వాలి
ఆదాయపన్ను శాఖ స్పష్టీకరణ న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో రూ.50 వేలకు మించి చేసే నగదు జమలకు పాన్ నంబర్ ఇవ్వాలనే నిబంధన ప్రస్తుతం అమల్లో ఉండగా... ఈ నెల 9 నుంచి డిసెంబర్ 30వ తేదీ మధ్య కాలంలో రూ.2.5 లక్షలు, అంతకు మించి చేసే డిపాజిట్లకు కూడా ఇది తప్పనిసరి అని ఆదాయపన్ను శాఖ తాజాగా స్పష్టం చేసింది. అంటే పాన్ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఒక రోజులో రూ.50 వేలకు మించకుండా, రోజుకు కొంత చొప్పున డిపాజిట్ చేసుకుందామనుకుంటే ఇకపై వీలు పడదు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు 50 రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే. ఈ కాలంలో నల్లధనాన్ని మార్చుకునే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు ఆదాయపన్ను శాఖ ఈ ఆదేశాలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 25 కోట్ల పాన్లను జారీ చేసినట్టు పేర్కొంది. ఆదాయపన్ను శాఖ నోటిఫికేషన్ ప్రకారం... బ్యాంకులు, పోస్టాఫీసులు ఒక రోజులో రూ.50 వేలకు మించి చేసే డిపాజిట్ దారుల వివరాలు, ఈ నెల 9 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.2.50 లక్షల వరకు డిపాజిట్ చేసే వారి వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ 50 రోజుల గడువులోపు సేవింగ్స ఖాతాల్లో రూ.2.50 లక్షలకు మించి, కరెంట్ ఖాతాల్లో రూ.12.50 లక్షలకు చేసే డిపాజిట్ల వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలని బ్యాంకులు, పోస్టాఫీసులను కోరిన విషయం తెలిసిందే. -
బస్సు కండీషన్లో ఉండాల్సిందే...
► గ్యారేజీ సిబ్బందికి అవగాహన ► ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ అరుణకుమారి శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కండీషన్లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత గ్యారేజీ సిబ్బందిపై ఉందని ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ నంబాళ్ల అరుణకుమారి అన్నారు. ప్రమాదరహిత వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీకాకుళంలోని రెండో డిపో గ్యారేజీ ఆవరణలో మెయింటినెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్ కండిషన్, బ్రేక్‌లు, హెడ్‌లైట్ తదితరవన్నీ బాగుండేలా చూడాలని సూచించారు. హ్యాండ్‌బ్రేక్ కండిషన్ సరిగా ఉందా, లేదో చూసుకోవాలని, స్టీరింగ్ కండీషన్ సక్రమంగా ఉందో, లేదో చూడాలన్నారు. సేఫ్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్యారేజీ మెకానిక్‌లకు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ(ఇంజన్ మెకానిక్), ఎం.రవికాంత్(బ్రేక్ మెకానిక్), ఎస్.కోటేశ్వరరావు(బ్రేక్ మెకానిక్), జె.నూకరాజు(టైర్ మెకానిక్). బి.సతీష్‌బాబు(ఎలక్రీ్టషియన్), జి.కాళి(ఈఓసి మెకానిక్), కేవీ రావు(స్పోర్ట్స్ సూపర్వైజర్), జేవీకే రాజు(లీడింగ్ హ్యాండ్) తదితర ఉత్తమ గ్యారేజీ మెకానిక్, సూపర్వైజర్లకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ రెండో డిపో అసిస్టెంట్ మేనేజర్, ఎం.ఎఫ్ తదితరులు పాల్గొన్నారు. -
మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమం..
కోల్ కతాః పశ్చిమ బెంగాల్ కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమెకు.. గురువారం నుంచీ ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, అయినా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఆమె మూత్రపిండాలు రెండూ సరిగా పనిచేయడం లేదని, గురువారం రాత్రి డయాలసిస్ నిర్వహించినా.. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనపించడం లేదని వైద్యులు చెప్తున్నారు. 90 ఏళ్ళ వయసున్నశ్వేతాదేవి వివిధ ఆరోగ్య సమస్యలతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో రెండు నెలలుగా చికిత్స పొందుతున్నారు. ఆమెకు రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో తగిన వైద్యం అందిస్తున్నామని, అయినా పరిస్థితి విషమిస్తుండటంతో వెంటిలేషన్ పై శ్వాసను అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. 1996 లో జ్ఞానపీఠ అవార్డు పొందిన మహా శ్వేతాదేవి.. ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 1926 లో జన్మించారు. శ్వేతాదేవి తల్లిదండ్రులు సైతం రచయితలే. -
అనుమానాస్పదంగా హమాలీ మృతి
బీబీగూడెం(చివ్వెంల): అనుమానాస్పద స్థితిలో హమాలీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బీబీగూడెం గ్రామ శివారులోని విష్ణువందన ఫార్‌బాయిల్డ్ రైస్ మిల్లులో గురువారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మున్యానాయక్‌తండాకు చెందిన ధరావత్ రాజు(45) 20 సంవత్సరాలుగా విష్ణు వందన రైస్ మిల్లులో హమాలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే మిల్లులో పని నిమిత్తం వచ్చాడు. కాగా పని కొంచెం ఆలస్యంగా మొదలవుతుందని తెలుసుకుని వెంట తెచ్చుకున్న ఆహారాన్ని మిల్లులోనే అతడితో పాటు మరికొంత మంది హమాలీలు చెట్టు కింద కూర్చొని భోజనం చేశారు. కొద్ది సేపటికే రాజు కుప్పకూలి కింద పడిపోయాడు. గమనించిన తొటి హమాలీలు వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించగా అప్పటికే మృతిచెం దినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో మృతిచెందినట్టు భావిస్తున్నారు. మృతదేహాన్ని తిరిగి ట్రాక్టర్లలో మిల్లు వద్దకు తీసుకువచ్చారు. మృతుడి కుటుంబానికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంధువులు మృతదేహంతో మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మిల్లు యాజమాన్యం రూ.1.20 లక్షలు ఇస్తామని అంగికరించడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఇసుక తిని బతికేస్తున్న సాండ్ మ్యాన్!
వర్షం వస్తున్నపుడు వచ్చే మట్టి వాసనను ఇష్టపడని మనుషులుండరేమో.. అలాగే చిన్నతనంలో మట్టి తినని వారు కూడా ఉండరేమో.. కానీ ఓ వ్యక్తి చిరుతిండిలా... తినుబండారాలను తిన్నట్లుగా ఇసుక, మట్టిని తినెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శరీరంలో విటమిన్ల లోపం కారణంగానే అతడు మట్టి తినడానికి అలవాటు పడ్డాడని డాక్టర్లు చెప్తుండగా.. తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని చెప్తున్న సదరు వ్యక్తి ఏకంగా 'సాండ్ మాన్' గా పేరు తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన హంస్ రాజ్ ఏదో టిఫిన్ తిన్నట్లుగా రోజుకో ప్లేటు ఇసుకను తినేస్తున్నాడు. ఇరవై ఏళ్ళ వయసులో ఇసుక తినడానికి అలవాటు పడ్డ అతడు చివరికి అదే అలవాటుకు బానిసయ్యాడు. ఇసుకతోపాటు ఇటుక, రాళ్ళ ముక్కలను కూడ నంజుకుని కరాకరా నములుతూ తినేస్తున్నాడు. శరీరంలో విటమిన్లు లోపంవల్ల ఏర్పడే పికా డిజార్డర్ అతనికి ఉండొచ్చని, అందుకే అలా చేస్తున్నాడని డాక్టర్లు చెప్తున్నారు. అటువంటి అలవాటు కొన్నాళ్ళకు తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయని అంటున్నారు. ఇటువంటి రోగానికి చికిత్స లేదని చెప్తున్నారు. ఇలా ఇసుక తినడం వల్ల కొన్నాళ్ళకు అది విషంగా మారి ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అయితే హంస్ రాజ్ మాత్రం తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని, ఇసుక తినడం వల్ల ఎటువంటి సమస్యా లేదని చెప్తున్నాడు. ఇసుక తినడంతో తనకు విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా చేరుతున్నాయని, తాను ధృఢంగా ఉండేందుకు అవి తోడ్పడుతున్నాయని అంటున్నాడు. సుమారు 25 ఏళ్ళనుంచి ఇలా.. ఇసుక, రాళ్ళు, ఇటుక ముక్కలు తింటున్నానని, ఇలా తినడం ఇప్పటికీ తనకు ఎంతో ఇష్టమని ఆనందంగా చెప్తున్నాడు. ప్రతిరోజూ ఓ ప్లేటు ఇసుక తిననిదే 45 ఏళ్ళ హంస్ రాజ్ కు నిద్ర పట్టదు. అందుకే తన గ్రామంనుంచీ పక్క గ్రామానికి వెళ్ళి మరీ బస్తాలతో ఇసుకను తెచ్చి ఇంట్లో భద్రపరచుకుంటున్నాడు. ఈ అలవాటు వల్ల అతను ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లోనే ఫేమస్ అయిపోయాడు. 'సాండ్ మ్యాన్' గా పేరు తెచ్చుకున్నాడు. ఇసుక తినడంవల్ల తన కడుపులోనూ, పళ్ళకు కూడ ఎటువంటి ఇబ్బందీ కలగడం లేదని, గట్టిగా ఉన్న రాయిని కూడ తాను సునాయాసంగా కొరకగల్గుతానని చెప్తున్నాడు. -
తెల్లకార్డుంటేనే.. అదీ ఒక్క కిలోనే
సబ్సిడీ ఉల్లికి రోజుకో షరతు ఎంవీపీకాలనీ : రైతుబజార్లలో ఉల్లిపాయలకు ప్రభుత్వం రోజుకో షరతు విధిస్తోంది. మొదట ఆధార్ కార్డు.. తరువాత రేషన్‌కార్డు తీసుకొస్తేనే ఉల్లిపాయలు ఇస్తామని చెప్పిన అధికారులు మంగళవారం నుంచి తెల్లరేషన్ కార్డు తీసుకురావాలని ప్రకటించారు. అదీ కార్డుపై కిలో మాత్రమే. ఇప్పటికే అవస్థలు పడుతున్న వినియోగదారులు తాజా నిబంధనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండుకు తగ్గట్టుగా సరకు లేకపోవడంతో ఇలా నిబంధనలు కఠినతరం చేసుకుంటూ పోతున్నారనే విమర్శ వినిపిస్తోంది. డిమాండు పెరిగిపోవడంతో రైతుబజార్లలో వివాదాలు పెరిగిపోతున్నాయి. గోపాలపట్నంలో ఉల్లి కోసం గోడవ రావడంతో మార్కెటింగ్ శాఖ కార్యాలయనికి వంద మంది వినియోగదారులు కార్యాయం వద్దకు వచ్చి ధర్నా చేశారు. అక్కయ్యపాలెంలోనూ తగవులు పడుతున్నారు. కంచరపాలెంలో లైన్లలో కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. నగర పరిధిలో రోజుకు 60 నుంచి 80 ఎంటీల వరకు డిమాండ్ ఉండగా రైతుబజార్ల ద్వారా కేవలం 25 నుంచి 30 ఎంటీల లోపే సరఫరావుతోంది. బహిరంగ మార్కెట్ లో రూ.70కు పైగా ఎగబాకడంతో సబ్సిడీఉల్లికి డిమాండ్ విపరీ తంగా పెరిగింది.రోజుకు రెండులారీల కర్నూల్ ఉల్లిని రప్పిస్తుండగా, డిమాండ్ బాగా పెరగడంతో రేపటి నుంచి నాలుగులారీలలోడు రప్పించేం దుకు ఏర్పాట్లు చేస్తు న్నట్టు మార్కె టింగ్ శాఖ ఏడీ ఎం.కాళేశ్వరరావు సాక్షికి తెలిపారు. -
పీడియాట్రీ కౌన్సెలింగ్
మా బాబు వయసు ఏడాదిన్నర. దగ్గు ఎక్కువగా వస్తుంటే డాక్టర్‌కి చూపించాం. ఛాతీలో నెమ్ము ఉందని చెప్పారు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశారు. ఈ నెమ్ము సమస్య ఎందుకు వస్తుంది? మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సంతోషి, కమలాపురం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను వైద్యపరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో అత్యంత ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి. డయేరియా తర్వాత పిల్లల్లో ప్రమాదకరంగా పరిణమించే వ్యాధుల్లో ఇది రెండోదని చెప్పవచ్చు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నిమోనియాకు అత్యంత ప్రధాన కారణాలు. కొన్ని సందర్భాల్లో కొన్ని శరీర నిర్మాణపరమైన లోపాల వల్ల, రోగనిరోధక శక్తి లోపాల వల్ల కూడా నిమోనియా కనిపించవచ్చు. ఒక ఏడాది వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్‌తో పిల్లలకు సరైన వైద్యచికిత్స అందించడం ఎంతైనా ముఖ్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే గుంపులు గుంపులుగా జనం ఉన్న చోట్లకు నిమోనియాతో బాధపడే పిల్లలను పంపకూడదు ఇంట్లో చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగులు ఉంటే వారి నుంచి కూడా ఈ పిల్లలను దూరంగా ఉంచాలి పిల్లలందరికీ టీకాలు వేయించడం ప్రధానం. హెచ్ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గోప్యత పాటిస్తున్న నటుడి కుటుంబసభ్యులు!
'ఆహుతి' చిత్రాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు పెదవి విప్పటం లేదు. కాగా ఆహుతి ప్రసాద్.. సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇంతకీ అనారోగ్యం ఏమిటనేది ...ఆహుతి ప్రసాద్ కుటుంబ సభ్యులు గోప్యత పాటిస్తున్నట్లు ఆయనతో సన్నిహితంగా ఉండే ఒకరు తెలిపారు. ' ఆహుతి ప్రసాద్‌కు ఫోన్ చేసినా... నాన్న బిజీగా ఉన్నారని ఆయన కుమారుడు సమాధానం ఇస్తున్నారని, అయితే అసలు విషయం తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లితే...ఆహుతి ప్రసాద్ బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని' ఆయన పేర్కొన్నారు. కాగా ఆహుతి ప్రసాద్ కేన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన రెండు నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్దన వరప్రసాద్. ఆయన సొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు. 1986లో 'విక్రమ్' సినిమా ద్వారా ఆహుతి ప్రసాద్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అనంతరం ఆయన నటించిన 'ఆహుతి' పెద్ద బ్రేక్ ఇచ్చింది. గులాబి, నిన్నే పెళ్లాడతా, చంద్రమామ, కొత్త బంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాల్లో ఆహుతి ప్రసాద్ చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'చందమామ' సినిమాకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు. -
‘ఫిట్’..ఫట్!
రోడ్డుపైకి 151 కండీషన్ లేని స్కూలు బస్సులు నిబంధనలు కాలరాస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు మేల్కొనని ఆర్టీఏ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు: ఆర్టీఓ విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ప్రైవేట్ పాఠశాలల ప్రచారపర్వం ముగిసి, పిల్లల మార్పుచేర్పు కూడా జరిగిపోయింది. కానీ చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లే బస్సు ఫిట్నెస్ మాత్రం పూర్తికాలేదు. కండీషన్‌లేని బస్సులు రోడ్డుపై తిరుగుతూనే ఉన్నాయి. ఒక్కో బస్సులో రెండింతల విద్యార్థులను కుక్కి స్కూళ్లకు తీసుకెళ్తున్నా.. పట్టించుకునేవారు లేరు. అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్‌స్కూళ్ల యాజమాన్యాల లాభార్జన.. వెరసి విద్యార్థుల భద్రత గాల్లోదీపంగా మారింది . సాక్షి, మహబూబ్‌నగర్/క్రైం: విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే స్కూలుబస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న 794 బస్సులకు గాను ఇప్పటి 643 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 151 బస్సులు కండిషన్ లేకుండానే రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో వందలాది మంది విద్యార్థులు సురక్షితం లేని ప్రయాణం మధ్య చదువుకుంటున్నారని తెలిసింది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తరువాత కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందుగానే వాహనాల తనిఖీ బాధ్యతను విస్మరిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే పిల్లలను తీసుకెళ్లే స్కూలు బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేసి ధ్రువీకరణపత్రాలు జారీచేయాలి. ఆ తర్వాత కూడా రవాణాశాఖ నిబంధనలకు అనుగుణంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ జిల్లా రవాణాశాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయలేదు. 40 కేసులు..లక్ష జరిమానా! జిల్లాలో ఐదువేలకు పైగా ప్రైవేట్‌స్కూళ్లు బస్సులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో ఒక్కోస్కూల్లో రెండు నుంచి ఐదుబస్సుల వరకు ఉన్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా 794 బస్సులు ఉన్నట్లు ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిలో చాలా కండీషన్‌లేని బస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఒక బస్సులో 42 మంది విద్యార్థులు, మినీ బస్సులో 24 మంది విద్యార్థులను కూర్చోబెట్టాలి. కానీ ఒక్కోబస్సులో 50 మంది చిన్నారులను కుక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటివరకు 40కేసులు నమోదుచేసి.. రూ.లక్ష వరకు జరిమానా విధించారు. సాధారణంగా ఒక స్కూలు బస్సు 15 ఏళ్ల లోపు మాత్రమే రోడ్డుపై తిరిగాలి. కానీ మారుమూల ప్రాంతాలైన కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నారాయణపేట, కొడంగల్ తదితర ప్రాంతాల్లో అక్కడక్కడ తిప్పుతున్నట్లు సమాచారం. ఇవీ నిబంధనలు నర్సరీ నుంచి పదో తరగతులను నిర్వహించే పాఠశాలల బస్సులు తప్పనిసరిగా కిటికీలకు ఇనుపగ్రిల్స్ను ఏర్పాటు చేయాలి. బస్సుబ్రేకుల కండీషన్లో ఉన్నాయో? లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న డ్రైవర్లనే స్కూలు బస్సులను నడిపేందుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు నియమించాలి.బస్సు డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించరాదు.బస్సు నడిపే వ్యక్తి డ్రైవింగ్ సామర్థ్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానాలు ఉంటే వారిని మార్చాలి.ఇందుకోసం బస్సు వెనకభాగంలో ఎడమవైపు పాఠశాల యాజమాన్యం ఫోన్ నంబర్‌ను రాయాలి.బస్సుల్లో చెక్కసీట్లకు బదులు కుషన్ ఉన్న సీట్లను అమర్చాలి.బస్సులో ప్రయాణించే విద్యార్థుల కదలికలు డ్రైవర్ గమనించేందుకు అనువుగా రియల్మిర్రర్ను ఏర్పాటు చేయాలి.బస్సుల్లో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను తీసుకుపోరాదు.అత్యవసర ద్వారం, ప్రథమచికిత్స పెట్టెలు బస్సులో అందుబాటులో ఉండాలి. ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే, వాటిని నివారించేందుకు అగ్నిమాపక యంత్రం నర్సరీ నుంచి ఐదోతరగతి వరకు విద్యార్థులను తరలించే బస్సుల్లో పిల్లలు సులువుగా కిందికి దిగేందుకు వీలుగా మరోమెట్టును కిందివైపునకు అమర్చాలి. ఫిట్నెస్ టెస్టులు త్వరలో పూర్తి స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా 150బస్సులను పరీక్షించాల్సి ఉంది. ఇప్పటికే అధికారులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించాం. అలాగే నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. రవాణా నిబంధనల అమలు కోసం త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం.. పిల్లల తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతగా స్కూల్బస్సులపై నిఘా ఉంచాలి. ఏమైనా అనుమానాలుంటే తక్షణం ఫిర్యాదు చేయొచ్చు. - ఎల్.కిష్టయ్య, ఆర్టీఓ, మహబూబ్‌నగర్ -
అద్దె వాహనాలపై అధికారుల భక్తి
టీటీడీలో భక్తుల సొమ్ము అద్దెల పాలు లక్షల్లో జేబులు నింపుకుంటున్న కాంట్రాక్టర్లు వారికి వంతపాడుతున్న ట్రాన్స్పోర్ట్ అధికారులు ‘టీటీడీ ఆన్ డ్యూటీ’ పేరుతో వైట్బోర్డ్లూ హల్చల్ తిరుపతి సిటీ: వేల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌తో కార్యకలాపాలు సాగించే టీటీడీలో అద్దెవాహనాల జోరు కొనసాగుతోంది. కొందరు టీటీడీ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడంతో అత్యంత శ్రీమంతుడైన గోవిందుని సేవలో అద్దె వాహనాల హవా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. వాహనాలను కొనే శక్తి ఉన్నా, టీటీడీలో అద్దె వాటినే కొనసాగిస్తుండడంతో ప్రతి నెలా లక్షలాది రూపాయలు కాంట్రాక్టర్ల పరమవుతున్నాయి. దీనికి వంతపాడుతున్న ట్రాన్స్పోర్ట్ విభాగంలోని అధికారులూ పెద్దస్థాయిలో లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఒకప్పుడు 5 నుంచి 10 వాహనాల (కార్లు, జీపు)ను మాత్రమే అద్దెకు పెట్టుకునే ట్రాన్స్పోర్ట్ విభాగం నేడు 100 వాహనాలకు పెంచడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంచి కండీషన్ ఉన్నా.. మంచి కండీషన్ కలిగిన వాహనాలను వీఐపీ సేవల పేరుతో నిరంతరం ఖాళీ గా ఉంచుతున్నారు. అదే సమయంలో అద్దె వాహనాలను తిప్పుతున్నారు. పోనీ అద్దె వాహనాల వలన టీటీడీకి ఆదా అవుతోందా? అంటే అదీ లేదు. తిరిగిందానికంటే ఎక్కువ కిలోమీటర్లు నమోదుచేసి టీటీడీ నుంచి డబ్బు లాగుతున్నారనే విమర్శలున్నాయి. అవసరం, అర్హత లేకున్నా అడిగిందే తడవుగా ప్రతి చిన్న అధికారికీ సంబంధిత ముఖ్య అధికారి అద్దె కారును గంటల్లో సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అద్దె వాహనాల సంఖ్య సుమారు 100కు చేరింది. టీటీడీ ఒక్కో అద్దె వాహనానికి(కారు) నెలకు రూ.25 వేల నుంచి రూ.28వేల వరకు చెల్లిస్తోంది. సంబంధిత కాంట్రాక్టర్లు కారు యజమానులకు నెలకు రూ.20 వేలు మాత్రమే చెల్లించి మిగిలిన సొమ్మును అధికారులతో కలసి వాటాలుగా పంచుకుంటున్నట్లు విమర్శలున్నాయి. చక్రం తిప్పుతున్న డీఐలు అద్దె వాహనాల నిర్వహణలో కాసులు దండుకోవడానికి కాంట్రాక్టర్లకు కొందరు డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ అక్రమ దందా సజావుగా సాగేందుకు వారిని ఏళ్ల తరబడి ఉన్న స్థానాలకే పరిమితం చేశారు. ఐదేళ్లుగా ముగ్గురు డీఐలను అలాట్మెంట్ విధుల్లో కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్య అధికారి బంధుగణానికి, మిత్రులకు సపర్యలు చేసేందుకు తిరుమలలో మరో డీఐని ఆరేళ్లుగా ఒకే స్థానంలో కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైట్ బోర్డులూ హల్చల్ టీటీడీ అద్దెకు పెట్టుకున్న వాహనాల్లో సగానికిపైగా వైట్ బోర్డులతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ‘టీటీడీ ఆన్ డ్యూటీ’ పేరుతో నడుస్తున్న ఈ వాహనాలను ఆర్టీఏ విభాగం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఈ వాహనాలు టీటీడీలో ఎక్కువ హల్చల్ చేస్తున్నాయి. జేబులు నిండితే చాలు ఏ బోర్డులైతే మనకేంటని ట్రాన్స్పోర్ట్ అధికారులే స్వయంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మాకు సంబంధం లేదు అద్దె వాహనాలనేవి టీటీడీ పాలసీ విధానంలో ఒక భాగం. ఇక అద్దె వాహన యజమానులతో మాకు సంబంధం లేదు. టెండర్ ద్వారా సరఫరా చేసేందుకు వచ్చే కాంట్రాక్టర్‌తోనే నడుస్తున్నాయి. ఒక్కో వాహనానికి నెలకు రూ.25 వేలు ఇస్తున్నాం. అది వారికి చేరుతుందో లేదో మాకు అనవసరం. వైట్‌బోర్డ్ వాహనాలనేవి తాత్కాలికం. రెండు, మూడు రోజులకు వాడుకునే సమయంలో అలాంటివి వస్తుంటాయి. -శేషారెడ్డి, ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ -
కంప్యూటర్‌పై పనిచేస్తుంటే కాసేపటి తర్వాత తప్పులెందుకు..?
నేను నిత్యం కంప్యూటర్ను ఉపయోగించి పనిచేస్తుంటాను. కానీ నేను గమనించిన అంశం ఏమిటంటే దాదాపు రెండు, మూడు గంటల తర్వాత అంతే ఏకాగ్రతతో పనిచేస్తున్నా కొన్ని తప్పులు వస్తున్నాయి. నాకు ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువే. అయినా నా విషయంలో కంప్యూటర్ ఉపయోగంలో తరచూ తప్పులెందుకు దొర్లుతున్నాయో అర్థంకావడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి మార్గాలు చెప్పండి. - సునీల్, బెంగళూరు మీలా చాలామంది గంటలతరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తుంటారు. ఇలా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఒకే పోశ్చర్‌లో కూర్చుంటే అది స్టాటిక్ లోడింగ్ అనే పరిస్థితికి దారితీస్తుంది. అంతెందుకు కేవలం అరగంటకే ఈ పరిస్థితి వస్తుంది. ఈ కండిషన్లో రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇలా కూర్చుండిపోయినప్పుడు వాళ్ల ఉచ్ఛాస్వ నిశ్వాస లు సైతం 30 శాతం మందగిస్తాయి. దాంతో ఆక్సిజన్ పాళ్లూ 30 శాతం తగ్గుతాయి కదా. అంటే... ఆ మేరకు శరీరానికి అవసరమైన ప్రాణవాయువు తగ్గడంతో కూర్చుని పనిచేస్తున్న కొద్దిసేపటికే అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే వ్యాయామం తగ్గడం వల్ల కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే దీర్ఘకాలంపాటు అదేపనిగా కంప్యూటర్‌పై పనిచేయాల్సిన వారు కొద్ది కొద్ది సేపటి తర్వాత ఒకసారి లేచి కాసేపు పక్కన తిరగాలి. అలాగే నేరుగా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్ వైపు రెప్పవాల్చకుండా చూడకూడదు. ప్రతి పది నిమిషాలకు ఒకమారు కళ్లకు కాస్త విశ్రాంతినిస్తూ ఉండాలి. ఇలా కంప్యూటర్‌పై కూర్చుని పనిచేసేవారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఈ సూచనలను అనుసరిస్తే చాలావరకు మీరు చేసే తప్పుల సంఖ్య తగ్గుతుంది. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్ & ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
జగన్ ఆరోగ్యం విషయంలో భగ్గుమన్న అభిమానులు,కార్యకర్తలు
-
వైద్యుల సూచన నిరాకరించిన విజయమ్మ