తెల్లకార్డుంటేనే.. అదీ ఒక్క కిలోనే | Co-per cent subsidy on the condition of the day | Sakshi

తెల్లకార్డుంటేనే.. అదీ ఒక్క కిలోనే

Published Tue, Aug 25 2015 1:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM

రైతుబజార్లలో ఉల్లిపాయలకు ప్రభుత్వం రోజుకో షరతు విధిస్తోంది. మొదట ఆధార్ కార్డు..

సబ్సిడీ ఉల్లికి రోజుకో షరతు
 
ఎంవీపీకాలనీ : రైతుబజార్లలో ఉల్లిపాయలకు ప్రభుత్వం రోజుకో షరతు విధిస్తోంది. మొదట ఆధార్ కార్డు.. తరువాత రేషన్‌కార్డు తీసుకొస్తేనే ఉల్లిపాయలు ఇస్తామని చెప్పిన అధికారులు మంగళవారం నుంచి తెల్లరేషన్ కార్డు తీసుకురావాలని ప్రకటించారు. అదీ కార్డుపై కిలో మాత్రమే. ఇప్పటికే అవస్థలు పడుతున్న వినియోగదారులు తాజా నిబంధనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండుకు తగ్గట్టుగా సరకు లేకపోవడంతో ఇలా నిబంధనలు కఠినతరం చేసుకుంటూ పోతున్నారనే విమర్శ వినిపిస్తోంది. డిమాండు పెరిగిపోవడంతో రైతుబజార్లలో వివాదాలు పెరిగిపోతున్నాయి.

గోపాలపట్నంలో ఉల్లి కోసం గోడవ రావడంతో మార్కెటింగ్ శాఖ కార్యాలయనికి వంద మంది వినియోగదారులు కార్యాయం వద్దకు వచ్చి ధర్నా చేశారు. అక్కయ్యపాలెంలోనూ తగవులు పడుతున్నారు. కంచరపాలెంలో లైన్లలో కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి.  నగర పరిధిలో రోజుకు 60 నుంచి 80 ఎంటీల వరకు డిమాండ్ ఉండగా రైతుబజార్ల ద్వారా కేవలం 25 నుంచి 30 ఎంటీల లోపే సరఫరావుతోంది. బహిరంగ మార్కెట్ లో రూ.70కు పైగా ఎగబాకడంతో సబ్సిడీఉల్లికి డిమాండ్ విపరీ తంగా పెరిగింది.రోజుకు రెండులారీల కర్నూల్ ఉల్లిని రప్పిస్తుండగా, డిమాండ్ బాగా పెరగడంతో రేపటి నుంచి నాలుగులారీలలోడు రప్పించేం దుకు ఏర్పాట్లు చేస్తు న్నట్టు మార్కె టింగ్ శాఖ ఏడీ ఎం.కాళేశ్వరరావు సాక్షికి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement