ఉల్లి.. తల్లడిల్లి | Cost price, or a loss of onion | Sakshi
Sakshi News home page

ఉల్లి.. తల్లడిల్లి

Published Mon, Dec 5 2016 10:48 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

Cost price, or a loss of onion

 = గిట్టుబాటు ధర లేక నష్టాల బాట 
 = రైతన్నను పట్టించుకోని ప్రభుత్వం 
 
 అనంతపురం అగ్రికల్చర్ : ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 14 వేల మందికి పైగా రైతులు 6,200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు. రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి డివిజన్లలో ఎక్కువగానూ.. మిగిలిన డివిజన్లలో అక్కడక్కడ ఈ పంట సాగు చేశారు. ఎకరా ఉల్లి పంటకు రూ.50 నుంచి రూ.60 వేలు పెట్టుబడి పెట్టారు. పంట బాగుంటే ఎకరాకు 10 టన్నులు (100 క్వింటాళ్లు) పండాలి. టన్ను కనీసం రూ.8 వేలు పలికితే ఎకరాకు రూ.15 నుంచి రూ.20 లాభం వస్తుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది.  
 
 వర్షాభావం..తెగుళ్ల ప్రభావం : 
 వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలుఅడుగంటిపోవడం వల్ల పంట కాలంలో రైతులు నానా అవస్థలు పడ్డారు. ఉన్న నీటి వనరులు సద్వినియోగం చేసుకున్నారు. కానీ. మజ్జిగ తెగులు, వెర్రి తెగులు ఆశించడంతో చాలా ప్రాంతాల్లో పురుగు మందుల పిచికారీకి ఎక్కువ ఖర్చు చేశారు. అలాగే కూలీల ఖర్చు అధికంగానే పెట్టినట్లు తెలిపారు. ఎకరాకు ఆరు టన్నులు (60 క్వింటాళ్లు) కూడా దిగుబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరేలే మంచి ధరలైనా పలికితే గట్టెక్కవచ్చని ఆశించిన రైతులకు పుండు మీద కారం చల్లినట్లు ధరలు పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. టన్ను రూ.4 నుంచి రూ.5 వేల మధ్య పలుకుతుండటం, దాన్ని కూడా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా చేతికి రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.   
 
 పట్టించుకోని సర్కారు 
 నాలుగైదేళ్లుగా ధర ఆశించిన స్థాయిలో ఉంటూ వచ్చింది. గతేడాది కూడా ధర బాగుంది. అరుుతే రెండు, మూడు నెలల నుంచి తగ్గుతూ వచ్చింది. పంటను రైతన్న విడిగా విక్రయించినా ప్యాకెట్ (40 కిలోలు) ధర ప్రస్తుతం రూ.200 నుంచి 250 వరకు పలుకుతోంది. రెండు నెలల క్రితం అదే ప్యాకెట్ ధర రూ.500 నుంచి రూ.600 వరకు పలికింది. గతేడాది అరుుతే ప్యాకెట్ ధర రూ.1000 వరకు పలికింది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర అరుుతే రూ.10 వరకు పలుకుతుండడంతో గిట్టుబాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా మంత్రులు, అధికార పార్టీ నేతలు కానీ, మార్కెటింగ్‌శాఖ, ఉద్యానశాఖ తరఫున కూడా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఉల్లి రైతు లబోదిబోమంటున్నాడు. ధరలు లేనప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తే కొంత వెసులుబాటు లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సారి ఉల్లి దిగుబడి ఆశించిన స్థాయిలో రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఉద్యానశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.   
 
 సాగు విస్తీర్ణం పెరిగింది 
 ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడి కూడా పెరిగింది. జిల్లాలో మామూలుగా 3 వేల హెక్టార్లలోపు ఉల్లి సాగయ్యేది. నాలుగైదేళ్లుగా ధరలు బాగానే ఉంటుండడంతో  ఈ ఏడాది సాగు విస్తీర్ణం రెట్టింపరుు్యంది. పొరుగు ఉన్న కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఇవి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలో  సాగు విస్తీర్ణం మరింతగా పెరిగింది. దిగుబడి కూడా బాగా రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.  జనవరి 15 తర్వాత కానీ ఫిబ్రవరి నెలలో ధరలు పెరిగే అవకాశం ఉంది.  
 - బీఎస్ సుబ్బరాయుడు, 
 ఉద్యానశాఖ డీడీ 
 
 ఈ రైతు పేరు వెంకటేశులు, ఉరవకొండ మండలం మైలారంపల్లి. ఒకటిన్నర ఎకరాలో ఉల్లి సాగు చేశాడు. భూమి దుక్కి దున్నడం కాడి నుంచి పంట కోత,  రవాణా చేసేంత వరకు రూ.1.10 లక్షలు ఖర్చు చేశాడు. 90 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. క్వింటా రూ.500 కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో తల్లడిల్లిపోతున్నాడు. లాభం పక్కనపెడితే పెట్టిన పెట్టుబడిలోనే రూ.లక్షకు పైగా నష్టం వస్తోంది. గిట్టుబాటు ధర లేదు. కొనేవారు కరువై రోజుల తరబడి ఉల్లి బస్తాలతో రైతుబజార్‌లో ఎదురుచూస్తున్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement