Adah Sharma Shares Her Health Condition With Fans, Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Adah Sharma Skin Allergy Pics: 'అమ్మకు మాటిచ్చా.. త్వరలోనే కలుస్తా'.. అదా శర్మ పోస్ట్ వైరల్!

Published Sat, Aug 5 2023 7:03 PM | Last Updated on Sat, Aug 5 2023 7:58 PM

Adah Sharma Shares Her Health Condition With Fans Goes Viral - Sakshi

అదా శర్మ బీ టౌన్‌తో పాటు తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో తెలుగులో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ.. ఇటీవల ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్‌తో ఇప్పుడు అదా శర్మ పేరు ఇండియా అంతా మార్మోగిపోయింది. అయితే ఇటీవలే ఆస్పత్రిలో చేరిన అదా శర్మ.. తన ఆరోగ్యానికి సంబంధించి ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం తన హెల్త్ కండీషన్‌ గురించి అభిమానులతో పంచుకుంది. 

(ఇది చదవండి: మనవరాలు ఇంటికి వచ్చిన శుభవేళ... ఉపాసన తల్లి ఏం చేసిందంటే? )

ఇన్‌స్టాలో అదా శర్మ రాస్తూ..' గత కొన్ని రోజులుగా నేను చర్మవ్యాధితో బాధపడుతున్నా. నా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. అందువల్ల ఫుల్‌గా ఉండే డ్రెస్సులు ధరించాను. కానీ ఇటీవల ఒత్తిడి వల్ల నా ముఖంపై కూడా దద్దుర్లు ఏర్పడ్డాయి. వీటి కోసం నేను కొన్ని మందులు వాడాను. కానీ మందువల్లే దద్దుర్లు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఇతర మెడిసిన్స్ వాడుతున్నా. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని అమ్మకు మాటిచ్చా. అయినప్పటికీ ఫుల్ స్లీవ్స్ ధరించిన ప్రమోషన్స్ చేస్తా. ఆ తర్వాత ఆరోగ్యం కోసం కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నా. త్వరలోనే ఆయుర్వేది చికిత్స తీసుకోబోతున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. కమాండో సిరీస్‌పై ఇన్‌స్టాలో అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటా.' అంటూ పోస్ట్ చేసింది. దయచేసి భయపడేవారు ఉంటే ఈ ఫోటోలు చూడొద్దని కోరుతున్నా.. ఎందుకంటే కొన్ని భయంకరమైన పిక్స్ ఇందులో ఉన్నాయి అంటూ సరదాగా అభిమానులకు సూచించింది. 

ప్రస్తుతం అదా శర్మ నటించిన కమాండో వెబ్ సిరీస్ ఈనెల 11న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్‌ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్న ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఇటీవలే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. కాగా.. అదా శర్మ తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీతో అదా శర్మకు మరింత ఫేమ్ దక్కింది. కేరళలో 32 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారనే నేపథ్యంలో సుదీప్తో సేన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  

(ఇది చదవండి: వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement