Skin Allergy
-
అందం, ఆరోగ్యం అందించేది ఇదే..!
బేబీ క్యారెట్లు గురించి తెలియని వారుండరు. ఇది తినేందుకు కూడా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా సాధారణ క్యారెట్స్ కంటే ఈ బేబీ క్యారెట్లు తింటే ఎన్నో లాభాలు పొందొగలమని అమెరికా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అందం, ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్ బేబీ క్యారెట్లని తేల్చి చెబుతున్నారు. అంత మేలు చేసే ఈ బేబీ క్యారెట్లను చిరుతిండిగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!శాకాహార ప్రియులకు బెస్ట్ స్నాక్ ఐటెంగా తీసుకునే కాయగూర బేబీ క్యారెట్లు. వీటిని స్నాక్ రూపంలో మరేదైన విధంగా తీసుకోవడం చాలా మంచిది. క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడుసార్లు తీసుకుంటే చర్మ కెరోటినాయిడ్లు గణనీయంగా పెరుగుతాయని పరిశోధనలో తేలింది. ఈ కెరోటినాయిడ్లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించగలవు. ఆక్సికరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెరుగైన చర్మం, రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగ్గా ఉంచుతాయి. అధిక స్థాయి కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ రక్షణతో సంబంధం కలిగి ఉన్నాయని, ఇవి గుండె జబ్బులు, కేన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి పరిశోధకులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే..చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ చెందిన శాస్త్రవేత్తలు సుమారు 60 మంది యువకులపై అధ్యయనం నిర్వహించగా..స్కిన్ కెరోటినాయిడ్ స్కోర్లు గణనీయంగా 10.8% పెరిగినట్లు గుర్తించారు. సుమారు వందగ్రాములు బేబిక్యారెట్లు తీసుకుంటేనే మంచి ఫలితాలను చూపించిందని అన్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా వివరించారు. అవేంటంటే..దృష్టి లోపాన్ని మెరుగుపరుస్తుంది: చూపుని రక్షించడంలో సహాయపడుతుంది. వయస్సు సంబంధిత సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. ఇది పిత్తస్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. వృద్ధ జపనీస్ జనాభాలో దంతాల నష్టం రేటుని అధ్యయనం చేయగా బీటా కెరోటిన్ ఎక్కువగా తీసుకున్న వారిలో దంత సమస్యలు తగ్గినట్లు గుర్తించారు. అయితే బేబి క్యారెట్లు సాధారణ క్యారెట్లు కంటే తక్కువ రోజులే నిల్వ ఉంటాయి. రిఫ్రిజిరేటర్లో అయితే సుమారు నాలుగు వారాల పాటు నిల్వ చేయవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్!..ఒక లీటర్‌కే..!) -
Beauty Tips: చర్మం మృదువుగా ఉండాలంటే.. ఇలా చేస్తే చాలు!
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ఇలా చేయండి.. పెసరతో మెరుపు మేనికి పెసరపిండి వాడితే చర్మకాంతి ఇనుమడిస్తుంది. పెసలలో ఉండే ప్రోటీన్లు చర్మ మృదుత్వాన్ని కాపాడతాయి. టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది. టీ స్పూన్ పెసరపిండిలో తగినంత పెరుగు కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా అవుతుంది. ఇవి చదవండి: గురక సమస్య అంతింత కాదయా! లైట్ తీసుకుంటే డేంజరే! -
Health: పెరిగే వయసుతో.. ఈ సమస్యలూ పెరుగుతాయని మీకు తెలుసా!
వయసు పెరుగుతున్నకొద్దీ వెంట్రుకలు తెల్లబడుతుంటే రంగు వేస్తాం. కానీ మార్పులకు లోనయ్యే చర్మాన్ని ఏం చేయగలం? ఎవరెంత రంగు వేసినప్పటికీ... చర్మం తీరును బట్టే ఎదుటివారి వయసును అంచనా వేస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికి కొన్ని రకాల వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు.. చర్మాన్ని పొడిబార్చే జీరోసిస్ మొదలుకొని చర్మం కింద రక్తం పేరుకున్నట్లు కనిపించే పర్‌ప్యూరా వరకు అనేక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అవేమిటో, వాటి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు / నిర్వహణ పద్ధతులూ, చికిత్సలను తెలుసుకుంటే.. పరుగులు తీసే వయసుకు స్పీడ్‌కు బ్రేకులు వేసి, యూత్‌ఫుల్‌గా కనిపించేందుకు తోడ్పడే కథనమిది. చర్మంలో ప్రధానంగా మూడు పొరలు ఉంటాయి. బయటిపొరను ఎపిడెర్మిస్, మధ్యపొరను డెర్మిస్, దాని కింద సబ్‌క్యుటేనియస్ పొర అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఎపిడర్మిస్ పొర పలుచబారడం మొదలవుతుంది. ఈ పొరలోనే ఉంటూ మేనికి రంగునిచ్చే మెలనోసైట్స్ ఉత్పత్తి తగ్గడం మొదలవుతుంది. అందుకే వృద్ధుల చర్మం పారదర్శకంగా ఉండి, లోపలి రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం పాలిపోయినట్లుగా అవుతుంది. ఇక డెర్మిస్ పొరలో చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్, ఎలాస్టిన్ అనే కణజాలాలు ఉంటాయి. వీటివల్లనే చర్మం బిగుతుగా ఉంటుంది. ఈ బిగువు తగ్గడం వల్లనే వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం సాగి, వదులవుతుంది. డర్మిస్లోని రక్తనాళాలూ బలహీనమవుతాయి. అందుకే వయసు పైబడినవారిలో చిన్న దెబ్బకైనా వెంటనే రక్తస్రావం అవుతుంది. ఇక సబ్‌క్యుటేనియస్ పొరలో కొవ్వు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొవ్వు తగ్గిపోవడం వల్ల చర్మం మునుపటిలా కాకుండా పలచబారిపోతుంది. ఈ పొరలోనే చెమట గ్రంథులు, నూనెలాంటి పదార్థాన్ని స్రవించే సెబేషియస్ గ్రంథులు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథుల పనితీరు తగ్గుతూ పోయి చర్మం పొడిబారినట్లుగా అవుతుంది. నునుపుదనాన్ని కోల్పోతుంది. వెరసి... ఈ సమస్యలన్నింటి వల్ల చర్మం పటుత్వాన్ని కోల్పోయి వేలాడుతున్నట్లుగా అవడంతోపాటు ముడతలు కూడా పడుతుంది. వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. జీరోసిస్ లేదా ఏస్టియోటిక్ డర్మటైటిస్ : దీన్నే వాడుకలో చర్మం పొడిబారిపోవడం అంటారు. ఈ సమస్య ముందుగా మోకాలి కింద భాగంలో ఉన్న చర్మంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత దుస్తులు కప్పని ఇతర భాగాల్లోనూ కనిపిస్తుంది. ఏజ్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ : చర్మానికి రంగును ఇచ్చే మెలనోసైట్స్ తగ్గడం వల్ల చర్మం పాలిపోయినట్లు అవుతుంది. ఆ తర్వాత నల్లటి మచ్చలు వస్తాయి. వాటిని ఏజ్ స్పాట్స్ లేదా లివర్స్పాట్స్ లేదా లెంటిజీన్స్ అంటారు. చర్మానికి బాగా ఎండ తగిలే ప్రదేశాలలో ఇవి ఎక్కువగా వస్తాయి. చెర్రీ యాంజియోమాస్ : ఈ సమస్య ఉన్నవారిలో కొద్దిపాటి రాపిడికే రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉండడంతో పాటు చర్మంపై నుంచి రక్తనాళాలు ఎరుపు రంగులో పైకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ‘చెర్రీ యాంజియోమాస్’ అంటారు. సెబోరిక్ కెరటోసిస్ : చర్మంపై ముఖ్యంగా చేతుల మీద, ముఖంపైన కందిగింజ సైజులో సెబోరిక్ కెరటోసిస్ అనే గోధుమరంగు మచ్చలు వస్తాయి. స్కిన్ ట్యాగ్స్ లేదా యాక్రోకార్డాన్స్: చర్మం వదులుగా.. ముడత పడినట్లుగా అయి... అదనపు చర్మంలా పొడుచుకు వచ్చి, పులిపిర్లలా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా మెడమీద, బాహుమూలాల వద్ద, తొడలపైన కనిపిస్తాయి. పర్‌ప్యూరా అండ్ హిమటోమాస్: చర్మం కింద ఉన్న రక్తనాళాలు పెళుసుబారి సులువుగా చిట్లుతాయి. దాంతో అక్కడ రక్తం చేరినట్లుగా కనిపిస్తుంది. దాన్ని సినైల్ పర్‌ప్యూరా అంటారు. ఒకవేళ రక్తం పేరుకుపోయి, చర్మం ఉబ్బుగా కనిపిస్తే దాన్ని హిమటోమా అంటారు. ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్: వయసు పైబడిన వారిలో చర్మానికి చాలా తేలికగా అలర్జీలు వస్తుంటాయి. పరిసరాల్లో ఉండే మొక్కల కారణంగా చర్మంపై అలర్జీలు వస్తే దాన్ని ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటారు. కెరటో అకాంథోమా: వయసు పైబడుతున్న వారిలో, ఎండలో ఎక్కువగా తిరిగే కొందరిలో కాయల్లా కనిపించే వాటిని నాన్ క్యాన్సరస్ స్కిన్ గ్రోత్స్గా చెబుతారు. అవి చాలా పెద్దగా, చుట్టూ ఎత్తుగా... మధ్యలో కొద్దిగా గుంటలా ఉంటాయి. జాగ్రత్తలు.. వయసు పైబడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలాకాలం పాటు చర్మాన్ని సంరక్షించుకోవడమే కాదు... యూత్‌ఫుల్‌గా కనిపించేలా కూడా చూసుకోవచ్చు. అందుకోసం చేయాల్సినవి.. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడాలి. బాగా గాఢంగా ఉండి, ఎక్కువ సువాసనలు వెదజల్లే సబ్బులు వాడకూడదు. బాత్ ఆయిల్స్‌ను దూరం పెట్టాలి. పొగ తాగడం మానేయాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు సస్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలి. సమతులాహారం, ద్రవపదార్థాలు తీసుకోవాలి. గోరు వెచ్చటి నీటితోనే స్నానం చేయాలి. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఆహారం: చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, పండ్లతోబాటు బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. చికిత్స: సమస్యను బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికీ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. వయసు మళ్లిన వారిలో బేసల్ సెల్ ఎపిథిలియోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా వంటి చర్మ క్యాన్సర్స్ కనిపించవచ్చు. మరికొన్ని తీవ్ర సమస్యలు.. ఇన్ఫెక్షన్లు: వయసు పైబడుతున్న వారి చర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్స్కు గురవుతుంది. బార్టీరియా వల్ల – ఫాలిక్యులైటిస్, సెల్యులైటిస్; ఫంగస్ వల్ల – క్యాండిడియాసిస్, డెర్మటోఫైట్ ఇన్ఫెక్షన్స్; వైరస్ వల్ల – జోస్టర్ వంటివి సోకుతాయి. సోరియాసిస్: పెరిగే వయసుతో సోరియాసిస్ అనే చర్మ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. మొదట పొడిగానూ ఆ తర్వాత వెండిరంగు పొట్టు రాలుతున్న లక్షణాలు కనిపిస్తాయి. న్యూరోడర్మటైటిస్: ఇందులో ప్రధానంగా పాదాల మీద నల్లటి మచ్చలా వచ్చి, చాలా దురదగా ఉంటుంది. — డా. ఎస్. సుష్మా సుకృతి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. ఇవి చదవండి: చిన్నారులు బరువు పెరుగుతున్నారా? అయితే జాగ్రత్త! -
Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..?
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ముఖ చర్మం మృదువుగా ముడతలు లేకుండా ఉండాలంటే చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకు బీట్రూట్ దుంప బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ను చెక్కు తీసి సన్నగా తురుముకుని రసం తీసుకోవాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ΄్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. అలాగే కొన్ని గులాబీ ఆకులను తీసుకుని వాటికి తగినన్ని నీటిని చేర్చి మెత్తగా రుబ్బుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖం తేమగా ఉంటుంది. ఇది ముఖానికి గులాబీ రంగుని ఇస్తుంది. ఇవి అందుబాటులో లేక΄ోయినా లేదా తగిన సమయం లేకున్నా, ముఖంపై రోజ్‌వాటర్‌ను చల్లుకున్నా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముఖంపై, బుగ్గల పైన తేనె రాసుకుని ఆరాక శుభ్రం చేసుకున్నా ముఖం స్మూత్‌గా.. మెరుస్తూ కనిపిస్తుంది. ఇవి చదవండి: క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి.. -
మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి!
'చిన్నపిల్లల చర్మం చాలా కోమలంగా ఉంటుంది. చలికాలంలో వారి చర్మం పొడిబారడంతో అనేక సమస్యలు వస్తాయి. మొదటే మృదువైన చర్మం. దానికి తోడు చలికాలంలో పొడిబారి పగలడం, చిట్లడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘అటోపిక్ డర్మటైటిస్’ అంటారు. ఈ సీజన్లో నెలల పిల్లలు మొదలు.. ఎదిగిన పిల్లల్లోనూ అనేక వయసు చిన్నారులో కనిపించే అటోపిక్ డర్మటైటిస్ సమస్యలు, వాటికి పరిష్కారాలను తెలిపే కథనమిది.' అటోపిక్ డర్మటైటిస్లో మొదట్లో చర్మం పొడిబారి, దురదతో ఎర్రగా మారుతుంది. పిల్లలు ఆ ప్రాంతంలో పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘లైకెనిఫికేషన్’ అంటారు. ఇది జరిగాక దురద ఇంకా పెరుగుతుంది. దాంతో మరీ ఎక్కువగా గీరడం, దేనికైనా రాస్తుండటంతో చర్మం మరింత మందమవుతుంది. ఈ ప్రక్రియలు ఒకదాని తర్వాత మరొకటి ఒక సైకిల్లా (ఇచ్ అండ్ స్క్రాచ్ సైకిల్) సాగుతుంటాయి. కొందరిలో ఇదొక దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా కూడా మారవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే.. చలికాలంలో చెమ్మ (తేమ) ఇగిరిపోతూ ఉండటంతో చర్మం పొడిబారడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఇలాంటప్పుడు చర్మం పొడిబారి, ఎర్రబారుతుంది. కుటుంబ ఆరోగ్య చరిత్రలో ఆస్తమా, డస్ట్ అలర్జీలు ఉండేవారిలో అటోపిక్ డర్మటైటిస్ సమస్య ఎక్కువ. వివిధ వయసుల పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఇలా.. రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు.. ఈ వయసు పిల్లల్లో చర్మం ఎర్రబారడం ప్రధానంగా ముఖంపైన, మెడ దగ్గర కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో దేహంలోని ఏ ప్రాంతంలోనైనా ఇలా జరిగే అవకాశముంది. ఉదాహరణకు పాకే పిల్లల్లో వాళ్ల మోకాళ్లు నేలకు ఒరుసుకుపోతుండటం వల్ల మోకాళ్ల దగ్గర ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్‌తో చర్మం ప్రభావితం కావడమన్నది చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో ఎక్కువ. అంటే.. మోచేతులు, మోకాళ్ల వెనక భాగం, మెడ పక్కభాగాలు, ముంజేయి, పిడికిలి, మడమ వంటి ప్రాంతాల్లో అన్నమాట. ఈ వయసు పిల్లల్లో చర్మం ముడుత వద్ద ఒక గీతలా (స్కిన్లైన్) ఉన్నచోట్ల దురద వచ్చి, అది పగులు బారుతున్నట్లవుతుంది. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో చర్మం పొడిబారడం కాస్త ఎక్కువ. పైగా ఈ పొడిబారడమన్నది మోకాళ్ల కింది భాగంలో ఎక్కువ. అందుకే ఈ వయసు పిల్లల కాళ్లు.. పొడి బారినప్పుడు బయట ఆడి వచ్చినట్లుగా తెల్లగా కనిపిస్తుంటాయి. ముఖం పెద్దగా పగలదు. కానీ... పెదవులు పొడిబారి, పగుళ్లలాగా వస్తుంది. పెదవుల చుట్టూ చర్మమంతా పగుళ్లుబారి ఓ సరిహద్దులా స్పష్టంగా కనిపిస్తూ, ఆ భాగం మంట పుడుతుంటుంది. దీన్ని ‘పెరీ–ఓరల్ డర్మటైటిస్’ అంటారు. ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో.. ఏడేళ్ల వయసు నుంచి (అంతకంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే) పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ఈ వయసునుంచి లక్షణాల తీవ్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. అయితే ఈ వయసు పిల్లల్లోనూ చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యలతో పాటు కొందరిలో సైనుసైటిస్ కూడా ఉండవచ్చు. చికిత్స / మేనేజ్మెంట్ తొలి దశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్): అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు తొలి దశల్లో చికిత్స చాలా తేలిక. చర్మంపై పొడిదనాన్ని తగ్గించడానికి వైట్ పెట్రోలియమ్ జెల్లీ, లిక్విడ్ పారఫీన్ ఆయిల్ వంటివి రాస్తే చేస్తే చాలు. పగుళ్లు, దురద, పొడిదనం తగ్గుతాయి. దాంతో గీరుకోవడం తగ్గుతుంది. రాత్రి నిద్రపడుతుంది. అలర్జీని ప్రేరేపించే అంశాలను నివారించడం: సబ్బులు, డిటర్జెంట్లు.. అలర్జీని ప్రేరేపిస్తున్నాయా అన్నది చూసుకోవాలి. అలా జరుగుతుంటే.. సబ్బులను, డిటర్జెంట్లను మార్చాలి. ఘాటైన సబ్బులకు బదులు మైల్డ్‌గా ఉండే క్లెన్సెర్స్ తో శుభ్రం చేసుకోవాలి. పిల్లల్ని పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. పిల్లల్లో అలర్జీ కలిగించే ఆహారాన్ని గుర్తించి (ముఖ్యంగా నట్స్, సీ ఫుడ్), ఒకవేళ ఆ ఆహారాలతో అలర్జీ వస్తుంటే వాటి నుంచి దూరంగా ఉంచాలి. పూత మందులతో చికిత్స: పిల్లలకు ఎమోలియెంట్స్ అని పిలిచే.. లిక్విడ్ పారఫీన్, గ్లిజరిన్, మినరల్ ఆయిల్ వంటివి పూయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్నానం చేయించిన వెంటనే ఎమోలియెంట్స్ పూయాలి. తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎమోలియెంట్స్ పూశాక వాటిపైన పూతమందుగా వాడే స్టెరాయిడ్స్ కూడా వాడవచ్చు. పైపూతగా వాడే స్టెరాయిడ్స్‌ను ఎక్కువ రోజులు వాడకుండా ఉండేందుకు టాపికల్ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్ క్రీమ్ వాడవచ్చు. డాక్టర్ల సలహా మేరకు పైపూత యాంటీబయాటిక్, స్టెరాయిడ్ కాంబినేషన్స్‌ను వాడవచ్చు. నోటిద్వారా తీసుకోవాల్సిన మందులు: నిద్రకు ముందు డాక్టర్ సలహా మేరకు నాన్ సెడెటివ్ యాంటీహిస్టమైన్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. రెండోదశ చికిత్స: మొదటిదశ చికిత్స (ఫస్ట్‌లైన్ ట్రీట్మెంట్)తో అంతగా ఫలితం లేనప్పుడు స్టెరాయిడ్ డోస్ పెంచడమూ, అప్పటికీ గుణం కనిపించకపోతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ చికిత్స: కొంతమంది పిల్లలకు అల్ట్రావయొలెట్ బి– కిరణాలతో చికిత్సతో మంచి ఫలితాలు వస్తాయి. మూడో దశ చికిత్స (థర్డ్ లైన్ ట్రీట్మెంట్): నోటిద్వారా కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం లాంటి ఈ థర్డ్ లైన్ ట్రీట్మెంట్ అంతా పూర్తిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే జరగాలి. వెట్ ర్యాప్ టెక్నిక్.. అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ‘వెట్ ర్యాప్ టెక్నిక్’తో మంచి ఫలితాలుంటాయి. చర్మమంతా పగుళ్లు ఉన్న పిల్లలకు మొదట ఎమోలియెంట్స్ పూయాలి. ఆ తర్వాత ఒంటిపైన బ్యాండేజ్‌ను ఒక పొరలా కట్టి, దాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. దానిపైన మరో పొరలా పొడి బ్యాండేజ్ వేయాలి. ఇలా వేసిన బ్యాండేజీని ప్రతి పన్నెండు గంటలకు ఒకమారు మార్చాలి. దీన్నే వెట్ ర్యాప్ టెక్నిక్ అంటారు. దీంతో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రతను తగ్గించవచ్చు. లక్షణాలు.. చర్మం పొడిబారి దురదలు వచ్చాక గుల్లలు, నీటిగుల్లలూ రావచ్చు. ఎర్ర బారినచోట చర్మం పొట్టు కట్టినట్లు అవుతుంది. మందంగానూ (లైకెనిఫికేషన్) మారుతుంది. కొన్నిసార్లు కాస్తంత పొట్టు రాలడంతోపాటు అక్కడ గాటు కూడా పడవచ్చు. మందంగా తెట్టుకట్టిన చర్మం పై పొర లేచిపోయినప్పుడు అక్కడ ద్రవం ఊరుతుండవచ్చు (ఊజింగ్). ఈ దశలోనూ చికిత్స అందకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ ఇవి చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..! -
చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటుకు అనుమతి
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఏసీ ఏర్పాటు చేయించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబుకి ఉన్న చర్మ సమస్యల కారణంగా.. ప్రభుత్వ వైద్యుల సూచనల్ని జైలు అధికారులు పాటించేలా ఆదేశించాలంటూ శనివారం రాత్రి హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు బాబు తరపు లాయర్లు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన కోర్టు.. రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహా బ్లాక్‌లో ఆయన ఉంటున్న ప్రత్యేక గదిలో ఏసీ ఏర్పాటు చేయించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడారు ఏసీబీ న్యాయమూర్తి. చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని వైద్యులు తెలపగా.. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే ఇతర ఆరోగ్య సమస్యలున్నాయా? అని జడ్జి అడిగారు. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే రకమైన ఆరోగ్య సమస్యలు చంద్రబాబుకి లేవని వైద్యులు, న్యాయమూర్తికి తెలిపారు. దీంతో.. చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు ఉంటున్న బ్యారక్‌లో ఏసీ ఏర్పాటు చేయించాలని, వైద్యుల సూచనల్ని తప్పకుండా అమలు చేయాలని అధికారుల్ని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలకు సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద ‘‘కోర్టు ఆదేశాల్ని తూ.చా. తప్పకుండా పాటిస్తామ’ని తెలిపారు. దీంతో ఈ రాత్రికే చంద్రబాబు కోసం ఏసీ(టవర్ ఏసీ) ఏర్పాటు చేయనున్నారు అధికారులు. చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలు, అసత్యాలు ప్రచారంలోకి రావడంతో.. జైళ్ల శాఖ స్పందించింది. ఆయన్ని పరీక్షించిన వైద్య బృందంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ అనుమానాల్ని నివృత్తి చేయించింది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని.. ఆయన యాక్టివ్గానే ఉన్నారని.. ఆస్పత్రి అవసరం లేదని తెలిపింది. రోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే స్కిన్ ఎలర్జీ కారణంగా కూల్ ఎన్విరాన్మెంట్ సిఫార్సు చేశామని వైద్యులు తెలిపారు. ఆ వెంటనే చంద్రబాబు తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అనారోగ్య లక్షణాలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని.. జైలులో ఏసీ ఏర్పాటు చేయించేలా జైలు అధికారుల్ని ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఏసీ ఏర్పాటు చేయకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. స్కిన్ ఎలర్జీ కారణంగా చల్లని ప్రదేశంలో చంద్రబాబు ఉంటే సరిపోతుందన్న ప్రభుత్వ డాక్టర్ల సూచనల్ని పిటిషన్లో ప్రస్తావించారు బాబు లాయర్లు. -
చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యకు జైల్లో చికిత్స
-
చంద్రబాబుకు స్కిన్ అలర్జీ
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తీవ్ర ఎండ, ఉక్కపోత కారణంగా అలర్జీతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రిలోని బోధనాస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ మహాలక్ష్మికి సమాచారం ఇచ్చారు. వైద్యులను పంపాలని లేఖలో కోరారు. వెంటనే స్పందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇద్దరు చర్మ సంబంధిత వ్యాధి నిపుణులను కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్.సునీతాదేవి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేపట్టారు. పరీక్షల అనంతరం వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించకుండా తిరిగి జీజీహెచ్‌కు వెళ్లిపోయారు. వైద్య పరీక్షల్లో వెల్లడైన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు సమాచారం. సెంట్రల్ జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు అలర్జీ ఉందని చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. అవసరమైన మందులు సూచించినట్టు వెల్లడించారు. వైద్యులు చెప్పిన మందులను చంద్రబాబుకు అందజేసినట్టు చెప్పారు. హెల్త్ బులెటిన్ విడుదల చంద్రబాబు చర్మ వ్యాధి బారినపడిన నేపథ్యంలో జైలు అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. బీపీ 140/80 ఎంఎంహెచ్‌జీ, టెంపరేచర్ నార్మల్‌గా ఉందన్నారు. పల్స్ రేట్ 87 (నిమిషానికి) ఉందని, ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
అదా శర్మ బీ టౌన్‌తో పాటు తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగులో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ.. ఇటీవల ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్‌తో ఇప్పుడు అదా శర్మ పేరు ఇండియా అంతా మార్మోగిపోయింది. అయితే ఇటీవలే ఆస్పత్రిలో చేరిన అదా శర్మ.. తన ఆరోగ్యానికి సంబంధించి ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం తన హెల్త్ కండీషన్ గురించి అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: మనవరాలు ఇంటికి వచ్చిన శుభవేళ... ఉపాసన తల్లి ఏం చేసిందంటే? ) ఇన్‌స్టాలో అదా శర్మ రాస్తూ..' గత కొన్ని రోజులుగా నేను చర్మవ్యాధితో బాధపడుతున్నా. నా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. అందువల్ల ఫుల్‌గా ఉండే డ్రెస్సులు ధరించాను. కానీ ఇటీవల ఒత్తిడి వల్ల నా ముఖంపై కూడా దద్దుర్లు ఏర్పడ్డాయి. వీటి కోసం నేను కొన్ని మందులు వాడాను. కానీ మందువల్లే దద్దుర్లు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఇతర మెడిసిన్స్ వాడుతున్నా. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని అమ్మకు మాటిచ్చా. అయినప్పటికీ ఫుల్ స్లీవ్స్ ధరించిన ప్రమోషన్స్ చేస్తా. ఆ తర్వాత ఆరోగ్యం కోసం కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నా. త్వరలోనే ఆయుర్వేది చికిత్స తీసుకోబోతున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. కమాండో సిరీస్‌పై ఇన్‌స్టాలో అప్డేట్స్ ఇస్తూనే ఉంటా.' అంటూ పోస్ట్ చేసింది. దయచేసి భయపడేవారు ఉంటే ఈ ఫోటోలు చూడొద్దని కోరుతున్నా.. ఎందుకంటే కొన్ని భయంకరమైన పిక్స్ ఇందులో ఉన్నాయి అంటూ సరదాగా అభిమానులకు సూచించింది. ప్రస్తుతం అదా శర్మ నటించిన కమాండో వెబ్ సిరీస్ ఈనెల 11న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్న ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఇటీవలే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. కాగా.. అదా శర్మ తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీతో అదా శర్మకు మరింత ఫేమ్ దక్కింది. కేరళలో 32 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
రూ. 17,500తో ఫేషియల్.. ఉన్న అందం పోయి, చర్మం కాలిపోయి..
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే వేలకు వేలు వెచ్చించి మరి అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. దానికోసం రకరకాల క్రీములు, లోషన్లు, ట్రీట్మెంట్ల పేరుతో డబ్బులన్నీ తగలేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు.. ఇలా సందర్భం ఏదైనా వెంటనే పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ముంబైకి చెందిన ఓ మహిళ అందంగా కనిపించాలని పార్లర్‌కు వెళితే మొదటికే మోసం జరిగింది. కాలిన గాయాలతో ఉన్న అందం కూడా పోయింది. వివరాల్లోకి వెళితే.. జూన్ 17న ముంబైలోని ఓ మహిళ అందం కోసం హైడ్రా ఫేషియల్ చేయించుకుంది. దీనికోసం అంధేరిలోని కామధేను షాపింగ్ సెంటర్లోని గ్లో లక్స్ సెలూన్‌కు వెళ్లి రూ. 17,500 విలువైన ఫేషియల్ ట్రీట్మెంట్ చేయించుకుంది. సెలూన్ సిబ్బంది ఆమె ముఖంపై కొన్ని క్రీములు రాయడం ప్రారంభించగానే ముఖంపై మంట మొదలైంది. ఇదే విషయాన్ని సెలూన్ వాళ్లతో చెప్పినా బ్లీచింగ్ వల్ల ఇలా జరుగుతుందని, ఇది చాలా సాధరణం అని చెప్పారు. ఒకటి-రెండు రోజుల్లో తగ్గిపోతుందని మిగతా ట్రీట్మెంట్ను పూర్తి చేశారు. అయితే అప్పటికే మంటగా ఉండటం, రెండు రోజులైనా తీవ్రత తగ్గకపోవడంతో డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించింది. హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ వల్ల ఆమె ముఖంపై పలు చేట్ల కాలిన గాయాలు అయ్యాయని,చర్మం పలు చోట్ల శాశ్వతంగా దెబ్బతిందని డెర్మటాలజిస్ట్ వివరించడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైంది. నాసీరకం ఉత్పత్తులు వాడటం వల్ల ఇలా జరిగిందని, పార్లర్ యజమానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలిసులకు ఫిర్యాదు చేసింది. -
ఉంగరం ఒంటికి ఆనే చోట చర్మం నల్లగా అవుతోందా?
ఉంగరం లేదా ఆభరణం వంటిది ధరించినప్పుడు... అది అనుకునే చోట కొందరిలో చర్మం రంగు మారుతుంది. ఒక్కోసారి అక్కడ నల్లబారుతుంది. ఇలా రంగు మారడానికి ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అనే సమస్య కారణం కావచ్చు. ఉంగరాన్ని «ధరించే మనం స్నానం చేయడంతో ముఖం కడుక్కునే సమయంలో సబ్బు వాడటం వల్ల... దాని తాలూకు డిటెర్జెంట్ ఉపయోగిస్తుంటే దాని మిగిలిపోయిన భాగం (రెసిడ్యూ) ఉంగరం / ఆభరణం వెనక ఉండిపోతుంది. అది చర్మంపై చూపే ప్రతిచర్యతో చర్మం నల్లబారడం లేదా అలర్జీలా రావడం జరగవచ్చు. అంతేకాదు... ఉంగరం లేదా ఆభరణాల్లో ఉండే ఇతర లోహాల (అల్లాయ్స్) వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు చేయాల్సిన పనులు.. ఉంగరాన్ని / ఆభరణాన్ని తీసి, శుభ్రపరచి మళ్లీ ధరించాలి. ఇలా తరచూ శుభ్రం చేసుకుని మళ్లీ తొడుగుతూ ఉండటం మేలు. చేతులు కడుక్కునే సమయంలో ఉంగరం వెనక ఎలాంటి సబ్బుగానీ లేదా రెసిడ్యూగానీ మిగలని విధంగా శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. లేదా ఉంగరం తీసి కడుక్కుని... వేళ్లు పొడిగా మారాక తొడుక్కోవాలి. ఇతర ఆభరణాల విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకోవచ్చు. ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, అలా కూడా మార్చి చూడవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా నలుపు తగ్గకపోతే... చర్మనిపుణులు సూచించిన మందుల్ని, వారు సూచించినంత కాలం వాడాలి. ఇలాంటి సందర్భాల్లో చర్మం నల్లగా మారిన చోట డాక్టర్ సలహా మేరకు హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాలు లేదా డాక్టర్ నిర్దేశించినంత కాలం వాడాల్సి రావచ్చు. -
గీరిన ముద్రలు మీ చర్మంపై ఉన్నాయా... అయితే ఇలా చేయండి!
మనిషి తన కళా ప్రదర్శనకు చివరికి సొంత చర్మాన్ని కూడా వదలలేదు. గోరింటాకు (మెహందీల)తో తాత్కాలికంగా, పచ్చబొట్ల(టాటూల)తో శాశ్వతంగా దాన్ని అలంకరించడం మానలేదు. మెహందీ లేదా టాటూ అయితే అది ప్రయత్నపూర్వయంగా చేసే పని. కానీ కొందరు ఎదుర్కొనే ఓ వింత సమస్య చర్మంపై చాలా చిత్రమైన ప్రభావం చూపుతుంది. ఏమాత్రం గీరినా లేదా చేయి బలంగా తగిలినా దేహంపైన ఉండే చర్మం పైకి ఉబికి ఎంబోజింగ్ చేసినట్లుగా మారుతుంది. ఇలాంటి వారి చర్మంపై ఏదైనా రాసినప్పుడు అది పైకి ఉబికి కనిపిస్తుండటం వల్ల ఈ సమస్యను ‘స్కిన్ రైటింగ్’ అని అంటారు. వైద్యపరిభాషలో దీన్ని ‘డర్మటోగ్రాఫియా’గా పిలుస్తారు. కారణాలు: ►మనకు ఏదైనా సరిపడనిది దేహంలోకి గానీ, లేదా చర్మంపైన చేరితే... మన వ్యాధినిరధకత (ఇమ్యూన్ సిస్టమ్ / సిగ్నల్స్) దాన్ని ఎదుర్కొనేందుకు హిస్టమైన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. (అందుకే మనకు ఏదైనా సరిపడక రియాక్షన్ వచ్చినప్పుడు దాన్ని తగ్గించేందుకు యాంటీహిస్టమైన్ మందులు వాడటం మనకు తెలిసిన విషయమే). ►ఒక్కోసారి మనపై ఉన్న తీవ్రమైన మానసిక/శారీరక ఒత్తిళ్ల (స్ట్రెస్/యాంగై్జటీల) వల్ల కూడా ‘డర్మటోగ్రాఫియా’ కనిపిస్తుంది. ∙కొన్ని సందర్భాల్లో సరిపడని మందుల వల్ల కూడా ఇది కనిపించవచ్చు. ►ఎక్కువసేపు మైక్రోఒవెన్ దగ్గర ఉండే కొంతమందిలో ఈ సమస్యను పరిశోధకులు గుర్తించారు. ముప్పు ఎవరిలో ఎక్కువ... ►యౌవనంలో ఉన్నవారిలో ∙పొడిచర్మం ఉన్నవారిలో ∙డర్మటైటిస్ లేదా థైరాయిడ్ వంటి మెడికల్ హిస్టరీ ఉన్నవారిలో నివారణ ►దురద పుట్టించే బిగుతు దుస్తులు లేదా బెడ్‌షీట్స్ వాడకూడదు. అలాగే అలర్జీలకు కారణమయ్యే కంబళ్లు, ఊల్‌తో/ సింథటిక్ పద్థలుల్లో తయారయ్యే దుస్తులు, చర్మానికి అలర్జీ కలిగించేవి వాడకూడదు. ►అలర్జీ కలిగించే ఘాటైన వాసన సబ్బులు (సోప్స్ విత్ ఫ్రాగ్నెన్స్) వాడకూడదు. ►గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. (ఒక్కోసారి బాగా వేడిగా ఉండే నీళ్లు కూడా డర్మటోగ్రాఫియాను కలిగించవచ్చు.) ►చర్మంపై రోజూ మాయిష్చరైజింగ్ క్రీమ్ వాడుకోవడం మంచిది. ►ఇలాంటి సమస్య ఉన్నవారి చర్మంపై గీరడం, గీయడం చేయకూడదు. ►ఒత్తిడికి (స్ట్రెస్ / యాంగై్జటీలకు) దూరంగా ఉండాలి. చికిత్స ఇది చాలావరకు నిరపాయకరమైనదీ, హానికలిగించని సమస్య కావడంతో దీన్ని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అలర్జీలను ఎదుర్కొనే మందులైన కొన్ని డైఫిన్హైడ్రమైన్, యాంటీహిస్టమైన్ వంటి వాటితో చికిత్స అందిస్తారు. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు ఫొటోథెరపీనీ సిఫార్సు చేయవచ్చు. ఇక సంప్రదాయ చికిత్సలుగా టీట్రీ ఆయిల్, అలోవీరా వంటి వాటిని పూయడం వల్ల కూడా కొంతమేర ప్రయోజనం, ఉపశమనం ఉంటాయి. చదవండి: Prostate Gland: ఈ గ్రంథి లేనట్లయితే సంతానమే లేదు.. బాదంకాయంత సైజు నుంచి అమాంతం ఎందుకు పెరుగుతుంది? -
‘పీపీఈ’లు ధరిస్తే చర్మ వ్యాధులు..
కంటికి కనిపించని ప్రాణాంతక కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని తమను తాము కాపాడుకుంటూ బాధిత రోగులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యులు,సిబ్బంది ధరిస్తున్న పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) దుస్తులు అత్యంత కీలకం.పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతతోపాటు గంటల తరబడి పీపీఈలు ధరించినపలువురు వైద్యులు, సిబ్బంది పలు రకాల రుగ్మతలకు గురవుతున్నారు. గాంధీఆస్పత్రి: పీపీఈలు ధరించకుంటే కరోనా వైరస్ తమను కాటేస్తుందోననిభయాందోళన వ్యక్తం చేస్తూనే తప్పనిసరి పరిస్థితుల్లో రక్షణ దుస్తులు ధరిస్తున్నారు. డీహైడ్రేషన్, దురద, చెమట పొక్కులు, బబుల్స్ వంటి చర్మవ్యాధులతోపాటు మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. మరికొంత మందిలో తలపై జుట్టు ఊడిపోతోంది.కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సుమారు రెండు వేల మంది వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్, శానిటేషన్, అంబులెన్స్ సిబ్బంది, లిఫ్ట్ ఆపరేటర్, పేషెంట్ కేర్ టేకర్‌తోపాటు పోలీస్ సిబ్బంది కరోనా విధులు నిర్వహిస్తున్నారు.వీరంతా తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాల్సిందే. వీరిలో పల్మనాలజీ, జనరల్‌మెడిసిన్ వంటి ఫ్రంట్ లైన్ వైద్యులు, జూనియర్ డాక్టర్లు, ఇంటర్నీస్, హౌస్ సర్జన్లతోపాటు నర్సింగ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి 8 నుంచి 12 గంటల పాటు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారు. పీపీఈ కిట్లలో తల నుంచి కాళ్ల వరకు శరీరమంతటినీ పూర్తిస్థాయిలో కప్పి ఉంచే ఏడు రకాల రక్షణ దుస్తులుంటాయి. ఇవీ సమస్యలు.. పరిష్కారాలు.. ఉక్కపోతకు తోడు గంటల తరబడి శరీరమంతటినీ కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించడంతో మూడు రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు వైద్యనిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా డీహైడ్రేషన్‌తోపాటు చర్మ సమస్యలు, మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని వివరించారు. డీహైడ్రేషన్ సమస్య పరిష్కరించేందుకు ఎక్కువగా నీరు తాగాలని సూచించారు. ఓఆర్ఎస్ ద్రావణంతోపాటు కొబ్బరి నీళ్లు తగిన మోతాదులో తీసుకోవాలని వివరించారు. సున్నితమైన శరీరతత్వం(సెన్సిటివ్) ఉన్నవారు తప్పనిసరిగా మాయిశ్చరైజర్లు వాడాలని, చర్మం పొడిబారడం, దురద, శరీరంపై నీటిపొక్కులు కనిపిస్తే సంబంధిత చర్మవ్యాధి వైద్యుల సలహా, సూచనల మేరకు వైద్యసేవలు పొందాలన్నారు. డ్యూటీకి వచ్చే ముందే మానసికంగా సన్నద్ధం కావాలని, బలవర్థకమైన ఆహారం తీసుకోవాలని, ఎక్కువ నీళ్లు తాగాలని వైద్యనిపుణులు సూచించారు. మానసిక, శారీరక రుగ్మతలు దూరం కావాలంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరమని, వ్యాయామం లేదా యోగా వంటివి నిత్యం సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పోషక పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి పీపీఈ కిట్లు ధరించి వైద్యసేవలు అందించేవారు అనేక రకాల రుగ్మతలు, సమస్యల బారిన పడుతున్నారు. వీరు పోషక పదార్థాలు ఉన్న ఆహారం, ఎక్కువ నీళ్లతోపాటు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారంతా పీపీఈ కిట్లు ధరించే ముందు మాయిశ్చరైజర్లు శరీరానికి రాసుకోవాలి. శరీరం తాజాగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. చర్మవ్యాధులకు గురైతే తక్షణమే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. – కటకం భూమేష్‌కుమార్, చర్మవ్యాధి నిపుణుడు ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచాం ఉక్కపోతకు తోడు శరీరాన్ని కప్పిఉంచే పీపీఈ కిట్లతో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనట్లు గుర్తించాం. వైద్యులు, సిబ్బంది కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్ మంచినీళ్లు అందుబాటులో ఉంచాం. స్వీయరక్షణ కోసం తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించే వైద్యసేవలు అందించాలి. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది, రక్షణ దుస్తులు ధరించకుంటే ప్రాణాలకే ప్రమాదం. డీహైడ్రేషన్, కాళ్లు గుంజడం, దురద, నీటిపొక్కులు వంటి చర్మవ్యాధులకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని, పనిగంటలు తగ్గించేందుకు ప్రయోగాత్మకంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ -
ఇంట్లో పత్తి.. ఒంట్లో అలర్జీ
సాక్షి, హైదరాబాద్: రైతు కుటుంబాలను పత్తి వేధిస్తోంది. నిల్వ చేసిన పత్తి రోగాలకు కారణమవుతోంది. ఇళ్లలో నిల్వ చేసిన పత్తి చర్మ సమస్యలకు కారణమవుతోంది. పత్తి సాగు చేసే ప్రతి ఊరిలోనూ ఇప్పుడు ఈ సమస్య తీవ్రంగా ఉంది. నిల్వ పత్తిలో ఉండే సూక్ష్మక్రిములు గ్రామస్తులను అనారోగ్యంపాలు చేస్తున్నాయి. ఎండ తీవ్రత పెరిగి పొడిగాలి ఉండటంతో అలర్జీ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యుల దగ్గర పత్తి బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. అలర్జీ కారణంగా పిల్లలు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది పత్తి రైతులు ఉన్నారు. ప్రతి ఏటా సగటున 47 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. ఎక్కువమంది రైతులు పత్తి నిల్వవిషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలేదు. గతంలో పత్తిని బస్తాల్లో నింపి నిల్వ చేసేవారు. ప్రత్యేక గదుల్లో పెట్టేవారు. ఇప్పుడు ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ నిల్వ చేస్తున్నారు. నిల్వచేసిన పత్తిలో ఉండే సూక్ష్మ క్రిములు బయటికి రాకుండా చర్యలు తీసుకోవడంలేదు. దీంతో సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపించి మనుషులను తాకుతున్నాయి. ఫలితంగా చర్మరోగాలు పెరుగుతున్నాయి. పత్తిలోని సూక్ష్మక్రిముల వల్ల అలర్జీ వస్తుందనే అవగాహన లేకపోవడంతో కొందరు వైద్యుల దగ్గరికి వెళ్లడంలేదు. మందులు వాడడంలేదు. చర్మవ్యాధులు తీవ్రమైతే ఆస్తమాకు దారి తీస్తుంది. పిల్లలలో శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. అనారోగ్య కారకం... పత్తి పురుగులతో అలర్జీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితులు రోజూ పదుల సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నారు. పత్తిలో అలర్జీ కారక ఆనవాళ్లు ఉన్నాయి. పత్తిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వల్ల అందులోని సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపిస్తున్నాయి. సూక్ష్మక్రిములతో చర్మం ఎర్రబారడం, దురద, మంట వంటివి వస్తాయి. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దురద వచ్చిన వెంటనే మందులు వాడాలి. లేకుంటే ఇతరులకు వ్యాపిస్తుంది. – డాక్టర్ రాంచందర్ ధరక్, చర్మవ్యాధి నిపుణులు,కాకతీయ వైద్య కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ -
ఫేషియల్ క్రీమ్స్‌పై దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్!
సాక్షి, ముంబై: ప్రముఖ బ్రాండ్స్‌కు సంబంధించిన ఫేషియల్ క్రీమ్స్‌పై షాకింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. పాపులర్ బ్రాండ్ ఫేషియల్ క్రీమ్స్ వల్ల క్యాన్సర్ వ్యాధికి గురికావడంతోపాటు ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఉంటుందని తాజా అధ్యయనం తేల్చింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIEST) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు తేలాయి. ఇలాంటి ఫేషియల్ క్రీముల వల్ల త్వరిత ఫలితాలు వచ్చినప్పటికీ, దీర్ఘకాలికంగా ప్రమాదకరమైనవని ఈ స్టడీ హెచ్చరించింది. ఈ క్రీమ్స్‌లో నానోసిస్డ్ కణాలతో చురుకైన సూక్ష్మ కార్బన్‌ను కనుగొన్నామని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్ల యాడ్స్ లో చెప్పినట్టుగా యాక్టివేటెడ్ కార్బన్ చర్మానికి తీవ్రమైన హాని కలిగింస్తుందనీ, మరణం కూడా సంభవించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. చాలా ఫేస్ క్రీముల్లో క్యాన్సర్ కారక అంశాలు ఉన్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కెమిస్ట్రీ ప్రొఫసర్ సవ్యసాచి సర్కార్ తెలిపారు. చర్మానికి హాని కలిగించే రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు (ROS) ఉత్పత్తి చేసేందుకు గాలిలో ఆక్సిజన్ ద్వారా ఆర్జీవో లు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల సాధారణంగా వచ్చే దురద, ఎలర్జీ, డ్రై స్కిన్, పింపుల్స్, ఫోటో సెన్సిటివిటీ లాంటి సైడ్ఎఫెక్ట్స్ తోపాటు ఆర్జీవో తగినంత పరిమాణంలో ఉంటే మరింత ప్రమాదమని తెలిపింది. ఆర్జీవో విషపూరిత ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు, శాస్త్రవేత్తలు మానవ చర్మపు కణాలను 200-వాట్ల వెలుతురులో 12 గంటలపాటు పరిశోధించారు. ఈ ఫేస్ క్రీములలో క్రియాశీల సూక్ష్మ కార్బన్, హై సైటోటాక్సిక్ ప్రభావాన్ని కలిగి ఉన్న ఆర్జీవో గ్రాఫేన్ పదార్థాలను ఉంటాయని, ఆర్జీవో ప్రత్యేక కణాలపై "సైటోటాక్సిక్" ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. సూక్ష్మ కార్బన్లో ఉండే ఆర్జీవో నిద్రాణంగా ఉంటుంది, కానీ సాధారణ కాంతిలో, గాలిలో ఆక్సిజెన్ ద్వారా విషపూరితమైన సూపర్ ఆక్సైడ్ ఆనియన్గా మారుతుంది. ఇది కాన్సర్ కారకమని, జీవ కణాలు, సాధారణ ముఖ కణాలను తక్షణమే మార్పు చేసినా దీర్ఘకాంలలో వాటిని తీవ్రంగా నష్టపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఆర్జీవో లాంటి నాన్కార్బన్ ను వాడొద్దని ఫేస్ క్రీమ్ తయారీదారులకు సూచించారు. "అప్లైడ్ నానోసైన్స్" జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఈ అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వ విభాగం సైన్స్ అండ్ టెక్నాలజీకి నిధులు సమకూర్చింది. -
ఈ చప్పట్లు థియేటర్లలోనూ వినిపిస్తాయి
చెన్నై చిన్నది సమంత అదృష్టవంతురాలనే చెప్పాలి. తొలి రోజుల్లో తమిళ చిత్ర పరిశ్రమలో కాస్త తడబడ్డా ఆ తరువాత నిలదొక్కుకుని ప్రస్తుతం క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. బానాకాత్తాడి చిత్రంలో రంగప్రవేశం చేసిన సమంత ఆ చిత్రం నటిగా ఆమెను ఆదుకోకపోవడంతో టాలీవుడ్‌పై దృష్టి సారించారు. ఆ అవకాశాన్ని దర్శకుడు గౌతమ్మీనన్నే కల్పించారు. తెలుగులో తొలి చిత్రం ఏ మాయ చేశావేతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత వరుస విజయాలతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్ అయ్యారు. అలాంటి సమయంలో కోలీవుడ్‌లో స్టార్ దర్శకుడు శంకర్ ఐ చిత్రం, ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కడల్ చిత్రాల బంపర్ ఆఫర్లలను స్కిన్ అలర్జీ కారణంగా వదులు కోవలసిన పరిస్థితికి గురయ్యారు. ఆ తరుణం కాస్త చింతను కలిగించినా... తమిళంలో సాధించే తీరుతాను అనే ఆత్మ విశ్వాసంతో కృషి చేశారు. తన ప్రయత్నం వమ్ము కాలేదు. సూర్యతో అంజాన్, విజయ్ సరసన కత్తి వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకున్నారు. అంజాన్ నిరాశపరచినా కత్తి చిత్రం విజయాన్ని అందించింది. ప్రస్తుతం సమంత ఇక్కడ టాప్ హీరోయిన్. విజయ్, ధనుష్, వంటి స్టార్ హీరోలతో నటిస్తున్నారు. మొదట్లో గ్లామర్‌ను నమ్ముకున్న సమంత ఇప్పుడు నటనా ప్రతిభను చాటుకోవడం పైనే మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. ఇంతకు ముందు 10 ఎండ్రత్తుక్కుళ్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒక పాత్రలో విలనీయం ప్రదర్శించి విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నటుడు ధనుష్ సరసన తంగమగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ధనుష్ భార్యగా చాలా సహజత్వంతో కూడిన నటనను ప్రదర్శించి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న దర్శకుడు కేఎస్.రవికుమార్, రాధికలతో ప్రశంసా చప్పట్లను కొట్టించుకున్నారట. ఈ విషయాన్ని సమంత చెబుతూ ఇవే చప్పట్టు రేపు చిత్రం విడుదలైన తరువాత థియేటర్లలో వినిపిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమంత ఈ చిత్రంతో పాటు విజయ్‌కు జంటగా తేరి చిత్రంలో నటిస్తున్నారు.