ఫేషియల్‌ క్రీమ్స్‌పై దిమ్మతిరిగే షాకింగ్‌ న్యూస్‌! | Some popular brands of facial creams that are advertised as containing "activated carbon" for better results can be harmful to the skin and even cause death, scientists say | Sakshi
Sakshi News home page

ఫేషియల్‌ క్రీమ్స్‌ వల్ల క్యాన్సర్‌ రావొచ్చు..

Published Tue, Sep 26 2017 2:54 PM | Last Updated on Tue, Sep 26 2017 6:34 PM

Some popular brands of facial creams that are advertised as containing "activated carbon" for better results can be harmful to the skin and even cause death, scientists say

సాక్షి, ముంబై: ప్రముఖ బ్రాండ్స్‌కు సంబంధించిన ఫేషియల్‌ క్రీమ్స్‌పై షాకింగ్‌ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది.  పాపులర్‌ బ్రాండ్‌ ఫేషియల్‌ క్రీమ్స్‌ వల్ల క్యాన్సర్‌ వ్యాధికి గురికావడంతోపాటు ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఉంటుందని తాజా అధ్యయనం  తేల్చింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIEST) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు  తేలాయి.  ఇలాంటి ఫేషియల్‌ క్రీముల వల్ల త్వరిత ఫలితాలు వచ్చినప్పటికీ, దీర్ఘకాలికంగా ప్రమాదకరమైనవని ఈ స్టడీ హెచ్చరించింది. ఈ క్రీమ్స్‌లో నానోసిస్డ్ కణాలతో చురుకైన సూక్ష్మ కార్బన్‌ను కనుగొన్నామని అధ్యయనం తెలిపింది.

ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్ల యాడ్స్‌ లో  చెప్పినట్టుగా యాక్టివేటెడ్‌ కార్బన్‌ చర్మానికి తీవ్రమైన హాని కలిగింస్తుందనీ,  మరణం కూడా సంభవించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. చాలా ఫేస్‌ క్రీముల్లో క్యాన్సర్‌ కారక  అంశాలు ఉన్నాయని  ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కెమిస్ట్రీ  ప్రొఫసర్‌ సవ్యసాచి సర్కార్‌ తెలిపారు.  చర్మానికి హాని కలిగించే రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు (ROS) ఉత్పత్తి చేసేందుకు గాలిలో ఆక్సిజన్ ద్వారా ఆర్‌జీవో లు యాక్టివేట్  అవుతాయి. దీనివల్ల సాధారణంగా వచ్చే దురద, ఎలర్జీ,  డ్రై స్కిన్‌, పింపుల్స్‌, ఫోటో  సెన్సిటివిటీ లాంటి  సైడ్‌ఎఫెక్ట్స్‌ తోపాటు  ఆర్‌జీవో తగినంత పరిమాణంలో ఉంటే మరింత ప్రమాదమని  తెలిపింది.

ఆర్‌జీవో విషపూరిత ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు, శాస్త్రవేత్తలు మానవ చర్మపు కణాలను 200-వాట్ల వెలుతురులో 12 గంటలపాటు పరిశోధించారు. ఈ ఫేస్‌ క్రీములలో క్రియాశీల సూక్ష్మ కార్బన్, హై సైటోటాక్సిక్ ప్రభావాన్ని కలిగి ఉన్న ఆర్‌జీవో  గ్రాఫేన్ పదార్థాలను ఉంటాయని,  ఆర్‌జీవో ప్రత్యేక కణాలపై "సైటోటాక్సిక్" ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. సూక్ష్మ కార్బన్లో ఉండే ఆర్‌జీవో నిద్రాణంగా ఉంటుంది, కానీ సాధారణ కాంతిలో,  గాలిలో ఆక్సిజెన్ ద్వారా విషపూరితమైన సూపర్ ఆక్సైడ్ ఆనియన్‌గా మారుతుంది. ఇది కాన్సర్‌ కారకమని,  జీవ కణాలు,  సాధారణ ముఖ కణాలను తక్షణమే మార్పు చేసినా  దీర్ఘకాంలలో వాటిని తీవ్రంగా నష్టపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఆర్‌జీవో లాంటి నాన్‌కార్బన్‌ ను వాడొద్దని ఫేస్‌ క్రీమ్‌ తయారీదారులకు సూచించారు.  "అప్లైడ్ నానోసైన్స్" జర్నల్ లో ఈ  అధ్యయనం ప్రచురితమైంది. ఈ అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వ విభాగం  సైన్స్ అండ్‌  టెక్నాలజీకి నిధులు సమకూర్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement