
హరారే: నమీబియా అధ్యక్షుడు హగె గాట్‌ప్రీడ్ గీన్‌గోబ్(82) మృతి చెందారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న గీన్‌గోబ్ హరారేలోని లేడీ పొహంబా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారని అధ్యక్షభవనం తెలిపింది. ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడినట్లు 2014లో గీన్‌గోబ్ స్వయంగా ప్రకటించారు.
అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. 2015 నుంచి దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న గీన్‌గోబ్ పదవీ కాలం ఈ ఏడాదితో పూర్తి కావాల్సి ఉంది. వలస పాలన నుంచి బయటపడ్డాక నమీబియా మొదటి ప్రధానిగా 1990–2002 మధ్య తిరిగి 2008–12 సంవత్సరాల మధ్య గీన్‌గోబ్ బాధ్యతలు నిర్వహించారు.
ఇదీ చదవండి: చిలీలో కార్చిచ్చు ఎఫెక్ట్.. 46 మంది మృతి, వేలాది మందికి..
Comments
Please login to add a commentAdd a comment