బ్యూటీ టిప్స్
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర‍్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం.
ముఖ చర్మం మృదువుగా ముడతలు లేకుండా ఉండాలంటే చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకు బీట్‌రూట్ దుంప బాగా ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌ను చెక్కు తీసి సన్నగా తురుముకుని రసం తీసుకోవాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ΄్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి.
అలాగే కొన్ని గులాబీ ఆకులను తీసుకుని వాటికి తగినన్ని నీటిని చేర్చి మెత్తగా రుబ్బుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖం తేమగా ఉంటుంది. ఇది ముఖానికి గులాబీ రంగుని ఇస్తుంది. ఇవి అందుబాటులో లేక΄ోయినా లేదా తగిన సమయం లేకున్నా, ముఖంపై రోజ్‌వాటర్‌ను చల్లుకున్నా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముఖంపై, బుగ్గల పైన తేనె రాసుకుని ఆరాక శుభ్రం చేసుకున్నా ముఖం స్మూత్‌గా.. మెరుస్తూ కనిపిస్తుంది.
ఇవి చదవండి: క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి..
Comments
Please login to add a commentAdd a comment