Beauti Tips
-
Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..?
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ముఖ చర్మం మృదువుగా ముడతలు లేకుండా ఉండాలంటే చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకు బీట్రూట్ దుంప బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ను చెక్కు తీసి సన్నగా తురుముకుని రసం తీసుకోవాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ΄్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. అలాగే కొన్ని గులాబీ ఆకులను తీసుకుని వాటికి తగినన్ని నీటిని చేర్చి మెత్తగా రుబ్బుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖం తేమగా ఉంటుంది. ఇది ముఖానికి గులాబీ రంగుని ఇస్తుంది. ఇవి అందుబాటులో లేక΄ోయినా లేదా తగిన సమయం లేకున్నా, ముఖంపై రోజ్‌వాటర్‌ను చల్లుకున్నా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముఖంపై, బుగ్గల పైన తేనె రాసుకుని ఆరాక శుభ్రం చేసుకున్నా ముఖం స్మూత్‌గా.. మెరుస్తూ కనిపిస్తుంది. ఇవి చదవండి: క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి.. -
valentines day: అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా?
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రేమికుల సందడి మొదలవుతుంది. ఎక్కడ చూసినా ‘వాలంటైన్స్ డే ’ఫీవరే. వాలెంటైన్ వీక్ అంటూ ప్రేమికులు వారం రోజులపాటు సంబరాలు చేసుకుంటారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవంతో ఈ సంబరాలు పీక్ అన్నట్టు. మరీ మీ ఫేస్ అందంగా, ఫుల్ వాలెంటైన్ గ్లోతో అచ్చమైన చందమామలా మెరిసిపోవాలిగా? అందుకే... ఈ చిట్కాలు మీ కోసమే...! ♦అరకప్పు కీరాదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. ఇది ముడతలు, సన్నని గీతలు వంటి సమస్యలు దూరం అవుతాయి. ♦ ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి ముఖ చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. ♦ పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కల΄ాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని బాగా ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్ క్లెన్సర్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్‌హెడ్స్ సులభంగా తొలగిపోతాయి. ♦ రెండు టీస్పూన్ల వేప పొడి, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోండి. వీటిని మెత్తగా చేసి ముఖం, మెడ భాగాలల్లో రాయాలి. పావు గంట తర్వాత చల్లటి నీటితో వలయాకారంలో ముఖాన్ని రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చర్య సౌందర్యానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎప్పుడూ ముఖ్యమైనది. చివరి నిమిషంలో మొటిమలు రాకుండా ఉండటానికి చక్కెర ,పాల ఆహారాలకు దూరంగా ఉండండి. ఒక కప్పు వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే మచింది. ఇలాచే స్తే టాక్సిన్స్ అన్నీ పోయి చర్మానికి మెరుపు వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బ్రోకలీ బచ్చలికూర, క్యారెట్లు, అవకాడోలు, అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయలులాంటి వాటిని డైట్లో చేర్చుకోండి. తగినంత నీరు త్రాగడం మీ చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచుతుందనే మర్చిపోకూడదు. -
ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్!
చలికాలంలో చాలా మంది తమ ముఖాలు అందంగా కనిపించేలా ప్రయత్నాలు చేస్తుంటారు. చలి తీవ్రతతో.. ముఖం నిగారింపు తగ్గడం, పెదవులు పొడిబారిపోవడం, కళ్లకింద నల్లరంగు చారలు ఏర్పడటంలాంటి సమస్యలు కనిపిస్తూంటాయి. వీటిని అధిగమించడానికి మరెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తెలియని ఫేస్‌క్రీమ్స్ వాడి లేని సమస్యలను కొనితెచ్చుకుంటారు. మరి వీటినుండి బయటపడాలంటే ఈ చిన్న చిన్న బ్యూటిప్స్ని వాడితే చాలు. అవేంటో చూద్దాం. రోజ్ వాటర్, తేనెతో.. రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. చక్కగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తగ్గుముఖం పడుతుంది. రోజ్ వాటర్ ముఖానికి సహజసిద్ధ్ద నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది. ఇంగువతో నిగారింపు.. రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో స్పూను తేనె, చిటికెడు ఇంగువ, స్పూను రోజ్‌వాటర్ వేసి చక్కగా కల΄ాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాల΄ాటు ఆరబెట్టాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ΄్యాక్‌ను వారంలో రెండుసార్లు వేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు ΄ోతాయి. చర్మం ΄÷డిబారడం తగ్గి ముఖం కాంతిమంతమవుతుంది. ఇవి కూడా చదవండి: ఏంటి? కనీసం 6 గంటలైనా నిద్ర పోవట్లేదా..! -
ఇలా చేస్తే.. ముఖంపై ఎలాంటి మచ్చలైనా మటుమాయం
ఎత్తుకు తగిన బరువుతో ఆకర్షణీయమైన పర్సనాలిటీతో నలుగురిన్నీ ఆకట్టుకుంటూ ఉండాలని అందరమూ కోరుకుంటాం. కానీ అన్నీ బావున్నా.. తీరా ముఖం దగ్గరికొచ్చేసరికి మచ్చలు కొంతమందిని వేధిస్తూ ఉంటాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే ఈ నల్లటి మచ్చలనే మంగు మచ్చలంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుంచి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో కూడా ఏర్పడే అవకాశం ఉంది. శరీరతత్వాన్ని బట్టి ముఖంపై మొటిమలు, పులిపిర్లు, పెద్ద పరిమాణంలో ఉండే పుట్టుమచ్చలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు మొదలైనవి ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని వంశ పారంపర్యంగా వస్తే, మరికొన్ని హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు. వంశ పారంపర్యంగా వచ్చే మచ్చలను నివారించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ముఖంపై మంగు మచ్చలు లేదా, నల్లటి మచ్చలు వ్యాధి కాదు కానీ, వీటితో ఆత్మన్యూనతతో పదిమందిలోకీ వెళ్లడానికి ఇబ్బంది పడతారు. అసలు ఇలాంటి మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వాటిని నివారించ వచ్చు. తొలిదశలోనే ఉన్న వాటిని చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం. తాజా వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే క్రమేణా పలచబడి కొంతకాలానికి చర్మం రంగులో కలిసిపోతాయి. పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి పాలల్లో కలిపి రాస్తుంటే మంగు మచ్చలు, చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. జాజికాయను పాలలో అరగదీసి రాయడం వల్ల గుణం కనిపిస్తుంది. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది. పావు టీ స్పూన్నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టొమాటోను రెండు ముక్కలుగా తరిగి, వాటితో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే నల్ల మచ్చలు తగ్గడంతోపాటు ముఖవర్చస్సు పెరుగుతుంది. అలోవెరా పేస్టును మచ్చలపై పూయాలి. ఆ మచ్చతడి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. టీ స్పూన్టొమాటో రసం, టీ స్పూన్గంధం పొడి, రెండు టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజ్‌వాటర్, కీరా రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెల రోజులు గడిచేసరికి మంచి మార్పు వస్తుంది. బంగాళదుంప చెక్కు తీసి, సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి, రసం తీయాలి. దానిలో దూది ఉండలని ముంచి, వాటితో మచ్చలపై అద్దాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం. ఆత్మన్యూనతతో ఉంటే మరింత కృంగిపోతాం. పదే పదే అందవిహీనంగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసుకుంటే డిప్రెషన్‌కు లోనవుతాం. సో అలాంటివన్నీ పక్కన పెట్టి, సహజ పద్ధతుల్లో పరిష్కారానికి ప్రయత్నించడం, లేదంటే నిపుణులైన డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఆత్మవిశ్వాసంతో ఉండి చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే ఏ మచ్చలూ మన అందాన్ని మసక బార్చలేవు. -
అందంగా కనపడేందుకు ఏం చేశానో తెలుసా.. సీక్రెట్ చెప్పిన తాప్సీ
Tapsee Pannu Revealed About Her Beauty Secret: అందం అంటే అందరికీ ఆరాటమే. ఎన్నేళ్లు ఒంటిపైకి ఎగబాకిన అందంగా కనపడాలనే కోరిక మాత్రం చావదు. అందుకే అందంగా కనపడేందుకు అందవిహీన పనులు కూడా చేస్తుంటారు కొందరు. ఏం చేసైనా సరే అందంగా కనపడాలనేదే వారి తాపత్రయం. మరీ ఏం చేద్దాం. అందంగా కనపడాలంటే తప్పదుగా మరీ అంటారు. సామాన్యుల సంగతి పక్కన పెడితే సెలబ్రిటీలు అయితే బోర్ కొట్టించకుండా ఎప్పటికప్పుడు కొత్తగా, సరికొత్తగా అందంతో ఆకట్టుకోవాలనుకుంటారు. అప్పుడేగా అభిమానులు, ఆఫర్స్, రెమ్మ్యునరేషన్స్ పెరిగేది. అందం పెరిగితే అన్ని పెరుగుతాయని అందం కోసం కష్టపడుతుంటారు హీరోయిన్స్. అలా అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చింది హీరోయన్ తాప్సీ. పింక్, తప్పడ్, హసీనా దిల్‌రుబ వంటి విభిన్న చిత్రాలతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది తాప్సీ. ప్రస్తుతం మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది. 'నా కళ్లు పెద్దగా, చూడచక్కగా ఉండవు. సినిమాల్లో చూపించే హీరోయిన్స్‌లా నా ముక్కు సన్నగా ఉండదు. పెదవులు అందంగా కనిపించవు. ఆఖరికీ జుట్టు కూడా రింగు రింగులుగా కనిపిస్తుండేది. టీవీలో కనిపించే నటీమణులకు సైతం నాలాంటి జుట్టు ఉండదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. సెలూన్‌కి వెళ్లి కెమికల్స్‌తో హెయిర్‌ని అందంగా చేసుకునేదాన్ని. అలా ఓ రెండుసార్లు చేయించుకున్నాక.. నాకు జట్టు రాలడం ప్రారంభమైంది. దాంతో మళ్లీ వాటి జోలికి పోలేదు. నిజం చెప్పాలంటే.. అందానికి పరిమితులుగా చెప్పుకొనే కొన్నింటికీ నేను సరిపోను. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను నేను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోయాను. జీవితాన్ని ప్రేమతో జీవించాలని, మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్యప్రపంచానికి ఎంతో అందంగా కనిపిస్తామని అర్థమైంది. అప్పటి నుంచి అందంపై నా అభిప్రాయం మారింది’’ అని తాప్సీ అందానికి అసలైన సీక్రెట్ తెలిపింది. ఇది చదవండి: వరల్డ్ కప్ 2022కి సిద్ధంగా ఉండండి: తాప్సీ -
తొక్కే కదా అని తీసిపారేయకండి...
అన్ని పండ్ల తొక్కల్లో విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందుకని వాటిని ఆహారంగా తీసుకోలేం కదా. అయితే తొక్కే కదా అని తీసిపారేయకండి. వాటిని మరోలా ఉపయోగించుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలు అందానికి బాగా ఉపయోగపడతాయని ఇంతకు ముందు చాలా సార్లు తెలుసుకున్నాం. బకెట్ నీళ్ళలో కొన్ని నిమ్మ తొక్కలు వేసి మరిగించి, ఆ నీళ్లతో స్నానం చేయాలి. నిమ్మతొక్కల్లోని సిట్రిక్ యాసిడ్ వల్ల చర్మం మృదువుగా అవుతుంది. బయట ఎక్కువగా తీరుతున్న వారికి చర్మంపై దుమ్ముచేరి, కమిలిపోతుంది. అలసటకు కూడా గురవుతారు. అలాంటప్పుడు అరటిపండు తొక్కతో ముఖమంతా మర్దనా చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. బొప్పాయి గుజ్జుతో ఫేసియల్ చేయడం అందరికీ తెలుసు. వీటి తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి దీన్ని కూడా ప్యాక్ గా వేసుకుని పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. యాపిల్ తొక్కను కూడా మిక్సీ చేసి ముఖానికి పట్టించాలి.నెమ్మదిగా మర్దన చేస్తే, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది. నారింజ తొక్కలు కూడా సున్నిపిండిలో వేసి మర పట్టిస్తే చర్మం మృదువుగా అవుతుంది. దీన్ని కూడా నీళ్ళలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. అలాగే తొక్కల గుజ్జుతో ప్యాక్ చేసుకుంటే నల్లని మచ్చలు, కంటికింద వలయాలు తగ్గుతాయి. నిద్రనుంచి లేచినప్పుడు కొందరి ముఖం ఉబ్బి పోతుంది. ఇది తగ్గాలంటే బంగాళా దుంప తొక్కలు ఉడికించిన నీటితో ముఖం కడుక్కుంటే ఉబ్బిన చర్మం మామూలుగా అయిపోతుంది. అలాగే ఉడికిన తొక్కల్ని ప్యాక్ గా చేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది. -
చెప్పులందు హైహీల్స్ వేరయా..
‘చెప్పులందు హైహీల్స్ వేరయా..’ అంటారు చాలా మంది మగువలు. కొందరు.. తాము తగినంత పొడవున్నా చాలదన్నట్లుగా ఫోర్, ఫైవ్ ఇంచెస్ పైగానే హీల్స్ వేసుకుంటారు. మరికొందరు ఉండాల్సినంత పొడవులేమనుకుంటూ.. ఇల్లుదాటితే హీల్స్ మీదే నడుస్తుంటారు. పెన్సిల్ హీల్స్, పాయింటెడ్ హీల్స్, కిట్టెన్ హీల్స్, పంప్స్ హీల్స్, బూట్ టైప్ హీల్స్.. ఇలా ఒకటా రెండా? ట్రెండ్ సెటర్స్ మెచ్చినవి, ట్రెండ్ ఫాలోవర్స్‌కి నచ్చినవి.. అంటూ హీల్స్‌లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఈ హైహీల్స్ ఎంత ఫాషనబుల్‌గా ఉంటాయో, వీటిని మెయింటెయిన్ చేయడం అంత కష్టం. వెనుక భాగం ఎత్తుగా ఉండటంతో భారమంతా కాలి వేళ్లమీద పడుతుంది. ఇవి వేసుకుని నడవడం, లేదా ఎక్కువ సేపు వీటిని ధరించి ఉండటంతో వేళ్ల భాగంలో నొప్పి తీవ్రమవుతుంది. అలా అని హీల్స్‌కి దూరంగా ఉండలేని పరిస్థితి. నిజానికి హీల్స్ వేసుకుంటే.. వేసుకున్న డ్రెస్‌కి, నడిచే నడకకి ఓ కొత్త లుక్ వస్తుంది కూడా. అందుకే మరి.. హైహీల్స్ ప్రేమికుల కోసం ఈ యోగా టోస్. వీటిని కాళ్ల వేళ్లకు అటాచ్ చేసుకుని కాస్త సమయం రిలాక్స్‌గా ఉంటే చాలు.. హీల్స్ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి. హీల్స్ ఎక్కువ సమయం వేసుకుని ఉండటం వల్ల, బరువు మొత్తం వేళ్లపైనే ఉండటం వల్ల, హీల్స్ ఆకారాన్ని బట్టి.. వేళ్లు ఎక్కువ సమయం వాలుగా ఉండటం వల్ల కలిగే భారం తగ్గి రిలాక్స్ అవ్వచ్చు. వైద్యులు కూడా ఈ యోగా టోస్ని రికమెండ్ చేస్తున్నారు. ఈ టోస్ వేళ్లకు పెట్టడం వల్ల వేళ్లు నిటారుగా మారి, ఫ్లెక్సిబుల్‌గా సౌకర్యంగా అనిపిస్తాయి. ‘యోగాటోస్ జెమ్స్’కి వీటిపై పేటెంట్ రైట్స్ ఉన్నాయి. దీని ధర 29 డాలర్లు. అంటే 2,069 రూపాలయలకు ఇవి దొరకుతాయి. మరింకేం.. చక్కగా హీల్స్ వేసుకుని అమ్మో హీల్స్ అని కాకుండా.. హాయ్ హాయ్‌గా.. ‘హాయ్’.. హీల్స్ అనేయండి. -
ఇలా చెయ్యండి.. సెట్ అవుతుంది!
కేశాలంకరణతోనే మగువలకు అసలైన అందం సొంతమవుతుంది. విరబోసుకున్నా, విడివిడిగా పాయలు తీసి, జడలేసుకున్నా ముఖానికి కొత్త సోయగం వచ్చేస్తుంది. పొందిగ్గా చీర కట్టుకున్నా, ఫ్యాషన్‌గా జీన్స్ వేసుకున్నా హెయిర్ స్టైల్‌ని బట్టి లుక్ మారిపోతుంది. అందుకే చాలా మంది రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఇక హెయిర్ లీవ్ చేసుకోవడమంటారా..? ఇప్పుడే కాదు ఎప్పటికీ అది ట్రెండే. అయితే ఏ హెయిర్ స్టైల్ ట్రై చెయ్యాలన్నా జుట్టు మృదువుగా, పట్టులా ఉండాలి. అందుకే ఈ హాట్ హెయిర్ డ్రైయర్. ఇది మేకప్ కిట్‌తో పాటు వెంట ఉంచుకుంటే చాలు. ఒకేసారి నాలుగు పనులు ఒకేదానితో చేసుకోవచ్చు. ఈ గాడ్జెట్‌ని తల స్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్లా, చిక్కులు పడినప్పుడు దువ్వెనలా, మెలికలు తిరిగిన వెంట్రుకలను సరిచెయ్యడానికి హెయిర్ స్ట్రెయిటెనర్లా, ఫంక్స్, కర్లీ హెయిర్(రింగురింగుల జుట్టు) కావాలనుకున్నప్పుడు హెయిర్ కర్లర్లా మార్చుకోవచ్చు. వెట్ హెయిర్, స్ట్రెయిట్హెయిర్, కర్లీ హెయిర్ అనే మూడు ఆప్షన్స్‌తో పాటూ దువ్వెనలా కూడా ఈ గాడ్జెట్ ఉపయోగపడటంతో... నచ్చినప్పుడు నచ్చిన స్టైల్స్ ప్రయత్నిస్తూ.. నలుగురిలో ప్రత్యేకంగా మెరవచ్చు. దీని మీద హై, మిడిల్, లో, ఆఫ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ గాడ్జెట్‌కి కిందవైపు ఉన్న రెగ్యులేటర్ ఎడమ నుంచి కుడికి తిరుగుతుంది. దాంతో మోడ్స్ మార్చుకోవచ్చు. దీని ధర సుమారుగా 15 వందలు (21 డాలర్లు). ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. జుట్టు కోసం ఎక్కువ సమాయాన్ని వెచ్చించలేక, జుట్టు పాడవుతుందని బాధపడేవాళ్లు.. హెయిర్ స్టైల్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించేవాళ్లకి ఈ గాడ్జెట్ భలే ఉపయోగడుతుంది. అప్పుడు మీరు అనొచ్చు షాంపూ యాడ్‌లా ‘ఇలా చేశాను.. సెట్ అయ్యింది..’ అని. -
నూనె ఎలా పెడుతున్నారు?!
బ్యూటిప్స్ తలకు నూనె పెట్టామా.. షాంపూతో తలస్నానం చేశామా.. అనేది కాదు ఈ రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే శిరోజాల అందం దెబ్బతింటుంది. జుట్టుకుదుళ్లు బలంగా ఉండి, మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే.... 1. కప్పు వేడి నీళ్లు తీసుకోవాలి. 2. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె వేడినీళ్లలో కలపాలి. 3. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే మాడుకు పట్టించాలి. 4. పెద్ద పళ్ల దువ్వెనతో జుట్టు కుదుళ్ల నుంచి కింది వరకు దువ్వాలి. 5. కనీసం 30 నిమిషాలు వదిలేయాలి. 6. షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి. 7. జుట్టు చివర్లకు కొన్నిచుక్కల నూనె రాయాలి. తలస్నానం చేసే ప్రతీసారీ ఈ విధంగా చేస్తుంటే మాడు పొడిబారదు, వెంట్రుకల నిగనిగలు తగ్గవు. జుట్టురాలడం, చుండ్రు సమస్యలు దరిచేరవు. -
జుట్టు జిడ్డుగా మారుతుంటే..!
బ్యూటిప్స్ వేసవిలో జుట్టు సంరక్షణ పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ఎండతాకిడి, చెమట, పదే పదే నీళ్లతో శుభ్రపరచుకోవడంతో పొడిబారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ కాలం వెంట్రుకల నిగారింపు తగ్గకూడదంటే... * ఎండవేళలో బయటకు వెళ్లేటప్పుడు స్కార్ఫ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. లేదంటే నేరుగా సూర్యకాంతి పడి అతినీలలోహిత కిరణాల వల్ల మాడుపై ఉన్న సహజ మాయిశ్చరైజింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల వెంట్రుకలు పొడిబారి నిస్తేజంగా మారడం, రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. * ఉక్కగా ఉంది కదా అని ముడేసి బిగుతుగా కట్టేయడం వల్ల వెంట్రుకలు దెబ్బతిని, రాలిపోయే సమస్య పెరుగుతుంది. వీలైనంత సౌకర్యంగా ఉండే వదులు కేశాలంకరణనే ఎంపిక చేసుకోవాలి. * ఉక్కపోతతో తరచూ తల తడపడం వల్ల మాడుపై ఉండే సహజ నూనె గ్రంథులు అద నపు నూనెను స్రవిస్తాయి. దీని వల్ల జుట్టు మరీ జిడ్డుగా మారుతుంది. అలాగని రోజూ షాంపూ వాడకుండా దానికి బదులుగా మొక్కజొన్న గంజిని ఉపయోగించి తలను శుభ్రపరచుకోవచ్చు. * జుట్టును ఆరబెట్టుకోవడానికి ఈ కాలం డ్రయ్యర్‌ని ఉపయోగించకపోవడమే మేలు. అలాగే జుట్టును ఫ్లాట్ ఐరన్ చేయడం, రింగులుగా మార్చడం వంటి హెయిర్ స్టైల్స్ శిరోజాలను పొడిబారేలా చేస్తాయి. దీనివల్ల జుట్టు కండిషనింగ్ దెబ్బతిని త్వరగా రాలిపోతుంది.