‘చెప్పులందు హైహీల్స్ వేరయా..’ అంటారు చాలా మంది మగువలు. కొందరు.. తాము తగినంత పొడవున్నా చాలదన్నట్లుగా ఫోర్, ఫైవ్ ఇంచెస్ పైగానే హీల్స్ వేసుకుంటారు. మరికొందరు ఉండాల్సినంత పొడవులేమనుకుంటూ.. ఇల్లుదాటితే హీల్స్ మీదే నడుస్తుంటారు. పెన్సిల్ హీల్స్, పాయింటెడ్ హీల్స్, కిట్టెన్ హీల్స్, పంప్స్ హీల్స్, బూట్ టైప్ హీల్స్.. ఇలా ఒకటా రెండా? ట్రెండ్ సెటర్స్ మెచ్చినవి, ట్రెండ్ ఫాలోవర్స్‌కి నచ్చినవి.. అంటూ హీల్స్‌లో చాలా రకాలు ఉంటాయి.
అయితే ఈ హైహీల్స్ ఎంత ఫాషనబుల్‌గా ఉంటాయో, వీటిని మెయింటెయిన్ చేయడం అంత కష్టం. వెనుక భాగం ఎత్తుగా ఉండటంతో భారమంతా కాలి వేళ్లమీద పడుతుంది. ఇవి వేసుకుని నడవడం, లేదా ఎక్కువ సేపు వీటిని ధరించి ఉండటంతో వేళ్ల భాగంలో నొప్పి తీవ్రమవుతుంది. అలా అని హీల్స్‌కి దూరంగా ఉండలేని పరిస్థితి. నిజానికి హీల్స్ వేసుకుంటే.. వేసుకున్న డ్రెస్‌కి, నడిచే నడకకి ఓ కొత్త లుక్ వస్తుంది కూడా. అందుకే మరి.. హైహీల్స్ ప్రేమికుల కోసం ఈ యోగా టోస్. వీటిని కాళ్ల వేళ్లకు అటాచ్ చేసుకుని కాస్త సమయం రిలాక్స్‌గా ఉంటే చాలు.. హీల్స్ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి.
హీల్స్ ఎక్కువ సమయం వేసుకుని ఉండటం వల్ల, బరువు మొత్తం వేళ్లపైనే ఉండటం వల్ల, హీల్స్ ఆకారాన్ని బట్టి.. వేళ్లు ఎక్కువ సమయం వాలుగా ఉండటం వల్ల కలిగే భారం తగ్గి రిలాక్స్ అవ్వచ్చు. వైద్యులు కూడా ఈ యోగా టోస్‌ని రికమెండ్ చేస్తున్నారు. ఈ టోస్ వేళ్లకు పెట్టడం వల్ల వేళ్లు నిటారుగా మారి, ఫ్లెక్సిబుల్‌గా సౌకర్యంగా అనిపిస్తాయి. ‘యోగాటోస్ జెమ్స్’కి వీటిపై పేటెంట్ రైట్స్ ఉన్నాయి. దీని ధర 29 డాలర్లు. అంటే 2,069 రూపాలయలకు ఇవి దొరకుతాయి. మరింకేం.. చక్కగా హీల్స్ వేసుకుని అమ్మో హీల్స్ అని కాకుండా..
హాయ్ హాయ్‌గా.. ‘హాయ్’.. హీల్స్ అనేయండి.
Comments
Please login to add a commentAdd a comment