high heels
-
హైహిల్స్‌తో రన్నింగ్ చేసి..గిన్నిస్ రికార్డు సృష్టించాడు!
పరుగు పందెం అంటే ఏంటో అందరికీ తెలిసిందే. కానీ హైహిల్స్‌తో హైస్పీడ్‌గా పరుగు తీయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడొక వ్యక్తి ఆ అడ్వెంచర్‌ని చాలా సునాయాసంగా చేసి ప్రపంచ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. వివరాల్లోకెళ్తే..స్పెయిన్‌కి చెందిన 34 ఏళ్ల సీరియల్ రికార్డ్ బ్రేకర్ క్రిస్టియన్ రాబర్టో లోపేజ్ రోడ్రిగ్జ్ ఈ రికార్డుని సాధించాడు. అతను సుమారు 2.76 అంగుళాల స్టిలెట్టో హీల్స్ ధరించి కేవలం 12.82 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తి ఈ రికార్డు సృష్టించాడు. గతంలో 2019లో 14.02 సెకన్లలో 100 మీటర్లని హైహిల్స్‌తో పరుగెత్తిన ఆండ్రీ ఓర్టోల్ఫ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు రోడ్రిగ్జ్. ఈ మేరకు అతను మాట్లాడుతూ..ఇలా పరుగెత్తడం తనకొక సవాలని, ఇలాంటి రేసులను ఎన్నో అవలీలగా సాధించానని చెబుతున్నాడు. అంతేగాదు తనలాంటి టైప్ 1 మధుమేహ వ్యాధిగ్రస్తులు.. మధుమేహం లేని వ్యక్తుల కంటే అన్ని పనులు చురుగ్గా చేయగలరని నిరూపించేందుకే తాను ఈ రికార్డు సాధించినట్లు చెప్పుకొచ్చాడు. రోడ్రిగ్జ్ గతంలో కళ్లకు గంతలు కట్టుకని సుమారు 100 మీటర్లు ముందుకు, వెనుకకు వేగంగా పరుగెత్తి రికార్డు సృష్టించాడు కూడా. అలాగే కళ్లకు గంతలు కట్టుకుని సుమారు 100 మీటర్లు వేగంగా పరిగెడుతూ.. అదే సమయంలో మూడు వస్తువులతో గారడీ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆలస్యం కానిదే ఏది కాదేమో! ఓ వ్యక్తి ఆన్లైన్ ఆర్డర్ పెడితే..ఏకంగా..) -
టో బాలెట్ ఫ్లాట్స్ .. ప్లాస్టిక్ శాండల్స్.. వానాకాలంలో ఏ చెప్పులు బెస్ట్!
పాదాలకు అనువుగా ఉండాలి. పారుతున్న నీళ్లలో జారకుండా ఉండాలి. తడిసినా పాడవకుండా ఉండాలి. పాదాలకు వేసే చెప్పులే అయినా కాలానుగుణంగా ఉండాలి. ఎటు తిరిగినా అందంగానూ ఉండాలి. ఆ ఎంపిక ఎప్పుడూ బెస్ట్ అనిపించాలి. వర్షాకాలంలో రెయిన్కోట్లు, గొడుగు ఎంత ముఖ్యమో ఈ కాలం వేసుకోదగిన చెప్పులు కూడా అంతే ముఖ్యం. ఏవి ఈ సీజన్‌కి సరైనవో ఎంపిక చేసుకోవడం మరీ ముఖ్యం. రబ్బర్ షూస్, పీవీసీ షూస్ ఈ కాలానికి అనువుగానే కాదు ఫ్యాషనబుల్‌గా పర్ఫెక్ట్గా అమరుతున్నాయి. వాటిలో .. ఫ్లిప్ ఫ్లాప్స్, స్లిప్–ఆన్ క్రాస్లైట్ శాండల్స్ వర్షాకాలానికి అనువైనవి. స్లిప్–ఆన్‌లో హీల్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈ సీజన్లో స్టైలిష్ కన్నా సౌకర్యవంతంగా అమరేవే చూడాలి. పాదాలను పట్టినట్టుగా ఉంటూనే వదలడానికి అనువుగా, ప్లాట్ నమూనాతో ఉండటం వీటి ప్రత్యేకత. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. టో బాలెట్ ఫ్లాట్స్ కాలి మునివేళ్లను దగ్గరగా ఉంచుతూ పాదాలను రక్షణ కలిగిస్తాయి. రంధ్రాలు ఉండే ఈ ఫ్లాట్స్ స్టైలిష్‌గానూ ఉంటాయి. ఇండియన్, వెస్ట్రన్.. ఏ స్టైల్ దుస్తులకైనా బాగా నప్పుతాయి. కాలేజీ, ఆఫీస్ వేర్, క్యాజువల్ వేర్.. అన్నివేళలా ధరించడానికి అనువైనవి. బురద అంటినా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. రబ్బరు లేదా ప్లాస్టిక్ శాండల్స్ లెదర్ వాటిలా కనిపించే షూస్, శాండల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇవి రబ్బరు లేదా ప్లాస్టిక్‌తో తయారుచేసినవి. హై టాప్ రెయిన్ షూస్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం, ట్రావెలర్స్‌కు సూట్ అవుతాయి. స్ట్రాప్ శాండల్స్ పాదాలు తడిగా ఉన్నప్పుడు చెప్పలు, ఫ్లిప్–ఫ్లాప్స్ జారిపోతాయి అనుకునేవారు స్ట్రాప్ ఉన్న శాండల్స్ లేదా స్ట్రాప్ చెప్పులు ఎంచుకోవచ్చు. బాలెరినా షూస్ రబ్బరు లేదా లైక్రా బాలెరినా బూట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే పాదాలను బురద నుంచి కాపాడతాయి. హీల్స్ లేనివే ఎంపిక నీళ్లు, బురదతో నిండిన రోడ్ల మీద నడిచేటప్పుడు జారకుండా ఉండాలంటే పట్టీలు ఉన్నప్పటికీ హీల్స్‌ని మాత్రం ఎంపిక చేసుకోకపోవడమే ఉత్తమం. పేస్టెల్, నియాన్ షేడ్స్ గల శాండల్స్ ఈ సీజన్‌కి మరింత అందాన్ని తీసుకువస్తాయి. చదవండి: Cyber Crime Prevention Tips: రుణం కోసం అడ్వాన్స్.. చెల్లిస్తున్నారా?! అయితే ప్రమాదంలో పడ్డట్లే! ఈ జాగ్రత్తలు పాటించండి! C- Section Wound Infection: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా? -
హైహీల్స్‌తో జంప్ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ!.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
ఇంతవరకు మనం గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కిన చాలా మంది గురించి విన్నాం. పైగా వారంతా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డులను సృష్టించారు. ఆ కోవకు చెందినదే ఈ మహిళ కూడా. కానీ ఈ మహిళ చేసిన విన్యాసం చేస్తే కచ్చితంగా నోరెళ్లబెడతారు. ఎందుకంటే ఆ విన్యాసం చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన ఇక అంతే. వివరాల్లోకెళ్తే...అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాంటా మోనికా బీచ్‌లో ఓల్గా హెన్రీ అనే క్రీడాకారిణి హైహిల్స్ ధరించి మరీ తాడుపై నైపుణ్యంగా దూకింది. హైహిల్స్ వేసుకుని నడవాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆమె వాటిని వేసుకుని మరీ ఆగకుండా తాడుపై జంప్ చేసింది. దీంతో ఆమె ప్రపంచ రికార్డును సృష్టించడమే కాక గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆమె ప్రతిభను చూసి ఆశ్చర్యపోవడమే కాక ఇది చేయడం చాలా కష్టం అంటూ రకరకాలు పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆర్కిమెడ్స్కి సూత్రమే ఆ ఏనుగుని రక్షించింది!) -
గంజాయి తాగావా ఏంటి? హీరోయిన్‌పై ట్రోలింగ్
Malaika Arora Trips In High Heels Gets Trolled By Netizens On Social Media: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలె కరిష్మా కపూర్ ఇంట్లో పార్టికి హాజరైన మలైకా.. కారు దిగబోతు బ్యాలెన్స్ అదుపు తప్పి కిందపడబోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గ్రీన్ కలర్ బోల్డ్ అవుట్‌ఫిట్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపించిన ఆమె హైహీల్స్ వేసుకుంది. అయితే కారు నుంచి కిందికి దిగేటప్పుడు మాత్రం బ్యాలెన్స్ చేయలేక కిందపడిపడబోయింది. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి ఆమెకు సాయం అందించడంతో సేఫ్ అయ్యింది. అనంతరం నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'గంజాయి తాగొచ్చావా', 'అయినా ఈ వయసులో హీ హిల్స్ వేసుకుంటే ఇలాగే జరుగుతంది' అంటూ ట్రోలింగ్‌కు దిగారు. మరికొందరు మాత్రం.. అందరి విషయంలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అంటూ మలైకాకు సపోర్ట్‌గా నిలబడ్డారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వైరల్: బ్యాలెన్స్ తప్పిన కృతి.. నెటిజన్ల ట్రోలింగ్!
సెలబ్రిటీలు ఇల్లు విడిచి కాలు బయట పెడితే చాలు ఫోటోగ్రాఫర్లు వారిని చుట్టుమముడతారు. వీళ్లు ఎక్కడ కనపడినా, తిరిగినా తమ కెమెరాలలో బంధిస్తుంటారు. సీసీ కెమెరా కంటే ఎక్కువ ఫోకస్‌తో ఫాలో అవుతుంటారు. వీరి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒక్క చోట కచ్చితంగా దొరికిపోతుంటారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ముంబై నగర వీధుల్లో కంటపడింది. ఓ సెలూన్ సందర్శన కోసం వచ్చిన ఈ బ్యూటీ ఫోటోగ్రాఫర్ల కంటికి చిక్కింది. బ్లాక్ హైహీల్స్‌తో క్యాజువల్ వేర్లో ఉన్న కృతి తన లగ్జరీ కారు నుంచి బయటకు దిగుతుండగా బ్యాలెన్స్ తప్పి పడబోయింది. పూర్తిగా కింద పడిపోతుండగా వెంటనే అప్రమత్తమైన ఈ భామ చివరి క్షణంలో తిరిగి సరిగా నిలబడింది. తరువాత ఫోటోలకు కూడా ఫోజులిచ్చింది. అయితే కృతి పడిపోతుండగా వీడియో తీశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. తమ కామెంట్లతో కృతిని ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ ఎత్తు ఉన్న పాదరక్షలు వాడకూడదని ఫ్లాట్ చెప్పులు వాడలని సలహా ఇస్తున్నారు. మరికొంత మంది కృతికి అండగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్ తప్పడం సాధరణమని, అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. చదవండి: సోషల్ హల్చల్: కళ్లతో కైపెక్కిస్తోన్న భామలు హ్యాట్, బ్యాట్‌తో మంచు లక్ష్మి సందడి! -
చెప్పులందు హైహీల్స్ వేరయా..
‘చెప్పులందు హైహీల్స్ వేరయా..’ అంటారు చాలా మంది మగువలు. కొందరు.. తాము తగినంత పొడవున్నా చాలదన్నట్లుగా ఫోర్, ఫైవ్ ఇంచెస్ పైగానే హీల్స్ వేసుకుంటారు. మరికొందరు ఉండాల్సినంత పొడవులేమనుకుంటూ.. ఇల్లుదాటితే హీల్స్ మీదే నడుస్తుంటారు. పెన్సిల్ హీల్స్, పాయింటెడ్ హీల్స్, కిట్టెన్ హీల్స్, పంప్స్ హీల్స్, బూట్ టైప్ హీల్స్.. ఇలా ఒకటా రెండా? ట్రెండ్ సెటర్స్ మెచ్చినవి, ట్రెండ్ ఫాలోవర్స్‌కి నచ్చినవి.. అంటూ హీల్స్‌లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఈ హైహీల్స్ ఎంత ఫాషనబుల్‌గా ఉంటాయో, వీటిని మెయింటెయిన్ చేయడం అంత కష్టం. వెనుక భాగం ఎత్తుగా ఉండటంతో భారమంతా కాలి వేళ్లమీద పడుతుంది. ఇవి వేసుకుని నడవడం, లేదా ఎక్కువ సేపు వీటిని ధరించి ఉండటంతో వేళ్ల భాగంలో నొప్పి తీవ్రమవుతుంది. అలా అని హీల్స్‌కి దూరంగా ఉండలేని పరిస్థితి. నిజానికి హీల్స్ వేసుకుంటే.. వేసుకున్న డ్రెస్‌కి, నడిచే నడకకి ఓ కొత్త లుక్ వస్తుంది కూడా. అందుకే మరి.. హైహీల్స్ ప్రేమికుల కోసం ఈ యోగా టోస్. వీటిని కాళ్ల వేళ్లకు అటాచ్ చేసుకుని కాస్త సమయం రిలాక్స్‌గా ఉంటే చాలు.. హీల్స్ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి. హీల్స్ ఎక్కువ సమయం వేసుకుని ఉండటం వల్ల, బరువు మొత్తం వేళ్లపైనే ఉండటం వల్ల, హీల్స్ ఆకారాన్ని బట్టి.. వేళ్లు ఎక్కువ సమయం వాలుగా ఉండటం వల్ల కలిగే భారం తగ్గి రిలాక్స్ అవ్వచ్చు. వైద్యులు కూడా ఈ యోగా టోస్ని రికమెండ్ చేస్తున్నారు. ఈ టోస్ వేళ్లకు పెట్టడం వల్ల వేళ్లు నిటారుగా మారి, ఫ్లెక్సిబుల్‌గా సౌకర్యంగా అనిపిస్తాయి. ‘యోగాటోస్ జెమ్స్’కి వీటిపై పేటెంట్ రైట్స్ ఉన్నాయి. దీని ధర 29 డాలర్లు. అంటే 2,069 రూపాలయలకు ఇవి దొరకుతాయి. మరింకేం.. చక్కగా హీల్స్ వేసుకుని అమ్మో హీల్స్ అని కాకుండా.. హాయ్ హాయ్‌గా.. ‘హాయ్’.. హీల్స్ అనేయండి. -
‘కళ్లజోడుతో హాట్‌గా కనిపించరు.. అందుకే ఇలా’
టోక్యో : జపాన్‌లో మహిళల వేషధారణపై పలు సంస్థలు విధిస్తున్న ఆంక్షలు దుమారం రేపుతున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలు కళ్లజోడు ధరించి విధుల్లోకి రావొద్దని, బూట్లకు బదులు ఎత్తయిన హైహీల్స్ ధరించాలని నిబంధనలు పెట్టాయి. కళ్లజోడుతో మహిళ సిబ్బంది విధుల్లో ఉంటే వారి మేకప్‌ను అవి డామినేట్ చేస్తాయని రెస్టారెంట్ నిర్వాహకులు అంటుండగా.. భద్రత కోసమే మహిళా సిబ్బందికి కళ్లజోడు పెట్టుకోవద్దని ఆంక్షలు విధించామని ఎయిర్‌లైన్స్ సంస్థలు చెప్తున్నాయి. ఈ ఆంక్షలపై జపాన్ వ్యాప్తంగా మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పురుషులకు ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా తమపైనే వివక్ష చూపుతున్నారని, అలాంటప్పుడు కళ్లజోళ్లు అమ్మడం నిషేదించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.‘కళ్లజోడు నిషేదించబడింది’అనే హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్ మొదలు పెట్టారు. ‘కళ్లజోడుతో హాట్‌గా కనిపించడం కుదరదు, బాస్‌కు నచ్చదు. అందుకే కాబోలు ఈ దిక్కుమాలిన ఆంక్షలు’ అని మహిళలు తిట్టిపోస్తున్నారు. గంటల తరబడి హైహీల్స్ వేసుకుంటే పని చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, కాళ్లు ఎర్రగా వాచిపోయి రక్తం వచ్చిన సందర్బాలూ ఉన్నాయని పలువురు మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిమాత్రమే కాకుండా.. హైహీల్స్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారని వెల్లడించారు. హైహీల్స్‌తో నరకాన్ని చూస్తున్నామని పేర్కొంటూ.. #KuToo ఉద్యమాన్ని లేవనెత్తారు. మీటూ ఉద్యమం స్ఫూర్తిగానే కూటూ వచ్చిందని ఇషిక్వారా మహిళా ఉద్యోగిని వెల్లడించారు. జపనీస్‌లో కూటూ అంటే బాధ అని అర్థం. జపాన్‌లో పాఠశాల విద్యార్థినులపై కూడా ఆంక్షలు విధించడం గమనార్హం. నల్లని జట్టుతో.. వైవిధ్యమైన జడతో విద్యార్థినులు స్కూల్‌కు రావాలని ఆంక్షలు పెట్టడం దారుణం. -
మేం హై హీల్స్ వేసుకోం!
టోక్యో : పని చేసే ప్రదేశాల్లో హై హీల్స్ వేసుకోవటం కుదరదని జపనీస్ మహిళలు తెగేసి చెబుతున్నారు. పని ప్రదేశాల్లో హై హీల్స్ తప్పనిసరన్న నిబంధనను రద్దు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. హై హీల్స్ వేసుకోవటం అన్నది ఉద్యోగాలకోసం అన్వేషించే, ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు. జపనీస్ నటి, ఫ్రీలాన్స్ రచయిత యూమి ఇసికావా ఇందుకోసం ఓ ఉద్యమాన్ని సైతం చేపట్టింది. జపాన్ శ్రామిక శాఖ అధికారులతో చర్చల అనంతరం నటి ఇషికావా మీడియాతో మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలను హై హీల్స్ వేసుకోమనటం లైంగిక వివక్షేనని, వేధింపులకు గురి చేయటమేనని ఆమె పేర్కొన్నారు. యాజమాన్యం ఏ విధంగా చట్టాల్ని తుంగలో తొక్కుతోందో అధికారులకు వివరించామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం నాడు ప్రభుత్వానికి పిటిషన్ అందజేశామని తెలిపారు. మహిళల ఇబ్బందులపై జపాన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొన్నేళ్ల క్రితం లండన్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ హై హీల్స్ ధరించటానికి నిరాకరించటంతో ఆమెను ఇంటికి పంపించారు. గతంలో సినీ నటి ఎమ్మా థాంప్సన్.. గోల్డెన్ గ్లోబ్స్ కార్యక్రమంలో తాను తొడుక్కున్న చాలా ఎత్తు మడమల లబోటిన్ హీల్స్ వల్ల చాలా నొప్పి వస్తోందంటూ వాటిని తీసివేసి పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందే. 1万人を超えました! メールアドレスとお名前だけで署名ができます。 問題点: ①性別によって同じ職場で強制される服装が違うこと ②健康を害してまで強制されるマナーとは? 「厚生労働省宛: #KuToo 職場でのヒール・パンプスの強制をなくしたい!」 https://t.co/q61K5E2TVw @change_jpより — 石川優実@#KuToo署名中👞👠 (@ishikawa_yumi) February 21, 2019 -
ఎత్తు మడమలు
హక్కులు లేవు ఉద్యమించారు. సమానత్వం లేదు. ఉద్యమించారు. పురుషుడు తిన్నగా లేడు. ఉద్యమించారు. ఉద్యమించడం అంటేనే కదలడం కదా.. ఇప్పుడిక ‘కదలడం’ కోసం కూడా ఉద్యమించారు! ఈ ఉద్యమంలో తొలి కదలిక.. ‘కూటూ’ మూవ్మెంట్. మున్ముందు జరిగే యుద్ధాలన్నీ నీళ్ల కోసమేనన్నట్లు.. ఇకపై స్త్రీలు జరిపే ఉద్యమాలన్నీ ‘కదిలే స్వేచ్ఛ’ కోసమే కావచ్చు! మాధవ్ శింగరాజు స్త్రీలో పైకి కనిపించని దేహభాగం ‘ఒద్దిక’! ఆమె పుట్టగానే ఒద్దికను ఆమె ఒంటికి కలిపి కుట్టేస్తుంది సంప్రదాయం. అందుకే ఒద్దికకు, ఆడపిల్లకు చాలాసార్లు తేడా తెలియదు మనకు. కొన్నిసార్లైతే ఒద్దికనే ఆడపిల్ల అని భ్రమపడతాం. ఒద్దికలేని ఆడపిల్లను ఆడపిల్లగా అస్సలే గుర్తించలేం. అయినా సంప్రదాయాలు ఆడపిల్ల వెంటే ఎందుకు పడతాయి? ఆమె అందంగా ఎదగాలి.. ఎట్ ద సేమ్ టైమ్.. ఒళ్లు విరుచుకోకుండా ఎదగాలి. ఎలా? ఆమె దేహభాగాలను మూసల్లో, వస్త్రాల్లో బిగించడం ఉపాయం. స్త్రీ పాదాలు చిన్నవిగా ఉండడం అందం అనుకున్నారు. అవి అందంగా, చిన్నవిగా పెరగడం కోసం గూడుచెప్పులు కుట్టించి, ఇవి తొడుక్కోవడం సంప్రదాయం అన్నారు. పాదాలు పెరక్కుండా అవి నొక్కి పడతాయి. ఆమె పెరుగుతున్నా పాదాలు ఆ గూళ్ల పరిమితిని దాటి ఎదగవు. బాడీ మొత్తాన్ని కవర్ చేసే మరో సంప్రదాయం చీర. అప్పటికీ వీపు, మెడ, నడుము బయటపడుతున్నాయి. ఏమిటి సాధనం? నడుము చుట్టూ చీర కొంగును తిప్పుకోవడం సంప్రదాయం అయింది. వీపు, మెడ కనిపించకుండా తల చుట్టూ కొంగు కప్పుకోవడం సంప్రదాయం అయింది. సంప్రదాయం సంపూర్ణం! చీర పరుగులు పెట్టనివ్వదు. పెద్ద అంగలు వెయ్యనివ్వదు. పరుగెత్తవలసిన అవసరంలోనూ చీర తట్టుకుని స్త్రీ పడిపోవలసిందే తప్ప, సంప్రదాయం పడిపోదు. అలా ప్లాన్ చేశాం. ఇంకా చాలా ఉంటాయ్, మగాళ్లకు తెలియనివీ, ఊహించనివీ.. ఆడవాళ్ల ఒంటి మీద సంప్రదాయాల దుస్తులు, ధారణలు. తెలీదు నిజమే. ఊహించలేం నిజమే. వాళ్లొచ్చి బాధగా ముఖం పెట్టి కంప్లయింట్ చేసినప్పుడైనా వినాలి. మనం చేయగలిగింది చెయ్యాలి. చేయ తగనిది మానాలి. స్త్రీ అని కాదు. సాటి మనిషి కదా. ఆ మాత్రం కన్సర్న్ ఉండాలి. ‘అమ్మో! సంప్రదాయం. దాన్ని బ్రేక్ చెయ్యలేం’ అని దూరంగా జరిగితే.. వాళ్లకై వాళ్లు బ్రేక్ చేసుకుని బయటికి వచ్చేయడం న్యాయమే! పాదాలు ఎన్నాళ్లని అలా ఉక్కులాంటి పాదరక్షల్లోపలే ఉండిపోతాయి. శరీరం ఎన్నాళ్లని ఉక్కపోత చీరలో మెల్లిగా ఊపిరి తీసుకుంటుంది? చెప్పుల్ని కాళ్లు, చీరల్ని ఒళ్లు వదిలించుకుని బయటికి వచ్చేస్తాయి. సంప్రదాయాల్ని గౌరవించేవారు.. సంప్రదాయాల్ని ‘బ్రేక్ చేసే సంప్రదాయాన్నీ’ గౌరవించాలి.. ఫర్ ద సేక్ ఆఫ్.. హ్యూమన్ పెయిన్. నొప్పిని పోగొట్టడం కోసం. ఆ నొప్పిని అనుభవిస్తున్నది ఆడమనిషైనా, మగమనిషైనా. జపాన్‌లో ఆఫీస్‌లకు ఉద్యోగినులు హైహీల్స్ వేసుకుని వెళ్లాలి. డ్రెస్ కోడ్‌లో భాగం అది. హైహీల్స్ నడకను అందంగా మార్చవచ్చు. దేహాన్ని సొగసైన ఆకృతిలో చూపించవచ్చు. హై హీల్డ్ కదలికల వల్ల ఆఫీస్‌లకు ‘ఎలిగెన్స్’ లాంటిదేదో ఒనగూడవచ్చు. మరి ఆ ఎత్తు మడమలు పెట్టే బాధ సంగతేమిటి? పాదాల బాధ ఒక చోటే స్థిరంగా ఉండదు. దేహంలో ఏ మూలకు ఎఫెక్ట్ ఇస్తుందో చెప్పలేం. జపాన్వాళ్లకు, చైనావాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. చూశారు.. చూశారు.. ఇక లాభం లేదనుకుని ఈ ‘ఆఫీస్ సంప్రదాయం’పై మహిళలు ‘కూటూ’ ఉద్యమం మొదలుపెట్టారు. అవును. జపాన్‌లో ఇప్పుడు ‘కూటూ’ ఉద్యమం నడుస్తోంది. పురుషులు వేధిస్తున్నట్లుగానే, హైహీల్సూ వాళ్లను వేధిస్తున్నాయి మరి. అందుకే ‘మీటూ’ స్ఫూర్తితో.. ‘కూటూ’ మూవ్‌మెంట్‌ని తెచ్చారు. పనిచేసే చోట వేధింపులపై ‘మీటూ’, పనిచేసే చోట హైహీల్స్‌పై ‘కూటూ’.. ఇప్పుడా దేశంలో రెండు మహిళా ఉద్యమాలు సమాంతరంగా నడుస్తున్నాయి. ‘కు’ అంటే జపాన్‌లో షూ అని, ‘కూ’ అంటే నొప్పి అని అర్థం అట. రెండిటినీ కలిపి, ‘కూటూ’ అని కాయిన్ చేశారు. అక్కడి మగాళ్లకు ఇది మీనింగ్లెస్లా అనిపిస్తోంది. ‘అతి కాకపోతే, ఏంటిదీ’ అని అప్పుడే కామెంట్స్ మొదలుపెట్టేశారు! బాడీకి కంఫర్ట్‌గా లేకపోతే జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో ఆ ‘ఇరుకు’ను ఫీల్ అయ్యేవాళ్లకే తెలుస్తుంది. ఆడవాళ్ల కంఫర్ట్‌ని మింగేసి కంఫర్ట్‌గా కూర్చునే ఇన్స్టింక్ట్ మగపుట్టుకలోనే ఉంటుందేమో. టూ మచ్ స్పేస్ తీసేసుకుంటారు. పక్కన మనిషి ఉందనే జ్ఞానమూ, స్పృహ ఉన్నా కూడా.. దిస్ ఈజ్ మై ఆటిట్యూడ్ అన్నట్టు! ‘కిక్ 2’ సినిమాలో ఒక పాట ఉంది. రవితేజ పాడతాడు. ‘మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదనీ.. లిజన్ టు మై వర్డ్ డూడ్ / నేను ఏడూ నెల్లకే బయటికి తన్నుకు వచ్చాను.. దిస్ ఈజ్ మై ఆటిట్యూట్’ అని. కంఫర్ట్ కోసం బయటికి వచ్చేయడం అది. అలా కాకుండా, కంఫర్ట్ కోసం పక్కకు నేట్టేసేవాళ్లుంటారు. ‘మ్యాన్ స్పేసింగ్’ అంటారు అలా నెట్టేయడాన్ని. అర్బన్ డిక్షనరీలో ఆ మాటకు అర్థం ‘పక్క మనిషిని నెట్టేసి, స్పేస్ తీసుకోవడం’. కంఫర్ట్ కోసం నెట్టేయడమే అనాగరికం అనుకుంటే.. మరింత కంఫర్ట్ కోసం పక్కవాళ్ల కంఫర్ట్‌ని లాగేసుకోవడం ఆదిమానవరికం. పనిచేసే చోట, ప్రయాణిస్తున్న చోట చేతులు ఆడిస్తారు. కాళ్లు చాపుతారు. ఆవలిస్తారు. పెద్దగా అరుస్తారు. సర్వావయాలను ఊపుతుంటారు. తోకక్కటే లేదు. ఉంటే దాన్ని కూడా గాల్లోకి తిప్పుతూ కూర్చుంటారు. ఇవన్నీ మ్యాన్ స్పేసింగే. వీటితోపాటు సంప్రదాయాల మ్యాన్ స్పేసింగ్! ఆడపిల్లల్ని సంప్రదాయబద్ధంగా పెంచడం, వాళ్లు సంప్రదాయంగా పెరగడం మంచిదే. అయితే ఎంత వరకు? వాళ్ల బాడీ అండ్ సోల్ పాడవనంత వరకు. పుట్టకముందు వరకు బిడ్డను తల్లి గర్భం కాపాడుతుందని, పుట్టాక సంప్రదాయమే తల్లి గర్భమై బిడ్డను సంరక్షిస్తుందని అనుకున్నా.. కడుపులో కంఫర్ట్‌గా లేకపోతే బిడ్డ ఎంతకాలమని లోపలే ఉండిపోతుంది?! కదలికల స్వేచ్ఛ కోసం తన్నుకుని బయటికి వచ్చేయదా? గుండె నిండా గాలిని పీల్చుకుని బతుకు జీవుడా అనుకోదా?! -
ఎత్తు చెప్పుల అనర్థాలను చిత్తు చేయండిలా!
హైహీల్స్ వేసుకుంటే చూడ్డానికి బాగుంటుందేమోగానీ.. వాటి హీల్ పరిమితికి మించి ఉండటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎముక బాల్ మీద అదనపు ఒత్తిడి కలిగి, మడమలో తీవ్రమైన నొప్పి వస్తుంది. తుంటి భాగంలో ఉండే ‘హిప్ ఫ్లెక్సార్ కండరాలు’ అవసరమైనదానిక కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది . ఈ చెప్పులు మహిళల మోకాల్లో లోపలివైపున ఒత్తిడిని (ఇన్వర్డ్ ఫోర్స్) కలిగించి, ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణమవుతాయి. వీటి వల్ల చీలమండ భాగంలోని యాంకిల్ జాయింట్ కదలికలు కూడా బాగా తగ్గిపోతాయి. దాంతో పిక్క కండరాలు పొట్టిగా మారి, బలం కోల్పోతాయి. అన్నిటికీ మించి అదనపు హీల్ కారణంగా బ్యాలెన్స్ కోల్పోయే అవకాశాలు పెరిగినకొద్దీ పడిపోవడం, గాయపడటం వంటి ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ. ఇన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ మహిళలు హైహీల్స్‌ను ఇష్టపటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవి తొడుక్కున్నప్పుడు మడమలు మరింత ఎత్తుకు వెళ్తాయి. హైహీల్స్ వేసుకున్నప్పుడు కలిగే శరీరాకృతి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి కారణం మన మడమలు ఎత్తు కాగానే... దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మరింత నిటారుగా నిలుచోవడమే. ఇలా నిటారుగా ఉండటం వల్ల మహిళల అందం ఇనుమడించినట్లు కనిపించడంతో పాటు, ఆత్మవిశ్వాసం వ్యక్తమవుతున్న ఫీలింగ్ ఉంటుంది. అందుకే మహిళలు అంత రిస్క్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివారు హైహీల్తో వచ్చే అనర్థాలను సాధ్యమైనంతగా తగ్గించడానికి అనుసరించాల్సిన కొన్ని టిప్స్ ఇవి... ♦ రోజంతా హైహీల్స్ వేసుకోకండి. మీకు మరీ ముఖ్యమైనవి అనిపించిన కొన్ని సందర్భాల్లోనే వాటిని ధరించండి. ♦ మీ హైహీల్ చెప్పుల కోసం మధ్యాహ్నం లేదా సాయంత్రాలలోనే షాపింగ్ చేయండి. ఆ సమయంలో మీ పాదాల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. మిగతా సమయాల్లో హైహీల్స్ ధరించాల్సి వస్తే ఆ సమయాల్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువ కావడంతో సరిగ్గా మీ పాదాలకు సరిపోయేవి దొరకకపోవచ్చు. అందుకే ఈ జాగ్రత్త. ♦ మీ హైహీల్ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా... రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి. (ఒక్కోసారి హీల్ నిడివిలోనూ మార్పు ఉండవచ్చు. రెండింటినీ ఒకేసారి వేసుకుంటే ఆ తేడా తెలిసేందుకు అవకాశం ఎక్కువ). ♦ మీ హైహీల్స్ తొడిగే ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గితే మీకు దాని వల్ల వచ్చే నొప్పులూ అంతగా తగ్గుతాయి. ♦ పాయింటెడ్ హైహీల్స్ లేదా మరీ బిగుతుగా ఉండే షూస్ వేసుకోవద్దు. ♦ హైహీల్స్ వేసుకునే ముందుగా మీ మోకాలి కింద వెనక భాగంలో ఉండే కాఫ్ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ, కాసేపు వార్మప్ మసాజ్‌లా చేయండి. కాఫ్ మజిల్స్‌కు ప్రతిరోజూ తగినంత వ్యాయామాన్ని, స్ట్రెచింగ్‌ను ఇవ్వండి. ♦ హైహీల్స్ తొడగడానికి ముందుగా కాస్తంత వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ కోసం అటూ ఇటూ మెల్లగా పరుగెత్తి... ఆ తర్వాతే హైహీల్స్ వేసుకోండి. ♦ మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్ వేసుకుంటే... అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి పాదాలు నేలకు ఆనేట్లుగా ఉంచి కాసేపు అలాగే నిలబడండి. ఈ సమయంలో ముందుకు వంగి మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ♦ హైహీల్స్ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి. నొప్పి తగ్గేవరకు మీకు సౌకర్యంగా ఉండే మామూలు చెప్పులు ధరించండి. ఈ నొప్పులన్నీ తగ్గాకే మళ్లీ హైహీల్స్ ట్రై చేయండి. ♦ మీరు హైహీల్స్ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని అనర్థాల వల్ల అసలు పాదరక్షలే తొడగలేని పరిస్థి కూడా రావచ్చు. అందుకే హైహీల్స్ చెప్పుల్ని చాలా సెలెక్టర్ సందర్భాల్లోనే వాడటం మంచిది. -
మెక్సికోలో షాకింగ్ ఇన్సిడెంట్
-
చిన్నారిని చిదిమేసిన ‘హై హీల్స్’
థానే : కాస్తా ఎత్తుగా, మరికాస్తా అందంగా కనిపించడానికి ధరించిన హై హీల్స్(చెప్పులు) మహారాష్ట్రలో ఓ పసిప్రాణాన్ని బలితీసుకున్నాయి. వినాడానికి షాకింగ్ ఉన్న ఇది నిజం. వివాహ వేడుకకు కోసం ఓ మహిళ ధరించిన హై హిల్స్ కాస్తా పట్టు తప్పడంతో చేతిలో ఉన్న ఆరు నెలల చిన్నారి బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి కిందపడి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఫెహ్మిద షేక్ (23) తన 6 నెలల కుమారుడు మహ్మద్‌ను తీసుకుని భర్తతో కలిసి రాంభాగ్‌లో జరుగుతున్న బంధువుల వివాహ వేడుకకు హజరయ్యింది. వివాహం ముగిసిన అనంతరం ఇంటికి వెళ్దామని బయలుదేరారు. మొదటి అంతస్తులో బాల్కని వెంబడి కిందకు వస్తున్నారు. ఆ సమయంలో ఫెహ్మిదా ధరించిన హై హీల్స్ కాస్తా పట్టు తప్పడంతో ఆమె చేతిలో ఉన్న 6 నెలల మహ్మద్ మొదటి అంతస్తు నుంచి జారి కిందపడ్డాడు. ఫెహ్మిద భర్తతో కలిసి కిందకు పరిగెత్తే చూసే సరికి పసివాడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మహ్మద్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మహ్మద్ మృతిని ప్రమాదం వల్ల జరిగినట్లు నమోదు చేసుకున్నారు. అంతేకాక తదుపరి విచారణకు ఆదేశించినట్లు మహాత్మ ఫౌలే పోలీసు స్టేషన్ అధికారి విజయ్ ఖేడేకర్ తెలిపారు. -
మగాళ్లు బలంగా ఉండాలంటే హైహీల్స్ వేసుకోవాలట..!
సిడ్నీ : మగాళ్లు ఏంటి? హైహీల్స్ వేసుకోవడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా.. అందరిలాగా ఆలోచిస్తే కిక్కేముందనుకున్నాడో ఏమో ఓ మహాశయుడు ఇలాగే వెరైటీగా ఆఫీస్‌కు వెళ్లడం మొదలుపెట్టాడు. మహిళలు ధరించే హైహిల్స్ వేసుకొని ఆఫీస్‌కు వెళుతున్నాడు. ఇదేంటి అని పక్కవాళ్లు నవ్వుకున్నా.. తోటి ఉద్యోగులు ఎద్దేవా చేసినా అతను వెరవలేదు. అంతేకాదు.. హైహిల్స్ కంటే మహిళలాగా పురుషులు కూడా శక్తిమంతంగా తయరు కావొచ్చునని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన యాష్లే మాక్స్వెల్-లామ్.. ఇలా ఆడవాళ్లు ధరించే హైహీల్స్ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఇతడు కొన్నేళ్ల కిందటి వరకు అందరిలాగే మామూలుగా పురుషుల షూస్ వేసుకొని ఆఫీస్‌కు వెళ్లేవాడు. అయితే, తన ఆఫీసులో పనిచేసే ఓ మహిళా సహోద్యోగి.. ఆమె శక్తివంతంగా ఉండడానికి కారణం హైహీల్సేనని చెప్పింది. కావాలంటే వేసుకుని చూడమని సలహా ఇచ్చింది. ఆ సలహా నచ్చడంతో లామ్.. లైఫ్‌స్టైలే మారిపోయింది. ఇప్పుడు అతను ఎక్కడికివెళ్లినా.. అందరి చూపు అతని వేసుకునే చెప్పులపైనే ఉంటుంది. అతను హైహీల్స్ ధరించడం..చూసేవారికి వింతగా తోచినా.. ఇవి ధరించడం వల్ల చాలా హుందాగా, శక్తిమంతంగా ఉన్నానని నిర్మోహమాటంగా చెప్తున్నాడు. అనుమానం ఉంటే మీరు కూడా ధరించండని సలహా ఇస్తున్నాడు. -
కలిపి చుడితే కలదు సుఖం
హై హీల్స్ నడకకు అందాన్నిస్తాయి. కొంచెం నొప్పిగా కూడా అనిపిస్తాయి. ఈ నొప్పి.. హీల్స్ సరిపడకపోవడం వల్ల కాదు. పాదాల్లోని నరాలపై పడే ఒత్తిడి వల్ల! ఇది తెలిసిన విషయమే. తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. చిన్న టెక్నిక్‌తో నొప్పిని తప్పించుకుని హై హీల్స్‌తో ఈ భూమిని ఏలేందుకు అమ్మాయిలు సిద్ధం కావచ్చని! ఈ గొడవంతా ఎందుకు? చక్కగా చెప్పల్స్ లేదా స్లిప్పర్స్ వేసుకుంటే సుఖం కదా అనుకోవచ్చు. సుఖమే.. కానీ హై హీల్స్ హైïß ల్సే! ఒక్కసారి వేసుకుని చూడండి. ‘చూడండి’.. అంటే మిమ్మల్ని మీరు చూసుకొమ్మని కాదు. హై హీల్స్ వేసుకుని మీరు నడుస్తున్నప్పుడు మిమ్మల్ని చూసేవాళ్లను చూడండీ అని. ఎంత ఆరాధన ఆ కళ్లల్లో! ఉండదా మరి? మీరేం తక్కువగా కనిపిస్తారా! ఏ దేశపు యువరాణిగారో మీలోకి ప్రవేశిస్తారు. తన హొయలును మీ కదలికల్లో అనువణువునా ఒలికిస్తారు. కానీ హై హీల్స్‌తో ఆ కాసేపు మీరు పడే బాధ మీకు మాత్రమే తెలుస్తుంది. పాదాలు నొప్పెడతాయి. కొంతమందికైతే నడుము నొప్పి కూడా వస్తుంది. రోజూ హై హీల్స్ వేసుకునేవారికైతే పర్వాలేదు కానీ, కొత్తల్లో కాస్త ఇబ్బందే. ఆ ఇబ్బందిని ఈ స్మాల్ టిప్పుతో భలేగా తప్పించుకోవచ్చు. ఎలాగంటే... చిన్న టేప్ తీసుకోండి. అడ్హెసివ్ టేప్, స్కాచ్ టేప్, న్యూడ్ కలర్ మెడికల్ టేప్.. ఏదైనా సరే. అవన్నీ లైట్‌గా, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అతికించడానికి, అతికించాక తొలగించడానికీ అవి తేలిగ్గా ఉంటాయి. ఆ టేప్‌తో బొటన వేళ్ల పక్కన ఉండే రెండు వేళ్లను కలిపి గట్టిగా చుట్టేయండి. (ఫొటోలో చూపిన విధంగా). తర్వాత మెల్లిగా మీ పాదాలను హై హీల్స్లోకి దూర్చేయండి. ఆ తర్వాత నడవండి. వెంటనే మీకు ఆశించినంత సౌఖ్యం కలగకపోవచ్చు. నమ్మండి. కొద్దిరోజుల్లోనే మీ హై హీల్స్ మీకు మంచి ఫ్రెండ్స్ అవుతాయి. ఏమిటీ మాయ? మాయ కాదు, మంత్రం కాదు. బొటనవేలి తర్వాతి రెండు, మూడు వేళ్ల మధ్య ఒక నరం ఉంటుంది. హై హీల్స్ వల్ల ఆ నరం నొక్కుకుపోయి, నొప్పికలుగుతుంది. ఆ నొప్పి ఎక్కువైతే నడుము వరకు పాకుతుంది. అలా కాకుండా ఉండేందుకే రెండు వేళ్లకూ కలిపి టేపు చుట్టేయడం! ఇలా చుట్టడం వల్ల ఆ నరం మీద ఒత్తిడి తగ్గి హై హీల్స్ వేసుకుని నడుస్తున్నప్పుడు నొప్పి అనిపించదు. అయితే హై హీల్స్ వల్ల భవిష్యత్తులో రాగల అవకాశం ఉన్న ఆరోగ్య సమస్యలకు మాత్రం ఈ టేపు టిప్పు ఔషధంలా పనిచేయదు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అప్పటికప్పుడు అనుకోకుండా పార్టీకి రెడీ అయినప్పుడు సరదాగా కొద్దిసేపు హై హీల్స్‌తో నొప్పి లేకుండా నడిచేందుకు టేప్ చుట్టుకుని వెళ్లొచ్చు. -
ప్రేమంటే ఇదేరా..!
తమకు ప్రియమైన వారికోసం ఎంతటి కష్టాన్ని భరించడానికైనా కొందరు వెనుకాడరు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియురాలు హైహిల్స్ (ఎత్తైన) చెప్పులు వేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే.. దానిని చూసి తట్టుకోలేక ఓ యువకుడు ఆమెకు తన చెప్పులు ఇచ్చాడు. ఆమె హైహిల్స్ తాను వేసుకున్నాడు. చైనాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. చైనా చాంగ్కింగ్లో ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఆస్పత్రికి వచ్చాడు. ఈ సందర్భంగా అతను పింక్ రంగు హైహిల్స్ వేసుకోగా.. అనారోగ్యంతో ఉన్న ఆమె అతని చెప్పులు వేసుకొని కనిపించింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను అతను పలుసార్లు వెన్నుతట్టి ధైర్యం చెప్పాడని, హైహిల్స్ వేసుకోవడంలో ఆమె పాదాలకు ఇబ్బందిగా ఉండటంతో అతను ఆ చెప్పులు వేసుకొని.. ఆమెకు తన పాదరక్షలు ఇచ్చాడని ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ‘గ్జీ’అనే మహిళ తెలిపింది. ఆస్పత్రి నుంచి వెళ్లేటప్పుడు చెప్పులు మార్చుకుందామని ఆమె కోరినా.. అతను ఒప్పుకోలేదని, ఆ జంట ప్రేమ తనను కదిలించిందని గ్జీ పేర్కొంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిపోయాయి. నిజమైన ప్రేమ అంటే ఇలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
నా భార్య ఏ తప్పు చేయలేదు: ట్రంప్
వాషింగ్టన్ : తన భార్య మెలానియా ట్రంప్ హై హీల్స్‌పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దేశ ప్రథమ పౌరురాలైన మెలానియాతో పాటు తనకు అధ్యక్ష భవనం అంటే ఎంతో గౌరవమని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మెలానియా ఎప్పుడూ సంప్రదాయ వేషధారణలో ఉంటారని ఆమెకు మద్ధతుగా నిలిచారు. వైట్ హౌస్ నుంచి టెక్సాస్‌కు బయలుదేరే ముందు అందరూ మహిళల తరహాలోనే తన భార్య పద్ధతిగా దుస్తులు వేసుకున్నారని, హైహీల్స్ ధరించారని తెలిపారు. విమానంలో ప్రయాణించడానికి వీలుగా ఉంటుందని మెలానియా స్నికర్స్ మార్చుకున్నారని చెప్పారు. హరికేన్ హార్వే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకునేందుకు మేము వెళ్లగా తన భార్యపై అనవసరంగా విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ వ్యక్తులకు, వీఐపీలకు వేషధారణలో ఎలాంటి మార్పులు ఉండవని.. అందరూ సమానమేనని భావించాలన్నారు. వాస్తవానికి మెలానియా సంప్రదాయంగానే కనిపించారని, ఆమె హై హీల్స్ లేదా స్నికర్స్ ధరించడమనేది తప్పిదమే కాదన్నారు. అసలు మెలానియా ఏం తప్పు చేసిందో చెప్పాలని ట్రంప్ ప్రశ్నించారు. విమానం నుంచి దిగే సమయంలో మెలానియాకు తెలియకుండానే సౌకర్యంగా ఉంటాయని హై హీల్స్ నుంచి స్నికర్స్కు మారారని విమర్శలకు బదులిచ్చారు. గత ఆగస్టులో విధ్వంసం సృష్టించిన హరికేన్ హార్వే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించగా మెలానియా ఆహార్యంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
కలసి ఉంటే కలదు సుఖం
ఫిటిప్స్ హై హీల్స్ నడకకు అందాన్నిస్తాయి. కొంచెం నొప్పిగా కూడా అనిపిస్తాయి. ఈ నొప్పి.. హీల్స్ సరిపడకపోవడం వల్ల కాదు. పాదాల్లోని నరాలపై పడే ఒత్తిడి వల్ల! అయితే, చిన్న టెక్నిక్‌తో ఈ నొప్పిని తప్పించుకుని హై హీల్స్‌తో ఈ భూమిని ఏలేందుకు అమ్మాయిలు సిద్ధం కావచ్చు! ఎలాగంటే... చిన్న టేప్ తీసుకోండి. అడ్హెసివ్ టేప్, స్కాచ్ టేప్, న్యూడ్ కలర్ మెడికల్ టేప్.. ఏదైనా సరే. అవన్నీ లైట్‌గా, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అతికించడానికి, అతికించాక తొలగించడానికీ అవి తేలిగ్గా ఉంటాయి. ఆ టేప్‌తో బొటన వేళ్ల పక్కన ఉండే రెండు వేళ్లను కలిపి గట్టిగా చుట్టేయండి. తర్వాత మీ పాదాలను హై హైల్స్లోకి దూర్చేయండి. ఆ తర్వాత నడవండి. కొద్దిరోజుల్లోనే మీ హై హీల్స్ మీకు మంచి ఫ్రెండ్స్ అవుతాయి. అయితే హై హీల్స్ వల్ల భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న ఆరోగ్య సమస్యలకు మాత్రం ఈ టేపు టిప్పు ఔషధంలా పనిచేయదు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. -
‘హై హీల్స్, డ్రెస్ కోడ్ అవసరం లేదు’
లండన్: ఎత్తు మడాల చెప్పులు(హై హీల్స్), ప్రత్యేక డ్రెస్ మాత్రమే వేసుకొని విధులకు రావాలని ఆయా కంపెనీలు చెప్పడం చట్ట విరుద్ధం అని బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ వ్యాపారసంస్థలు, కేంద్రాలకు స్పష్టం చేసింది. ఇకపై మహిళలను ఇలాంటి వాటితోనే రావాలని ఏ కంపెనీ వేధించిన దానిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నికోలా థార్ప్ అనే యువతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఆమె గతంలో ఓసారి ఫ్లాట్ షూ వేసుకొని వెళ్లింది. అయితే, కంపెనీ మాత్రం ఆమెను లోపలికి అంగీకరించలేదు. దీనిపై బ్రిటన్ పార్లమెంటులో పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. ఈ నిబంధన తొలగించాలని దాదాపు 1,52,000 సంతకాలు కూడా సేకరించారు. దీనిపై చర్చించిన పార్లమెంటు చివరకు ఇది మహిళలపట్ల వివక్ష చూపడమేనని పేర్కొంది. ప్రత్యేక డ్రెస్ కోడ్, హై హీల్స్ వేసుకోవడంలాంటివి పనిచేసే కంపెనీలు ఆదేశించడం నేరం అవుతుందని స్పష్టం చేశారు. ఇకపై కంపెనీలు ఇలాంటి ఆదేశాలు చేయొద్దని హెచ్చరించారు. -
అక్కడ హైహీల్స్ నిషేధం
మగువలు అత్యంత ఇష్టంగా ధరించే హైహీల్స్‌ను నిషేధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. కెనడాలోని బ్రిటీస్ కొలంబియా ప్రావిన్స్‌లోని అన్ని పని ప్రదేశాల్లో ఈ నిషేధం విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రత, ఆరోగ్య కారణాల దృష్ట్యా కార్మికుల పాదరక్షల నియంత్రణ చట్టానికి సవరణలు చేసినట్లు గ్లోబల్ న్యూస్ సంస్థ తెలిపింది. పని చేసే సమయంలో మహిళలు ఎక్కువ సేపు హీల్స్ ధరించి పనిచేస్తుండంటంతో ఎక్కువ మంది అనారోగ్యానికి గురౌతున్నారని తెలిపింది. అయితే దీనిపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది వ్యతిరేఖిస్తున్నారు అయితే కొన్ని సందర్భాల్లో పని చేసే ప్రాంతాల్లో మహిళలు హైహీల్స్ ధరించాల్సిఉంటుందని,వాటిని ఎలా నిషేధిస్తారని ప్రావిన్సియల్ ప్రీమియర్ క్రిష్టి క్లార్క్ ప్రశ్నించారు. గ్రీన్పార్టీకి చెందిన నేత పార్లమెంట్లో ప్రవేటు బిల్లు ప్రవేశపెట్టడంతో ఈఅంశం వెలుగులోకి వచ్చింది. కెనడాలో ఎక్కువ శాతం మంది మహిళలు హైహీల్స్ ధరించి బార్లు, రెస్టారెంట్లలో పనిచేస్తుంటారు. -
డ్రెస్ కోడ్ పేరుతో మహిళలపై వివక్షత
లండన్: నికోలా థోర్ప్ అనే యువతి లండన్‌లోని ఓ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పనిచేసేది. ఆఫీసుకు ఓ రోజు హై హీల్స్ వేసుకుపోనందుకుగాను ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక అప్పటి నుంచి ఆమె.. ఉద్యోగాల్లో డ్రెస్ కోడ్ పేరుతో మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించడంపై పోరాడుతోంది. థోర్ప్ పోరాటానికి అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభించింది. సుమారు 1,50,000 మంది వర్క్ ప్లేస్‌లో మహిళలకు డ్రెస్ కోడ్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్ వెబ్సైట్లో థోర్ప్ దాఖలు చేసిన ఆన్లైన్ పటిషన్ పై సంతకాలు చేశారు. దీంతో బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఈ అంశంపై వెస్ట్‌మినిస్టర్ హాల్లో డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై కొనసాగుతున్న ఈ డ్రెస్‌కోడ్ వివక్షను రూపుమాపేందుకు చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చారు. డిబేట్లో భాగంగా లేబర్ పార్టీ ఎంపీ గిల్ ఫర్నిస్ తనకూతురు ఎమిలి(27) ఏవిధంగా వివక్షకు గురయ్యారో వివరించారు. డ్రెస్ కోడ్‌లో భాగంగా హై హీల్స్ వేసుకున్న ఎమిలి కాలికి గాయం అయిందని ఆమె వెల్లడించారు. గాయం కారణంగా తీసుకున్న సెలవులకు ఆమె పనిచేస్తున్న సంస్థ చెల్లింపులకు నిరాకరించిందని తెలిపారు. పొట్టి దుస్తులు, హై హీల్స్‌తో పాటు కొన్ని ఉద్యోగాల్లో ఎలాంటి లిప్‌స్టిక్ వాడాలో కూడా చెబుతున్నారని గిల్ వెల్లడించారు. కొన్ని చోట్ల పనిచేసే మహిళలు 8 గంటలు హై హీల్స్‌లో నిలబడాల్సి వస్తుందని, ఇది అనేక సమస్యలకు దారి తీస్తుందని గిల్ వాపోయారు. మరో ఎంపీ, పిటిషన్స్ కమిటీ చైర్మన్ హెలెన్ జోన్స్ ఈ తరహా వివక్షకు సంబంధించిన విషయాలు తమను షాక్‌కు గురిచేశాయని తెలిపారు. మహిళా ఉద్యోగులను డ్రెస్ కోడ్ పేరుతో వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రులు వెల్లడించారు. -
హైహీల్స్ వేసుకోండి లేదా ఇంటికెళ్లండి
ఇదేమైనా ఫ్యాషన్ షోనా.. రోజూ 2-4 అంగుళాల హై హీల్స్ వేసుకునే ఆఫీసుకు రావాలి. కచ్చితంగా మేకప్ వేసుకోవాలి. తప్పనిసరి మేకప్‌ను రీఅప్లయ్ చేసుకోవాలి. ఒకవేళ హై హీల్స్ వేసుకోకుండా ఆఫీసుకు వచ్చారో. ఇక వారిపనంతే. వెంటనే ఇంటికి వెనుదిరగడమే. ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా? బ్రిటిష్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు పెడుతున్న డ్రస్ కోడ్ అట. సెక్సియెస్ట్ డ్రస్ కోడ్ పరిశ్రమల్లో తీవ్రంగా వ్యాపించిందని యూకే రిపోర్టు పేర్కొంది. హైహీల్స్‌తో భరించలేని కాళ్ల, కీళ్ల నొప్పులు వస్తున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నా... సెక్సియెస్ట్ డ్రస్ కోడ్ పేరుతో కొన్ని పరిశ్రమల వారు మహిళలు హైహీల్స్ వేసుకునే రావాలని బలవంతం పెడుతున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. హైహీల్స్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై హెచ్చరికలు వస్తున్నా వారు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కంపెనీల డ్రస్ కోడ్ స్త్రీ, పురుష ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించాలని బ్రిటన్ సమానత్వ చట్టాలు చెబుతున్నాయి. కానీ హోటల్స్, ట్రావెల్, తాత్కాలిక వర్క్ ఏజెన్సీ, హాస్పిటాలిటీ, రిటైల్ రంగాల్లో ఈ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని చట్టసభ్యులు పేర్కొన్నారు. తక్కువ జీతం వచ్చే ఉద్యోగులకు కూడా డ్రస్ కోడ్‌లో అసమానత్వం చూపిస్తున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.. చట్టాలు ఉల్లంఘిస్తున్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రోజంతా నిల్చునే పనిచేసి ఉద్యోగుల పరిస్థితి హైహీల్స్ నిబంధనతో మరింత ఘోరంగా ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. నికోలా థ్రోప్ అనే ఓ మహిళ ఉద్యోగి హైహీల్స్ వేసుకుని రాలేదని, జీతం లేకుండా వెంటనే ఇంటికి పంపించేశారు. దీంతో ఆ మహిళ హైహీల్స్‌పై అక్కడ ఉద్యమం ప్రారంభించింది. కచ్చితంగా హైహీల్స్ వేసుకుని రావాలనే దానికి వ్యతిరేకంగా పార్లమెంట్ వెబ్సైట్లో ఫిర్యాదు దాఖలు చేసింది. ఆమెకు మద్దతుగా 1,52,420 సంతకాలు నమోదయ్యాయి. ఆమె ఈ తిరుగుబాటు బ్రిటన్ కార్యాలయాల్లో డ్రస్ కోడ్‌పై విచారణకు చట్టసభ్యులు దిగొచ్చే స్థాయికి వెళ్లింది. -
వామ్మో.. హై హీల్స్.. ఇట్ రియల్లీ కిల్స్..
ఒట్టావా: హై హీల్స్.. ఈ మాడ్రన్ డేస్ లో కొందరు మహిళలు, యువతులు ధరించే రకం చెప్పులు, షూస్. అయితే ఈ హై హీల్స్ వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరమని గతంలో ఎన్నో సర్వేల్లో తేలింది. హై హీల్స్ వాడకం వల్ల కాలు కీళ్లు, కొన్ని ఎముకలు పటుత్వం కోల్పోవడం, కొన్నిసార్లు విరిగిపోవడం జరుతుంది. అయితే కెనడాకు చెందిన ఓ రెస్టారెంట్ యజమాని మహిళా ఉద్యోగుల విషయంలో కాస్త కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. స్నేహితురాలి బాధను చూడలేక ఓ యువతి కొన్ని వాస్తవాలను బయటపెట్టింది. ఈ ఫొటో చూడండి. ఇది నా ఫ్రెండ్ పరిస్థితి. జాగ్రత్తగా ఈ కాళ్లను పరిశీలించండి. సాక్సులకు ఉన్నది రంగు మాత్రం కాదండి. రక్తంతో సాక్సులు తడిసిపోయాయి' అంటూ ఓ నికోలా గేవిన్స్ అనే యువతి తన ఫ్రెండ్ బాధల్ని మాత్రమే కాదు జోయ్ రెస్టారెంట్ లో ఫీమేల్ ఎంప్లాయిస్ కష్టాలను మన కళ్లకు కట్టినట్లు చూపించింది. అందుకే ఈ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో అక్కడ హల్ చల్ చేస్తోంది. మహిళా ఉద్యోగులకు పనిచేసే దగ్గర కనీస స్వేచ్ఛ లేకుండా పోతుందని వాపోయింది. కాళ్లకు నిత్యం అలా రక్తం కారడంతో ఇన్ ఫెక్షన్ సోకి ఓ వేలు గోరు కూడా కట్ అయిపోయిందట. పురుష ఉద్యోగులు మాత్రం తమకు ఇష్టం వచ్చిన డ్రెస్సింగ్ ఫాలో అవుతుండగా, మహిళలు మాత్రం కాళ్లకు అంతగా సౌకర్యంగా లేని ఆ హై హీల్ షూస్ ధరించాలి. లేనిపక్షంలో ఉద్యోగం నుంచి తొలగిస్తారు. హై హీల్స్ వేసుకోని కారణంగా యూకేలో కూడా కొందరు మహిళల్ని జాబ్ నుంచి తప్పించారని నికోలా గేవిన్స్ ఫేస్ బుక్ పోస్ట్ తో ఈ విషయంపై పోరాడుతోంది. -
హైహీల్స్.. యమా డేంజర్!
* కేన్స్‌లో హీల్స్ లొల్లి * ఎత్తుచెప్పులు ప్రమాదకరమంటున్న నిపుణులు ‘‘ఇక్కడ మహిళలు హైహీల్స్‌ను మాత్రమే ధరించాలి. ఫ్లాట్‌గా ఉండే చెప్పులు, షూస్‌ను నిషేధించడమైనది’’ ప్రఖ్యాత కేన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు చేసిన ఈ ప్రకటన ఇటీవల దుమారం రేపింది. అంతర్జాతీయ సినిమా వేడుకలకు మాత్రమే కాదు.. ప్రముఖ నటీమణుల అందాల ప్రదర్శనకూ వేదికైన కేన్స్‌లో ఈ నిబంధన పట్ల చాలా మంది వివిధ ఇబ్బందుల వల్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. హాలివుడ్ ప్రముఖల నుంచి విమర్శలూ వెల్లువెత్తడంతో ఆనక నిర్వాహకులు వెనక్కి తగ్గారు. అయితే, ఈ గొడవ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్ నిపుణుడు డాక్టర్ స్టీవ్ ప్రీస్ హై హీల్స్‌పై దృష్టి సారించారు. వీటిని ధరిస్తే కలిగే మోదం కంటే.. ప్రమాదమే ఎక్కువని తేల్చేశారు! హై హీల్స్‌ను రోజూ ధరించడం వల్ల ఇబ్బందులు తప్పవని స్టీవ్ చెప్పారు. దీర్ఘకాలంలో కాలి ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయని అంటున్నారు. వీటిలో ముఖ్యమైన సమస్యలు ఏవంటే... ⇒ హైహీల్స్‌తో నడక తీరు మారిపోతుంది. నడుంనొప్పి మొదలవుతుంది. చీలమండలు, కీళ్లు వాచిపోతాయి. ⇒ పాదాలపై పుండ్లు ఏర్పడతాయి. ⇒ శరీర బరువంతా మునివేళ్లపై పడుతుంది. దీనివల్ల అరికాలుపై ముందు వైపు ఒత్తిడి పెరుగుతుంది. పాదం పనితీరుపై ప్రభావం పడుతుంది. ⇒ తూలిపడకుండా ఉండేందుకు భయంగా, అతి జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. ⇒ నడుము దగ్గర నుంచి తొడలు, పిక్కలు, పాదాల వరకూ అన్ని కండరాలూ అతికష్టంగా పనిచేయాల్సి వస్తుంది. -
హైహెల్!
నాగరకతకు ప్రతీకగా భావించి అనుసరించే తప్పుడు వేషధారణలో ముఖ్యమైనది హైహీల్స్. అందం కోసం, పదిమందిలో ప్రత్యేకత కోసం ధరించే ఈ పాదరక్షలు... పాదాన్ని రక్షించడానికి బదులు, సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల పూర్తి శరీరానికే హాని చేస్తున్నాయి. హైహీల్స్‌ను ఎలా ధరించాలి, ఎంతవరకు ధరించాలో తెలుసుకుందాం. హైహీల్స్‌ను ఎందుకు తొడుగుతారు? నిటారుగా కనిపించేవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. హైహీల్స్ తొడిగిన వారిలో మడమలు మరింత ఎత్తుకు వెళ్లేసరికి పృష్టభాగం కాస్త వెనక్కువస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మరింత నిటారుగా నిలబడతారు. ఇలా నిటారుగా ఉండటం వల్ల అందం ఇనుమడించినట్టయ్యి, ఎదుటివారికి ఆత్మవిశ్వాసంతోనూ కనిపిస్తున్నట్లుగా అవుతుంది. అందుకే ఈ హైహీల్. కానీ పరిమితికి మించిన హీల్ వల్ల దీర్ఘకాలంలో పాదాలకూ, పాదాల్లోని కండరాలకూ, వెన్నుకూ జరిగే నష్టాలే ఎక్కవ. చాలాకాలం పాటు హీల్స్ వేస్తే...? హైహీల్స్ వాడటం వల్ల కండరాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేం. దాంతో కాలి కండరాలు తేలిగ్గా అలసిపోతాయి. కొద్ది శ్రమకే ఎక్కువ అలసిపోయే ఫలితం హైహీల్స్ వల్ల కనిపిస్తుంది. ఇదే ప్రక్రియ దీర్ఘకాలం సాగితే కండరాల్లో స్ట్రెయిన్ ఇంజరీస్ అనే గాయాలు అవుతాయి. కండరం అదేపనిగా గాయపడటం వల్ల కోలుకోలేని విధంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కటొక్కటిగా అనేక అనర్థాలు... : ఈ సృష్టిలో ప్రతి ప్రాణీ నడిచే సమయంలో ఒక క్రమత్వాన్ని పాటిస్తుంటుంది. దాన్నే గెయిట్ అంటారు. మనుషులకూ ఈ గెయిట్ ఉంటుంది. హీల్ వల్ల మడమ పైకి లేచి ఉంటుంది కాబట్టి మహిళలు మునివేళ్లతోనే ఎక్కువ పుష్ చేయాల్సి ఉంటుంది. అలా పుష్ చేస్తున్నకొద్దీ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి తుంటి భాగంలో ఉండే ‘హిప్ ఫ్లెక్సార్ కండరాలు’ అవసరమైనదానిక కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో హిప్ ఫ్లెక్సార్ కండరాలపై చాలా బరువు పడుతుంది. బ్యాలెన్స్: పాయింటెడ్ హీల్పై నిలబడటాన్ని ఎంతగా ప్రాక్టీస్ చేస్తే వారు అంత నాగరికులని లెక్క. కానీ జరగబోయే అనర్థాన్ని మహిళలు గుర్తించడం లేదు. ఇలా చేయడం వల్ల మన పాదం, చీలమండ బయటివైపునకు (స్యూపినేటెడ్) కదులుతాయి. ఫలితంగా బ్యాలెన్స్ కోల్పోయే అవకాశాలు మరింత పెరుగుతాయి. బ్యాలెన్స్ కోల్పోయే అవకాశాలు పెరిగినకొద్దీ పడటం, గాయపడటం వంటి ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. వెన్ను సున్నమవ్వడం ఖాయం: మన వీపు ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’ ఆకృతిలో ఉంటుంది. హైహీల్స్ తొడగడం వల్ల నడుం భాగం (లంబార్) ప్రాంతం తన ఒంపును కోల్పోయి నిటారుగా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఛాతీకి వెనకభాగపు వీపు (థొరాసిక్ లేదా మిడ్ బ్యాక్), మెడ, తల... ఇవన్నీ తమ స్వాభావికమైన ఒంపును కోల్పోయి సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్’ ఆకృతి ఒంపు కాస్తా ఒక కర్రలా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్మెంట్లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది. హిప్ (తుంటి భాగం)లో: మన తుంటి భాగంలో ఉండే హిప్ ఫ్లెక్సార్ కండరాలు తొడల పై భాగంలో వెనకవైపున ఉంటాయి. మనను ముందుకు నడిచేలా చేసే కండరాలు ఇవే. హైహీల్స్ కారణంగా వీటిలో ఉండాల్సినంత బలం లోపించడంతో సమర్థంగా నడిపించలేవు. పైగా హైహీల్స్ వల్ల అవి పొట్టిగా మారడమే కాకుండా... కంట్రాక్చర్స్ వచ్చే అవకాశం ఉంది. (మనకు ఏదైనా కండరం కాలినప్పుడు లోపల కదుము కట్టినట్లుగా బిగుతుగా మారి చర్మం నుంచి బయటకు కనిపించే భాగాన్ని కంట్రాక్చర్స్ అంటారు. కాలడం అన్నమాటను ఉదాహరణకు చెప్పినదే. కాలకపోయినా సరే కంట్రాక్చర్స్ వస్తాయి). మోకాళ్లు (నీస్): హైహీల్స్ వల్ల మహిళల్లో మోకాళ్లకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువ. హైహీల్స్ తొడిగినప్పుడు మోకాళ్లు ఒంగాల్సి (ఫ్లెక్స్‌డ్) వస్తుంది. ఇది మోకాళ్లలో లోపలివైపునకు ఒత్తిడిని (ఇన్వర్డ్ ఫోర్స్) వృద్ధి చేస్తుంది. దాంతో మోకాలిలోపలి భాగంలో అరుగుదల కనిపించి ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణమవుతుంది. చీలమండ (యాంకిల్): హైహీల్స్ వల్ల చీలమండ భాగంలోని యాంకిల్ జాయింట్ కదలికలు చాలా తగ్గిపోతాయి. దాంతో పిక్క కండరాలు (కాఫ్ మజిల్స్) పొట్టిగా మారతాయి. మడమ ఎముక (క్యాల్కేనియస్)పై ఒత్తిడి పడుతుంది. ఈ మొత్తం ప్రయత్నం వల్ల ‘ఇన్సెర్షనల్ ఎకిలిస్ టెండనైటిస్’ అనే ఒక రుగ్మత రావచ్చు. పాదం (ఫీట్): మామూలుగా పాదం నేలకు ఆనించి ఉన్నప్పటి కంటే... హీల్ పెరుగుతున్న కొద్దీ కాలి ముందు భాగంలో ఉండే ఎముకలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కాలి నొప్పి, పాదం నిర్మాణంలో మార్పులు, హ్యామర్ టో, బునియోనెటీస్ వంటి కాలి వ్యాధులు, న్యూరోమా వంటి కండిషన్స్ అభివృద్ధి చెందవచ్చు. హైహీల్స్ వాడేవారికి టిప్స్: హైహీల్స్ వేసుకునే ముందు మీ మోకాలి కింద వెనక భాగంలో ఉండే కాఫ్ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ వార్మప్ మసాజ్‌లా చేయండి. వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ కోసం అటూ ఇటూ పరుగెత్తి ఆ తర్వాత హైహీల్స్ వేసుకోండి. రోజంతా హైహీల్స్ వేసుకోకండి. మధ్యాహ్నం లేదా సాయంత్రాలే ధరించడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో మీ పాదల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. హై హీల్స్ ధరించడానికి అనుకూలం మీ హైహీల్ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి. అలాగని పూర్తిగా ఫ్లాట్‌గా ఉండే పాదరక్షలూ వద్దు. కాస్తంత మాత్రమే హీల్ ఉండే (లో హీల్) పాదరక్షలను ఎంచుకోండి. మీ మడమ వెడల్పు ఎంతో చూడండి. దానితో పోలిస్తే మీ మడమ ఎత్తు అందులో సగం ఉంటే అది సరైన ఆరోగ్యకరమైన హీల్ అని గుర్తుంచుకోండి. మీ హైహీల్స్ తొడిగే ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గితే మీకు దాని వల్ల వచ్చే నొప్పులూ అంతగా తగ్గుతాయి. మీరు హైహీల్స్ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాల వల్ల అసలు పాదరక్షలే తొడగలేని పరిస్థితి కూడా రావచ్చని గుర్తుంచుకోండి. హైహీల్స్ తొడిగాలనే కోరిక ఉంటే కొద్దికొద్దిగా హీల్‌ను పెంచుకోండి తప్ప... ఒకేసారి ఎక్కువ ఎత్తున్న హైహీల్స్ వేసుకోవద్దు. మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్ వేసుకుంటే అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ను చేయండి. హైహీల్స్ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి. డాక్టర్ కె. సుధీర్ రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్