మగాళ్లు బలంగా ఉండాలంటే హైహీల్స్‌ వేసుకోవాలట..! | Sydney man wears HEELS to work for powerfulness | Sakshi
Sakshi News home page

మగాళ్లు బలంగా ఉండాలంటే హైహీల్స్‌ వేసుకోవాలట..!

Published Sun, Mar 11 2018 1:02 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Sydney man wears HEELS to work for powerfulness - Sakshi

హైహీల్స్‌ ధరించిన యాష్లే మాక్స్వెల్-లామ్

సిడ్నీ : మగాళ్లు ఏంటి? హైహీల్స్‌ వేసుకోవడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా.. అందరిలాగా ఆలోచిస్తే కిక్కేముందనుకున్నాడో ఏమో ఓ మహాశయుడు ఇలాగే వెరైటీగా ఆఫీస్‌కు వెళ్లడం మొదలుపెట్టాడు. మహిళలు ధరించే హైహిల్స్‌ వేసుకొని ఆఫీస్‌కు వెళుతున్నాడు. ఇదేంటి అని పక్కవాళ్లు నవ్వుకున్నా.. తోటి ఉద్యోగులు ఎద్దేవా చేసినా అతను వెరవలేదు. అంతేకాదు.. హైహిల్స్‌ కంటే మహిళలాగా పురుషులు కూడా శక్తిమంతంగా తయరు కావొచ్చునని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అతని ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన యాష్లే మాక్స్వెల్-లామ్.. ఇలా ఆడవాళ్లు ధరించే హైహీల్స్‌ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఓ ప్రైవేటు కంపెనీలో ఫైనాన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఇతడు కొన్నేళ్ల కిందటి వరకు అందరిలాగే మామూలుగా పురుషుల షూస్‌ వేసుకొని ఆఫీస్‌కు వెళ్లేవాడు. అయితే, తన ఆఫీసులో పనిచేసే ఓ మహిళా సహోద్యోగి.. ఆమె శక్తివంతంగా ఉండడానికి కారణం హైహీల్సేనని చెప్పింది. కావాలంటే వేసుకుని చూడమని సలహా ఇచ్చింది. ఆ సలహా నచ్చడంతో లామ్‌.. లైఫ్‌స్టైలే మారిపోయింది. ఇప్పుడు అతను ఎక్కడికివెళ్లినా.. అందరి చూపు అతని వేసుకునే చెప్పులపైనే ఉంటుంది. అతను హైహీల్స్‌ ధరించడం..చూసేవారికి వింతగా తోచినా.. ఇవి ధరించడం వల్ల చాలా హుందాగా, శక్తిమంతంగా ఉన్నానని నిర్మోహమాటంగా చెప్తున్నాడు. అనుమానం ఉంటే మీరు కూడా ధరించండని సలహా ఇస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement