పరుగు పందెం అంటే ఏంటో అందరికీ తెలిసిందే. కానీ హైహిల్స్‌తో హైస్పీడ్‌గా పరుగు తీయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడొక వ్యక్తి ఆ అడ్వెంచర్‌ని చాలా సునాయాసంగా చేసి ప్రపంచ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. వివరాల్లోకెళ్తే..స్పెయిన్‌కి చెందిన 34 ఏళ్ల సీరియల్ రికార్డ్ బ్రేకర్ క్రిస్టియన్ రాబర్టో లోపేజ్ రోడ్రిగ్జ్ ఈ రికార్డుని సాధించాడు. అతను సుమారు 2.76 అంగుళాల స్టిలెట్టో హీల్స్ ధరించి కేవలం 12.82 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తి ఈ రికార్డు సృష్టించాడు.
గతంలో 2019లో 14.02 సెకన్లలో 100 మీటర్లని హైహిల్స్‌తో పరుగెత్తిన ఆండ్రీ ఓర్టోల్ఫ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు రోడ్రిగ్జ్. ఈ మేరకు అతను మాట్లాడుతూ..ఇలా పరుగెత్తడం తనకొక సవాలని, ఇలాంటి రేసులను ఎన్నో అవలీలగా సాధించానని చెబుతున్నాడు. అంతేగాదు తనలాంటి టైప్ 1 మధుమేహ వ్యాధిగ్రస్తులు.. మధుమేహం లేని వ్యక్తుల కంటే అన్ని పనులు చురుగ్గా చేయగలరని నిరూపించేందుకే తాను ఈ రికార్డు సాధించినట్లు చెప్పుకొచ్చాడు.
రోడ్రిగ్జ్ గతంలో కళ్లకు గంతలు కట్టుకని సుమారు 100 మీటర్లు ముందుకు, వెనుకకు వేగంగా పరుగెత్తి రికార్డు సృష్టించాడు కూడా. అలాగే కళ్లకు గంతలు కట్టుకుని సుమారు 100 మీటర్లు వేగంగా పరిగెడుతూ.. అదే సమయంలో మూడు వస్తువులతో గారడీ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు.
(చదవండి: ఆలస్యం కానిదే ఏది కాదేమో! ఓ వ్యక్తి ఆన్‌లైన్ ఆర్డర్ పెడితే..ఏకంగా..)
Comments
Please login to add a commentAdd a comment