Running race
-
గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా..
అట్లాంటా: పీచ్ ట్రీలో జరిగిన మహిళల 10 కిలోమీటర్ల పరుగుపందెంలో ఇతియోపియా కు చెందిన ఒలింపియన్ అథ్లెట్ సెన్బెర్ టెఫెరి మొత్తం పరుగు పందాన్ని పూర్తి చేసి గమ్యస్థానానికి ఆమడ దూరంలో చేయకూడని పొరపాటు చేసి 10,000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీని కోల్పోయింది. ఇతియోపియాకు చెందిన 28 ఏళ్ల అథ్లెట్ సెన్బెర్ టెఫెరి జులై 4న జరిగిన అట్లాంటాలో జరిగిన 10,000 కిలోమీటర్ల పరుగు పందెంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. మొత్తం పరుగు పందాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సెన్బెర్ చివరి అంచెలో పరిగెడుతుండగా ఆమె పొరపాటున ఆమె ముందున్న ఎస్కార్ట్ బైక్ ను అనుసరించి కుడి వైపుకు తిరిగిపోయింది. అప్పటికి పరుగులో ఆమె మిగతా వారికంటే చాలా ముందుంది. కానీ ఆమె రాంగ్ టర్న్ తీసుకుని పెద్ద పొరపాటు చేయడంతో మిగతావారు ఆమెకంటే ముందు గమ్యాన్ని చేరుకున్నారు. పక్కనున్న వారు సెన్బెర్ ను అప్రమత్తం చేశాక మళ్ళీ ఆమె సరైన దిశగా పరుగు లంఘించుకుని గమ్యాన్ని చేరుకొని మూడో స్థానంలో నిలిచింది. ఈ రేసులో మొదటి స్థానంలో నిలిచిన టెస్ఫే 10 వేల డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకోగా సెన్బెర్ మాత్రం 3000 డాలర్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది. రేసు పూర్తయ్యాక సెన్బెర్ జరిగిన పొరపాటుకి బాధతో కుమిలిపోయింది. సహచరులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కీలకమైన దశలో సెన్బెర్ చేసిన పొరపాటు ఖరీదు 7 వేల డాలర్లన్న మాట. During the women's elite division of the Peachtree Road Race, a 10-kilometer race held annually in Atlanta on July 4, one runner took a wrong turn just before the finish line, costing her the win pic.twitter.com/qRs9Umk19y — CNN (@CNN) July 4, 2023 ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో వీరంగం.. కంప్యూటర్లను నేలకేసి కొట్టి.. -
హైహిల్స్‌తో రన్నింగ్ చేసి..గిన్నిస్ రికార్డు సృష్టించాడు!
పరుగు పందెం అంటే ఏంటో అందరికీ తెలిసిందే. కానీ హైహిల్స్‌తో హైస్పీడ్‌గా పరుగు తీయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడొక వ్యక్తి ఆ అడ్వెంచర్‌ని చాలా సునాయాసంగా చేసి ప్రపంచ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. వివరాల్లోకెళ్తే..స్పెయిన్‌కి చెందిన 34 ఏళ్ల సీరియల్ రికార్డ్ బ్రేకర్ క్రిస్టియన్ రాబర్టో లోపేజ్ రోడ్రిగ్జ్ ఈ రికార్డుని సాధించాడు. అతను సుమారు 2.76 అంగుళాల స్టిలెట్టో హీల్స్ ధరించి కేవలం 12.82 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తి ఈ రికార్డు సృష్టించాడు. గతంలో 2019లో 14.02 సెకన్లలో 100 మీటర్లని హైహిల్స్‌తో పరుగెత్తిన ఆండ్రీ ఓర్టోల్ఫ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు రోడ్రిగ్జ్. ఈ మేరకు అతను మాట్లాడుతూ..ఇలా పరుగెత్తడం తనకొక సవాలని, ఇలాంటి రేసులను ఎన్నో అవలీలగా సాధించానని చెబుతున్నాడు. అంతేగాదు తనలాంటి టైప్ 1 మధుమేహ వ్యాధిగ్రస్తులు.. మధుమేహం లేని వ్యక్తుల కంటే అన్ని పనులు చురుగ్గా చేయగలరని నిరూపించేందుకే తాను ఈ రికార్డు సాధించినట్లు చెప్పుకొచ్చాడు. రోడ్రిగ్జ్ గతంలో కళ్లకు గంతలు కట్టుకని సుమారు 100 మీటర్లు ముందుకు, వెనుకకు వేగంగా పరుగెత్తి రికార్డు సృష్టించాడు కూడా. అలాగే కళ్లకు గంతలు కట్టుకుని సుమారు 100 మీటర్లు వేగంగా పరిగెడుతూ.. అదే సమయంలో మూడు వస్తువులతో గారడీ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆలస్యం కానిదే ఏది కాదేమో! ఓ వ్యక్తి ఆన్లైన్ ఆర్డర్ పెడితే..ఏకంగా..) -
బసలదొడ్డి గ్రామంలో మహిళలకు పరుగు పందెం పోటీలు
-
సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఇటలీలోని వెరోనాలో మంగళవారం జరిగిన యురోపియన్ ఛాంపియన్‌షిప్‌లో లిథువేనియాకు చెందిన 41 ఏళ్ల అలెగ్జాండర్ సోరోకిన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 24 గంటల్లో సోరోకిన్ 319.614 కిలోమీటర్ల దూరం పరిగెత్తి ప్రపంచ రికార్డు లిఖించాడు. కాగా అలెగ్జాండర్ సగటున ఒక కిలోమీటర్ దూరాన్ని 4.30 నిమిషాల్లో దాటేశాడు.ఇంతకముందు అతని పేరిటే ఉన్న రికార్డుపే సోరోకిన్ బద్దలు కొట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో 24 గంటల్లో అతను 303.506 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తాడు. తాజా రికార్డుపై 40 ఏళ్ల సోరోకిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. ''చాలా అలిసిపోయా.. కానీ రికార్డుతో డబుల్ ఆనందంతో ఉన్నా. విషయమేంటనేది అర్థమయిందిగా.. ప్రపంచ రికార్డు కొట్టడం ఒక ఎత్తయితే.. నా రికార్డును నేనే బద్దలు కొట్టడం మరింత సంతోషాన్నిచ్చింది.'' అంటూ తెలిపాడు. ఇక పొలాండ్‌కు చెందిన అథ్లెట్ పియోట్రోస్కీ 24 గంటల్లో 301.858 కిలోమీటర్ల దూరం పరిగెత్తి రెండో స్థానంలో నిలవగా.. ఇటలీకి చెందిన మార్కో విసినిటీ 288 కిలోమీటర్ల దూరం పరిగెత్తి మూడో స్థానంలో నిలిచాడు. Ultrarunning legend Aleksandr Sorokin has just smashed his own record (192.252 miles) of distance covered in 24 hours of running 🔥🇱🇹 The Lithuanian has just covered 318.8km / 198.1 miles (unofficial) – 7:15/mile and 4:30/km pace...over a day 🤯 pic.twitter.com/35pWdAE3Ug — AW (@AthleticsWeekly) September 18, 2022 View this post on Instagram A post shared by Aleksandr Sorokin (@ultrarunner_aleksandr_sorokin) చదవండి: Karman Kaur: భారత నంబర్‌వన్‌గా కర్మన్ కౌర్ ICC New Rules: అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా -
World Masters Athletics: 94 ఏళ్ల వయసులో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్
ఫిన్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్-2022లో భారత అథ్లెట్ భగవానీ దేవీ సంచలనం సృష్టించింది. 94 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించి ఔరా అనిపించింది. 35 ఏళ్లు పైబడిన వారు పోటీ పడిన ఈ రేసును భగవానీ దేవీ 24.74 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించింది. India's 94-year-old #BhagwaniDevi Ji has yet again proved that age is no bar! She won a GOLD medal at the #WorldMastersAthleticsChampionships in Tampere in the 100m sprint event with a timing of 24.74 seconds.🥇She also bagged a BRONZE in Shot put. Truly commendable effort!👏 pic.twitter.com/Qa1tI4a8zS — Dept of Sports MYAS (@IndiaSports) July 11, 2022 లేటు వయసులో సాధించిన ఘనతకు గాను భగవానీ దేవీకి విశ్వం నలుమూలల నుంచి నీరాజనాలు అందుతున్నాయి. ఏదైనా సాధించేందుకు వయసుతో సంబంధం లేదని భగవానీ దేవీ మరోసారి నిరూపించిందని అభినందనలు అందుతున్నాయి. భగవానీ దేవీ సాధించిన ఘనతను కొనియాడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. నెటిజన్లు భగవానీ దేవీని ఆకాశానికెత్తుతున్నారు. సోషల్‌మీడియాలో భగవానీ దేవీ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. చదవండి: ప్రపంచకప్ బరిలో నుంచి టీమిండియా ఔట్ -
82 ఏళ్లు.. 24 గంటలు.. 125 కిలోమీటర్లు
ఇవేం లెక్కలబ్బా... అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? బార్బరా హంబర్ట్ అనే ఫ్రాన్స్ మహిళ రికార్డులివి. గత నెలాఖరులో జరిగిన ఫ్రెంచ్ చాంపియన్‌షిప్‌లో 24 గంటల్లో 125 కిలోమీటర్లు పరుగెత్తి ప్రపంచరికార్డు సృష్టించింది 82 ఏళ్ల బార్బరా. 24 గంటల్లో 105 కిలోమీటర్లు పరుగెత్తి ఓ జర్మన్ మహిళ నెలకొల్పిన రికార్డును బార్బరా బ్రేక్ చేసింది. ఆ వయసులో అలా పరుగెత్తిందంటే ఆమె జీవితమంతా రన్నింగేనేమో అనుకోకండి. తనకు 43 ఏళ్ల వయసులో అంటే తన కూతురు హైస్కూల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ టైమ్‌లో రన్నింగ్ మొదలుపెట్టారామె. మొదట బౌఫ్మాట్వీధులకే పరిమితమైన బార్బరా పరుగు... తరువాత మారథాన్స్ దాకా వెళ్లింది. ఈ 39 ఏళ్ల కాలంలో పారిస్, న్యూయార్కుల్లో జరిగిన 137 రేసులు, 54 మారథాన్స్‌లో పాల్గొన్నది. ‘మొదట మెడిటేషన్‌లాగా మొదలుపెట్టాను. కానీ వీధుల్లో పరుగెడుతున్నప్పుడు కలిగిన స్వేచ్ఛా భావన నాకో స్పష్టతనిచ్చింది. అప్పటినుంచి పరుగును ఆపలేదు’ అంటుంది బార్బరా. అంతేకాదు.. పరుగు పూర్తయ్యేవరకు దాహం, ఆకలి, నిద్ర అన్నింటినీ మరిచిపోతుంది. ముగింపు లైన్ దాటాకే ఆమెకు అలసట గుర్తొస్తుంది. 14 గంటల రేసులో ఆమెతోపాటు ఉండి... అవసరమైనవల్లా అందించిన ‘మై హస్బెండ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అంటారు బార్బరా. ఆ వయసులో పరుగు మొదలుపెడితే అడ్డంకులేం ఎదురు కాలేదా? అంటే... చాలా గాయాలయ్యాయి. నొప్పులొచ్చాయి. అయినా ఇవేవీ ఆమె పరుగును ఆపలేకపోయాయి. ఎలాంటి మందులు వేసుకోను, కేవలం ట్రైనింగ్‌నే నమ్ముతానని చెప్పే బార్బరా.. రన్నింగ్‌ను వదిలేస్తే మాత్రం నిరుత్సాహం ఆవహిస్తుందంటారు. -
స్ఫూర్తి: సూపర్ రన్నర్ సుప్రీతి!
హరియాణాలోని పంచకులలో జరుగుతోన్న ఖేలో ఇండియా యూత్ అథ్లెటిక్స్‌లో జార్ఖండ్‌కు చెందిన సుప్రీతి కచ్చప్ 3000 మీటర్లను 9 నిమిషాల,46.14 సెకన్లల్లో పరుగెత్తి సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రాక్ మీద రన్నింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. కనీసం నడవడం కూడా నేర్చుకోని సమయంలో తండ్రిని కోల్పోయి, అమ్మ పెంపకంలో నడక నేర్చుకుని, పట్టుదల కష్టంతో రన్నింగ్‌లో దూసుకుపోతుంది. జార్ఖండ్‌లోని బుర్హు గ్రామానికి చెందిన సుప్రీతి తండ్రి రామ్‌సేవక్ ఓరాన్ ఇంటికి దగ్గరలో ఉన్న గ్రామంలో డాక్టర్‌గా పనిచేసేవారు. తల్లి బాలమతి గృహిణి. అది 2003.. ఓ రోజు రాత్రవుతున్నా రామ్‌సేవక్ ఇంటికి రాలేదు. తండ్రి కోసం సుప్రీతితో పాటు అమ్మ, నలుగురు తోబుట్టువులు ఎదురు చూస్తున్నారు. అర్థరాత్రి అయినా ఇంకా ఇంటికి చేరలేదు. అదే రోజు రామ్ సేవక్‌ను తుపాకితో కాల్చి చంపి చెట్టుకు వేలాడదీశారు నక్సలైట్లు. ఈ విషాధకర దుర్ఘటన జరిగినప్పుడు సుప్రీతి బుడిబుడి అడుగులు కూడా సరిగా వేయలేని చిన్నారి. రామ్ సేవ్క్ చనిపోయిన తరువాత బాలమతికి బీడీవో ఆఫీసులో నాలుగోతరగతి ఉద్యోగం వచ్చింది. దీంతో తన ఐదుగురు íపిల్లలతో గుమ్లాలోని గవర్నమెంట్ క్వార్టర్స్‌లోకి మకాం మార్చింది. మట్టి ట్రాక్‌పై పరుగెడుతూ.. క్వార్టర్స్‌లో ఉన్న మిగతా పిల్లలతో సుప్రీతి ఎంతోయాక్టివ్గా ఆడుకుంటూనే, దగ్గర్లోని గ్రౌండ్లో రన్నింగ్ సాధన చేస్తుండేది. సుప్రీతికి రన్నింగ్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన బాలమతి మరింత ప్రోత్సహించి రన్నింగ్ చేయమని చెప్పేవారు. దీంతో నుక్రుడిప్పా చెయిన్‌పూర్ స్కూల్లో ఉన్న చిన్నపాటి మట్టి ట్రాక్‌పైనే కొన్నేళ్లు రన్నింగ్ చేసేది. తరువాత సెయింట్ పాట్రిక్ స్కూల్‌కు మారింది. అక్కడ సుప్రీతి ప్రతిభను గుర్తించిన యాజమాన్యం ఆమెకు స్కాలర్షిప్ను అందించి అథ్లెట్స్‌తో కలిసి శిక్షణ ఇప్పించింది. శిక్షణ తీసుకుంటూ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో పాల్గొన్న సుప్రీతి కోచ్ ప్రభాత్ రంజన్ తివారీ దృష్టిలో పడింది. దీంతో సుప్రీతికి మరింత శిక్షణ ఇస్తే మెడల్స్ సాధిస్తుందని గ్రహించిన ప్రభాత్ 2015ల గుమ్రాలోని జార్ఖండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఇక్కడ 400 మీటర్లు, 800 మీటర్లు చాలా వేగంగా పరుగెత్తడం నేర్చుకుంది. క్రమంగా ఆమె వేగాన్ని 1500 మీటర్లకు పెంచారు. దీంతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేది. తొలి మెడల్ సుప్రీతి 2019లో మధురలో జరిగిన నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని తొలిసారి 2000 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకం గెలుచుకుంది. ఇదే ఏడాది గుంటూరులో జరిగిన 3000 మీటర్ల నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం అందుకుంది. క్రమంగా తన రన్నింగ్‌ను మెరుగు పరుచుకుంటూ గడిచిన మూడేళ్లలో పదినిమిషాల్లో మూడువేల మీటర్లను ఛేదించి వెండిపతకం, కాంస్య పతకాలను జూనియర్ ఫెడరేషన్ కప్‌లో గెలుచుకుంది. వారానికి 120 కిలోమీటర్లు.. సుప్రీతి లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు పట్టుదలతో తీవ్రంగా సాధన చేసేది. దీంతో వారానికి 80 కిలోమీటర్లు రన్నింగ్ చేసే సామర్థ్యాన్ని, వారానికి 120 కిలోమీటర్లకు పెంచింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ముందు కోజికోడ్‌లోని ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల ఐదువేల మీటర్ల కాంపిటీషన్లో పాల్గొంది. 16.40 నిమిషాల్లో పూర్తిచేయాల్సిన రేసుని 16.33 సెకన్లలో పూర్తిచేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు అర్హత సాధించింది. తాజాగా ఖేలో ఇండియా గేమ్స్‌లో జార్ఖండ్ రాష్ట్ర పతకాల జాబితాలో గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది సుప్రీతి. ‘అదృష్టంలేదు, ఎంత ప్రయత్నించినా నెగ్గలేకపోతున్నాం’ అని చెప్పేవాళ్లకు, కష్టడితే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి సుప్రీతి ఉదాహరణగా నిలుస్తోంది. ‘‘నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎంతోమంది అనేక గేమ్స్‌లో విజేతలుగా నిలుస్తున్నారు. వీరంతా నాకు ప్రేరణ. అనేక మంది సక్సెస్ స్టోరీల నుంచి స్ఫూర్తిని పొంది నేను ఇప్పుడు గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నాను. మానాన్న ఎలా ఉండేవారో నాకు గుర్తులేదు. కానీ ఈ మెడల్ ఆయనకే అంకితం ఇస్తున్నాను. నా విజయం వెనుక అమ్మ, కోచ్‌ల ప్రోత్సాహం చాలా ఉంది. పరిస్థితులు మనకు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కష్టపడి వాటì ని అనుకూలంగా మార్చుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చు’’ – సుప్రీతి -
ఈ తాత మామూలోడు కాదండోయ్
తాత అనేగానే.. ఒళ్లు కుంగిపోయి, చర్మం ముడతలు పడి, సరిగ్గా కదల్లేక ఓ మూలన కూర్చుంటాడు అనుకుంటారేమో. ‘కబాలీ.. రా’ రేంజ్లో హుషారు చూపిస్తుంటాడీ తాత. ఈ తాత మామూలోడు కాదు. పేరు.. సావాంగ్ జన్‌ప్రామ్. వయసు 102 ఏళ్లు. ఉండేది థాయ్‌లాండ్ సాముత్ సాంగ్ఖ్రమ్ ప్రావిన్స్‌లో. పోయినవారం అక్కడ 26వ ఇటెరేషన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. అందులో 100-105 ఏళ్ల కేటగిరీకి జరిగిన పోటీల్లో ఈ తాతే మొత్తం మెడల్స్ మెడలో వేసేసుకున్నాడు. స్వతహాగానే ఈ పెద్దాయన ఒక అథ్లెట్. అందుకే ఈ ఏజ్‌లోనూ హుషారుగా పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ఈసారి పోటీల్లో ఈయనగారు ఏకంగా ఓ రికార్డ్ కూడా నెలకొల్పాడు. తన ఈడు వాళ్లతో పోటీపడి వంద మీటర్ల పరుగు పందెంను 27.08 సెకన్లలో పూర్తి చేశాడు. 100 మీటర్ల పరుగు పందెంలో జమైకా పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ పేరిట ఉంది(2009లో 9.58 సెకండ్లు). అలాంటిది ఈ ఏజ్‌లో ఈ తాత ఈ రికార్డును నెలకొల్పడం గొప్పే కదా! Sawang Janpram, 102, broke the Thai 100m record – for centenarians – at the annual Thailand Master Athletes Championships https://t.co/GZcaQGrAoR pic.twitter.com/OxqGLiXySI — Reuters (@Reuters) March 3, 2022 ఈ గొప్పతనం వల్లే ఈ తాతకి.. లేడీస్లోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. యూత్ ఫిజికల్ టిప్స్ కోసం ఈ తాతను కలుస్తుంటారు.. ఇక డెభ్భై ఏళ్ల ఆయన కూతురే సిరిపాన్.. ప్రస్తుతం సావాంగ్కు ట్రయినర్‌గా ఉంది. ఆటలే నన్ను ధృడంగా ఉంచుతున్నాయి. టైంకి మంచిగా తిని.. ఎక్సర్సైజులు గట్రా చేస్తే నాలాగే మీరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నాడు ఈ తాత. వీటితో పాటు పాజిటివ్ మైండ్ తన తండ్రి ఆరోగ్య రహస్యం అంటోంది సిరిపాన్. థాయ్‌లాండ్ మాస్టర్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ పోటీలు 1996 నుంచి నడుస్తున్నాయి. అప్పుడు కేవలం 300 మంది మాత్రమే పాల్గొన్నారు. మరి ఇప్పుడో.. 2 వేల మంది.. అదీ 35 నుంచి 102 ఏళ్ల మధ్యవయస్కులు పాల్గొంటున్నారు. అంటే.. ఫిట్నెస్ మీద థాయ్‌లాండ్ ప్రజలకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
అలుపెరుగని అథ్లెటిక్.. పరుగులో రారాజు
మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఆయన వయసు 67 ఏళ్లు...అయినా 20 ఏళ్ల యువకుడిలా ఫిట్‌గా ఉంటాడు. ఎవరైనా సరే నాతో పరుగెత్తగలరా అంటూ సవాల్ విసురుతాడు. కచ్చితంగా గెలిచే తీరుతాడు. 60–75 ఏళ్ల విభాగంలో పోటీలో పాల్గొంటూ పతకాలు గొల్లగొడుతున్నాడు. అతనే ఇందిరాకాలనీకి చెందిన ఆకుల కనకరాజు. ఇప్పటికీ అదే ఉత్సాహం కనకరావుకు ఇప్పడు 65 ఏళ్లు. అయినా నిత్యయువకుడిలా పరుగులో రాణిస్తున్నాడు. తెల్లవారు జామునే నిద్ర లేవడం.. రన్నింగ్‌కు వెళ్లడం నిత్య దినచర్య. ప్రస్తుతం కనకరాజు షిప్‌యార్డ్ జూనియర్ కళాశాలలో పీఈటీగా పనిచేస్తున్నాడు. రన్నింగ్‌తో పాటు బాడీబిల్డింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్ వంటి క్రీడలు కనకరాజుకు అనుభవం ఉంది. ఆ క్రీడల్లో కూడా పతకాలు సాధించాడు. 1972లో తొలిసారిగా.. 1972లో ఇండియన్ నేవి విశాఖలో ఏర్పాటు చేసిన పది కిలో మీటర్ల పరుగు పందెంలో తొలి స్థానంలో నిలిచాడు. అప్పటి నుంచి ఏటా వివిధ రాష్ట్రాలలో జరిగే పరుగు పందెంలో పాల్గొని పతకాలు సాధించాడు. 65 ఏళ్ల వయసులో కూడా (2000వ సంవత్సరం) హరియానలో జరిగిన జాతీయ స్థాయి 4 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. వంద, రెండు వందలు ,మూడు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ఇప్పటి వరకు నాలుగు వందల వరకు పతకాలు సాధించాడు. ఇప్పటి వరకు సాధించిన పతకాలు 140 జీవీఎంసీ 60వ వార్డు పరిధి ఇందిరాకాలనీ– 1 ప్రాంతానికి చెందిన ఆకుల కనకరాజు అథ్లెటిక్స్ రాణిస్తు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వయసు 67 ఏళ్లయినా వెనుకడుగు వేయకుండా పరుగులో నంబర్–1 గా నిలుస్తున్నాడు. పదో తరగతి పూర్తి చేసిన కనకరాజు ఇండియన్ ఆర్మీలో చేరాడు. అక్కడ అధికారులు ఇచ్చిన పోస్టు నచ్చక ఏడాదికి తిరిగి వచ్చాశాడు. విశాఖలో హోంగార్డుగా ఐదేళ్లు పనిచేశాడు. అనంతరం సీలేరు వద్ద గల ప్రభుత్వ ఐటీఐలో మేల్ నర్స్‌గా చేరాడు. తరువాత విశాఖ సెంట్రల్ జైల్లో మేల్ నర్సింగ్ విధులు నిర్వహించి అక్కడే పదవీ విరమణ పొందాడు. కనకరాజు 13 ఏళ్ల వయసులోనే పరుగు మొదలు పెట్టాడు. షిప్‌యార్డ్, జింక్, పోర్టు గ్రౌండ్లో రన్నింగ్ ప్రాక్టిస్ చేశాడు. -
Scooter Trolley: ఐడియా అదిరింది
రోజువారీ రవాణా ఖర్చులు పెరుగుతుండటంతో ఈ యువ రైతు కొత్తగా ఆలోచించాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్‌కడ్మూర్‌కు చెందిన జానకి రాంరెడ్డి తమకున్న ఆరెకరాల పొలంలో బొప్పాయి తోటను సాగు చేశాడు. ఈ పండ్లను అమ్మడానికి అమరచింత, ఆత్మకూర్‌కు రావడానికి ఆటోకు రోజుకు రూ.600 చెల్లించేవాడు. ఇది భారంగా మారింది. అతను స్వతహాగా బైక్ మెకానిక్ కావడంతో దాన్నుంచి బయటపడే ఆలోచన చేశాడు. స్కూటర్‌కు ట్రాలీని జతపరిచాడు. తన భార్యతో కలిసి బొప్పాయిలను విక్రయిస్తున్నాడు. – అమరచింత పరుగో పరుగు జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో భవానీమాత జాతర సందర్భంగా ఆదివారం నిర్వహించిన శునకాల పరుగుపందెం పోటీలు ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతిని గద్వాలకు చెందిన శునకం దక్కించుకుంది. – గద్వాల (గట్టు) చిలుకమ్మ పలికింది.. విజయవాడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన డాగ్ షోలో రెండు చిలుకలు సందడి చేశాయి. ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన తోకటూ(తెల్ల రంగులో ఉన్నది), అమెరికా నుంచి తెచ్చిన మకావ్ చిలుకలు సందర్శకుల మాటలకు బదులిస్తూ వారిని ఆశ్చర్యచకితులను చేశాయి. దీంతో డాగ్‌షోకు వచ్చిన పలువురు ఈ చిలుకలతో సరదాగా మాట కలిపి ఆనందంలో మునిగితేలారు. – సాక్షి, విజయవాడ -
Harmilan Kaur: మహిళల 1500 మీటర్ల రేసులో 19 ఏళ్ల రికార్డు బద్దలు
ఢిల్లీ: మహిళల 1500 మీటర్ల రేసులో పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల హర్మిలన్ కౌర్ బైన్స్ 19 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. హర్మిలన్ 4ని:05.39 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2002 ఆసియా క్రీడల్లో 4ని:06.03 సెకన్లతో సునీతా రాణి నెలకొల్పిన రికార్డును హర్మిలన్ తిరగరాసింది. గత ఏడాదిన్నర కాలంలో హర్మిలన్ ఎనిమిది జాతీయస్థాయి రేసుల్లో పాల్గొనగా అన్నింటా విజేతగా నిలువడం విశేషం. తెలంగాణ మహిళల బృందానికి కాంస్యం జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో మహిళల 4X100 మీటర్ల రిలేలో తెలంగాణ బృందం కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. జీవంజి దీప్తి, నిత్య, మాయావతి నకిరేకంటి, అగసార నందినిలతో కూడిన తెలంగాణ రిలే జట్టు 47.18 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. రైల్వేస్‌కు స్వర్ణం, తమిళనాడుకు రజతం లభించాయి. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో తెలంగాణకు చెందిన అగసార నందిని ఫైనల్‌కు చేరింది. -
అమిత్ ఖత్రీకి రజతం
నైరోబి: భారత అథ్లెట్ అమిత్ ఖత్రీ సుదీర్ఘ పరుగులో సత్తా చాటుకున్నాడు. ప్రపంచ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 10,000 మీ. పరుగులో అతను రజత పతకం సాధించాడు. మహిళల 400 మీ. పరుగులో ప్రియా మోహన్ తృటిలో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రోహ్టక్కు చెందిన 17 ఏళ్ల టీనేజ్ అథ్లెట్ అమిత్ ఖత్రీ ఓ రకంగా అద్భుతమే చేశాడు. సాధారణంగా ఆఫ్రికా అథ్లెట్లకు మాత్రమే సాధ్యమయ్యే సుదీర్ఘ పరుగులో భారత అథ్లెట్ పతకం గెలవడం విశేషం. శనివారం జరిగిన పురుషుల పదివేల మీటర్ల రేస్‌వాక్‌లో అతను పోటీని 42 నిమిషాల 17.94 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన హెరిస్టోన్ వాన్యోని 42 ని.10.84 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకం సాధించగా, స్పెయిన్ అథ్లెట్ పాల్ మెక్‌గ్రాత్ (42ని.26.11 సె.) కాంస్యం గెలుపొందాడు. నిజానికి ఖత్రీ స్వర్ణం గెలిచే అవకాశాలు చివరి వరకు కనిపించాయి. వేగంగా దూసుకెళ్లిన అతను 8 ల్యాపులు ముగిసే సరికి అందరికంటే ముందున్నాడు. దాదాపు 9000 మీటర్ల దాకా ఇదే వేగం నమోదు చేయగా... స్థానిక అథ్లెట్ వాన్యోని అనూహ్యంగా ఆఖరి ల్యాపులో అమిత్ ఖత్రీని అధిగమించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. కెన్యా రాజధాని నైరోబి సముద్ర మట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంటుంది. ఇది భారతీయులకు ప్రతికూల ప్రదేశం. ఇలాంటి చోట భారత అథ్లెట్ సుదీర్ఘ పరుగులో స్వర్ణానికి చేరువగా వెళ్లడం ఆషామాషీ విషయం కాదు. పరుగు ముగిసిన అనంతరం ఖత్రీ మాట్లాడుతూ ‘నేను ఆశించిన ఫలితం కాదిది. అయినా సరే రజతంతో తృప్తిగా ఉన్నాను. ఐదు రోజుల ముందు ఇక్కడికొచ్చిన నన్ను ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టింది. ఒక ల్యాప్‌లో అయితే శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది’ అని అన్నాడు. పాల్గొన్న తొలి అంతర్జాతీయ పోటీలో రజతం గెలిచిన తన శిష్యుడి ప్రదర్శన పట్ల కోచ్ చందన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల 10వేల మీటర్ల రేస్‌వాక్‌లో బల్జీత్‌కౌర్ (48 ని.58.17 సె) ఏడో స్థానంలో నిలిచింది. ప్రియకు చేజారిన పతకం... మహిళల 400 మీటర్ల పరుగులో అనేక అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రియా మోహన్‌కు నిరాశే ఎదురైంది. దురదృష్టవశాత్తూ ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఫైనల్ పోటీని ప్రియ 52.77 సెకన్లలో ముగించింది. ఈ ఈవెంట్లో ఇమావోబంగ్ (నైజీరియా; 51.55 సె.), కార్నెలియా (పోలండ్; 51.97 సె.), కెన్యా అథ్లెట్ సిల్వియా చెలన్‌గట్ (52.23 సె.) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలిచారు. పురుషుల 400 మీ. హర్డిల్స్‌లో రోహన్ గౌతమ్ కాంబ్లి ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. సెమీస్‌లో అతను 52.88 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల హీట్స్‌లో అబ్దుల్ రజాక్, సుమిత్ చహల్, కపిల్, భరత్ శ్రీధర్‌లతో కూడిన జట్టు హీట్స్‌తోనే సరిపెట్టుకుంది. -
వినుకొండ యువకుడి ప్రతిభ: పరుగు పందెంలో పసిడి పతకం!
వినుకొండ (నూజెండ్ల): అంతర్జాతీయ పోటీల్లో గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్లా 5 కిలో మీటర్ల పరుగు పందెం విభాగంలో తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. భూటాన్‌లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు 3వ సౌత్ ఏషియన్ రూరల్ గేమ్స్ జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 4 దేశాల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, అబ్దుల్లా గతంలో కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో యూత్ రూరల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించిన జాతీయస్థాయి రన్నింగ్ పోటీల్లో 2 సార్లు, అంతర్జాతీయ స్థాయిలో నేపాల్‌లో జరిగిన పోటీల్లో 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే.... అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే ముందు అబ్దుల్లా ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం అబ్దుల్లాకు రూ. 50 వేల ఆర్థికసాయాన్ని చేసింది. ఈ మొత్తాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ సమక్షంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అబ్దుల్లాకు అందజేశారు. దీనిపై అబ్దుల్లా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రోత్సహిస్తే 2024 ఒలింపిక్స్‌లో కూడా ప్రతిభ కనబరుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
ఆ దేవుడి గౌరవార్థం ఒలింపిక్స్ మొదలయ్యాయట
వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో మొదలవుతుందన్నట్టు.. ప్రఖ్యాత ఒలింపిక్స్ కూడా కేవలం ఒక చిన్న రన్నింగ్ రేస్‌తోనే ప్రారంభమైంది! ఇప్పుడు వందలాది దేశాలు.. వేల మంది క్రీడాకారులు.. కోట్ల మంది వీక్షకులతో జపాన్‌లోని టోక్యోలో ఘనంగా క్రీడా సంగ్రామం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ చరిత్ర, ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ చిన్న రన్నింగ్ రేస్‌తో మొదలై.. గ్రీకుల పురాణాల ప్రకారం.. హెరాకల్స్ చక్రవర్తి వారి దేవుడు జియస్ గౌరవార్థం మొట్టమొదటగా ఒలింపియాలో తొలి క్రీడా పోటీలు నిర్వహించాడు. లిఖిత పూర్వక ఆధారాల ప్రకారమైతే.. క్రీస్తుపూర్వం 776వ సంవత్సరంలో ఒలింపియాలో 192 మీటర్ల పరుగు పందాలు నిర్వహించారు. కోరోబస్ అనే వంటవాడు అందులో గెలిచి.. మొదటి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచాడు. సుమారు వెయ్యి సంవత్సరాలు ఈ క్రీడాపోటీలు జరిగాయి. క్రీస్తుశకం 393లో గ్రీకు చక్రవర్తి థియోడొసియస్ క్రీడాపోటీలపై నిషేధం విధించడంతో పురాతన ఒలింపిక్స్ ఆగిపోయాయి. సుమారు 12 వందల ఏళ్ల తర్వాత 1850వ సంవత్సరంలో డాక్టర్ విలియం పెన్నీ బ్రూక్స్ ఒలింపిక్స్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. గ్రీస్‌లో అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్‌ను నిర్వహించాలని ప్రతిపాదించారు. మరో 40 ఏళ్ల తర్వాత.. పెన్నీ బ్రూక్స్ ఎంతగా ప్రచారం చేసినా తర్వాత 40ఏళ్లదాకా ఒలింపిక్స్ క్రీడల విషయం ముందుకు కదల్లేదు. చివరికి 1892లో ఫ్రాన్స్‌కు చెందిన పీ యర్ కోబర్టిన్ గట్టిగా ప్రయత్నించడంతో ఒలిం పిక్స్ నిర్వహణపై చర్చ మొదలైంది. 1894లో ‘ప్రపంచ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ)’ ఏర్పాటైంది. 1896లో గ్రీస్‌లోని ఏథెన్స్లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్స్ మొదలయ్యాయి. ప్రపంచ దేశాల మధ్య శాంతి, సహకారం, సోదరభావం పెంపొందించాలన్నదే ఈ క్రీడాపోటీల లక్ష్యమని ప్రకటించారు. కానీ మొదట్లో చాలా దేశాలు ఒలింపిక్స్‌ను అందుకు భిన్నంగా చూశాయి. అప్పట్లో వలస ప్రాంతాల విషయంగా యూరప్ దేశాల మధ్య కొనసాగుతున్న పోటీ, ఆధిపత్య పోరు వంటివి ఒలింపిక్స్‌కు చాలా ప్రాధాన్యం తీసుకొచ్చాయి. నాలుగేళ్ల తర్వాతే మహిళలకు చాన్స్ ఒలింపిక్స్ మొదలయ్యాక తొలి నాలుగేళ్ల పాటు మహిళా క్రీడాకారులను అనుమతించలేదు. 1890లో తొలిసారిగా టెన్నిస్, సెయిలింగ్, క్రోకెట్ (సుత్తి ఆకారంలో ఉండే బ్యాట్‌తో హాకీ తరహాలో ఆడే క్రీడ), ఈక్వెస్ట్రేనిజం (ఒకరకం గుర్రపు స్వారీ), గోల్ఫ్ క్రీడల్లో మహిళలకు అవకాశం కల్పించారు. ఒలింపిక్స్‌లో మహిళలకు అవకాశం కల్పించిన తర్వాత 90 ఏళ్లపాటు భారత మహిళా క్రీడాకారులెవరూ పతకాలు గెలుచుకోలేదు. తొలిసారిగా 2000 సిడ్నీ ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించింది. మన దేశం నుంచి వెళ్లింది ఒక్కరే.. ఒలింపిక్స్ మొదలయ్యే నాటికి భారతదేశం బ్రిటీషు వలస పాలనలోనే ఉంది. ఈ క్రమంలోనే 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున నార్మన్ ప్రిచర్డ్ అనే ఒకేఒక్క క్రీడాకారుడు పాల్గొన్నాడు. 1920లో ఆంట్వెర్ప్లో జరిగిన పోటీల్లో మాత్రం నలుగురు అథ్లెట్లు, ఇద్దరు రెజ్లర్లు పాల్గొన్నారు. నాజీల అహంకారాన్ని దెబ్బతీస్తూ.. 19వ శతాబ్దం తొలినాళ్ల నుంచీ జర్మనీలో నాజీయిజం పెచ్చుమీరింది. ఆర్యులు అయిన నాజీలు.. మనుషుల్లో తామే అత్యుత్తమ జాతి అని.. నల్లవారు కిందిస్థాయివారని చెప్పుకొనేవారు. ఆ అహంకారానికి 1936లో అమెరికన్ నల్లజాతి క్రీడాకారుడు జెస్సీ ఓవెన్స్ గట్టి దెబ్బకొట్టాడు. బెర్లిన్‌లో జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ఓవెన్స్ ఒక్కడే ఏకంగా నాలుగు బంగారు పతకాలు గెలుచుకున్నాడు. భారత హాకీ ‘బంగారం’ భారతదేశానికి చెందిన హాకీ టీమ్ 1928 నుంచే బంగారు పతకాల వేట మొదలుపెట్టింది. వరుసగా మూడు ఒలింపిక్స్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్, అమెరికా, జర్మనీలను ఓడించి బంగారు పతకాలను గెలుచుకుంది. తర్వాతి ఐదు ఒలింపిక్స్‌లలోనూ నాలుగు సార్లు గోల్డ్, ఒకసారి సిల్వర్ మెడల్ సాధించింది. చివరిగా 1980లో బంగారు పతకం గెలుచుకున్న హాకీ ఇండియా.. తర్వాతి నుంచి వెనుకబడి పోయింది. యుద్ధ క్షతగాత్రులతో ‘పారా ఒలింపిక్స్’ సాధారణ ఒలింపిక్స్ జరిగిన తరహాలోనే శారీరకంగా లోపాలు ఉన్న క్రీడాకారుల కోసం ‘పారా ఒలింపిక్స్’ నిర్వహిస్తారు. ప్రతి ఒలింపిక్స్ నుంచి రెండేళ్ల తర్వాత (అంటే ఒలింపిక్స్ జరిగే నాలుగేళ్ల గడువుకు మధ్యలో) ‘పారా ఒలింపిక్స్’ జరుగుతాయి. రెండో ప్రపంచ యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్న సైనికులకు గుర్తింపు, పునరావాసం కోసం 1948లో ప్రత్యేకంగా క్రీడాపోటీలు నిర్వహించారు. అవే 1960 నుంచి పారా ఒలింపిక్స్‌గా మారాయి. -
వైరల్: స్ప్రింటర్లను మించి కెమెరామెన్ పరుగో పరుగు..
బీజింగ్: మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఉత్తర చైనాలోని షాంకి ప్రావిన్స్‌లోని డాటాంగ్ విశ్వవిద్యాలయంలో పరుగు పందెం పోటీలు నిర్వహించారు. అయితే ఈ 100 మీటర్ల పరుగుపందెం ఈవెంట్‌ను కెమెరాలో బంధించే బాధ్యతను ఓ విద్యార్థికి అప్పగించారు. ఇంకేముంది ఆ విద్యార్థి ఈవెంట్‌ను వీడియో తీయడానికి ఓ 4 కిలోల భారీ కెమెరా గేర్‌ను పట్టుకొని స్ప్రింటర్ల కంటే వేగంగా పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 1.4 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. కెమెరామెన్ ప్రతి ఒక్కరినీ వీడియో తీయడానికి వేగాన్ని తగ్గించాల్సి వచ్చింది, లేకపోతే రాకెట్లా దూసుకుపోయేవాడు.’’ అంటూ ప్రశంస జల్లు కురిపించాడు. ఇక మరో నెటిజన్ ‘‘ ఆ బహుమతికి కెమెరామెన్ అర్హుడు.’’ అంటూ కామెంట్ చేశాడు. (చదవండి: ముంబైలో ఘోర ప్రమాదం.. 8 మంది పిల్లలతో సహా..) -
భారత క్రికెటర్లు ఇక 2 కిలోమీటర్లు పరుగెత్తాల్సిందే!
ముంబై: భారత క్రికెటర్ల ఫిట్నెస్ స్థాయిని పరీక్షించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న యో–యో టెస్టుతో పాటు మరో కొత్త తరహా పరీక్షను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. పరుగులో వేగాన్ని బట్టి ఆటగాళ్ల ఫిట్నెస్ను కొలవనున్నారు. పేస్ బౌలర్లయితే 2 కిలోమీటర్ల పరుగును 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. స్పిన్నర్లు, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌కు మరో 15 సెకన్లు అదనపు అవకాశం కల్పిస్తూ 8 నిమిషాల 30 సెకన్ల గరిష్ట సమయాన్ని నిర్దేశించారు. కాంట్రాక్ట్ ప్లేయర్లతో పాటు జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న అందరికీ ఇది వర్తిస్తుంది. ఏడాదిలో మూడుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇంగ్లండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పాల్గొనే ఆటగాళ్లు ముందుగా ఈ పరీక్షను ఎదుర్కోనున్నారు. అయితే అత్యున్నత స్థాయిలో ఆడే అథ్లెట్లు సాధారణంగా 6 నిమిషాల్లోనే 2 కిలోమీటర్లు పూర్తి చేస్తుంటారు కాబట్టి కొత్త పరీక్ష వల్ల క్రికెటర్లు పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. (చదవండి: ‘ఫైండ్ ఆఫ్ ది టూర్’ అతడే: రవిశాస్త్రి) -
ట్రాక్‌పైకి కంబళ వీరుడు!
మంగళూరు: కంబళ పోటీల్లో ఉసేన్‌బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస గౌడ త్వరలో రన్నింగ్ ట్రాక్‌పైకి ఎక్కనున్నాడు. బురదతో నిండిన పొలంలో బర్రెలతో కలిసి పరుగెత్తే కంబళ పోటీల్లో గౌడ వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) దక్షిణభారత విభాగం డైరెక్టర్ అజయ్ భేల్, ఇతర అధికారులు కాసరగోడ్ జిల్లాలోని పైవలికేలో శ్రీనివాసతో మాట్లాడి శిక్షణకు ఆయనను ఒప్పించారు. బెంగళూరులోని శాయ్ కేంద్రంలో శ్రీనివాసకు శిక్షణనివ్వనున్నారు. ఈ ఏడాది కంబళ పోటీలు ముగిశాక, ఏప్రిల్‌లో శ్రీనివాస శిక్షణ కేంద్రంలో చేరే అవకాశముంది. మూడుబిద్రిలో నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాస ఈ ఏడాది కంబళ పోటీల్లో ఏకంగా 39 పతకాలు కైవసం చేసుకోవడం విశేషం. -
అందుకున్న కల
పెళ్లి, పిల్లలు కుటుంబ బాధ్యతల్లోనే మహిళ జీవనం గడిచిపోతుంది. ఉద్యోగినిగా మారితే అదనపు బాధ్యత వచ్చి చేరుతుంది. ఆ బాధ్యతలు, విధుల్లో తలమునకలుగా ఉండటంతో చిన్ననాటి కలలు ఎక్కడో మరుగున పడిపోతాయి. అయితే, స్వరాజ్వలక్ష్మి తన కలల్ని విడిచిపెట్టేయలేదు. గృహిణిగా, కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూనే పరుగుల రాణిగా తన కలను తనే అందుకున్నారు. బైరి స్వరాజ్యలక్ష్మి ఉండేది సికింద్రాబాద్‌కు చేరువలో ఉన్న మచ్చబొల్లారంలో. వయసు నాలుగు పదులు దాటింది. భర్త ధన్‌రాజ్ ప్రైవేటు ఉద్యోగి. ఒక్కగానొక్క కొడుకు. చిన్న కుటుంబం. చింతల్లేవు. ‘‘నాన్న రైల్వేలో ఉద్యోగి కావడంతో నేనూ రైల్వే కాలేజీలో చదువుకున్నాను. స్కూల్, ఇంటర్మీడియెట్ స్థాయిలో రన్నింగ్ కాంపిటిషన్లో పాల్గొనేదాన్ని. ఎప్పుడూ ఫస్ట్ వచ్చేదాన్ని. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పీటీ ఉషలా పేరుతెచ్చుకోవాలని కలలు కనేదాన్ని. అయితే ఇంటర్మీడియెట్ పూర్తికాగానే అక్కడితో చదువు ఆపేయమన్నారు అమ్మానాన్న’’ అని చెప్పారు స్వరాజ్యలక్ష్మి. చదువుతో పాటే రన్నింగ్ రేస్‌లలో పాల్గొనడమూ ఆగిపోయింది. ముగ్గురు అక్కచెల్లెళ్లు. వాళ్ల పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకున్నారు స్వరాజ్యలక్ష్మి తల్లిదండ్రులు. గ్రౌండ్లలో రౌండ్లు ‘‘మా వారిది ప్రైవేటు ఉద్యోగం కావడంతో, చదువుకున్నది కొంత వరకే అయినా ఖాళీగా ఉండటం ఇష్టంలేకపోవడంతో ఉద్యోగం చేస్తానని చెప్పాను. తన ప్రోత్సాహంతో ఇరవై ఏళ్ల క్రితం ఆర్టీసీలో కండక్టర్ చేరాను. గృహిణిగా ఇంటి బాధ్యతలు, ఉద్యోగినిగా కండక్టర్ విధులు, తల్లిగా పిల్లాడి పనులు.. రోజులు గడిచిపోతున్నాయి. ఆ సమయంలో.. ఎనిమిదేళ్ల క్రితం.. ఆర్టీసీ తరపున స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగే పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. చదువుతో ఆగిపోయిన నా కలలకు కొత్త రెక్కలు వచ్చి చేరినట్టు అనిపించింది. రన్నింగ్.. అనే మరుగున పyì పోయిన జ్ఞాపకం తిరిగి నా కళ్లెదుటికి వచ్చింది. ఇంట్లో ఈ విషయం చెప్పడంతోనే సపోర్ట్ కూడా వచ్చింది. ఆ రోజు నుంచి నా టైమ్ టేబులే మారిపోయింది. ఉదయం 5 గంటలకల్లా డ్యూటీకి వెళతాను. మధ్యాహ్నం 2:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను. ఓ అరగంట విశ్రాంతి. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన బాబుకు టిఫిన్ పెట్టి, కాసేపు హోమ్ వర్క్ చేయించి, తిరిగి 5 గంటలకు బొల్లారంలోని పబ్లిక్ గ్రౌండ్‌కు వెళతాను. వారంలో ఒక్కరోజైనా ఉస్మానియా యూనివర్శిటీ గ్రౌండ్, ఇందిరా గార్డెన్‌లోనూ ప్రాక్టీస్‌కి వెళతాను. అలా ప్రాక్టీస్ చేస్తూనే.. రెండేళ్ల క్రితం ఇండోనేషియాలో జరిగిన రన్నింగ్ కాంపిటేషన్‌లో పాల్గొని బంగారు పతకంతో తిరిగి వచ్చాను. దేశీయస్థాయిలో ఢిల్లీ, రాజస్థాన్, చండీగడ్లలోనూ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నాను. 2018లో ఇండోనేషియా జకార్తాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీల్లో బంగారు పతకాలు, 3 కిలోమీటర్ల నడక పందెంలో కాంస్య పతకం, గతేడాది గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి పరుగు పోటీల్లో 100, 400, 800 మీటర్ల విభాగంలో బంగారు పతకాలు సాధించాను. పతకాల విజేతగా నమ్మలేకపోతుంటారు ‘‘ఈ నెలలో దేశీయ స్థాయిలో హర్యానాలో పోటీలు జరుగుతున్నాయి. 8 నుంచి 11 వరకు అక్కడ జరిగే నేషనల్ కాంపిటిషన్స్కు వెళుతున్నాను. ప్రయాణ ఖర్చుల వరకు నేను పెట్టుకొని వెళతాను. మిగతా వసతి సదుపాయాలు నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. నా సహోద్యోగులు ‘మేం చేయలేనిది నువ్వు చేస్తున్నావ్, గ్రేట్’ అంటుంటారు. ‘ఈ వయసులో మాకు కాళ్ల నొప్పులు. మరి నువ్వెలా పరిగెడుతున్నావు?’ అని కొందరు అంటుంటారు. చదువుకునే రోజుల్లో ఆటలు వద్దని చెప్పిన అమ్మనాన్న, బంధువులే కాదు నాతో పాటు పెరిగిన నా చెలెళ్లు్ల కూడా ఇప్పుడు నా గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు...’’ అని నవ్వుతూ అన్నారు స్వరాజ్యలక్ష్మి. అమ్మాయిలు తమ కలగన్న జీవితాన్ని అందుకోవడానికి చాలా అడ్డంకులే ఏర్పడుతుంటాయి. వాటిని అధిగమిస్తూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలనుకునేవారికి స్వరాజ్యలక్ష్మి పట్టుదల ఒక స్ఫూర్తి. – నిర్మలారెడ్డి -
వైరల్: ఒంటికాలితో పరుగు
-
ఆమె ఓడింది: లేదు, గెలిచిందంటున్న నెటిజన్లు
అన్ని అవయవాలు బాగానే ఉన్నా.. ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తారు చాలామంది. కానీ ఇక్కడ చెప్పుకునే బాలిక మాత్రం దేవుడు తనకు అంగవైకల్యం ఇచ్చాడు కానీ మనోవైకల్యం ఇవ్వలేదని ఆత్మవిశ్వాసాన్ని చాటి అందరి మన్ననలు పొందుతోంది. ఓ చోట నిర్వహించిన పరుగుపందెం పోటీలో కొందరు బాలబాలికలతో పాటు ఓ దివ్యాంగురాలు కూడా పాల్గొంది. పోటీ ప్రారంభం కాగానే ఒంటి కాలుతో పరుగు ప్రారంభించింది. మిగతావాళ్లు తనను దాటేసి వెళుతుంటే మొక్కవోని దీక్షతో వారిని అందుకోడానికి ఉబలాటపడింది. వారితో సమానంగా ఉరికేందుకు ప్రయత్నించింది. లక్ష్యాన్ని అందుకునేందుకు చివరివరకు పోరాడింది.. కానీ విజయాన్ని అందుకోలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియోను భారతీయ అటవీశాఖ అధికారి సుశాంత్ నందా గురువారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘అసాధ్యం అనేది మీరు కల్పించుకునే ఓ భావన మాత్రమే’నంటూ దీనికి ఓ క్యాప్షన్ జోడించాడు. పద్దెనిమిది సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చిన్నవయసులో ఆమె ఆత్మస్థైర్యాన్ని చూసి నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ‘ఆమె అసలైన విజేత’, ‘ఆ పోటీలో ఓడినా, జీవితంలో ఆమె లక్ష్యాన్ని సాధిస్తుంది’ అని ఆమె కృషిని కొనియాడుతున్నారు. ఈ వీడియో ఎందరికో స్ఫూర్తిదాయకమని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 30 వేల మందికి పైగా వీక్షించారు. చదవండి: బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. -
ఉద్యోగ వేటలో ఓడిన మమత
సాక్షి, కరీంనగర్‌క్రైం/రామగుడు(చొప్పదండి): తనది పేద కుటుంబం. తల్లిదండ్రులకు ముగ్గురు అక్కచెల్లెల్లు. నాన్న ఆటో నడిపి ముగ్గురిని చదివించాడు. పెద్ద కూతురు మమత(20) డిగ్రీ చేసింది. ఇక కుటుంబానికి బాసటగా ఉండాలని నిర్ణయించుకుంది. పోలీసు కొలువుకు దరఖాస్తు చేసుకుంది. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించింది. ఈవెంట్స్‌కోసం సిద్ధమైంది. కొలువు కొట్టాని కోటి ఆశలతో మైదానంలోకి అడుగుపెట్టింది. పరుగుపందెంలో అర్హత సాధించింది. ఇక పోలీస్ అయినట్లే అని సంతోషంతో మైదానం వీడుతున్న సమయంలో ఒక్కసారి కుప్పకూలింది. అక్కడే ఉన్న సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయింది. రోదిస్తున్న మమత కుటుంబసభ్యులు పోలీసుల వివరాల ప్రకారం.. రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన వడ్లకొండ సంపత్– సరోచన దంపతులది నిరుపేద కుటుంబం. సంపత్ ఆటో నడుపుంటాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు మమత, మానస, అర్చన. పెద్దకూతురు మమత(20) డిగ్రీపూర్తి చేసింది. ఇటీవల పోలీస్‌శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించింది.మూడు నెలలుగా కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు సంస్థ ఆధ్వర్యంలో గ్రౌండ్‌కోచింగ్ తీసుకుంటోంది. పోలీసుశాఖ నిర్వహిస్తున్న దేహదారుఢ్య,శారీరక పరీక్షలకు సోమవారం హాజరైంది. ఉదయం 7గంటలకు 100మీటర్ల పరుగుపందెంను 16.95 సెకన్లలో పూర్తిచేసి అర్హత సాధించింది. ట్రాక్ నుంచి బయటకు వస్తూనే కుప్పకూలింది. అక్కడే ఉన్న పోలీసులు, వైద్యసిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయింది. అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందిందని వైద్యులు తెలిపారు. సీపీ కమలాసన్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీటీసీ వీర్ల కవిత, ఎంపీటీసీ బండపెల్లి యాదగిరి, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు మృతదేహనికి నివాళి అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని రవిశంకర్ తెలిపారు. అయితే తరువాత జరిగిన ఈవెంట్స్‌లో జగిత్యాలకు చెందిన రశ్మిత, చిగురుమామిడికి చెంది మనీషలు కూడా స్వల్ప ఆస్వస్థతకు గురయ్యారు. మమత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాగ్రత్తలు తీసుకోవాలి – సీపీ కమలాసన్‌రెడ్డి మమత మృతిచెందడం బాధాకరమని సీపీ తెలిపారు. 25రోజుల పాటు జరగనున్న దేహదారుఢ్య,శారీరక పరీక్షల్లో సుమారు 25వేల మందికి పైగా అభ్యర్థులు పాల్గొంటున్నారని, 4వేల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మూడు రోజులుగా మహిళ కోసం ప్రత్యేకంగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నమని పేర్కొన్నారు. ఈ సమయంలో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉంటారని, 108, పోలీస్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్, వైద్య నిపుణులు ఉంటున్నారని వివరించారు. అభ్యర్థులు ఈవెంట్స్‌కు వచ్చేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
పోలీస్ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో అపశ్రుతి
-
కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో అపశ్రుతి
సాక్షి, కరీంనగర్ : పోలీస్ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా రన్నింగ్ రేసులో పాల్గొన్న మమత అనే యువతి హార్ట్ బీట్ ఎక్కువై కిందపడిపోయి, మృతిచెందింది. మమత స్వస్థలం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల. తండ్రి సంపత్ ఆటో డ్రైవర్ కాగా, ముగ్గురు కూతుళ్లలో మమత పెద్దమ్మాయి. మమత మృతితో వెలిచాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీపీ కమలాసన్‌రెడ్డి మమత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా మమత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. -
ప్రియురాలి కూతురి కోసం..
-
పందెం గెలిచాడు!
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్... న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్ రోహమన్ షాల్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవెంట్ ఏదైనా సరే అందరీ కళ్లూ తమపైనే ఉండాలి అన్నట్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ఈ జంట. అయితే సుస్మితతో రిలేషన్షిప్ వరకే రోహమన్ పరిమితం కాలేదు. ఆమె దత్తపుత్రికలు రీనా, అలీషాలకు తండ్రి ప్రేమను పంచుతూ వారి మనసులు కూడా గెలుచుకున్నాడు. తాజాగా అలీషా స్కూళ్లో జరిగిన పరుగు పందెంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన రోహమన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వాట్ ఏ మ్యాన్..! రోహమన్ పరుగుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సుస్మిత.. ‘ వాట్ ఏ మ్యాన్!!! అదీ రోహమన్ అంటే! అలీషా స్కూల్ ఫాదర్ రేసులో పాల్గొని స్వర్ణం సాధించాడు. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. రోహ్, అలీషాలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. లవ్ యూ గయ్స్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇందుకు స్పందనగా ‘ రోహమన్ మీకు, మీ పిల్లలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతడిని జీవిత భాగస్వామిగా పొందితే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు’ అని కొంతమంది రోహమన్‌ను పొగుడుతూ ఉంటే.. మరికొందరు మాత్రం.. ‘ చిన్న వయసులో తండ్రి అవడం వల్లే రోహమన్ గెలిచాడు. పాపం ఆ రేసులో ఉన్న తండ్రులు చాలా పెద్ద వయస్సు వాళ్లు. ఇది తొండాట’ అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. అన్నట్లు చెప్పలేదు కదూ.. రోహమన్.. సుస్మితా సేన్ కంటే దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడు.