మొహాలీ ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.. పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్‌ను తలపించాడు. సరదాగా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పెట్టుకున్న 100 మీటర్ల పరుగు పందెంలో ఈ సినీయర్ క్రికెటర్ ఏమాత్రం తగ్గకుండా పోటీనిచ్చాడు. ఇంకా చెప్పాలంటే యవ ఆటగాడైన పాండ్యా కన్నా ధోని ఒక అడుగు ముందే ఉన్నాడు. ఈ సరదా వీడియోను బీసీసీఐ ధోనిVS పాండ్యా 100 మీటర్ల పరుగు పందేం.. ఎవరు గెలిచారో చూడండి అని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక గత కొద్ది రోజులుగా ధోని రిటైర్మెంట్ ప్రకటించాలని సీనియర్ క్రికెటర్లు విమర్శలు గుప్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పి తన అవసరం ఏమిటో తొలి వన్డేలో నిరూపించాడు ధోని. అయితే ఏ కారణాలతో ధోని రిటైర్మెంట్ చేయమంటున్నారు..? ఫిట్‌నెస్ విషయంలోనా అయితే ఈ వీడియోను చూడండి..? యువ ఆటగాళ్లు సైతం అతనితో గెలవలేక పోతున్నారని ధోని అభిమానులు విమర్శుకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధోని VS పాండ్యా .!
Published Wed, Dec 13 2017 12:02 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement